[google-translator]

Today’s Devotional E-Paper – 27-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

27/11/2018 , మంగళవారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ

 

సూర్యోదయం : 6.22AM
సూర్యాస్తమయం : 5.39PM
తిథి పంచమి2.38AM
నక్షత్రం పునర్వసు1.43PM
యోగం :శుక్లమ్ 11.24PM
కరణం : కౌలవ 3.47PM
          తైతుల 2.38AM

రాహుకాలం :
03.00 PM to 04.30 PM
యమగండం :
09.00 AM to 10.30 AM
అమృతఘడియలు :11.27AM-1257PMవర్జ్యం : 9.10PM-10.39PM
దుర్ముహూర్తం
8.37AM-9.23AM
10.44PM-11.35PM

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

27/11/2018 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise :

6.22AM

SunSet :

5.39PM

Tithi :

Panchami 2.38AM

Nakshatram :

Punarvasu 1.43PM

Yogam :

Suklam 11.24PM

Karanam :

Koulava 3.47PM
Taitula 2.38AM

AmruthaGadiyalu :

11.27AM-1257PM

Varjyam :

9.10PM-10.39PM

Durmuhurtham 8.37AM-9.23AM
10.44PM-11.35PM

 

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 26-11-2018: 66,334.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 27-11-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 02.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 08 HOURS. 
TONSURES: 23,486, 
PARAKAMANI: RS.2.86 CRORES. 
Dept of PRO TTD

 

 

27/11/2018 , Tuesday

06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell

07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

 

 

శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఇందులోభాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. యాగశాల మండపంలో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. కార్తీక మాసంలో ఆరుద్ర న‌క్ష‌త్రం రోజున ల‌క్ష‌బిల్వార్చ‌న నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. బిల్వ ప‌త్రం ప‌ర‌మేశ్వ‌రునికి అత్యంత ప్రీతిక‌ర‌మైంది. ఒక బిల్వ ప‌త్రంతో శివున్ని పూజిస్తేనే పూర్వ‌జ‌న్మ‌లో చేసిన పాపాల‌న్నీ తొల‌గిపోతాయ‌ని, అలాంటిది ల‌క్ష బిల్వ‌ప‌త్రాల‌తో అర్చించ‌డం వ‌ల్ల విశేష‌మైన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని అర్చ‌కులు తెలిపారు. కార్తీక మాసంలో ప‌విత్ర‌మైన సోమ‌వారంనాడు ల‌క్ష బిల్వార్చ‌న రావ‌డంతో విశేషంగా భ‌క్తులు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. 
ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉద‌య‌స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ రెడ్డిశేఖ‌ర్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
LAKSHA BILWARCHANA HELD IN SRI KT

 On the auspicious day of Arudra Nakshatra, which happens to be the birth star of Lord Shiva, Laksha Bilwarchana Seva was held in Sri Kapileswara Swamy temple in Tirupati on Monday.

 

After the morning rituals, the special puja with one lakh sacred Indian Bael leaves was performed in Yagashala between 7am and 12noon. As this fete coupled with Karthika Somavaram, the temple witnessed huge turn out of devotees who took part in this fete.

 

Meanwhile, the processional deities of Sri Kamakshi Ammavaru and Sri Kapileswara Swamy were taken for a pleasure ride along the streets between 6pm and 8pm.

 

DyEO Subramanyam was also present.

శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థస్వామిజీ 
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థ స్వామిజీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వ్యాసరాజ మఠం మధ్వ సంప్రదాయంలో ప్రముఖ మఠంగా విరాజిల్లుతోంది.
ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. అక్కడి నుండి టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. 
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

VISIT OF CHIEF PONTIFF OF SHREE VYASARAJA MUTT, SOSALE TO TIRUMALA

 

 His Holiness Sri Vidya Shreesha Theertha Swamiji, Pontiff of SHREE VYASARAJA MUTT, SOSALE received by TTD Executive Officer Sri Anil Kumar Singhal with temple honors infront of the Sri Vari Temple, Tirumala on monday morning.

 

DyEO Haridranath, Peishkar Sri Ramesh, Parpathyedar Sri Ramachandra, Bokkasam Incharge Sri Gururaja Rao and others were present.

