[google-translator]

Today’s Devotional E-Paper – 31-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

31/10/2018 , బుధవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.11AM

సూర్యాస్తమయం : 5.44PM

తిథి సప్తమి 11.57AM

నక్షత్రం పుష్యమి 3.55AM

యోగం సాధ్యం 4.43PM

కరణం బవ 11.57AM

          బాల 10.46PM

అమృతఘడియలు 9.56PM-11.26PM

వర్జ్యం 12.59PM-2.29PM

రాహుకాలం :12.00 PM to 01.30 PM_

యమగండం :07.30 AM to 09.00 AM_

దుర్ముహూర్తం 11.33AM-12.22PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

31/10/2018 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.11AM

SunSet :

5.44PM

Tithi :

Sapthami 11.57AM

Nakshatram :

Pushyami 3.55AM

Yogam :

Sadhyam 4.43PM

Karanam :

Bava 11.57AM
Bala 10.46PM

AmruthaGadiyalu :

9.56PM-11.26PM

Varjyam :

12.59PM-2.29PM

Rahukalam
:

12.00 PM to 01.30 PM

Yamagandam
:

07.30 AM to 09.00 AM

Durmuhurtham 11.33AM-12.22PM

 
*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
TOTAL PILGRIMS HAD DARSHAN ON 30-10-2018: 64,464.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 31-10-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 0.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
TONSURES: 20,565, 
PARAKAMANI: RS.3.23 CRORES. 
Dept of PRO TTD 
 

 

 

 

 

31/10/2018 , Wednesday

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

09:30 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva


 

 

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు

 

నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
– నవంబర్ 7న దీపావళి ఆస్థానం.
– నవంబర్ 9న శ్రీ తిరుమల నంబి శాత్తుమొర.
– నవంబర్ 11న శ్రీ మణవాళమహాముని శాత్తుమొర.
– నవంబరు 12న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.
– నవంబరు 14న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం ఆరంభం.
– నవంబరు 15న శ్రీ పూదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– నవంబరు 20న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్ర తీర్థ ముక్కోటి.
– నవంబరు 23న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
– నవంబరు 24న శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

LIST OF THE EVENTS IN NOVEMBER

 The following are the list of the events that are being observed in Tirumala on November Month.

 

Nov 7 – Deepavali Asthanam

Nov 9 – Sri Tirumalanambi Sattumora

Nov 11 – Sri Manavala Mahamuni Sattumora

Nov 12 – Sri Senai Modaliyar Varsha Tiru nakshatram

Nov 14 – Srivari Pushpayagam, Sri Tirumangai Alwar Festival begins.

Nov 15 – Sri Pudattalwar Varsha Tiru nakshatram

Nov 20 – Kaisika Dwadasi Asthanam, Sri Chakrateertha Mukkoti.

Nov 23 – Sri Tirumangai Alwar Sattumora

Nov 24 – Sri Tiruppanalwar Varsha Tiru nakshatram

Dept. of PRO- TTD.

గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించిన టిటిడి ఈవో, జెఈవో
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటుకు అనువైన స్థలాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ పరిసరాల్లోని శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం, పాత టిటిడి పరిపాలనా భవనం, పురాతన గోశాల ప్రాంతాలను పార్కింగ్‌ ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ స్థానికాలయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా సీనియర్‌ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. ఈ క్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజికి బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. ఎఫ్‌ఏ, సిఏవో అందించిన నివేదిక మేరకు ఈవో పరిశీలన చేపట్టి అధికారులకు పలు సూచనలు చేశారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

EO INSPECTS SRI GT PREMISES TO DEVELOP PARKING SLOTS

TTD EO Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri P Bhaskar inspected the surroundings of Sri Govinda Raja Swamy temple premises on Tuesday.

 

As a part of the inspection commenced from Sri Lakshmi Narayana Swamy temple and covered Old Huzur Office building, Goshala etc. 

 

EO instructed the concerned officers to develop the possibilities to improve parking place in these areas.

 

Later Tirupati JEO said, to develop sub temples under the control of TTD, on the directives of EO each temple was adopted by one Senior officer. In this regard, the development of Sri Govinda Raja Swamy temple was given to FA and CAO Sri O Balaji. On his report a thorough inspection has been carried out, he added.

 

CE Sri Chandra Sekhar Reddy, CVSO Incharge Sri Siva Kumar Reddy, DyEO Smt Varalakshmi and other officers were also present.

 

Dept. of PRO- TTD.

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. 
ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ద్వారాతోరణ, ధ్వజకుంభారాధన,  చతుష్టార్చన,  మూర్తిహోమం, శాంతిహోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, వేదశాత్‌మొర కార్యక్రమాలు నిర్వహించారు. 
అనంతరం ఉదయం 11.30 నుండి 1.00 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతస్వామివారు, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం చక్రతాళ్వార్‌కు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస బట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

CHANDRAGIRI KODANDARAMA SWAMY TEMPLE PAVITROTSAVAMS CONCLUDES

The three-day annual Pavitrotsavams in Chandragiri Sri Kodanda Rama Swamy temple concluded on a grand note on Tuesday.

 

The day commenced with Suprabhatam followed by Thomala, Sahasra Namarchana and Nitya Archana.

 

Later it was followed by Dhwaratorana, Dhwajakumbharadhana, Chaturstarchana, Murthihomam, Shantihomam. After that Mahapurnahuti was performed followed by Pavitra vitarana and concluded with Vedasattumora.

 

Snapana Tirumanjanam was performed to the utsavarulu of Sri Sita Rama Lakshmana Sametha Sri Hanumantha Swamy along with Sri Sudarshana Chaktrattalwar between 11.30am and 1pm. 

 

Temple DyEO Sri Subramanyam, Archaka Sri Srinivasa Bhattar, Temple Inspector Sri Chaitanya were also present.

 Dept. of PRO- TTD.

నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
టిటిడికిి అనుబంధంగా ఉన్న సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. 
ఇందులో భాగంగా నవంబరు 2వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన నవంబరు 3వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు నవంబరు 4వ తేదీన ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు నవంబరు 5వ తేదీ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. 
గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

PAVITROTSAVAMS IN SRINIVASA MANGAPURAM FROM NOVEMBER 3 TO 5

The annual three day Pavitrotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram will be observed from November 3 to 5 with Ankurarpanam on November 2.

 

Usually this religious fete is observed once in a year to waive off the sins committed either knowingly or unknowingly by temple priests, staffs and pilgrims. It is a sin-free festival and also known as Upasamanotsavam.

 

The temple authorities have cancelled all the arjitha sevas during these three days. Every day there will be snapana tirumanjanam to processional deities between 10am and 11.30am. 

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——