[google-translator]

Today’s Devotional E-Paper – 10-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

10/10/2018 ,బుధవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం : శుక్ల

సూర్యోదయం : 6.07AM

సూర్యాస్తమయం : 5.54PM

తిథి :

శుద్ధ పాడ్యమి 7.50AM

నక్షత్రం : చిత్ర 12.32PM

యోగం : వైదృతి 2.21PM

కరణం
: బవ 7.50AM
బాల 7.24PM

అమృతఘడియలు : 6.16AM-7.50AM

రాహుకాలం: 12.00 PM to 01.30 PM

యమగండం :07.30 AM to 09.00 AM

వర్జ్యం : 6.06PM-7.42PM

దుర్ముహూర్తం: 11.37AM-12.25PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

10/10/2018 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Sukla

SunRise :

6.07AM

SunSet :

5.54PM

Tithi :

Suddha Padyami 7.50AM

Nakshatram :

Chitra 12.32PM

Yogam :

Vaidruthi 2.21PM

Karanam :

Bava 7.50AM
Bala 7.24PM

AmruthaGadiyalu :

6.16AM-7.50AM

Rahukalam : 12.00 PM to 01.30 PM

Yamagandam : 07.30 AM to 09.00 AM

Varjyam :

6.06PM-7.42PM

Durmuhurtham 11.37AM-12.25PM

 

 

 
 

 

 

10/10/2018 , Wednesday

 

 

02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

 

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

 

 

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

 

 

09:30 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

 

17:30 – 18:30 hrs

Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

 

—-

 

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ 

 

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ఏదైనా ఉత్సవానికి 9 రోజుల ముందుగానీ, ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందుగానీ అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

అంకురార్పణ ఘట్టం కోసం ముందుగా యాగాశాలలో శ్రీ సీతారామలక్ష్మణులు, శ్రీహనుమంతుడు, శ్రీ సుగ్రీవుడు, శ్రీ అంగదుడు, శ్రీ అనంతుడు, శ్రీ గరుడాళ్వార్‌, శ్రీ చక్రత్తాళ్వార్‌, శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.

సేనాధిపతి ఉత్సవం :

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.

అంకురార్పణ క్రమం :

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగించారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. ముందుగా భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో నవధాన్యాలు చల్లారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠించారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది.

అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరించి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేశారు. ఆ తరువాత హోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను, అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడశోపచార పూజలు నిర్వహించారు.

ANKURARPANAM PERFORMED

 

The sacred event of Ankurarpanam, heralding the commencement of the Srivari Brahmotsavam, was performed with religious fervour in Tirumala on Tuesday evening.

Ankurarpanam ritual commenced only after the second bell and Nivedana to Sri Venkateswara Swamy.

Later kalasha sthapanam took place in the Taga shala located on the Southern end of the Bagaru baavi for Ankurarpanam which is also known as beejavapanam.


TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Board Members Sri GSS SIVAJI, Sri Rudraraju Padma Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and others took part.

Dept. of PRO- TTD.

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– తిరుమలలోని వసతిగృహాల ఆధునీకరణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు టిటిడి బోర్డు ఎఫ్‌ఎంఎస్‌ సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించడమైనది. ఇందుకు రూ.112 కోట్లు ఖర్చు కానుంది.

 

– టిటిడిలోని రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వృత్తిపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు ఆమోదం.

 

– టిటిడి విద్యాసంస్థల్లోని బోధనా సిబ్బందికి పదవీ విరమణ లేదా మరణించిన సందర్భాలలో ఆర్జిత సెలవు(Earned Leave) మరియు అర్ధ వేతన సెలవుల(Half pay Leave) నగదు మార్పిడికి సంబంధించి జి.ఓ.నం.90 అమలుచేసేందుకు నిర్ణయం.

 

– టిటిడి ఆధ్వర్యంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను పెంచేందుకు, ఆదరణ తక్కువగా ఉన్న గ్రూపులలో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు ఆమోదం.

 

– టిటిడి సిబ్బంది విజ్ఞప్తి మేరకు వారికి పరకామణి డిప్యూటేషన్‌ విధులను రద్దు చేసేందుకు ఆమోదం.

 

– ఫారిన్‌ సర్వీసు నుండి టిటిడికి వచ్చిన ఉద్యోగులను 3 సంవత్సరాల కాలపరిమితి అయిన తరువాత మాతృసంస్థకు బదిలీ చేయాలని నిర్ణయం. ఒకసారి వచ్చిన వారిని రెండవ పర్యాయం విధుల్లోకి తీసుకోరాదని నిర్ణయం.

