[google-translator]

Today’s Devotional E-Paper – 25-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

25/10/2018 , గురువారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.09AM

సూర్యాస్తమయం : 5.46PM

తిథి : పాడ్యమి 9.42PM

నక్షత్రం : అశ్విని 10.28AM

యోగం : వజ్రం 9.47AM
కరణం
: బాల 9.50AM
కౌలవా 9.42PM

అమృతఘడియలు : 5.44AM

రాహుకాలం : 1.30PM-3.00PM

యమగండం : 6.00AM-7.30AM

వర్జ్యం : 6.21AM-8.00
8.06PM-9.42PM

దుర్ముహూర్తం
9.54AM-10.43AM
2.51PM-3.40PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.09AM

SunSet :

5.46PM

Tithi :

Padyami 9.42PM

Nakshatram :

Aswini 10.28AM

Yogam :

Vajram 9.47AM

Karanam :

Bala 9.50AM
Koulava 9.42PM

AmruthaGadiyalu :

5.44AM

Rahukalam : 1.30PM-3.00PM

Yamagandam : 6.00AM-7.30AM

Varjyam :

6.21AM-8.00
8.06PM-9.42PM

Durmuhurtham 9.54AM-10.43AM
2.51PM-3.40PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA

TOTAL PILGRIMS HAD DARSHAN ON 24-10-2018: 63,523.

V.Q.C SITUATION AT 05:00 AM ON 25-10-2018
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 17,
APPROXIMATE TIME FOR SARVADARSHAN: UPTO 12 HOURS.
TONSURES: 25,545,
PARAKAMANI: RS.2.67 CRORES.
Dept. of PRO TTD 

 

 

25/10/2018 , Thursday

06:00 – 08:00 hrs
Tiruppavada

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell

08:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell

21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

 

—-

 

 

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ 

తిరుమలలో బుధ‌వారం రాత్రి 7 గంటలకు పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 14న గ‌రుడ‌సేవ జ‌రిగింది. పౌర్ణ‌మి సంద‌ర్భంగా మ‌రోసారి స్వామివారు గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డం విశేషం.

శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, పార్‌ప‌త్తేదార్ శ్రీ శ‌శిధ‌ర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

POURNAMI GARUDA SEVA OBSERVED

 In a span of just ten days gap, the pilgrims were thrilled to witness Sri Malayappa Swamy on Garuda Vahanam on Wednesday evening.

Pournami Garuda Seva was observed with celestial fervour in Tirumala between 7pm and 9pm. The processional deity was taken around the four mada streets on a colourful procession.

It may be mentioned here that the devotees had witnessed the Navarathri Brahmotsava Garuda seva exactly ten days ago on October 14.

Temple officials, huge number of pilgrims took part in this event.

 

Dept. of PRO- TTD.

 

వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

 

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జ‌రిగింది.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల నడుమ శ్రీగోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఎ.పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ సురేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ప్ర‌శాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

POURNAMI GARUDA SEVA OBSERVED IN SRI GT

The Pournami Garuda Seva was observed with utmost devotion and religious fervour in Sri Govinda Raja Swamy temple on Wednesday.

The Garuda Vahana seva took place between 6pm and 8pm covering all the important streets encircling the shrine.

 

Large number of local devotees participated in this event.

 

Temple DyEO Smt Varalakshmi, Chief Priest Sri AP Srinivas Deekshitulu, AEO Sri Udaybhaskar Reddy, Suptd Sri Suresh and others took part.

 

Dept. of PRO- TTD.

డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలి : టిటిడి తిరుపతి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోగల సమావేశ మందిరంలో బుధవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాటికి క్యూలైన్ల నిర్వహణ, ఆళ్వార్‌ ట్యాంక్‌, నారాయణగిరి ఉద్యానవనాలలో షెడ్ల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో మహాద్వారం నుండి వెండివాకిలి వరకు ఉన్న క్యూలైన్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అధ్యయనం చేయాలన్నారు. తిరుమల బూందీ పోటులో అగ్నిప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్‌ఈ ఎలక్ట్రికల్స్‌కు సూచించారు. పోటు కార్మికులు ఉండేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులకు అందుతున్న సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ పనిచేయని పక్షంలో, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రెండు బ్రహ్మూెత్సవాలలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు చక్కగా ప్రదర్శించాయని, భక్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఈ ప్రదర్శనలను ఎస్వీబీసీ ద్వారా సిడిలుగా రూపొందించాలని తిరుపతి జెఈవోను కోరారు. బ్రహ్మూెత్సవాలలో భద్రతా సిబ్బంది కోసం కొనుగోలు చేసిన కెమెరాలు, రెయిన్‌ కోట్లను వెనక్కి తెప్పించి ఆడిట్‌ చేయాలన్నారు.

