[google-translator]

Today’s Devotional E-Paper -30-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

30/11/2018 , శుక్రవారం

 

 

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ

 

 

సూర్యోదయం : 6.24AM

 

సూర్యాస్తమయం : 5.40PM

 

తిథి అష్టమి7.41PM

 

నక్షత్రం మాఘ 8.47AM

 

యోగం వైదృతి2.03PM

 

కరణం బాల8.50Am

కౌలవ7.40PM

 

అమృతఘడియలు 6.32AM-8.02AM

 

రాహుకాలం :10.30 AM to 12.00 PM

యమగండం :03.00 PM to 04.30 PM

 

వర్జ్యం
:

4.16PM-5.46PM

 

దుర్ముహూర్తం
8.39AM-9.24AM
12.25PM-1.10PM

 

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

30/11/2018 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise :

6.24AM

SunSet :

5.40PM

Tithi :

Ashtami 7.41PM

Nakshatram :

Magha 8.47AM

Yogam :

Vaidruthi 2.03PM

Karanam :

Bala 8.50Am
Koulava 7.40PM

AmruthaGadiyalu :

6.32AM-8.02AM

Rahukalam :10.30 AM to 12.00 PM

Yamagandam : 03.00 PM to 04.30 PM

Varjyam :

4.16PM-5.46PM

Durmuhurtham 8.39AM-9.24AM
12.25PM-1.10PM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 29.11.2018: 60,549.
. V.Q.C SITUATION AT 05:00 AM ON 30.11.2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 06,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 06 HOURS.
 TONSURES – 22,637.
 PARAKAMANI – RS. 3.50 CRORES. 
Dept of PRO TTD

 

 

 

 

30/11/2018 , Friday

02:30-03:00 hrs
Suprabhatam

03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam

04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam

06:00 – 07:00 hrs
Samarpana

07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)

09:00 – 20:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.

20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

21:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

డిసెంబ‌రు 4న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక వనభోజనం
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 4వ‌ తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కార‌ణంగా నిత్య‌ కల్యాణోత్సవం, స్వ‌ర్ణ‌పుష్పార్చ‌న ఆర్జిత సేవలను రద్దు చేశారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9.30 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్క‌డి నుండి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
డిసెంబ‌రు 4న స‌త్ర‌వాడ‌లోని శ్రీ కరివ‌ర‌ద‌స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవం
టిటిడికి అనుబంధంగా ఉన్న స‌త్ర‌వాడ‌లోని శ్రీ కరివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 4వ తేదీన పవిత్రోత్సవం జరుగనుంది. ఇందుకోసం డిసెంబ‌రు 3న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.
పవిత్రోత్సవంలో భాగంగా డిసెంబ‌రు 4న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, రాత్రి పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ‌స్తులు రూ.300/- చెల్లించి పాల్గొన‌వ‌చ్చు. వీరికి ఒక ప‌విత్ర‌మాల‌, ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అన్న‌ప్ర‌సాదాలు బ‌హుమానంగా అంద‌జేస్తారు.

 Dept. of PRO- TTD.

 

 వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు పెద్దపీట : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబ‌రు 18,19వ తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత ఉన్నతంగా భక్తులకు దర్శనం, అన్నప్రసాదాలు, బస తదితర వసతులు కల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాధిపతులు తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తిచేసి ఈ పర్వదినాలకు సమాయత్తం కావాలన్నారు. టిటిడి అన్న‌ప్ర‌సాదం, ఆరోగ్య విభాగాలలో అద‌న‌పు సిబ్బందిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు హోంగార్డులను, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోనున్నామ‌న్నారు. శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూలు, లగేజి కౌంటర్లు తదితర వివరాలను రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా నిరంతరాయంగా భక్తులకు తెలియ‌జేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా శ్రీ‌వారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
   
వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు  
–      డిసెంబ‌రు 16 నుండి 19వ తేదీ వ‌ర‌కు దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 
–      డిసెంబ‌రు 16వ తేదీ రాత్రి వ‌చ్చిన భ‌క్తులకు 17వ తేదీ ఉద‌యం శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు.
–      డిసెంబ‌రు 17వ తేదీ ఉద‌యం 10.00 గంట‌ల నుండి ఎంబిసి – 26 వ‌ద్ద గ‌ల గేటు ద్వారా భ‌క్తుల‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 2 లోని అన్ని కంపార్టుమెంట్లు,  విక్యూసి – 1లోని 10 కంపార్టు మెంట్ల‌లోనికి  అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.
–       అదేవిధంగా ఆళ్వారు ట్యాంకు మీదుగా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలలో ఏర్పాటు చేసిన షెడ్ల‌లోనికి నిర్ధేశించిన సంఖ్య‌కు అనుగుణంగా అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులు డిసెంబ‌రు 17వ తేదీ ఏ స‌మ‌యంలో ప్ర‌వేశించినా 18వ తేదీన‌ వారికి నిర్ధేశించిన స‌మ‌యంలోనే ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు వివ‌రించారు.   
  
