[google-translator]

Today’s Devotional E-Paper – 26-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

26/11/2018 ,సోమవారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ

 

సూర్యోదయం : 6.21AM
సూర్యాస్తమయం : 5.39PM

 

తిథి :తదియ 7.04AM

 

చవితి 4.54AM

 

 

నక్షత్రం :ఆర్ద్ర3.12PM
యోగం :శుభం 2.27AM

 

కరణం :భద్ర7.04AM
బవ 5.59PM
బాల 4.54AM

 

అమృతఘడియలు :7.14AM

 

రాహుకాలం :07.30 AM to 09.00AM
యమగండం :10.30 AM to 12.00 PM

 

వర్జ్యం :2.26AM-3.56AM
దుర్ముహూర్తం
12.23PM-1.08PM
2.38PM-3.23PM

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

26/11/2018 , Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise : 6.21AM

SunSet : 5.39PM

Tithi :

Tadiya 7.04AM
Chavithi 4.54AM

Nakshatram :

Aardhra 3.12PM

Yogam :

Subham 2.27AM

Karanam :

Bhadra 7.04AM
Bava 5.59PM
Bala 4.54AM

AmruthaGadiyalu : 7.14AM

Rahukalam
:07.30 AM to 09.00AM

Yamagandam
:10.30 AM to 12.00 PM

Varjyam : 2.26AM-3.56AM

Durmuhurtham 12.23PM-1.08PM
2.38PM-3.23PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 25.11.2018 :: 78,041.
 VQC SITUATION AT 5.00 AM ON 26.11.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 01,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : 08 HOURS. 
TONSURES – 26,144. 
PARAKAMANI – 2.91. CRORES. 
Dept of PRO TTD
 

 

 

 

26/11/2018 , Monday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)
05:30 – 06:30 hrs
Visesha Puja
07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

న‌వంబ‌రు 27న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో డిసెంబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 27వ తేదీ మంగ‌ళ‌వారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహిస్తారు.
 
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కార‌ణంగా కుంకుమార్చ‌న‌తోపాటు ఆల‌యంలో అన్ని ఆర్జిత‌సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు.
 
డిసెంబ‌రు 3న అంకురార్ప‌ణ
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు డిసెంబరు 3వ తేదీన అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్య‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా డిసెంబరు 4న ధ్వజారోహణం, 8న గజవాహనం, 9న గరుడవాహనం, 11న రథోత్సవం, 12న పంచమితీర్థం జరుగనున్నాయి. అదేవిధంగా, డిసెంబరు 13న పుష్పయాగం నిర్వహిస్తారు.
 
వాహనసేవల వివరాలు :
 
 తేదీ                             ఉదయం                            రాత్రి 
 
4-12-2018(మంగళవారం)  ధ్వజారోహణం(వృశ్చిక లగ్నం)     చిన్నశేషవాహనం
 
5-12-2018(బుధవారం)    పెద్దశేషవాహనం                   హంసవాహనం
 
6-12-2018(గురువారం)   ముత్యపుపందిరి వాహనం          సింహవాహనం
 
7-12-2018(శుక్రవారం)     కల్పవృక్ష వాహనం              హనుమంతవాహనం 
 
8-12-2018(శనివారం)     పల్లకీ ఉత్సవం                     గజవాహనం
 
9-12-2018(ఆదివారం)    సర్వభూపాలవాహనం            స్వర్ణరథం,  గరుడవాహనం
 
10-12-2018(సోమవారం)  సూర్యప్రభ వాహనం            చంద్రప్రభ వాహనం
 
11-12-2018(మంగళవారం)  రథోత్సవం                  అశ్వ వాహనం
 
12-12-2018(బుధవారం)   పంచమీతీర్థం                 ధ్వజావరోహణం.
 Dept. of PRO- TTD.
తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం
పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీకవనభోజన మహోత్సవం ఆదివారంనాడు తిరుమల పార్వేట మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. 
ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమలలో  సుమారు 500 ఏళ్ల క్రితం వనభోజన మహోత్సవం జరిగేదని, 2010వ సంవత్సరంలో పునరుద్ధరించామని తెలిపారు. ప్రతి ఏడాదీ పవిత్ర కార్తీకమాసంలో భగవంతుని సమక్షంలో భక్తులు  సహపంక్తి భోజనం చేయడం విశేషమ‌న్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించినట్టు తెలిపారు.
కాగా, ఉదయం 8.00 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపంలో మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో ఆదివారంనాడు కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొని రుచికరమైన అన్నప్రసాదాలను స్వీకరించారుఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.
         ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శ్రీజిఎస్‌ఎస్‌.శివాజి, సివిఎస్‌వో శ్రీ గోపినాధ్ జెట్టి, డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు,  ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

KARTHIKA VANABHOJANAM IN THE PRESENCE OF ALMIGHTY IS A BOON TO ALL-JEO

 Taking part in the community dining in the presence of deities during the holy month of Karthika is a blessed event, said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.

 

Speaking on the occasion of Karthika Vanabhojanotsavam in Paruveta Mandapam at Tirumala on Sunday he said, this was an age-old festival, which was in practice some 500 years ago. This festival was revived by TTD in 2010.

 

Community dining has a great significance in this auspicious month. All the devotees have thoroughly enjoyed the fete, he maintained.

 

Earlier the processional deities of Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi were performed Snapana Tirumanjanam followed by Karthika Vana Bhojanam.

 

Hundreds of devotees had community dining underneath the amla trees in the garden which is considered to be sacred during the holy karthika month.

 

Tirumala Sri Pedda Jiyangar Swamy, Sri Chinna Jiyangar Swamy, CVSO Sri Gopinath Jetti and other officers were also present.

 Dept. of PRO- TTD.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆల‌యంలో రుద్ర‌యాగం ప్రారంభం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) ఆదివారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.  నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా  నవంబరు 25 నుంచి డిసెంబ‌రు 5వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు. 
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు.
సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.
గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
         ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉద‌య‌స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ రెడ్డిశేఖ‌ర్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

RUDRA YAGAM COMMENCES

The 11 day celestial event, Rudra Yagam commenced on a grand celestial note in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday.

 

The day witnessed puja, Rudra japam, laghu purnahuti, Harati and Nivedana in Yagashala.

 

Later in the evening Japam, Rudra Trishati, japam, homam, harati, naivedyam were rendered.

 

Meanwhile this homam will be observed till December 5 and it is being performed as a part of month long Karthika Masa Visesha Mahotsavams.

 

DyEO Subramanyam was also present.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

——