 

అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను నవంబర్‌లో సిద్ధం చేయాలని ఈవో ఆదేశించారు. హైదరాబాద్‌, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాల నిర్మాణపనులపై సమీక్షించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఆధునికరణ పనులలో భాగంగా పార్కింగ్‌ తదితర వసతులు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించి పార్కింగ్‌ వసతి కల్పించాలని సూచించారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ పరిసరాలలో పార్కింగ్‌ వసతి కల్పించాలని, మరుగుదొడ్లు, వంటశాల నిర్మాణపనులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. సప్తగిరి మాసపత్రిక సక్రమంగా అందేలా పాఠకుల నుండి సరైన చిరునామా, సెల్‌నెంబర్లు సేకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సప్తగిరి చందా పొందేందుకు గల మార్గదర్శకాలను ఎస్వీబీసీలో, టిటిడి వెబ్‌సైట్‌లో విశదీకరించాలని కోరారు. పాఠకులు టిటిడి కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి తమ చిరునామా, సెల్‌ నంబరును మార్చుకునేందుకు వీలుగా అప్లికేషన్‌ను రూపొందించాలన్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా డిఎఫ్‌ఎండి, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు వీలుగా హెడ్‌ కౌంట్‌ యంత్రం ఏర్పాటుచేయాలన్నారు.

 

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

 

 

ఈవో, జెఈవోలను ఘనంగా సత్కరించిన అధికారులు :

శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకుగాను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ను టిటిడి అధికారులు ఘనంగా సత్కరించారు.

 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యాలు, భద్రతకు సంబంధించి ఈవో, తిరుమల జెఈవో ఎప్పటికప్పుడు సమ్షీలు నిర్వహించి మార్గదర్శనం చేశారని తెలిపారు. ఈ కారణంగా భక్తులకు మెరుగైన సేవలు అందించగలిగినట్టు చెప్పారు. ఈవో ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించి బ్రహ్మోత్సవాలకు చక్కటి కళాబృందాలు వచ్చేలా తిరుపతి జెఈవో కృషి చేశారని కొనియాడారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అధికారులు ఇదే సమాఖ్యస్ఫూర్తితో చక్కగా సేవలందించి భక్తుల మన్ననలు పొందాలని సూచించారు.

 

MAKE ELABORATE ARRANGEMENTS FOR VAIKUNTHA EKADASI

Congratulating the strong work force of TTD for making the twin brahmotsavams a memorable success, TTD EO Sri Anil Kumar Singhal instructed all the Heads of Departments to gear up with same spirit for yet another major religious event Vaikuntha Ekadasi which falls on December 18.

 

During the review meeting at the Conference Hall in TTD administrative building in Tirupati on Wednesday, he directed the Engineering wing to make necessary arrangements of setting up queue lines near Alwar Tank and constructing sheds in Narayanagiri Gardens for the big day.

 

He also instructed them to come out with a plan to streamline the queue line at Vendi Vakili in Srivari temple to provide darshan with more ease and comfort to pilgrims. The SE Electrical was also instructed to take remedial measures to prevent fire mishaps at Boondi Potu. The need for separate accommodation for potu workers was also discussed during the meeting.

Appreciating the various art forms performed during twin brahmotsavams, the EO instructed that the CDs of the dance performances should be recorded and made available with the SVBC.

The EO instructed the concerned to go for alternative source measures in the facilities that are being provided to pilgrims, if technical issues arises in software. He directed for the auditing of CC cameras and rain coats which were purchased during the brahmotsavams for security purpose.

 

Later he also reviewed on the progress of works in Kanyakumari, Hyderabad temples, parking facility in Sri Govinda Raja Swamy temple, Vontimitta Sri Kodanda Rama Swamy temple development activities etc. The EO directed the Sapathagiri chief to ensure that the magazines reach the subscribers on time. Telecast the mode of booking and other details in SVBC for better knowledge of global pilgrims”, he added.

 

EO, JEOs FELICITATED

The senior officers of TTD have felicitated TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar for the the successful conduct of twin Brahmotsavams.

 

They thanked the top brass authorities for guiding the employees to work as a team in the right direction with their continuous monitoring and conducting the mega religious events in a smooth manner.

 

EO also wished the officials to continue to work with the same team spirit in future too.

 

Dept. of PRO- TTD.

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా అన్నాభిషేకం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం అన్నాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

 

ఇందులో భాగంగా ఉద‌యం సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.

 

అనంతరం సుమారు 425 కిలోల బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానపట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.

 

సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు భక్తులకు అన్నాభిషేక సర్వదర్శనం కల్పించారు. సర్వదర్శనానంతరం సాయంత్రం 6 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అన్నాభిషేకంలో వినియోగించిన అన్నాన్ని సాంబారులో కలిపి భక్తులకు పంపిణీ చేశారు.

 

సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో భక్తులు పాల్గొని అన్న లింగ దర్శనం చేసుకున్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మ సంచిత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, పశుపక్ష్యాది సకల జీవరాశులు సుభిక్షంగా ఉండడానికి ఈ అన్నాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, విజిఓ శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Dept. of PRO- TTD.

ANNABHISHEKAM PERFORMED IN SRI KT

The Annabhisheka Mahotsavam in Sri Kapileswara Swamy temple was performed on Wednesday.

 

After Suddhodaka Abhishekam, the presiding deity of Sri Kapileswara Swamy was covered with heaps of cooked rice in Linga Akara. The devotees had darshan of Anna Lingam between 4pm and 6pm.

 

Later Anna linga Udvasana(removal of cooked rice over Lingam) was observed at 6.30pm.

 

Tirupati JEO Sri Pola Bhaskar, Temple Deputy EO Sri Subramanyam and other officials took part in this fete.

 

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——