–      వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, క్యూలైన్లు, ఇత‌ర ర‌ద్ధీ ప్రాంతాల‌లో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. 
–      విక్యూసిలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిన త‌ర్వాత మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌-1 గేట్ ద్వారా ఆల‌య మాడ వీధులలోని గ్యాల‌రీల‌లోప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులలోనికి దాదాపు 40వేల మంది భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నట్లు తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా అన్న‌ప్ర‌సాదాలు, మ‌రుగుదొడ్ల సౌక‌ర్యాం క‌ల్పిస్తామ‌న్నారు.
–       డిసెంబ‌రు 17 నుండి 20వ తేదీ వ‌ర‌కు కాలిన‌డ‌క మార్గంలో వ‌చ్చే భ‌క్తులకు అందించే దివ్య‌ద‌ర్శ‌నం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, సంవ‌త్స‌రంలోపు చిన్న‌పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు క‌ల్పించే ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్ధు చేసిన‌ట్లు తెలిపారు. 
–       డిసెంబ‌రు 18వ తేదీ ఉద‌యం 5.00 గంట‌ల నుండి డిసెంబ‌రు 19వ తేదీ అర్ధ‌రాత్రి వ‌ర‌కు నిరంత‌రాయంగా భ‌క్తులను వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌న్నారు. వైకుఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌లో సుమారు 1.70 ల‌క్ష‌ల మందికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు.
 –     గ‌త సంవ‌త్స‌రం మాదిరిగానే ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌లో ప్రోటోకాల్ ప్ర‌ముఖులు, ఇత‌ర రాజ్యంగ‌ ప‌ర‌మైన హోదాలో ఉన్నవారు స్వ‌యంగా వ‌చ్చిన ప‌క్షంలో విఐపి టికెట్లు కేటాయించ‌నున్న‌ట్లు తెలిపారు.
–     మంత్రులు, రాజ్యంగ ప‌ర‌మైన హోదాలో ఉన్నవారికి వెంక‌టక‌ళా నిల‌యం, ఎం.పి.లు, ఎం.ఎల్‌.ఏ.లు, ఎం.ఎల్‌.సి.ల‌కు సీత‌నిల‌యం, రామ‌రాజ నిల‌యంలో, అఖిల భార‌త స‌ర్వీసులైన ఐఏఎస్‌, ఐపిఎస్‌ల‌కు స‌న్నిధానం,  టిటిడి ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌కు, అఖిల భార‌త స‌ర్వీసుకు చెంద‌ని ఇత‌ర అధికారుల‌కు గంబుల్ విశ్రాంతి భ‌వ‌నంలో బ‌స‌, ద‌ర్శ‌నంకు సంబంధించిన ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.
–     మంత్రులు, రాజ్యంగ ప‌ర‌మైన హోదాలోని ప్ర‌ముఖుల‌కు ఒక‌టి,  వారి కుటుంబ స‌భ్యుల‌కు 5 టికెట్లు, అదేవిధంగా అధికారుల‌కు ఒక‌టి, వారి కుటుంబ స‌భ్యుల‌కు 3 టికెట్లు జారీ చేయ‌న్నున్న‌ట్లు తెలిపారు.  వీరు ల‌ఘుద‌ర్శ‌నంలో స్వామివారిని ద‌ర్శించుకుని, వైకుంఠ ద్వార ప్ర‌వేశం చేస్తార‌న్నారు. 
–     వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌లో రెండు రోజుల పాటు ఘాట్ రోడ్లు 24 గంట‌లు తెర‌చి ఉంచుతామ‌న్నారు. 
       కావున అధిక సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తులు సంయ‌మ‌నంతో వేచిఉండి, టిటిడి అందిస్తున్న సేవ‌లు పొంది వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోవాలని జెఈవో కోరారు. 
       అనంత‌రం సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి మాట్లాడుతూ టిటిడి విజిలెన్స్‌, భ‌ద్రాత  సిబ్బంది, పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రత, అదనంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టిన‌ట్లు తెలిపారు.  అదేవిధంగా  ల‌గేజి ఉంచేందుకు, తీసుకునేందుకు అద‌న‌పు కౌంట‌ర్లు ఏర్పాటును టిటిడి రేడియో,బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా  భ‌క్తుల‌కు తెలియ చేస్తామ‌న్నారు. భ‌క్తుల భ‌ద్రాత‌కు పెద్ద‌పీటవేస్తూ సీనియ‌ర్ అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ ఏర్పాట్లు చేప‌టిన‌ట్లు వివ‌రించారు.

