[google-translator]

Today’s Devotional E-Paper – 09-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

09/11/2018 , శుక్రవారం

సంవత్సరం : శ్రీ విళంబి నామ సంవత్సరం

మాసం : కార్తీకం

పక్షం : శుక్ల

సూర్యోదయం : 6.14AM

సూర్యాస్తమయం : 5.40PM

తిథి : విదియ 9.04PM

నక్షత్రం : అనురాధ 9.14PM

యోగం
: శోభనం 4.43PM

కరణం
: బాల 8.59AM
కౌలవ 9.04PM

అమృతఘడియలు : 10.30AM-12.09PM

వర్జ్యం : 3.07AM-4.49AM

రాహుకాలం :
10.30 AM to 12.00 PM

యమగండం :
03.00 PM to 04.30 PM

దుర్ముహూర్తం
8.31AM-9.17AM
12.20PM-1.06PM

PANCHANGAM

Today’s Good & Bad Timings

09/11/2018 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Sukla

SunRise :

6.14AM

SunSet :

5.40PM

Tithi :

Vidiya 9.04PM

Nakshatram :

Anuradha 9.14PM

Yogam :

Shobhanam 4.43PM

Karanam :

Bala 8.59AM
Koulava 9.04PM

AmruthaGadiyalu :

10.30AM-12.09PM

Varjyam :

3.07AM-4.49AM

Rahukalam
:
10.30 AM to 12.00 PM

Yamagandam
:
03.00 PM to 04.30 PM

Durmuhurtham 8.31AM-9.17AM
12.20PM-1.06PM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 08.11.2018 :: 70,654.
 VQC SITUATION AT 5.00 AM ON 09.11.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 20,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : 10 HOURS. 
TONSURES – 22,241. 
PARAKAMANI – 2.10. CRORES. 
Dept of PRO TTD

 

 

09/11/2018 , Friday

02:30-03:00 hrs
Suprabhatam

03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam

04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam

06:00 – 07:00 hrs
Samarpana

07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)

09:00 – 20:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.

20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

21:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

 

 

నవంబరు 14న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
పుష్పాలంకార ప్రియుడు, నిత్యకల్యాణ స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 14వ తారీఖున పుష్పయాగం ఘనంగా జరుగనుంది. ఈ ఉత్సవ అంకురార్పణ నవంబరు 13న ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా 14వ తేది శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన సహస్ర కళశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సం సేవలను టిటిడి రద్దు చేసింది. అదే విధంగా 13వ తేది వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దుచేసింది.
కార్తీకమాసంలో స్వామివారికి నిర్వహించే ప్రథమ ఉత్సవం ఈ పుష్పయాగ మహోత్సవం. బుధవారం  మధ్యాహ్నం 1.00 గం|| నుండి సాయంత్రం 5.00 గం||ల వరకు ఈ మహోత్సవాన్ని ఆలయంలోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణానక్షత్రం రోజున ఉభయదేవేరులతో కూడి శ్రీమలయప్ప స్వామివారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ.
చారిత్రక నేపథ్యంలో ఈ పుష్పోత్సవం క్రీ.శ 15వ శతాబ్దం నాటికే నిర్వహిస్తున్నట్లు శాశనాధారాలు ఉన్నాయి. అయితే అనంతరం అర్ధాంతరంగా నిలచిపోయిన ఈ దివ్యోత్సవాన్ని అప్పటి టిటిడి ఆస్థాన విధ్వాంసులు శ్రీవేదాన్తం జగన్నాథాచార్యులవారి పర్యవేక్షణలో నవంబరు 14,1980లో టిటిడి పునరుద్ధరించింది.
పుష్పయాగం జరిగే రోజు యథా క్రమంగా రెండు అర్చనలు, రెండు నివేదనలు పూర్తియిన తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు. అటు తర్వాత హోమాలు, స్నపనతిరుమంజన కార్యక్రమాలను కన్నులపండుగగా వైదికులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
అనంతరం వివిధ రకాలైన కుసుమాలతో పుష్పార్చనను నివేదిస్తారు. సుమారు 7 టన్నుల పుష్పాలతో జరిగే ఈ పుష్పయాగం నేత్రపర్వంగా కొనసాగుతుంది. వీటిలో 18 రకాల సంప్రదాయాక పుష్పాలను నివేదిస్తారు. ముఖ్యంగా వీటిలో చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్ధనం, వంటి ప్రధాన సంప్రదాయ పుష్పాలు ఉంటాయి. శ్రీవారి హృదయాన్ని ఈ విరులు తాకే వరకు పుష్ప నివేదన చేసి అటు పిమ్మట పుష్పాలను తొలగిస్తారు. మళ్ళీ పుష్పార్చన చేస్తారు. ఇలా 20 మార్లు పుష్పార్చన జరుగుతుంది. అనంతరం ఉత్సవరులకు హారతిని సమర్పిచడంతో పుష్పయాగం శోభాయమానంగా ముగుస్తుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

