
నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు
29/11/2018 , గురువారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం
మాసం : కార్తీకం
పక్షం : బహుళ
సూర్యోదయం : 6.24AM
సూర్యాస్తమయం : 5.40PM
తిథి : సప్తమి 9.57PM
నక్షత్రం :ఆశ్లేష10.25PM
యోగం : ఐన్ద్రం 5.00PM
కరణం :విష్టి 11.07AM
బవ 9.57PM
అమృతఘడియలు :8.55AM-10.25AM
వర్జ్యం : 9.35PM-11.04PM
రాహుకాలం :01.30 PM to 03.00 PM
యమగండం: 06.00 AM to 07.30 AM
దుర్ముహూర్తం
10.09AM-10.54AM
2.39PM-3.25PM
PANCHANGAM
Today’s Good & Bad Timings
29/11/2018 , Thursday
Samvatsaram :
Sri Vilambi Nama Samvatsaram
Masam :
Karthikam
Paksham :
Bahula
SunRise :
6.24AM
SunSet :
5.40PM
Tithi :
Sapthami 9.57PM
Nakshatram :
Aasresha 10.25PM
Yogam :
Aindram 5.00PM
Karanam :
Vishti 11.07AM
Bava 9.57PM
AmruthaGadiyalu :
8.55AM-10.25AM
Varjyam :
9.35PM-11.04PM
Rahukalam :01.30 PM to 03.00 PM
Yamagandam : 06.00 AM to 07.30 AM
Durmuhurtham 10.09AM-10.54AM
2.39PM-3.25PM

29/11/2018 , Thursday
06:00 – 08:00 hrs
Tiruppavada
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell
08:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell
21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో బుధవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ డిసెంబరు 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. డిసెంబరు 3 నుండి 14వ తేదీ వరకు ఆన్లైన్, కరంట్ బుకింగ్‌లో ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును రద్దు చేసినట్టు తెలిపారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు. శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు తోళప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలన్నారు.
భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని ఈవో సూచించారు. భక్తులకు వైద్యసేవలందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టిటిడి నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సిసిటివిల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉత్సవాలకు అవసరమైన ఆభరణాలను సిద్ధం చేసుకోవాలని, ఆలయానికి అవసరమైన వస్త్రాలు తదితర వస్తువులను ఈ నెలాఖరులోపు సమకూర్చుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, అదనపు ఎస్పి శ్రీ అనిల్, డిఎస్పి శ్రీ మునిరామయ్య, ఎస్ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్ఇ-4 శ్రీ రాములు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రమణప్రసాద్, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, అదనపు ఆరోగ్యవిభాగం అధికారి డా|| సునీల్, ఏఈవో శ్రీసుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
WORK IN UNISON FOR AMMAVARU KARTHIKA BRAHMOTSAVAMS-DEPARTMENTS TOLD
To make the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Devi at Tiruchanoor a huge success akin to recently held twin brahmotsavams at Tirumala, TTD EO Sri Anil Kumar Singhal called up on all the wings of TTD to work in unison with outside departments like Police, Panchayat etc.
A high-level review meeting on Tiruchanoor Brahmotsavams was held in the Meeting Hall of TTD Administrative Building in Tirupati on Wednesday. As the annual mega religious fete are set to commence from December 4 in Tiruchanoor, the EO along with Tirupati JEO Sri P Bhaskar and CVSO Sri Gopinath Jetti had an elaborate meeting on the ongoing arrangements.
He instructed all the departments to complete the pending works in the next two days. The EO directed all the department HoDs to ensure a smooth and hassle free brahmotsavams working as a team putting extra efforts. Excerpts from the meeting.
* Online and Current booking of Arjitha Sevas have been cancelled from December 3 to 14.
* All the civil and electrical works should complete by November 30
* Special focus on electrical illumination and flower decoration
* Proper PA System and LED screens to be set up at all vital palces
* Cultural troupes from various states to be enlisted
* Special food arrangements in Friday Gardens and Government High School premises on the day of Panchami Theertham
* Temporary and mobile toilets to be set up and kept clean
* Special teams of medical and para medical staffs to be deployed
* Swimmers, additional security force to be kept ready
* Jewels and other important puja items which are necessary for the big fete to be kept ready before the end of this month.
Agama Advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy, Additional CVSO Sri Siva Kumar Reddy, ASP Sri Anil, DSP Sri Muniramaiah, SEs Sri Ramesh Reddy, Sri Sri Ramulu, Sri Venkateswarulu and others were also present.
Dept. of PRO- TTD.
రూ.2 కోట్లతో తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ అభివృద్ధి :
టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్
టిటిడికి అనుబంధంగా ఉన్న తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. తరిగొండలోని ఆలయాన్ని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ కల్యాణమండపం వద్ద 4 గదులు, ఒక డార్మెటరీ నిర్మాణంతోపాటు ఆలయంలోపల నూతనంగా ఫ్లోరింగ్ ఏర్పాటుచేస్తామన్నారు. ముఖమండపానికి కొయ్య ద్వారం ఏర్పాటు చేస్తామని, ఆగమపండితుల సూచన మేరకు పోటు, యాగశాల నిర్మాణం, కల్యాణకట్టను వెలుపలికి తరలించడం, పుష్కరిణి పునర్నిర్మాణంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తుల కోసం ఆర్వో తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు నూతన సేవలు ప్రవేశపెట్టే విషయంపై అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.
ఆ తరువాత వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయాన్ని ఛైర్మన్ సందర్శించారు. అక్కడ ధ్వజస్తంభం ఆధునీకరణ, పాదరక్షల భద్రపరుచుకునేందుకు ర్యాక్, టెంకాయలు విక్రయించేందుకు ఒక గది చేపట్టాలని అధికారులకు సూచించారు. దక్షిణ గోపురం నిర్మాణానికి సంబంధించి ఆగమ పండితుల సూచనలు పాటిస్తామన్నారు. వచ్చే బ్రహ్మూెత్సవాల లోపు ఆలయంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ శ్రీ శివరామకృష్ణ, డిఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయ, ఏఈవో శ్రీ లక్ష్మయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కేదారీశ్వర కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Dept. of PRO- TTD.
OM NAMO VENKATESHAYA



——