[google-translator]

Today’s Devotional E-Paper – 09-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

09/10/2018 , మంగళవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.07AM

సూర్యాస్తమయం : 5.56PM

తిథి : అమావాస్య 9.08AM

నక్షత్రం : హస్త 1.03PM

యోగం : ఐన్ద్రం 4.26PM

కరణం
: నాగవ 9.08AM
కింస్తు 8.29PM

అమృతఘడియలు : 7.16AM-8.48AM

రాహుకాలం :
03.00 PM to 04.30 PM

యమగండం :
09.00 AM to 10.30 AM

వర్జ్యం : 8.52PM-10.26PM

దుర్ముహూర్తం
8.22AM-9.11AM
10.51PM-11.38PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

09/10/2018 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Bhaadrapadam

Paksham :

Bahula

SunRise :

6.07AM

SunSet :

5.56PM

Tithi :

Amaavasya 9.08AM

Nakshatram :

Hasta 1.03PM

Yogam :

Aindram 4.26PM

Karanam :

Naagava 9.08AM
Kimsthu 8.29PM

AmruthaGadiyalu :

7.16AM-8.48AM

Rahukalam :03.00 PM to 04.30 PM

Yamagandam : 09.00 AM to 10.30 AM

Varjyam :

8.52PM-10.26PM

Durmuhurtham 8.22AM-9.11AM
10.51PM-11.38PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON       08-10-2018: 70,884.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 09-10-2018
 
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II:02
,
 APPROX. TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
TONSURES: 23,682,
 
PARAKAMANI: 2.51 CRORES. 
Dept. of PRO TTD

 

 
 

 

 

09/10/2018 , Tuesday

 

06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell

 

07:00 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

—-

 

అక్టోబరు 9న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 9వ తేదీ మంగళవారం అంకురార్పణ జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

 

సేనాధిపతి ఉత్సవం ….

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుడు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.

 

మేదినిపూజ….

నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

 

అంకురార్పణ….

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

 

అక్షతారోపణ…

ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.

 

BRAHMOTSAVAM SPECIAL STORY 2_ ANKURARPANAM MARKS THE CELESTIAL INVITATION

One of the most significant events of the Navaratri Brahmotsavams at Srivari temple is the Ankurarpanam which trumpets the commencement of the nine day festival of religious grandeur and devotional gaiety.

 

This ritual which will be performed a day ahead of the Navarathri Brahmotsavam on October 9 and is often considered as prelude ritual seeking the successful conduct of the nine day mega religious event. The range of success is often compared with the sprouting of the nine varieties of multi grains ( Nava dhanyas ) sown on that day in the Yagashala of Srivari Temple. According to Chief Priest of Tirumala Sri Venugopala Dikshitulu, this event also invokes the blessings of Bhudevi with special prayers offering “Medini Puja” and inviting Her to participate in the event and also to bless the mankind with peace, prosperity, health and tranquility.

 

RELIGIOUS SIGNIFICANCE:

Ankurarpanam or Beejavapanam will be performed with religious fervour in Tirumala temple as per the tenets of Vaikhanasa Agama. Ankuram is “seed” and Arpanam is giving or to “Dedicate”. So Ankurarpanam means Sankalpam for performing or commitment to a specific purpose. The event is also marked with invitation to 49 gods and also asta dikpalakas, (Guardians of Directions in the universe) to participate in the event hosted for Lord Venkateswara by Lord Brahma.The dikpalakas includes Indra, Yama, Varuna, Vayu, Agni(fire), Kubera, Isana and Nirutti

 

NAVADHANYAS IMPLIES NAVA GRAHAS:

In the process of Ankurarpanam, nine grains or Nava Dhanyas are involved and Chandra is the lord for plants and grains. Chandra would be powerful during nights and hence Ankurarpanam is always performed during the night at an auspicious hour. The Nava Dhanyas signify the presence of each deity including – Rice,(Chandra) Wheat (Surya), Tur Dal (Khuja), Moong Dal (Budha), Red Peas (Bruhaspati), White Peas (Shukra) , Sesame (Shani) , Yellow Peas – (Rahu) and Horse Grams (Ketu).