—————————
నవంబరు 27న వృద్ధులు, దివ్యాంగులకు, నవంబరు 28న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
భక్తుల సౌకర్యార్థం నవంబరు 27వ తేదీన వయోవృద్ధులు(65 సం||ల పైబడినవారు), దివ్యాంగులకు, నవంబరు 28వ తేదీన 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టిటిడి కల్పించనుంది.
నవంబరు 27న వయోవృద్ధులకు, దివ్యాంగులకు కలిపి 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 11 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను నవంబరు 28వ తేదీన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి  సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 Dept. of PRO- TTD.
 
సనాతన ధర్మ‌ప్ర‌చారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌
క్షేత్ర‌స్థాయిలో సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమ‌వారం ధర్మాచార్యుల శిక్షణ కార్యక్రమానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ఈ సందర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ భావిభారత పౌరులైన బాలబాలికలకు సనాతన ధర్మంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా ధ‌ర్మ‌బద్ధ‌మైన స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చ‌న్నారు. వివిధ ప్రాంతాల నుండి ధ‌ర్మాచార్యుల‌ను ఎంపిక చేసి విశిష్ట ధ‌ర్మాచార్యుల చేత శిక్ష‌ణ ఇస్తున్న‌ట్టు తెలిపారు. ఇక్క‌డ శిక్ష‌ణ పొందిన ధ‌ర్మాచార్యులు ఆయా ప్రాంతాల‌కు వెళ్లి విద్యార్థిని విద్యార్థుల‌కు సులభంగా అర్ధమయ్యేలా, చిరకాలం గుర్తుండేలా బోధించాల‌ని కోరారు. ఒక్కో బ్యాచ్‌కు 50 మంది చొప్పున వ‌చ్చే ఏడాది మార్చి నెల వ‌ర‌కు సుమారు 500 మందికి ఈ శిక్ష‌ణ ఇస్తామ‌న్నారు. మంచి ఫ‌లితాలు వ‌స్తే ఈ సంఖ్య‌ను మ‌రింత పెంచ‌డంతోపాటు మ‌రిన్ని నిధులు కేటాయిస్తామ‌న్నారు. ఇక్క‌డ‌ పుస్త‌క సామ‌గ్రిని అందించ‌డంతోపాటు శిక్ష‌ణ‌, ఆధ్య‌య‌నం, ఆచ‌ర‌ణ ద్వారా లోతుగా అవ‌గాహ‌న క‌లుగుతుంద‌న్నారు.
           కాగా,  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాల నుండి 50 మందిని ఈ శిక్ష‌ణ‌కు ఎంపిక చేశారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని దివ్య‌చ‌రిత్ర, స‌నాత‌న ధ‌ర్మం, పండుగ‌లు – ప‌ర‌మార్థం, ఆచారాలు – వైజ్ఞానిక దృక్ప‌థం త‌దిత‌ర అంశాల‌పై లోతుగా అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. పండిట్ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షకురాలు అయిన‌ శ్రీమతి గాయత్రి ధర్మప్రచారకులకు బోధ‌నా ప‌ద్ధ‌తులు, విష‌య సేక‌ర‌ణ‌, ఫీడ్‌బ్యాక్ సేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై శిక్ష‌ణ ఇస్తున్నారు. 
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హిందూధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా.. రమణప్రసాద్‌, ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదరనాయుడు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

CHAIRMAN TAKES PART IN DHARMACHARYA TRAINING WORKSHOP

 

TTD Chairman Sri P Sudhakar Yadav took part in TTD Dharmacharya training workshop held at SVETA building in Tirupati on Monday evening.

 

Addressing the Dharmacharyas, he said, one of the most important missions of TTD is propagation, promotion and preservation of Hindu Sanatana Dharma. “The Hindu Dharma Prachara Parishad (HDPP) wing was established by TTD with an aim to take up this holy task of propagating Hindu Dharma in nook and corner of the country. For this noble task we need many like-minded spiritual trainers”, he said. 

 

Adding further he said, the HDPP has now taken up the task of training the trainers for Dharmic propagation. By March 2019 we could able to train 500 Dharmacharyas. Every month this training programme will be conducted twice with 50 members in each batch. These Dharmacharyas will be from AP and TS. Getting an opportunity in the service of Lord is a rarest thing which is not possible to every one. Utilize this opportunity in training the students, youth, men and women on the tenets of Hindu Sanatana Dharma to the best extent possible”, he maintained.

