[google-translator]

Today’s Devotional E-Paper – 25-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

25/11/2018 , ఆదివారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ

 

సూర్యోదయం : 6.21AM
సూర్యాస్తమయం : 5.39PM
తిథి :విదియ8.56AM

 

నక్షత్రం : మృగశిర 4.27PM
యోగం :సిద్ధం 8.07AM
కరణం :సాధ్యం 5.21Am

గరజి 8.56AM 

వాణి 8.00

 

అమృతఘడియలు :8.01AM-9.33AM
వర్జ్యం :12.24AM-1.55AM
దుర్ముహూర్తం
4.09PM-4.54PM

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

25/11/2018 , Sunday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Karthikam

Paksham : Bahula

SunRise : 6.21AM

SunSet : 5.39PM

Tithi : Vidiya 8.56AM

Nakshatram : Mrigasira 4.27PM

Yogam : Siddham 8.07AM

Karanam : Sadhyam 5.21Am
          Garaji 8.56AM
 Vani 8.00

AmruthaGadiyalu : 8.01AM-9.33AM

Varjyam : 12.24AM-1.55AM

Durmuhurtham 4.09PM-4.54PM

 

 Darshan Details of Lord Balaji

OM NAMOVENKATESAYA

TOTAL NO.OF PILGRIMS HAD DARSHAN ON 24.11.2018 :74,397.

V.Q.C SITUATION AT 05:00 AM ON 25.11.2018

NO. OF COMPARTMENTS. WAITING IN VQC-II: 10.

APPROXIMATE TIME FOR SARVADARSHAN: 12 HOURS.

PARAKAMANI – RS.2.15 CRORES.

TONSURES – 30,738,

Dept of PRO TTD
 

 

 

 

25/11/2018 , Sunday

 

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

 

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

 

 

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 

 

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

 

07:30 – 19:00 hrs
Sarvadarshanam

 

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

తిరుమలలో  నవంబరు   25న కార్తీక వన భోజనోత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తి
పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 25వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీకవనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో ఘనంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అవ‌స‌ర‌మైన రేకు చ‌లువ పందిళ్లు, విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేసింది. అదేవిధంగా అధిక‌ సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాదాలు పంపీణి చేసేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు.
          ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై, దేవేరులను మరో పల్లకిపై అందంగా అలంకరించి కూర్చుండబెట్టి వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఉదయం 8.00 గం||లకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని ఒక చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. అదే విధంగా మరో పల్లకిపై ఉభయనాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఇక్కడ దేవతామూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు.
        కాగా వనభోజన మహోత్సవాన్ని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దకుమారుడైన శ్రీపెదతిరుమలాచార్యులవారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఏకారణాల వల్లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది. 
             అయితే సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం నుండి తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు కార్తీక వనభోజనోత్సవం ఈ ఏడాది నవంబరు 25వ తేదిన పార్వేట మండపంలో మధ్యాహ్నం 1.00 నుండి 3.00 గంటల నడుమ ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భగవంతుని సమక్షంలో భక్తులు కూడ సహపంక్తి భోజనం చేయడం విశేషం. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు తరపున వివిధ భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.
        ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు భక్తులు పాల్గొంటారు.

KARTHIKA VANABHOJANAM IN TIRUMALA ON NOVEMBER 25

The Paruveta Mandalam in Tirumala has geared up to host Vanabhojanotsavam in Tirumala which will be observed on Sunday.

 

Earlier during the day, the processional deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi will be taken to Paruveta Mandapam and Snapana Tirumanjanam will be performed.  

 

Karthika Vana Bhojanam will take place between 1pm and 3pm.

 

TTD has cancelled Kalyanotsavam, Dolotsavam, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva on that day following this celestial event.

 Dept. of PRO- TTD.
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) శ‌నివారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా  నవంబరు 16 నుంచి 23వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) ఘనంగా నిర్వహించారు. 
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. 

