[google-translator]

Today’s Devotional E-Paper – 24-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

24/11/2018 , శనివారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం
మాసం : కార్తీకం
పక్షం : శుక్ల
సూర్యోదయం : 6.20AM

 

సూర్యాస్తమయం : 5.39PM

 

తిథి :పాడ్యమి 10.28AM

 

నక్షత్రం:రోహిణి 5.27PM

 

యోగం :శివం 10.34AM
కరణం :కౌలవ 10.28AM
        తైతుల 9.54PM

 

అమృతఘడియలు :2.19PM-3.53PM
వర్జ్యం
: 9.38AM-11.12AM
10.48PM-12.20AM
దుర్ముహూర్తం
6.20AM-7.51AM

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

24/11/2018 , Saturday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :sukla

SunRise :

6.20AM

SunSet :

5.39PM

Tithi :

Padyami 10.28AM

Nakshatram :

Rohini 5.27PM

Yogam :

Sivam 10.34AM

Karanam :

Koulava 10.28AM
Taitula 9.54PM

AmruthaGadiyalu :

2.19PM-3.53PM

Varjyam :

9.38AM-11.12AM
10.48PM-12.20AM

Durmuhurtham 6.20AM-7.51AM

 

*Darshan Details *of Lord Balaji* 
OM NAMO VENKATESAYA
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 23-11-2018: 73,050.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 24-11-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 02.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 04 HOURS. 
TONSURES: 22,793, 
PARAKAMANI: RS.3.02 CRORES. 
Dept of PRO TTD 

 

 

 

24/11/2018 , Saturday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

నవంబరు 27న వృద్ధులు, దివ్యాంగులకు,  నవంబరు 28న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
భక్తుల సౌకర్యార్థం నవంబరు 27వ తేదీన వయోవృద్ధులు(65 సం||ల పైబడినవారు), దివ్యాంగులకు, నవంబరు 28వ తేదీన 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టిటిడి కల్పించనుంది.
నవంబరు 27న వయోవృద్ధులకు, దివ్యాంగులకు కలిపి 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 11 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండు రోజులపాటు టిటిడి అదనంగా దర్శన టోకెన్లు జారీ చేస్తోంది. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను నవంబరు 28వ తేదీన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరంలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి  సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 Dept. of PRO- TTD.
పత్రికా ప్రకటన   తిరుపతి,  2018 నవంబరు 23 తెలుగు రాష్ట్రాల్లో 12,480 ఆలయాల్లో ఘనంగా ‘మనగుడి’
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 12,480 ఆలయాల్లో శుక్రవారం మనగుడి కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్తూరు జిల్లాలోని 500 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు, అదేప్రాంతంలోని ఎస్‌టి కాలనీ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా టిపి.గూడూరులో జరిగిన మనగుడి కార్యక్రమాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌ పాల్గొన్నారు. ఆయా ఆలయాల్లో భక్తులకు శ్రీవారి కంకణాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, కలకండ పంపిణీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో నవంబరు 20న మంగళ కైశిక ద్వాదశి, 21న ఆలయ శోభ, 22న కార్తీక దీపోత్సవం, 23న కార్తీక పౌర్ణమి నిర్వహించారు. స్థానికంగా ఉన్న జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, దాససాహిత్య ప్రాజెక్టు భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు, భక్తులు కలిసి మనగుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాశస్త్యాన్ని, ఆలయ ధర్మాలను తెలియజేసి ధర్మబద్ధంగా భక్తులందరినీ ఏకం చేసేది మనగుడి. మనగుడి కార్యక్రమాన్ని 2012వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రారంభించింది. 2015వ సంవత్సరం వరకు శ్రావణపౌర్ణమి, కార్తీకపౌర్ణమి రోజులలో ఎంపిక చేసిన ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతం చేసే ప్రక్రియలో భాగంగా 2016వ సంవత్సరం నుంచి ఏడాది పొడవునా వచ్చే ముఖ్యమైన పండుగల నాడు గ్రామస్థాయిలోని ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
 Dept. of PRO- TTD.
శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాయంలో శుక్ర‌వారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని  సాయంత్రం కృత్తికా దీపోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ఆలయ ప్రాంగణంలో దేదీప్యమానంగా ప్రమిదలు వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం శోభాయమానంగా వెలిగిపోయింది. కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా, సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన కొండపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు ఆలయ ప్రాంగణమంతా దీపాలు వెలిగించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 
ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉద‌య‌స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ రెడ్డిశేఖ‌ర్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

——