[google-translator]

Today’s Devotional E-Paper -09-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

09/01/2019 ,బుధవారం

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్యమాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం : 6.44AM

సూర్యాస్తమయం : 5.58PM

తిథి :తదియ 11.57AM

నక్షత్రం : ధనిష్ఠ 12.36AM

యోగం :సిద్ధి 3.55AM

కరణం :గరజి 11.57AM
వాణి1.01AM

అమృతఘడియలు :1.04PM-2.50PM

వర్జ్యం : లేదు

దుర్ముహూర్తం
11.59AM-12.43PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

09/01/2019 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Pushya Masam

Paksham :

Sukla

SunRise :

6.44AM

SunSet :

5.58PM

Tithi :

Tadiya 11.57AM

Nakshatram :

Dhanishta 12.36AM

Yogam :

Siddhi 3.55AM

Karanam :

Garaji 11.57AM
Vani 1.01AM

AmruthaGadiyalu :

1.04PM-2.50PM

Durmuhurtham 11.59AM-12.43PM

 

09/01/2019 , Wednesday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

 

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

 

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

 

09:30 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

 

 టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– తిరుపతిలోని అలిపిరి వద్ద భక్తులకు వసతి కల్పించేందుకు మొదటి బ్లాకులో 384 గదులను రూ.67.29 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఖరారు.

– తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత పటిష్టంగా నిఘా, భద్రతను కల్పించేందుకు 2వ దశలో 1,050 సిసి కెమెరాలు ఏర్పాటుకు రూ.15.79 కోట్ల నిధులు మంజూరు.

– తిరుమలలో భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనం కాంప్లెక్స్‌ నుండి ఆళ్వార్‌ ట్యాంక్‌ రెస్ట్‌హౌస్‌ గేటు వరకు రూ.17.21 కోట్లతో క్యూలైన్‌ నిర్మించేందుకు టెండర్లు ఖరారు.

– తిరుమలలో స్మార్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రూ.2.63 కోట్లు మంజూరు. అదేవిధంగా, తిరుపతిలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్‌ ఏర్పాటుకు రూ.1.97 కోట్లు మంజూరు.

– అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా మహారాజగోపురం, ఆర్జితసేవామండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథమండపం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, పుష్కరిణి నిర్మించేందుకు రూ.27.29 కోట్లతో టెండర్లు ఖరారు.

– స్వర్గీయ వేదాంతం దేశికాచార్యులు స్థానంలో టిటిడి అర్చకులు శ్రీ ఎ.అనంతశయన దీక్షితులను రెండేళ్ల కాలపరిమితికి గాను ఆగమసలహాదారుగా నియమించేందుకు ఆమోదం.

– తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న వసతి సముదాయంలో ఒకరోజుకు నాన్‌ ఏసీ గది రూ.600/-, ఏసీ గది రూ.1200/-, ఏసీ డార్మిటరీ ఒక వ్యక్తికి రూ.100/- అద్దె, నాన్ ఏసీ డార్మిట‌రీ ఉచితంగా కేటాయించేందుకు ఆమోదం.

– పలమనేరులోని గోశాలలో దేశవాళి గోవుల సంరక్షణ కోసం, ”గోపర్యాటకాన్ని” అభివృద్ధి చేసేందుకు, పాడిరైతులకు శిక్షణ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.40.77 కోట్లు మంజూరుకు ఆమోదం.

– అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద కల్యాణమండపాన్ని రూ.2.27 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఖరారు.

– ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రాల నిర్మాణానికి టెండర్లు ఆమోదం.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో రూ.2.90 కోట్లు

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో రూ.2.86 కోట్లు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రూ.2.99 కోట్లు.

 

BOARD MEET RESOLUTIONS_

 

The TTD Trust board under the chairmanship of Sri P Sudhakar Yadav during its board meeting at Annamayya Bhavan in Tirumala took some important resolutions on Tuesday. Some excerpts:

• Nod to go for tenders to construct 384 rooms in Pilgrims Amenities Complex coming up at Alipiri at Rs.67.29crores

• Sanction of Rs.15.79crores in Second phase to install 1050 CCTVs in Tirumala

• Separate queue line to be constructed from Sarva Darshanam Complex to Alwar Tank Rest House at a cost of Rs.17.21crores

• Rs.2.63crores sanctioned for Smart Data Centre in Tirumala while Rs. I.97crores towards purchase of Hardware materials for new Data Centre in Tirupati.

