[google-translator]

Which is the best Hospital in Rayalaseema….with Code Blue Facility? Live Tirupati’s Special Article.

మారుతున్న ఆధునిక జీవన వ్యవస్థలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కనీసం పది నిమిషాలు కూడా తమ ఆరోగ్యం కోసం కేటాయించలేనివాళ్ళు సైతం ఈ రోజున గంటల తరబడి వ్యాయామాలు, వర్క్ ఔట్స్ చేస్తున్నారు.

మరి ఈ స్మార్ట్ యుగంలో మన స్మార్ట్ తిరుపతిలో అన్నిరకాలుగా ఉత్తమమైన, ఆధునికమైన,అనుభవంకలిగిన డాక్టర్లని కలిగి ఆధునిక వైద్య శాస్త్ర విధానాలతో,  అన్ని రకాల వర్గాలవారికి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏది? అనే ఒక ప్రశ్నకి  సమాధానం తెలుసుకోవటం  కోసం మా లైవ్ తిరుపతి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఎందుకంటే , మన తిరుపతిలో ఉన్నన్ని హాస్పిటల్స్ వేరే ఏ ఇతర సిటీ లో కూడా లేవనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.

స్మార్ట్ తిరుపతికి తగినట్లుగా అనుభవజ్ఞులైన వైద్యులతో కూడిన సంకల్ప సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ ను మా లైవ్ తిరుపతి టీం సందర్శించినప్పుడు…నిజంగా మేము ఆశ్చర్యానికి గురయ్యాము.

ఎందుకంటే, మన తిరుపతిలో ఇంత అత్యాధునికమైన సదుపాయాలతో, అత్యద్భుతమైన అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణలో నడుపబడుతున్న “సంకల్ప ప్రయాణం” నిజంగా అభినందనీయం.

.

 

ఈ సందర్భంగా… సంకల్ప హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.మధుసూదన్ రావు కొండేటి గారిని మా లైవ్ తిరుపతి టీం కలిసినప్పుడు ఆయన మాట్లాడుతూ.., తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సంకల్ప సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ ను అక్టోబర్ 2016 లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

7 సూపర్ స్పెషలిటీ మరియు 9 స్పెషలిటీ వైద్య విభాగాల ద్వారా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో, అత్యాధునిక వైద్య సదుపాయాలతో, నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని ఆయన తెలియచేయటం జరిగింది.
అలాగే, 100 పడకలు కలిగిన మా సంకల్ప హాస్పిటల్ నందు 30 పడకలతో కూడిన 4 అధునాతనమైన ICU లు, 3 లామినర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్ లు, 24X7 క్రిటికల్ కేర్ మరియు ఎమర్జెన్సీ సేవలు మరియు అడ్వాన్సుడ్ డయాలిసిస్ సదుపాయం అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

హాస్పిటల్ నందు అత్యాధునిక biochemistry  ల్యాబ్, X Ray, ఆల్ట్రాసౌండ్, 2D Echo, TMT, ECG, Holter, EEG & ENMG, PFT లతో పాటు ఎండోస్కోపీ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.

హాస్పిటల్ నందు ఫుల్ టైం dietician అందుబాటులో ఉండి, అడ్మిషన్ అయిన పేషెంట్స్ కు వారి జబ్బుకు సరిపడిన ఆహారాన్ని, హాస్పిటల్ కాంటీన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ నందు ఫుల్ టైం ఫీజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి అన్నారు.

అలాగే హాస్పిటల్ నందు వున్న RO ప్లాంట్ ద్వారా ప్రతి ఫ్లోర్ లో పేషెంట్స్ కు మినరల్ వాటర్ సదుపాయం కల్పించామని తెలిపారు.

డా. NTR వైద్య సేవ (ఆరోగ్యశ్రీ), EHS, ఆరోగ్యరక్ష మరియు వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాల లబ్దిదారులకు, గుర్తింపు పొందిన 8 వైద్య విభాగాల ద్వారా ఉచిత వైద్యం (Cashless Treatment) అందిస్తున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. మధుసూదన్ రావు తెలిపారు.

 

అన్ని ప్రముఖ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సు కార్డు కలిగిన వారికి ఇప్పటికే నగదు రహిత వైద్యం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

అత్యాధునిక ఫ్లాట్ ప్యానెల్ క్యాథ్ ల్యాబ్ ను కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొని వచ్చి, 24గం|| గుండె పోటుకు ప్రైమరీ ఆంజియోప్లాస్టీ ద్వారా చికిత్సను అందిస్తున్నామని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డా. నాగరాజ్ కుమార్ తెలిపారు.

పేషెంట్ కేర్ మరియు రికవరీ లో నర్సుల ప్రాముఖ్యతను గుర్తించి, నర్స్ మరియు పేషెంట్స్ నిష్పత్తిని NABH ప్రమాణాల ప్రకారం పాటిస్తున్నామని తెలిపారు. అలాగే మెడికల్ ప్రోటోకాల్ తో కూడిన standard వైద్యాన్ని అందించటం ద్వారా పేషెంట్ సేఫ్టీ తో పాటు చికిత్సను కూడా తక్కువ ఖర్చుతో చేస్తున్నామని తెలిపారు.

అన్ని రకాల ఎమర్జెన్సీలను ఎదుర్కొని, సమయానికి చికిత్సను అందించటానికి గాను, హాస్పిటల్ నందు అన్ని వార్డ్ లలో ఎమర్జెన్సీ క్రాష్ కార్ట్ మరియు కోడ్ బ్లూ సదుపాయం కలిగిన ఏకైక ప్రైవేట్ హాస్పిటల్ తిరుపతిలో తమదేనని ఆయన తెలిపారు.

త్వరలోనే  కార్డియో థొరాసిక్ సర్జరీ  సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తామని ఆ సంస్థ చైర్మన్ డా. వీరేశ్వర్ బండ్ల తెలిపారు.

అన్ని రకాల మాస్టర్ హెల్త్ చెక్ ఆప్ ప్యాకేజీ లతో పాటు, అందుబాటు ధరలలో వైద్యం అందించాటానికి, సంకల్ప హెల్త్ కార్డును విడుదల చేయటం జరిగింది. ఈ కార్డును Rs500/- చెల్లించి ఎవరైనా పొందవచ్చును. ఈ కార్డు కలిగిన వారికి 8 రకాల ప్రయోజనాలను అందిస్తున్నామని తెలిపారు.

చివరిగా సంకల్ప హాస్పిటల్ ను ఆదరించి ఈ స్థానంలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నట్లు, అలాగే రాబోయే రోజుల్లో కూడా తిరుపతి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనటానికి ప్రయత్నిస్తామని తెలియచేసారు.

 

.