[google-translator]

Today’s Devotional E-Paper -12-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

12/01/2019 , శనివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్య మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.45AM

సూర్యాస్తమయం :6.00PM

తిథి :షష్టి 5.39PM

నక్షత్రం :ఉత్తరాభాద్ర పూర్తి

యోగం : పరిఘ 4.30AM

కరణం :తైతుల 5.39PM
గరజి

అమృతఘడియలు :2.08PM-3.52PM

వర్జ్యం :3.45PM-5.28PM

దుర్ముహూర్తం 6.45AM-8.15AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

12/01/2019 , Saturday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Pushya Masam

Paksham :

Sukla

SunRise :

6.45AM

SunSet :

6.00PM

Tithi :

Shashti 5.39PM

Nakshatram :

Uttarabhadra poorthi

Yogam :

Parigha 4.30AM

Karanam :

Taitula 5.39PM
Garaji

AmruthaGadiyalu :

2.08PM-3.52PM

Varjyam :

3.45PM-5.28PM

Durmuhurtham 6.45AM-8.15AM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 11.01.2019: 61,195.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 12.01.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 04.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
TONSURES – 18,059. 
PARAKAMANI – RS. 2.35 CRORES. 
Dept of PRO TTD

12/01/2019 , Saturday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

 

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

07:30 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

Print all
In new window

జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

 

తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్యాకుమారిలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 27న ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాసంప్రోక్షణ ఘనంగా జరుగనుంది. జనవరి 23 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం జనవరి 22వ తేదీన అంకురార్పణ జరుగనుంది.
జనవరి 22న సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఆచార్య రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం చేపడతారు.
జనవరి 23న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాల వాస్తు, పంచగవ్య ప్రసన్నం, రక్షాబంధనం, అకల్మష ప్రాయశ్చిత్తహోమం, అక్షిన్మోచనం, పంచగవ్య అధివశం, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అగ్నిప్రతిష్ఠ, కుంభావాహనం, కుంభారాధన, హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.
జనవరి 24న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, క్షీరాధివాసం, పూర్ణాహుతి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు హోమం, పూర్ణాహుతి చేపడతారు.
జనవరి 25న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, జలాధివాసం, పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు బింబస్థాపనం, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.
జనవరి 26న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశస్నపనం, హోమం, పూర్ణాహుతి, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, మహాశాంతి పూర్ణాహుతి, రాత్రి 8 నుండి 10 గంటల వరకు రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం చేపడతారు.
జనవరి 27వ తేదీన ఉదయం 4 నుండి 7 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7 నుండి 7.30 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేస్తారు. ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. 
ఆ తరువాత ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 6.30 గంటల వరకు సర్వదర్శనం, సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

Dept of PRO TTD

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గోపూజ
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో గోపూజ ఘనంగా జరిగింది. ధర్మప్రచారంలో భాగంగా సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో 10 ఎంపికచేసిన ఆలయాల్లో గోపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. 
సకల దేవతాస్వరూపమైన గోవు హిందువులకు ఆరాధ్యదేవత. పుణ్యనదీనదాలన్నీ గోవులో మూర్తీభవించి ఉన్నాయి. గోవు పుణ్యానికి నిలయం. ఈ కారణంగానే గోపూజను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
కాగా, జనవరి 12న ఉభయ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర రాజధానుల్లోనూ గోపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ పవిత్రమైన పుణ్యకార్యక్రమంలో పాల్గొనాలని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా.. రమణప్రసాద్‌ కోరారు.

Dept of PRO TTD

శ్రీ గోవిందరాజస్వామివారికి ముత్యపుకవచం బహూకరణ
టిటిడి శ్రీశ్రీశ్రీ శఠగోపరామానుజ పెద్దజీయర్‌స్వామివారు శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి మూలమూర్తికి అలంకరించేందుకు ముత్యపుకవచాన్ని బహూకరించారు. ఈ కవచం విలువ రూ.11 లక్షలని ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీ పెద్దజీయర్‌ మఠంలో ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఈ ముత్యపు కవచానికి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో, జెఈవోలను మఠం తరఫున శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీ పెద్దజీయర్‌ మఠం నుండి ముత్యపు కవచాన్ని ఆలయానికి తీసుకెళ్లి స్వామివారి మూలవర్లకు అలంకరించారు. భగవద్‌ రామానుజాచార్యులవారి ఒక అజ్ఞాతభక్తుడు ఈ ముత్యపుకవచాన్ని తయారు చేయించిన ఆలయ అధికారులు తెలిపారు. గతంలో 2016వ సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారు శ్రీగోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ముత్యపుకవచం సమర్పించారు.
ఆ తరువాత శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న జనరేటర్‌ గది, వాటర్‌ సంప్‌ నిర్మాణపనులు, బుగ్గ అభివృద్ధి పనులను, లగేజి కౌంటర్‌ను ఈవో పరిశీలించారు. ఆలయంతోపాటు ఊంజల్‌ మండపం, యాగశాల, అద్దాలమండపాల్లోని శిల్పకళను భక్తులు వీక్షించేలా చేసిన ఏర్పాట్లను, తిరుమలనంబి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, విజివో శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Dept of PRO TTD

వేద ఘోష‌తో మార్మోగిన తిరుమ‌ల గిరులు
      క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప‌విత్ర ధ‌నుర్మాసం చివ‌రి శుక్ర‌వారాన్ని పుర‌స్క‌రించుకుని ఎస్వీ వేద పాఠ‌శాల విద్యార్థులు, అధ్యాప‌కులు వేద పారాయ‌ణంతో తిరుమ‌ల గిరులు మార్మోగాయి. ప్ర‌తి ఏడాది ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వేద పారాయ‌ణం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. 
 
     
 ఇందులో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరిలోని వేద పాఠ‌శాలకు చెందిన దాదాపు 750 మంది  అధ్యాప‌కులు, విద్యార్థులు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా చ‌తుర్వేద పారాయ‌ణం చేశారు.  
      
 అంత‌కుముందు అధ్యాప‌కులు, విద్యార్థులు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామివారి నిజ‌పాద ద‌ర్శ‌నం చేసుకున్నారు.   

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——