PUSHPAYAGAM IN TIRUMALA ON NOVEMBER 14

The annual religious ceremony, Pushpayagam was performed after annual Brahmotsavam on the asterism of Sravanam which also happens to be the birth star of Sri Venkateswara Swamy, usually in the month of Karthika as per Hindu calendar which occurs on November 14.

 

Ankurarpanam is done prior to the Pushpayagam on November 13. On this day, after the daily pujas, the processional deity of Sri Malayappa Swami along with Sridevi and Bhudevi will be seated on a special golden platform in Sampangi Mandapam.

 

After offering Tirumanjanam to the utsava murties, tonnes of varieties of flowers are showered on the deities. This entire fete takes place between 1pm and 5pm. 

 

As per the scriptures, this festival is usually performed to save the earth from natural calamities such as quakes, cyclones, epidemics and appease the Lord to save the life of humanity, flora and fauna from all the catastrophes.

 

This festival which was in vogue in 15th Century and was reinstated by TTDs in 1980s.

 

 Dept. of PRO- TTD.

డిసెంబరు 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 4
నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు
చేపట్టాలని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల
భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆలయ డెప్యూటీ ఈవో
కార్యాలయంలో గల సమావేశ మందిరంలో గురువారం జెఈవో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై
అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ స్థానికాలయాల్లో
బ్రహ్మోత్సవాలను శోభాయమానంగా నిర్వహించేందుకు టిటిడి
ప్రాధాన్యమిస్తోందని, ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను కన్నులపండుగగా
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. ఇందుకోసం అన్ని విభాగాల
అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజులైన
డిసెంబరు 8న గజవాహనం, డిసెంబరు 9న బంగారు రథం, గరుడవాహనం, డిసెంబరు 11న
రథోత్సవం, డిసెంబరు 12న పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు
సూచించామన్నారు. నవంబరు 30వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విద్యుత్‌ అలంకరణలకు విశేష స్పందన
లభించిందని, అదేతరహాలో తిరుచానూరులోనూ శోభాయమానంగా ఏర్పాటు చేస్తామని
తెలియజేశారు. ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశామని, ఉదయం, సాయంత్రం
వాహనసేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

        భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం,
అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని
ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని
జెఈవో కోరారు. భక్తులకు భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా విజిలెన్స్‌,
సెక్యూరిటీ సిబ్బందితోపాటు 300 మంది శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌
గైడ్స్‌ సేవలను వినియోగించుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే
భక్తులు సంతృప్తికరంగా అమ్మవారి మూలమూర్తితోపాటు వాహనసేవలు తిలకించేలా
ఏర్పాట్లు చేపడతామని వివరించారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో 10, పంచమీతీర్థం
రోజున 8 ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబరు 28 నుండి ప్రచార
రథాల తరువాత తిరుచానూరు, తిరుపతి పరిసన ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని
తెలిపారు. వాహనసేవల ముందు ప్రదర్శనలిచ్చేందుకు హిందూ ధర్మప్రచార పరిషత్‌
నుండి 6, దాససాహిత్య ప్రాజెక్టు నుండి 4 కలిపి మొత్తం 10 కళాబృందాలను
ఏర్పాటుచేస్తామని, ఇందుకోసం 12 రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు
జరుపుతున్నామని వివరించారు. వాహనసేవలో ధర్మగిరితోపాటు కీసరగుట్ట, భీమవరం
వేద పాఠశాలల విద్యార్థులతో వైదిక హారం ఏర్పాటుచేస్తామన్నారు. అంతకుముందు
అమ్మవారి ఆలయం, ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌, ఆరోగ్య విభాగం, ఉద్యానవన
విభాగం, గోశాల తదితర విభాగాల అధికారులకు ఏర్పాట్లపై జెఈఓ పలు సూచనలు
చేశారు. వైద్యశిబిరంలో  స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించాలని, అదనంగా
మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి బాటిళ్లను అందించాలని కోరారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-4
శ్రీ రాములు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, శ్రీ
పద్మావతి అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, సేవల విభాగం
డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌,
డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, డిఈవో శ్రీ రామచంద్ర, గోశాల డైరెక్టర్‌
డా.. హరినాథరెడ్డి, ఉద్యానవన సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాస్‌,
హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రమణప్రసాద్‌, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ
వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