– ఒకేచోట మూడు సంవత్సరాలు విధులు నిర్వహించిన టిటిడి ఉద్యోగులను మరొక విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం నవంబరు 1 నుండి అమల్లోకి వస్తుంది.

 

– అలిపిరి వద్ద భక్తుల సౌకర్యార్థం మొదటి దశలో రూ.120 కోట్లతో దాదాపు 500 గదులతో వసతి సముదాయం నిర్మించేందుకు ఆమోదం.

 

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మన్‌మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధానారాయణమూర్తి, శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీమేడా రామకృష్ణారెడ్డి, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీబికె.పార్థసారధి, శ్రీజిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీ డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పాల్గొన్నారు.

 

 

SOME EXCERPTS OF TTD TRUST BOARD RESOLUTIONS

The Tirumala Tirupati Devasthanams Board in its board meeting held under the chairmanship of Sri Putta Sudhakar Yadav at Annamaiah Bhavan in Tirumala has taken some important decisions on Tuesday.

Some excerpts:

* Approved to renovate the toilets and re-structure all the Rest houses in Tirumala at an estimated cost of Rs.112 crores.

 

* Resolved to construct a rest block at Alipiri in Tirupati facilitating accommodation to devotees. During first phase a block with 500 rooms at a cost of Rs.120 crore has been approved.

 

* Sub committee constituted to look into the grievances of the regular and outsourced employees of the TTD.

* TTD to implement G.O No.90 to provide half pay leave and earned leave to all the teaching staffs working in the TTD educational institutions on retirement or demise.

 

* Board approved a proposal to hike number of seats for groups in demand and reduce seats in groups with no demand in the TTD-run Junior and Degree colleges.

 

* The TTD staff were exempted from compulsory Parakamani duties.

 

* Employees from Government service on deputation to TTD service would be sent back to their parent body after 3 years and no provision of second chance will be considered to those who have completed one term in TTD.

 

* All the TTD employees who had completed 3 years at one location and one department would be transferred elsewhere with immediate effect from November 1.

 

TTD EO Sri Anil Kumar Singhal, Sri GSS Sivaji, Sri BK Parthasaradhi, Sri Rayapati Sambasiva Rao, Sri Dokka Jagannadham, Sri Bonda Umamaheswara Rao, Sri Challa Ramachandra Reddy, Sri Sandra Venkata Veeraiah, Smt Sudha Narayanamurthy, Sri RudraRaju Padma Raju, Sri E Peddi Reddy, Sri Meda Ramakrishna Reddy, Sri Dokka Jagannadham, Ex Officio Members, Dr Manmohan Singh, Dr M Padma, IAS, Spl Invitee Sri N Sri Krishna, Sri K Raghavendra Rao, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy participated in the meeting .

Dept. of PRO- TTD.

 

TTD BOARD MEET

The TTD Trust Board Meeting which took place under the Chairmanship of Sri Putta Sudhakar Yadav at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

 

TTD EO Sri Anil Kumar Singhal, Sri GSS Sivaji, Sri BK Parthasaradhi, Sri Rayapati Sambasiva Rao, Sri Dokka Jagannadham, Sri Bonda Umamaheswara Rao, Sri Challa Ramachandra Reddy, Sri Sandra Venkata Veeraiah, Smt Sudha Narayanamurthy, Sri RudraRaju Padma Raju, Sri E Peddi Reddy,Sri Meda Ramakrishna Reddy, Sri Dokka Jagannadham, Ex Officio Members, Dr Manmohan Singh, Dr M Padma, IAS, Spl Invitee Sri N Sri Krishna, Sri K Raghavendra Rao, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.

Dept. of PRO- TTD.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. చెన్నైలోని టిటిడి స్థానిక సలహా మండలి సభ్యుడు శ్రీ జె.రామాంజనేయులు ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని టిఎస్‌ఆర్‌ విశ్రాంతి భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీపుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీఎన్‌.శ్రీకృష్ణ పాల్గొన్నారు.

RS.10LAKHS DONATED

Sri J Ramanjaneyulu, Local Advisory Committee member, TTD, Chennai, has donated Rs.10lakhs to SV Annaprasadam Trust on Tuesday.

He has handed over the DD for the same to TTD Trust Board Chief Sri P Sudhakar
Yadav in TSR Rest House. Special Invitee to TTD Trust Board Sri Krishna was also present.

 

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——