     

శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ శేషాచల‌ దీక్షితులు మాట్లాడుతూ  వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన తెల్ల‌వారుఝామున 12.00 గంట‌ల‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాల‌తో ప్రారంభించి, అర్చ‌న, తోమాల నివేద‌న‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హించి వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నం ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా డిసెంబ‌రు 18వ తేదీ శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు స్వ‌ర్ణ‌ర‌థంపై
ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న‌ట్లు, డిసెంబ‌రు 19వ తేదీ చ‌క్ర‌స్నానం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు.      
       ఈ సమావేశంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2  శ్రీ రామచంద్రారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

GEAR UP FOR V-DAY-TIRUMALA JEO

As the Vaikuntha Ekadasi is set for December 18, Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon all the Officials and staffs to gear up for the ensuing big fete.

 

During the review meeting held at Annamaiah Bhavan in Tirumala on Thursday he directed all the officials to put their extra efforts to make the event a hassle free one keeping in view the past experience.

 

Later briefing media persons along with CVSO Sri Gopinath Jetti and Pradhana Archaka Sri Seshachala Deekshitulu, the JEO said elaborate arrangements are in offing for the big day. 

 

* All privileges of darshanam and accommodation will remain cancelled from December 16 till December 19 for donors

 

* Advance booking of accommodation in the above dates also remain cancelled

 

* No accommodation will be allocated to self Donors or on any referrals

 

* No Divya Darshanam tokens will be issued from December 17 to 20

 

* All privilege darshans remained cancelled from December 17 to 20

 

* Ministers, Constitutional Dignitaries will be allotted accommodation and darshanam tickets at Venkatakala Nilayam, MPs, MLCs and MLAs in Ramaraju Nilayam and Sita Nilayam, All India Service officers at Sannidhanam, TTD Chairman, Trust board members, 

Other Higher Officials at Gumble Rest House.

 

* Ghat Roads remain open on these two days round the clock

 

* Sarva Darshanam for common devotees on Vaikuntha Ekadasi and Dwadasi will be given for nearly 44 hours 

 

* Pilgrims are allowed to enter into the compartments of Vaikuntham 2 through MBC 26 gate from 10am onwards on December 17

 

* After the compartments of VQC 1 and 2 gets filled, the sheds arranged in Narayanagiri compartments will be filled along Clear Tank line through MBC 26 gate

 

* After filling of all compartments of Vaikuntham and sheds in Narayanagiri Gardens, the pilgrims will be allowed to enter in to the special sheds arranged in four mada streets galleries through N 1 gate

 

* Continuous announcements through Radio and Broadcasting for information of pilgrims about entry points

 

* Sarva Darshanam commences on December 18 by 5.30am and lasts up to midnight of December 19 with a break of less than an hour for Naivedyam.

 

* Arrangements of continuous supply of food and water with Srivari Seva volunteers has been planned at micro level

 

* Set to provide Vaikuntha Dwara darshanam to 1.70pilgrims during these two days

 

* Procession of Bangaru Ratham on Vaikuntha Ekadasi and Chakrasnanam on Vaikuntha Dwadasi

 

* Additional counters set up for depositing luggage at different points

 

CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, Addl CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, SE Sri Ramachandra Reddy, VGO Sri Manohar, GM Sri Sesha Reddy and other senior officers were present.

 

  Dept. of PRO- TTD.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గరువారం ఉదయం రూ.10 లక్షలు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన శ్రీ కృష్ణమూర్తి ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందజేశారు.

DONATION TO ANNAPRASADAM

 A Chennai based devotee Sri Krishnamurthy Raju donated Rs 10 lakhs to TTD SV Annaprasadam Trust. 

 

He has handed over the cheque to Tirumala JEO Sri KS Sreenivas Raju in Annamaiah Bhavan on Thursday.

  Dept. of PRO- TTD.

PAVITROTSAVAMS IN NAGARI TEMPLE

The annual Pavitrotsavams in Sri Kariya Manikya Swamy temple at Nagari will be observed on December 4 with Ankurarpanam on December 3.

 

The grihastas devotees who wish to take part in this fete should pay Rs.300 on which two persons will be allowed. They will be presented with a uttariyam, blouse piece and a pavitra garland.

VANABHOJANAM IN SKVST ON DECEMBER 4

 

 The Karthika Masa Vanabhojanam will be observed in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on December 4.

 

The professional deities will be taken to Paruveta Mandapam and snapana tirumanjanam will be performed. Later it is followed by Karthika Vana bhojanam.

  Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

 

——