సాయంత్రం శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి

నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉద‌య‌స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ రెడ్డిశేఖ‌ర్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నవంబరు 25 నుంచి రుద్రయాగం :  
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 25 నుంచి డిసెంబ‌రు 5వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుంది.  
గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
————————————————-
శ్రీ‌ పార్థ‌సార‌ధి స్వామివారికి ప్ర‌త్యేక అభిషేకం
            టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉప ఆల‌య‌మైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధి (శ్రీకృష్ణుడు) స్వామి వారికి శ‌నివారం ఉదయం ప్రత్యేక అభిషేకాలు, ఉత్సవ మూర్తులకు  తిరుమంజనం నిర్వహించారు. స్వామివారు జ‌న్మించిన రోహిణి నక్షత్రం సందర్బంగా ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 

           కాగా, సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 వరకు లక్ష్మి మండపంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు వీధి ఉత్సవం

నిర్వహించారు. 

వీధి ఉత్సవం అనంతరం ఆలయంలో ఆస్థానం జరిగింది
.

 
           ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్‌ భాస్కర్‌ రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

CHANDI YAGAM CONCLUDES IN KT

Chandi Yagam concluded in Sri Kapileswara Swamy temple on Saturday.

 

As a part of the month long Karthika Masa Visesha Homam, Chandi Yagam also known as Kamakshi Yagam began on November 16 and observed for nine days.

 

Rudra Yagam commences on November 25 and concludes on December 5.

 

 Dept. of PRO- TTD.
శేషగిరులే హిమాద్రిగా మారినవేళ … భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం 
తెల్లని పొగమంచు తెరల నడుమ, చలచల్లని మలయ వీచికలు గిలిగింతలు పెడుతుంటే స్వర్ణకాంతులీనే ఆనందనిలయం వినూతన అందాలను సంతరించుకొని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే అసంఖ్యాక‌ భక్తులకు క్రొంగొత్త అనుభూతిని కల్గిస్తూ శేషగిరులలోనే హిమగిరులను కూడా దర్శించుకొనే మధురానుభూతిని ప్రకృతీమాత కల్పిస్తున్నది.
గత మూడురోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు శేషగిరులలో వెలసివున్న అనేకానేక పుణ్యతీర్థాలు, జలపాతాలు జలకళతో ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండచరియల నుండి ఎగసిఎగసి పడుతున్న ఈ జలపాతాలను తిలకించడానికి భక్తులు ఎంతో ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు.
తిరుమలలోని వృక్షసంపద, వివిధ వర్ణాలతో కూడిన పుష్పాలు, అరుదైన ఔషధీమొక్కలు మొదలైనవి వర్షపు బిందువులకు సరికొత్త హంగులను సంతరించుకొని పచ్చదనంతో చూపరులను అలరిస్తున్నాయి. సాక్షాత్తు ఆ పరమేశుడు వెలసివున్న హిమాద్రి శిఖరమే శేషాచలంపై ఆవిష్కరించబడిందా అన్నరీతిలో తిరుమల గిరులను  కప్పివున్న మంచుతెరలు భక్తులకు నూతన అనుభూతిని కలిగిస్తున్నాయి. తద్వారా ‘శివ కేశవ అభేదానికి’ సంకేతంగా నిలుస్తున్నాయి. 
భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న తీర్థాలు
         తిరుమల దివ్యక్షేత్రంలోని తీర్థాల‌లో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థం, ఆకాశ‌గంగ‌, పాపావినాశ‌నం ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. 
తిరుమల శ్రీవారి ఆలయానికి దక్షిణభాగంలో  శేషాచల కొండల్లో పచ్చటి ప్రకృతి నడుమ కొలువైన చక్రతీర్థంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు చక్రతీర్థంను సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో చక్రతీర్థంలో నీరు బాగా ప్రవహిస్తోంది. అక్కడ వెలసిన శ్రీ చక్రత్తాళ్వారు వారికి, శ్రీనరసింహస్వామివారికి, శ్రీఆంజనేయస్వామివారికి భ‌క్తులు ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.
       అదేవిధంగా ఆకాశ‌గంగ‌, పాపావినాశ‌నంల‌లో భ‌క్తులు విశేష సంఖ్య‌లో పుణ్య స్నానాలు అచ‌రించి, పూజ‌లు, దానాలు చేస్తున్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది.
       కాగా తిరుమల, తిరుపతిలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయం వద్ద భారీగా జాలువారుతున్న జలపాతంలో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో కార్తీక పౌర్ణ‌మి పుణ్య‌స్నానాలు అచ‌రించి మ‌హిళ‌లు దీపాలు వెలిగిస్తున్నారు.  
తిరుమలలోని జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం – 
 
       తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులతో ఇటీవల గ‌త మూడు రోజులుగా విస్తారంగా కురిసిన‌ వర్షాలకు జలశయాల్లో నీటిమట్టం పెరిగి, భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. తిరుమలలోని జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 ల‌క్ష‌ల గ్యాల‌న్లు కాగా, ప్రస్తుతం  7,269 ల‌క్ష‌ల గ్యాల‌న్ల‌ నీరు నిల్వ ఉంది.
న‌వంబ‌రు 21వ తేదీ ఉద‌యం నుండి 24వ తేదీ ఉద‌యం వ‌ర‌కు తిరుమ‌ల‌లో 144 మిల్లీ మీట‌ర్ల వ‌ర్షం న‌మోదుకాగా, త‌ద్వారా 1,800.49 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు అన్ని డ్యామ్‌ల‌లోనికి చేరింది.  తిరుమలలో భక్తులకు సరాసరిన రోజుకు 30.8 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార మరియు పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఈ జలాశయాల్లో డెడ్‌ స్టోరేజిని మినహాయిస్తే మొత్తం 5,816 ల‌క్ష‌ల గ్యాల‌న్ల‌ నీరు నిల్వ ఉంది.  తిరుమలలోని డ్యామ్‌లలో దాదాపు 6 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉంది. తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో రోజుకు సరాసరి 8 ఎంఎల్‌డి నీటిని వినియోగించుకుంటున్నాము. కావున దాదాపు 441 రోజులు వ‌ర‌కు భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 
గోగర్భం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 2,683 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 501 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది. పాపవినాశనం డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,215 లక్షల గ్యాలన్లు కాగా ప్ర‌స్తుతం 2825 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు నిల్వ ఉంది. ఆకాశగంగ డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు కాగా, ప్ర‌స్తుతం 103 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీరు నిల్వ ఉంది. కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 5,845 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం 3,840 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉంది.

INCESSANT RAINS BRINGS CHILL THRILL TO PILGRIMS 

 

TORRENTS IN TIRUMALA HILLS PROVIDE FEAST TO EYES OF DEVOTEES 

The incessant rains in Tirumala brought cheers to the multitude of visiting pilgrims and the torrents gushing out of the hill rocks provided feast to the eyes of many.

 

The torrents including Chakratheertham, Malavadigundem, Kapilatheertham etc. gliding swiftly from hill rocks delighted the devotees. The pilgrims captured the beauty of Seshachala Ranges and the torrents in their mobile phones.

 

On the other hand Akasa Ganga, Papavinasanam, Gogarbham dams also added waters with the non stop rains which showered recently.

 

Tirumala has recoded 144mm of rainfall which added 1800.49lakh gallons of water in all the reservoirs. With this recent showers the water in the reservoirs of Tirumala will suffice the needs of pilgrims and denizens for the next 441 days.

 

  Dept. of PRO- TTD.
టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
తిరుమల శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్‌ 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఉద్యోగుల పాత క్యాంటీిన్‌లో పంపిణీ చేయనున్నారు. పింఛన్‌దార్లకు 2 పెద్ద లడ్డూలు, 2 వడలు అందజేస్తారు. 
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.
 Dept. of PRO- TTD.
జ‌న‌వ‌రి 27న 36వ విడ‌త స‌నాత‌న ధార్మిక విజ్ఞాన ప‌రీక్ష‌లు
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో 36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు 2019, జ‌న‌వ‌రి 27వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగ‌నున్నాయి. విద్యార్థిని విద్యార్థుల‌కు స‌నాత‌న ధ‌ర్మం, మాన‌వీయ‌, నైతిక విలువ‌లు, పురాణాలపై అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌తి ఏడాదీ ధార్మిక విజ్ఞాన ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది న‌వంబ‌రు 18న ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని భావించారు. ప‌రిపాల‌నా కార‌ణాల వ‌ల్ల ఈ ప‌రీక్ష‌ల‌ను 2019, జ‌న‌వ‌రి 27వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. 
          ఈ ప‌రీక్ష‌ల్లో రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేస్తారు.

EPIC STUDIES EXAM

TTD will conduct the 36th Epic Studies Exam on January 27 in 2019.

 

It may be mentioned here that these exams are being organised under the aegis of Hindu Dharma Prachara Parishad wing of TTD.

 

Every year awards at state and district level are distributed to the students who stood in first three places in this epic studies exam.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

——