 

AKSHATAROPANA ON FINAL DAY

The seeds are sown in mud pots called Palikas and they are placed at different directions in a geometrical manner as prescribed by Agamas. For nine days these seeds are grown and on the final day, the seedlings were separated from the sprouts and offered to the presiding deity and this process is called “Akshataropana”.

Dept. of PRO- TTD.

బర్డ్‌ ట్రస్టు సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

టిటిడి బర్డ్‌ ట్రస్టు సమావేశం సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగింది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, అదనపు ఎఫ్‌ఏసిఏవో శ్రీ రవిప్రసాదుడు, బర్డ్‌ సంచాలకులు డా|| జగదీష్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలు.

– బర్డ్‌ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి 7వ పిఆర్‌సి వర్తింపచేసేందుకు నిర్ణయం.

 

– టిటిడి ఉద్యోగులు, రోగుల విజ్ఞప్తి మేరకు 50 ప్రత్యేక అదనపు గదులు నిర్మించేందుకు ఆమోదం.

– స్విమ్స్‌ తరహాలో జి.ఓ ప్రకారం వైద్యుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుండి 63 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు.

 

– బర్డ్‌ ఆసుపత్రిలో ఔట్‌పేషంట్లకు ఉపయోగకరంగా ఉండేలా కొత్త ఓపి బ్లాక్‌ ఎదురుగా గల గదిలో ఓపెన్‌ టెండర్ల ద్వారా మందుల దుకాణం ఏర్పాటు. ఈ దుకాణం అద్దె ద్వారా వచ్చే నెలసరి ఆదాయాన్ని బర్డ్‌ ఆసుపత్రి అభివృద్ధికి వినియోగం.

 

BIRRD TRUST MEETING HELD

Sri Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled (BIRRD) Trust meeting was held under the Charimanship of TTD Trust Board Chief Sri P Sudhakar Yadav in Tirupati on Monday evening which has resolved to take some important decisions. Excerpts:

* Nod given to implement 7th PRC to the doctors working in BIRRD on the lines of SVIMS and NIMS where it is already implemented.

 

* Retirement age increased from 60years to 63years as per the GO which is already under implementation in SVIMS.

* The construction of 50 beds over the old hospital block need to be taken up immediately without further delay.

 

* Approved to go for open tender for the vacant room located in front of New Hospital Block. This would serve as Medical Shop for out patients. The monthly rentals obtained from this shop will be utilized for development of the hospital.

 

In the meeting which was held at Sri Padmavathi Rest House in Tirupati was also attended by members Sri Rayapati Samba Siva Rao, Sri Sandra Venkata Veeraiah, EO Sri Anil Kumar Singhal, FACAO Sri Balaji, Additional FACAO Sri Raviprasadudu, Director BIRRD Dr G Jagdeesh.

 

Dept. of PRO- TTD.

 

గరుడసేవ రోజు భక్తులకు చక్కటి సేవలు అందించాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 14న జరిగే గరుడసేవకు వచ్చే భక్తులకు చక్కటి సేవలు అందించాలని తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు ఉద్యోగులను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోగల సమావేశ మందిరంలో డెప్యూటేషన్‌ ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం అవగాహన సదస్సు నిర్వహించారు. పెరటాశి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో గరుడసేవ రోజున భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుందని, దీనికి తగ్గట్టు సిబ్బంది పని చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యార్థం నాలుగు మాడ వీధులలో ఇప్పటికే భక్తులకు అవసరమైన మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. గ్యాలరీలలోని భక్తులు మరుగుదొడ్లకు ఎలా వెళ్లాలో సిబ్బంది ముందుగానే తెలియజేయాలన్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలకు సంబంధించిన సూచికబోర్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

 

అదేవిధంగా, తిరుమల నాలుగు మాడ వీధులలో 2 లక్షల మంది భక్తులు కూర్చునే విధంగా గ్యాలరీలు ఉన్నాయని, భక్తులందరికీ అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీటిని సులభంగా అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను జేఈవో ఆదేశించారు. నాలుగు మాడ వీధులలో ఏ ఏ ప్రాంతాలలో ఏంత మంది శ్రీవారి సేవకులు ఉండాలనే విషయంపై ముందుగానే లిస్ట్‌ తయారు చేసుకోవాలన్నారు. భక్తులతో సంయమనంతో మెలుగుతూ, చక్కటి సేవలు అందించాలని సిబ్బందికి జేఈవో సూచించారు.