• Tenders approved for Rs.27.29crores towards the construction of Maharajagopuram, Arjitha Seva, Addala, Vahana and Ratha mandapams and pushkarini at Sri Anjaneya Swamy temple in the Sri Venkateswara Divya Kshetram coming up at Amaravathi.

• Temple Archaka Sri Ananta Sayanam Dikshitulu posted in the place of late Sri Vedantam Desikacharyulu as Agama Advisor for a period of two years.

• The cost of rooms fixed in Sri Padmavathi Complex coming up at Tiruchanoor. Tariff details:
Non-A/C room-Rs.600
A/C room-Rs.1200
A/C dormitory per person-Rs.100
Non-A/C dormitory-Free

• Construction of Kalyana Mandapam at Appalayagunta at Rs.2.27crores

• Sanction of Rs.40.77crores towards the development of Gow Tourism, train dairy farmers, create awareness among students in dairy farming at Palamaner

• Sri Venkateswara Divyakshetrams coming at agency areas:

Parvathipuram in Vizianagaram-Rs.2.90crores
Seetampeta in Srikakulam-Rs.2.86crores
Rampachodavaram in East Godavari-Rs. 2.99crores.
TTD EO Sri Anil Kumar Singhal, Sri Dokka Jagannadham, Sri Bonda Umamaheswara Rao, Sri Challa Ramachandra Reddy, Smt Sudha Narayanamurthy, Smt Sapna Munagantiwar, Sri RudraRaju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Ex Officio Member, Sri Manmohan Singh, Dr M Padma, IAS, Spl Invitee Sri N Sri Krishna, Sri B Ashok Reddy, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.

 

Dept of PRO TTD

జనవరి 31న అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణ : టిటిడి ఈవో

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ జనవరి 31వ తేదీన ఉదయం 9.10 నుండి 9.40 గంటల మధ్య అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆగమోక్తంగా భూకర్షణ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీనారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తారని వెల్లడించారు. టిటిడి తిరుమలలో నిర్వహించే అఖండ హరినామ సంకీర్తనకు వచ్చే భజన బృందాలకు ఆర్డినరీ బస్‌ చార్జీలు చెల్లించనున్నట్టు తెలిపారు. తిరుమలలో దుకాణాలు, హాకర్ల లైసెన్సుల సమస్యలపై టిటిడి ఛైర్మన్‌ అధ్యక్షతన సబ్‌ కమిటీ ఏర్పాటుచేశామని, ఇందులో బోర్డు సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీ విజయసారధి సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ కమిటీ రానున్న 10 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని, కమిటీ సిఫార్సులను అమలుచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీబోండా ఉమామహేశ్వరరావు, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీచల్లా రామచంద్రారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీఎన్‌.శ్రీకృష్ణ, శ్రీ అశోక్‌రెడ్డి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

 

PUJA FOR SRI VENKATESWARA DIVYAKSHETRAM IN AMARAVATHI ON JAN 31 – EO_

The construction of Sri Venkateswara Divyakshetram at Amaravathi will be commenced after performing Bhoomakarshana Puja on January 31.

Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala after board meeting on Tuesday, the EO said, the muhurtam has been fixed for the puja as per Vaikhanasa Agama between 9.10am and 9.40am by agama scholars.

He said, the Honourable Chief Minister Sri N Chandrababu Naidu will take part in this puja.

The EO also said, the board has agreed to pay ordinary bus fares to the bhajan artistes of Akhanda Hari Nama Sankeertana at Tirumala.

He said, a sub committee under the chairmanship of Sri P Sudhakar Yadav has been constituted which will submit a report on observations over shops of Tirumala and hawkers licence in ten days span.

 

Dept of PRO TTD

_ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు మంగళవారం రూ.10 ల‌క్ష‌లా 11 వేలు విరాళంగా అందింది. సింగపూర్‌లో స్థిరపడిన శ్రీమతి దేవకి కార్ల తరఫున తిరుపతికి చెందిన శ్రీ సురేష్‌, శ్రీ హుస్సేన్‌ కలిసి ఈ మేరకు విరాళం డిడిని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అందజేశారు. తిరుమలలోని టిఎస్‌ఆర్‌ విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.

 

DONATION TO PRANADHANA TRUST

 

A Singapore based devotee Smt Devaki Karla has donated Rs.10.11lakhs to Sri Venkateswara Pranadhana Trust on Tuesday.

Sri Suresh and Sri Hussain of Tirupati handen over the DD to TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav at TSR Rest House on Tuesday.

