[google-translator]

Today’s Devotional E-Paper – 08-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

ఈ రోజు లక్ష్మీవారం【గురువారము】_
_తేది :  8, నవంబర్ 2018_
_*సంవత్సరం* : విళంబినామ సంవత్సరం_
_ఆయనం : దక్షిణాయణం_
_మాసం : కార్తీకమాసం_
_ఋతువు : శరత్ ఋతువు_
_కాలము : వర్షాకాలం_
_పక్షం : శుక్లపక్షం_

తిథి : పాడ్యమి_
_【నిన్న 09.32 PM to ఈ రోజు 09.07 PM తదుపరి విదియ】_

నక్షత్రం : విశాఖ_
_【నిన్న 07.36 PM to ఈ రోజు 07.48 PM తదుపరి అనురాధ】_

యోగము : సౌభాగ్యము_

కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ_

వర్జ్యం:_
_01.19 AM to 02.55 AM_

అమృతకాలము_
_10.55 AM to 12.32 PM_

దుర్ముహూర్తం:_
_09.57 AM to 10.43 AM & 02.29 PM to 03.14 PM_

రాహుకాలం :_

01.30 PM to 03.00 PM_

యమగండం:_
_06.00 AM to 07.30 AM_

 

 

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
 
 TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 07.11.2018 :: 75,716.
 VQC SITUATION AT 5.00 AM ON 08.11.2018
NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 03,
APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : 06 HOURS.
TONSURES – 21,665. PARAKAMANI – 2.90. CRORES.  
 
 
 
 
Dept of PRO TTD

 

 

 

 

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం ఉదయం దీపావళి ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత వైభవంగా నిర్వహించారు. 
శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఘనంగా ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. 
నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తిఅయినది.అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. 
      ఈ ఆస్థానంలో  శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, తిరుమల జెఈవో  శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

DEEPAVALI ASTHANAM PERFORMED

On the auspicious occasion of festival of lights, Deepavali, the traditional ritual of temple court was.observed with religious fervour in Tirumala temple.

 

As a part of this fete, the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi were seated on Sarva Bhupala Vahanam in Garudalwar Sannidhi. The divine Commander in Chief Sri Vishwaksenula varu was also seated adjacent to the deities. Later Asthanam was performed.

 

After Asthanam Harati was rendered followed by Prasada vitarana.

 

HH Tirumala Pedda Swamy, Chinna Jiyar Swamy, Tirumala JEO Sri KS Sreenivasa Raju, DyEO Temple Sri Harindranath, SE II Sri Ramachandra Reddy and others were also present.

 

 Dept. of PRO- TTD.

తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా దీపావళి ఆస్థానం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా  నిర్వహించారు. 
             
 ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి,  ఏఈవో శ్రీ ఉద‌య‌భాస్క‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ సురేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 Dept. of PRO- TTD.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 
ఘనంగా దీపావళి ఆస్థానం, సహస్ర కలశాభిషేకం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధ‌వారం అమావాస్య, దీపావళి సందర్భంగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు దీపావ‌ళి ఆస్థానం వైభ‌వంగా నిర్వహించారు. అమావాస్య సందర్భంగా ఉదయం 6.00 నుండి 9.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా జరిగింది.  
దీపావళి సందర్భంగా బుధ‌వారం రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది. 
      ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఇ.సి.శ్రీధర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——