[google-translator]

Today’s Devotional E-Paper -14-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

14/01/2019 , సోమవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్య మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.45AM

సూర్యాస్తమయం :6.00PM

తిథి :అష్టమి 7.32PM

నక్షత్రం :రేవతి 8.47AM

యోగం:సిద్ధం 3.16AM

కరణం :విష్టి 7.10AM
బవ7.32PM

అమృతఘడియలు :7.56AM

వర్జ్యం:5.32AM

దుర్ముహూర్తం
12.45PM-1.30PM
3.00PM-3.45PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

14/01/2019 , Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Pushya Masam

Paksham :

Sukla

SunRise :

6.45AM

SunSet :

6.00PM

Tithi :

Ashtami 7.32PM

Nakshatram :

Revathi 8.47AM

Yogam :

Siddham 3.16AM

Karanam :

Vishti 7.10AM
Bava 7.32PM

AmruthaGadiyalu :

7.56AM

Varjyam :

5.32AM

Durmuhurtham 12.45PM-1.30PM
3.00PM-3.45PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 13.01.2019: 77,064.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 14.01.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 9.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 06 HOURS.
 PARAKAMANI – RS. 2.38 CRORES. 
TONSURES – 25761. 
Dept of PRO TTD

 

 

14/01/2019 , Monday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)
05:30 – 06:30 hrs
Visesha Puja
07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

 

టిటిడి ఛైర్మన్‌, ఈవో మకర సంక్రాంతి శుభాకాంక్షలు
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ శ్రీవారి భక్తులకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో రైతన్నలు కనుమ పండుగ నాడు గోపూజ చేసి గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
అదేవిధంగా, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు స్పందిస్తూ ఆ దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి క పాకటాక్షాలతో ఈ పర్వదినాన్ని భక్తులందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Dept of PRO TTD

Print all
In new window
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
ఘనంగా ముగిసిన శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది.
జనవరి 7 నుండి శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే.
చివరిరోజు ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5.00 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, ఎఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీప్రశాంత్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Dept of PRO TTD

 

జనవరి 16వ తేదీన ఎస్వీ గోశాలలో  ‘గోపూజ మహోత్సవం’
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ బుధవారం సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8 నుండి 9 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8 నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన  కార్యక్రమాలు  నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. 11.45 గంటల నుండి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
గోపూజ మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని  టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి క పకు పాత్రులు కావాలని కోరడమైనది.
Dept of PRO TTD
హనుమంతుడు శక్తిశాలి, బుద్ధిశాలి, త్యాగశీలి: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
            హనుమంతుడు వాయువేగంతో వెళ్లగలిగే శక్తిశాలి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే బుద్ధిశాలి, నమ్మినవారి కోసం తన శక్తిని ఉపయోగించిన త్యాగశీలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో  హనుమద్వైభవం – సమాజ స్ఫూర్తి అనే అంశంపై ఆయన ధార్మిక ఉపన్యాసం చేశారు. సోమవారం కూడా ఈ ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది.
       
           ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ విద్యను నేర్చుకోవడంలో ఆంజనేయుడు ఈతరం పిల్లలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎక్కడ వినయం ప్రదర్శించాలో, ఎక్కడ ఓర్పుతో ఉండాలో, ఎక్కడ తన శక్తిని వాడాలో తెలిసిన మహనీయుడన్నారు. ఎంత బలవంతుడో అంత తగ్గిపోయే తత్వం, అవసరమైతే ప్రభువు కోసం అవమానాలను ఎదుర్కోవడం ఆయనకే సాధ్యమన్నారు. సీత ఆన్వేషణ కోసం తన శక్తిని బుద్ధిని ప్రదర్శించాడని చెప్పారు. భగవంతునిపై నమ్మకం ఉంచితే భయం లేకుండా జీవించడం సాధ్యమవుతుందన్నారు. హనుమకథ విన్నా శోధించినా ఆయనలోని గొప్పతనం అలవడుతుందని, అందుకే పిల్లలకు ఆంజనేయకథను చెబుతారని వివరించారు.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——