 

HDPP Secretary Sri Ramana Prasad, Epic Studies Special Officer Sri Damodar Naidu were also present.

HDPP SUB-COMMITTEE MEETING HELD

The Hindu Dharma Prachara Parishad (HDPP) sub-committee meeting was held in SPRH in Tirupati on Monday evening under the chairmanship of TTD Trust Board Chief Sri P Sudhakar Yadav.

 

Speaking on this occasion, the Chairman said, many sub committees were constituted to improve the quality of various important departments in TTD and resolve the issues in a better and fast manner.

 

Excerpts of the meeting.

 

* To train 500 Dharmacharyas by March 2019 in a phased manner

* They take up training of students aged between 10-15years and women and men who are over 40years of age on the importance of Hindu Sanatana Dharma in remote villages and hamlets located in two Telugu speaking states.

* Competitions in Bhagavati Gita on the occasion of Gita Jayanthi from December 16 to 18 in AP, TS, TN, Karnataka and Kerala.

 

* The competitions will be conducted on the importance of Bhagavat Gita in Life for 6th,7th Class students and 8th, 9th Standard Students separately.

 

* Related books have already been dispatched to the schools located in these states.

* A review on the developmental activities of all projects of TTD was also held.

 

After the meeting a book titled “JEEVITANULO SAMPOORANA VIJAYANIKI BHAGAVAT GITA” by TTD Chairman and EO TTD.

 

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar, Executive Committee Member Sri RV Venkata Narayana Subbarama Sarma, HDPP Secretary Sri Ramana Prasad were present.

  Dept. of PRO- TTD.
 
గీతాజ‌యంతి సంద‌ర్భంగా విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత పోటీలు : 
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌
గీతాజ‌యంతి సంద‌ర్భంగా డిసెంబ‌రు 16 నుండి 18వ తేదీ వ‌రకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, కేర‌ళ రాష్ట్రాల‌తోపాటు చెన్నై, బెంగ‌ళూరు ప్రాంతాల్లో 6 నుండి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థిని విద్యార్థుల‌కు భ‌గ‌వద్గీత‌పై పోటీలు నిర్వ‌హించి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వెల్ల‌డించారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతిగృహంలో సోమ‌వారం హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ”జీవితంలో సంపూర్ణ విజ‌యానికి భ‌గ‌వ‌ద్గీత ” పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మాట్లాడుతూ  ”జీవితంలో సంపూర్ణ విజ‌యానికి భ‌గ‌వ‌ద్గీత ” పుస్త‌కాన్నిటిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు ఉచితంగా పంపిణీ చేస్తామ‌న్నారు. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి 500 మంది ధ‌ర్మాచార్యుల‌కు శిక్ష‌ణ ఇస్తామ‌ని, వీరు ఆయా గ్రామాల్లోని యువ‌త‌కు, 45 ఏళ్ల‌లోపు మ‌హిళ‌ల‌కు ధార్మిక అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారని చెప్పారు. అనంత‌రం హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, ప్ర‌చుర‌ణ‌ల విభాగం, రామాయ‌ణం ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, వెంగ‌మాంబ వాఙ్మ‌య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టుల కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షించారు. 
       కాగా, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌భ్యులుగా మైదుకూరుకు చెందిన శ్రీ ఆర్‌వి.వెంక‌ట‌నారాయ‌ణ సుబ్బ‌రామ శ‌ర్మ‌, క‌ర్నూలుకు చెందిన శ్రీ ఆర్‌వి.ర‌విచంద్ర‌శ‌ర్మ‌, ఒంగోలుకు చెందిన శ్రీ సిహెచ్‌.సీతారామాంజ‌నేయ‌ప్ర‌సాద్‌ల‌ను నియ‌మించారు. 
          ఆ త‌రువాత ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న బ‌ర్డ్ స‌బ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.
        ఈ స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, క‌మిటీ స‌భ్యుడు శ్రీ ఆర్‌వి.వెంక‌ట‌నారాయ‌ణ సుబ్బ‌రామ శ‌ర్మ‌, టిటిడి ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.
 Dept. of PRO- TTD.

 

OM NAMO VENKATESHAYA 

 

 

——