 

తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో స‌మీక్ష‌

 

 తిరుమలలో భక్తుల‌కు మెరుగైన వ‌స‌తులు క‌ల్పించేందుకు వివిధ విభాగాల ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మంగ‌ళ‌వారం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఇందులో సివిల్, ఎల‌క్ట్రిక‌ల్‌, వాటర్ వ‌ర్క్స్ ప‌నుల‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఎస్వీ మ్యూజియంలో ద‌శ‌ల‌వారీగా హాళ్ల అభివృద్ధి, కొనుగోళ్లు, ప‌ర‌కామ‌ణి త‌దిత‌ర విభాగాల‌పై చ‌ర్చించారు. అదేవిధంగా, ఫిబ్ర‌వ‌రి 12న జ‌రుగ‌నున్న ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం ఏర్పాట్ల‌పై ఒక నెల ముందుగా స‌మీక్ష నిర్వ‌హించారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

 

ర‌థ‌స‌ప్త‌మినాడు మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో వేచి ఉండే భ‌క్తుల‌కు ఉద‌యం నుండి సాయంత్రం వ‌ర‌కు సేవ‌లు అందించేందుకు గ్యాల‌రీల వారీగా శ్రీ‌వారి సేవ‌కులకు విధుల కేటాయించాల‌ని టిటిడి పిఆర్వో డా.. టి.ర‌విని ఆదేశించారు. ఈ ప‌ర్వ‌దినానికి విధులు కేటాయించే ఉద్యోగుల జాబితాను రూపొందించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. శ్రీ‌వారి సేవ‌కుల సాయంతో భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు అందించేందుకు త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని అన్న‌ప్ర‌సాదం, ఆరోగ్య విభాగం అధికారుల‌ను ఆదేశించారు. మాడ వీధుల్లో భ‌క్తుల‌కు వైద్య‌సేవ‌లు అందించేందుకు త‌గినంత మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల‌ని సిఎంవో డా.. నాగేశ్వ‌ర‌రావుకు సూచించారు.

 

ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Dept of PRO TTD

JEO HOLDS REVIEW MEETING ON VARIOUS DEVELOPMENT ACTIVITIES

Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday reviewed on the progress of developmental activities pertaining to various departments at Annamaiah Bhavan in Tirumala.

 

During the meeting he reviewed on the engineering works including civil, electrical, water etc., development of halls in SV Museum in a phased manner, procurement of various items, parakamani and issues pertaining to other departments.

 

Later the JEO also reviewed on the arrangements for the ensuing important religious event of Radhasapthami which occurs on February 12 almost one month prior. He instructed all the concerned department HoDs to plan for the arrangements for Radhasapthami keeping in view the past experience.

 

He directed TTD PRO Dr T Ravi to make gallery wise deployment list of Srivari Sevakulu to extract better services from them to pilgrims who will be sitting in galleries of four mada streets from morning to evening on that auspicious day. Similarly he also instructed the concerned to make a list of employees who will also be deployed for Radhasapthami duty. He directed Annaprasadam and Health wings to make necessary arrangements of food and water distribution for the occasion utilizing the services of Srivari Sevakulu. He also instructed the CMO Dr Nageswara Rao to keep sufficient numbers of medical teams in four mada streets.

 

SE II Sri Ramachandra Reddy, VSO Sri Manohar, temple DyEO Sri Harindranath, GM Transport Sri Sesha Reddy and other senior officers were also present.

 

 

‘అన్నమయ్య సంకీర్తన సుమమాలిక’ సంకీర్తనల ఆవిష్కరణ

 

 శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్త‌న సుమమాలిక ” సంకీర్తనలను టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్ ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఈ సంకీర్తనలను శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచారు. శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌తి ఆర్‌.బుల్లెమ్మ‌, శ్రీ జి.అనీలకుమార్, శ్రీమతి ఎన్.సి.శ్రీదేవి, శ్రీమతి పి.రమణవాణి గానం చేశారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

 

ANNAMAYYA CD RELEASED_

 

Saint Poet Sri Tallapaka Annamacharya penned devotional songs CD was released on Tuesday evening by Annamacharya Project Director Sri B Viswanath.

In connection with Sravana Nakshatram, audio Cd “ANNAMAYYA SANKEERTHANA SUMA MALIKA” composed and sung by Sri G.Bala Krishna Prasad, Smt.Bullema, Smt N.C.Sridevi, Smt. Ramanavani and Sri G.Anila Kumar was released.

Later they rendered some keertans with melody and enthralled the audience. The artistes were also felicitated on the occasion.

The devotees can also download these songs free of cost from TTD website.

 

Dept of PRO TTD

 

 

——