 

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ బాలాజీ, ఎస్‌ఈలు శ్రీ రమేష్‌ రెడ్డి, శ్రీ సుధాకర్‌రావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ఠ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

PROVIDE BEST POSSIBLE SERVICES ON GARUDA SEVA

Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon the deputation staffs for Gaurda Seva during the ensuing Navarathri Brahmotsavams to provide best possible services to pilgrims with patience and dedication.

An orientation programme to the staffs was held at Conference Hall in TTD Administrative building in Tirupati on Monday. Speaking on this occasion, the JEO said, this year more crowd is being anticipated for Garuda Seva during Navarathri Brahmotsavams as it is falling on October 14 which is not only Sunday but coupled with Peratasi masam which is auspicious to Tamil folk.

 

He said, additional toilets have already been constructed in the four mada streets in all galleries for the sake of pilgrims. The staffs deployed for gallery duty should properly guide the pilgrims on how to reach these toilets located in the galleries. Annaprasadam, buttermilk, water will be distributed to the 2lakh people converged in the galleries of four mada streets. The services of Srivari Sevakulu need to be utilized in the best way and for that the concerned department should list out the sevakulu drafted for Garuda Seva service.

 

FACAO Sri Balaji, SEs Sri Ramesh Reddy, Sri Sudhakar Rao, Annaprasadam Special Officer Sri Venu Gopal, DFO Sri Phanikumar Naidu, Health Officer Dr Sermista were also present.

Dept. of PRO- TTD.

భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ విధానాలపై కేరళ ప్రభుత్వ కమిటీ అధ్యయనం వివరాలు తెలియజేసిన తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టిటిడి అనుసరిస్తున్న విధానాలపై కేరళ ప్రభుత్వ త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయంలో రద్దీ క్రమబద్ధీకరణ విధానాలను అమలుచేసేందుకు ఈ కమిటీ సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమావేశమైంది. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ సందర్భంగా టిటిడి విధానాలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కూలంకషంగా వివరించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆలోచనల మేరకు సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా 75 శాతం మంది భక్తులకు నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు. దర్శన విధానాలకు సంబంధించి ఐటి పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పారదర్శకంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం సాధ్యమవుతోందన్నారు. భక్తులకు కల్పిస్తున్న దర్శనం, అన్నప్రసాదం, బస, భద్రత, రవాణా సౌకర్యాల గురించి వివరించారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడం తదితర అంశాల గురించి తెలియజేశారు.

 

కేరళ ప్రభుత్వ ప్రజాపనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కమలవర్ధన్‌రావు మాట్లాడుతూ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు టిటిడి అనుసరిస్తున్న విధానాలు చక్కగా ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ ప్రభుత్వ రెవెన్యూ(దేవాదాయ) ముఖ్య కార్యదర్శి శ్రీకె.ఆర్‌.జ్యోతిలాల్‌, అదనపు డిజి శ్రీ అనంతకృష్ణన్‌, టిటిడి ఎఫ్‌ఏసిఏఓ శ్రీ బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

KERALA TEAM APPRAISED ON DIGITAL TICKETING SYSTEM BY TTD

 

Tirumala JEO Sri KS Sreenivasa Raju elaborated on the strategies and systems adopted by TTD for devotee management at the holy shrine of Tirumala to the three-member team deputed by Kerala Government with high profile officials.

Earlier, the JEO briefed them with help of Power Point presentation held at the Sri Padmavati Rest house in Tirupati on Monday on the use of IT for facilitating darshan, accommodation, donations etc. by TTD which had helped in providing comfortable pilgrimage to multitude of visiting pilgrims in Tirumala.

 

The JEO said, under the instructions of Executive Officer Sri Anil Kumar Singhal, TTD has adopted IT in almost all its darshan formats to enhance transparency which yielded positive results. Be it Rs.300 Special Entry Darshan or Divya Darshan (footpath), Sarva Darshan, the time slotted darshan system has enabled the management to provide hassle free darshan to 75% of our pilgrims”, he asserted.