SRI PADMAVATHI DEVI ANNUAL BRAHMOTSAVAMS FROM DEC 4 TO 12-TIRUPATI JEO

 The annual Karthika Brahmotsavams of Sri Padmavathi Devi Ammavaru in Tiruchanoor will be observed from December 4 to 12 in a grand manner, said, Tirupati JEO Sri P Bhaskar.

 

During the review meeting in the new office building meeting hall in Tiruchanoor on Thursday, the JEO directed all the HoDs to complete the arrangements for the big fete by November 30. All the civil, electrical and other works should complete by this month end. The electrical illuminations should be grand as was done during the recent brahmotsavams at Tirumala and similarly the floral decorations should also be unique”, he instructed the concerned HoDs.

 

Later he said, the Kalabrindams and Bhajan Troupes who will perform before Vahana Sevas should also be exceptional. Last year, they enthralled devotees with their unique art forms. This year, invite expert artists from other states during important vahanams like Gaja and Garuda sevas, he directed HDPP Chief Sri Ramana Prasad.

 

He directed the Publicity Wing and SVBC to release press notes to media and promos respectively and give wide publicity so that more number of devotees take part in this nine day festival.

 

The JEO instructed VGO Sri Ashok Kumar Goud and Temple DyEO Smt Jhansi Rani to prepare an indent of Srivari Seva Volunteers and deputation staffs respectively for the occasion. He also later reviewed on the arrangements to be made by Annaprasadam, Forest, Medical and Health wings and other departments. 

 

CE Sri Chandra Sekhar Reddy and other HoDs were also present.

 

 Dept. of PRO- TTD.

డిసెంబ‌రు 12న గోదావ‌రి హార‌తి గోడ‌ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌రు 12వ తేదీన తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి స‌మీపంలోని కొవ్వూరు గోష్పాద‌క్షేత్రంలో జ‌రుగ‌నున్న గోదావ‌రి హార‌తి కార్య‌క్ర‌మ గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్క‌రించారు. తిరుచానూరులో గురువారం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై జ‌రిగిన స‌మీక్ష స‌మావేశం సంద‌ర్భంగా ఈ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సంకీర్త‌న కార్య‌క్ర‌మం, ఆధ్యాత్మిక సందేశాలు, సాయంత్రం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు గోదావ‌రి హార‌తి నిర్వ‌హిస్తారు. 

         ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో గ‌ణ‌ప‌తి హోమంతో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం గణపతి హోమంతో  విశేషపూజ, హోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన స్వామివారి సన్నిధిలో హోమాల్లో పాల్గొన‌డం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.
ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించారు. న‌వంబ‌రు 9, 10వ తేదీలలో కూడా గణపతి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.
న‌వంబ‌రు 11 నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం : 
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 11 నుంచి 13వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 13న సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఆలయ అర్చకులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

KARTHIKA HOMA MAHOTSAVAMS COMMENCES WITH GANAPATHI HOMAM

The month long religious Karthika Homa Mahotsavams in Sri Kapileswara Swamy temple commenced with Ganapathi Homam on Thursday.

Ganapathi Homam will last for three days and concludes on November 10. This will be followed by Sri Subramanya Swamy Homam for the next three days.

Sri Subramanya Swamy Kalyanam will be observed on the evening of November 13 by 6pm.

Temple DyEO Sri Subramanyam is supervising the arrangements.

  Dept. of PRO- TTD.

GODAVARI HARATI POSTER RELEASED

The Dasa Sahitya Project of TTD will be observing Godavari Harati on December 12 on the banks of River Godavari in the sacred Goshpada Kshetram in Kovvuru of Rajamundry.

 

The posters for the same was released by Tirupati JEO Sri P Bhaskar in Tiruchanoor on Thursday. He said, the religious event will be observed between 5pm and 7pm on that day. Spiritual discourses by eminent scholars have also been organised”, he added. 

 

The event will be organised under the supervision of Dasa Sahitya Project Special Officer Dr Ananda Teerthacharyulu.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——