The IT adoption has also provided transparency and proper regulation of not only pilgrim crowds but also other core activities of the TTD like sale and distribution of laddu prasadam, publications, hundi donations etc. The JEO later explained them on queue lines management, compartments, cleanliness, garbage clearance, recycling, drinking water facilitation, reuse of tertiary water after treatment etc at Tirumala which fascinated the team.

 

Sri Kamalavardhan Rao, Principal Secretary of Public Works Department, Kerala, Sri K R Jyotilal, Principal Secretary ( Revenue Endowments), Addl. DGP Sri Ananta Krishnan later complimented TTD for its pilgrim initiatives and said they will adopt the IT measures in Kerala temples including Sabarimala for a hassle free darshan mechanism.

 

FA and CAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, IT Chief Sri Sesha Reddy, Dy E O Srivari Temple Sri Harindranath, Special Officer Annaprasadam Sri Venugopal also participated in the event.

Dept. of PRO- TTD.

సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం – టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా||రమణ ప్రసాద్‌

యువత, పిల్లలు, మహిళలలో సనాతన హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు నేటి యువతలో సనాతన హైందవ ధర్మం, మానవీయ, నైతిక విలువలు పెంచేందుకు చిన్న వయస్సులోనే వారికి సులభంగా అర్ధమయ్యేలా, చిరకాలం గుర్తుండేలా ధర్మ ప్రచారకులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సనాతన ధర్మం వివేకాన్ని పెంచుతుందని, ఆచరించడం ద్వారా గమ్యం చేరుకోవచ్చన్నారు. ఈ రోజు నుండి 13వతేది వరకు ఎంపికైన ధర్మప్రచారకులకు శిక్షణ ఇస్తామన్నారు.

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన జిల్లాల నుండి 50 మందిని ఎంపిక చేశామన్నారు. ఒక్కో బ్యాచ్‌కు 50 మంది చొప్పున మార్చి 2019 వరకు దాదాపు 600 మందికి 12 బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తామన్నారు. రామాయణం, భాగవతం, భారతంలోని ప్రధాన ఘట్టాలను నేటి తరానికి అర్థమయ్యేలా సరళమైన భాషలో వివరించాలని ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి డా.దామోదర్‌ నాయుడు తెలియజేశారు. హిందూ ధర్మం పవిత్రమైనదని, భారతదేశానికి హిందూ ధర్మం వెన్నెముక లాంటిదన్నారు. శ్రీ గురుదేవ్‌ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షకురాలు శ్రీమతి గాయత్రి సుధా ధర్మప్రచారకులకు ధర్మపరిచయం, లక్ష్యాలు, పురాతన గ్రంథాలు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు.

 

ఈ కార్యక్రమంలో పురాణ ఇతిహాస ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మయ్య, ఎస్‌పిడబ్ల్యూ డిగ్రీ కాలేజీ తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి కృష్ణవేణి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన ధర్మప్రచారకులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

SANATANA DHARMA PRACHARA ENHANCED BY TTD

TTD has rolled out an effective campaign for propagating Sanatana Hindu Dharma among school children, youth, women and depressed classes of society, says Dr Ramana Prasad, HDPP Secretary.

 

Speaking at the launch of train program for Dharma Pracharakulu organised at SVETA on Monday, he said that on directions of TTD EO Sri Anil Kumar Singhal and JEO (Tirupati) Sri P Bhaskar, HDPP took up this publicity campaign with the objective of catching the youth and the children at an young age to imprint the message of Hindu dharma in simplified and long lasting format.

 

He said the 50 persons from all districts of AP and Telengana, were chosen for training as Dharma Pracharaks till October 13. The goal is to train around 600 persons as 12 batches of Dharma Pracharaks by March 2019 at the rate of 50 members per batch.
Speaking on occasion Sri. Damodar Naidu, OSD of Epic Studies said the trainees should be imparted knowledge on epics like Ramayana and Mahabharata to narrate it to youth in simple language.

 

Smt Gayatri Sudha, a teacher of the Art of Living is one of the speakers chosen to impart training in Dharma, Goals,epic studies with PP presentations. Among others Dr Samudrala Lakshmaiah OSD of Epic studies, Telugu lecturer of SPW Degree college Smt Krishnaveni , Dharma Pracharaks from Telangana and AP and staff of the HDPP participated in the event.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——