[google-translator]

Today’s Devotional E-Paper -07-12-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

07/12/2018 , శుక్రవారం

 

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ
సూర్యోదయం:6.27AM
సూర్యాస్తమయం :5.41PM
తిథి :అమావాస్య 12.10PM
నక్షత్రం:జ్యేష్ఠ6.00AM
యోగం:ధృతి9.47PM
కరణం :నాగవ 12.10PM
కింస్తు12.33AM
అమృతఘడియలు :8.46PM-10.27PM
రాహుకాలం :10.30 AM to 12.00 PM

 

యమగండం:03.00 PM to 04.30 PM
వర్జ్యం :10.43AM-12.24PM
దుర్ముహూర్తం
8.42AM-9.27AM
12.26PM-1.11PM

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

07/12/2018 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise :

6.27AM

SunSet :

5.41PM

Tithi :

Amaavasya 12.10PM

Nakshatram :

Jyeshta 6.00AM

Yogam :

Dhruthi 9.47PM

Karanam :

Nagava 12.10PM
Kimstu 12.33AM

AmruthaGadiyalu :

8.46PM-10.27PM

Rahukalam :10.30 AM to 12.00 PM

Yamagandam :03.00 PM to 04.30 PM

Varjyam :

10.43AM-12.24PM

Durmuhurtham 8.42AM-9.27AM
12.26PM-1.11PM

 

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
    
  
TOTAL PILGRIMS HAD DARSHAN ON 06-12-2018: 62,355, 
V.Q.C SITUATION AT 05.00 AM ON 07-12-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 10.
 APPROXIMATE TIME FOR SARVA DARSHAN: UPTO 12 HOURS. 
.
TONSURES: 11,129. 
PARAKAMANI: RS.2.53 CRORES. 
Dept of PRO TTD

 

 
 
 

07/12/2018 , Friday

02:30-03:00 hrs
Suprabhatam

03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam

04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam

06:00 – 07:00 hrs
Samarpana

07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)

09:00 – 20:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.

20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

21:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

TTD TO RELEASE 70K ODD SEVA TICKETS ONLINE ON DECEMBER 7

 The on-line quota of Arjitha seva tickets for the month of March 2019 will be the released by TTD on December 7 by 10am.

 

Usually the release of tickets will be announced by TTD EO Sri Anil Kumar Singhal while addressing pilgrim callers during monthly “Dial your EO” program. But since the program was cancelled on Friday following Tiruchanoor brahmotsavams, TTD has released a press statement on Thursday evening about online quota of Arjitha Seva tickets.

 

In a total of 70,512 arjitha seva tickets that are going to be released on Friday, 11,537 will be through electronic dip process while the remaining 58,975 under general category.

Dept. of PRO- TTD.

ముత్యపుపందిరిపై శ్రీ‌కృష్ణాలంకారంలో అల‌మేలుమంగ‌
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.
మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది.
         వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈఓ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PADMAVATHI DEVI CHEERS DEVOTEES ON MUTTANGI VAHANAM

The Goddess of Riches, Sri Padmavathi Devi cheered the devotees on Muttangi Vahanam on the third day morning on a pearl canopy as a part of the ongoing annual Karthika Brahmotsavams in Tiruchanoor.  

The Goddess in the guise of Sri Krishna Swamy blessed Her devotees taking a pride procession along the four mada streets encircling the shrine.

The bhajan troupes and the art forms displayed their artistic skills in front of vahanam enthralled the devotees.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy and others were present.

 Dept. of PRO- TTD.
డిసెంబరు 7 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 7 నుండి 31వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమౌతుంది.
ఈ సందర్భంగా శ్రీవైష్ణవ జీయంగార్లు స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
 Dept. of PRO- TTD.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింప చేశాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. 
         ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు హైద‌రాబాదుకు చెందిన శ్రీ ఎమ్‌.వి.ఎస్‌.శాస్త్రి మాట్లాడుతూ ” రామో విగ్ర‌హ‌వాన్ ధ‌ర్మః ”   అనే  అంశంపై శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి గుణ‌ములు, ధ‌ర్మ‌సంస్థాప‌నం చేసిన అంశాల‌ను భ‌క్తుల హృద‌యాల‌పై చెర‌గ‌ని ముద్ర‌వేసే విధంగా ప్ర‌వ‌చించారు.    
       అనంత‌రం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన ఎస్‌.శ్రీ‌వ‌ల్లి బృందం వారిచే  భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. 
అనంతరం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు  తిరుప‌తికి చెందిన  శ్రీ కె.చంద్ర‌శేఖ‌ర్ భాగ‌వ‌తార్ హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, ఊంజల్‌ సేవలో సంకీర్తన‌ల‌ను బెంగుళూరుకు చెందిన ర‌మ్య ప్ర‌వీణ్‌ బృందం గానం చేయ‌నున్నారు. 
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైద‌రాబాదుకు  చెందిన శ్రీ వి.శ్రీ‌కృష్ణ బృందంచే భ‌క్తిసంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు న్యూఢిల్లికి చెందిన ఢిల్లి సిస్ట‌ర్స్ ఎస్‌.శైల‌జ మ‌రియు ఎస్‌. సౌంద‌ర్య బృందం భక్తి సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద తిరుప‌తికి చెందిన ఆర్‌.మాధ‌వీల‌త బృందంచే భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. 

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన ఎ.రాజ‌మోహ‌న్ బృందం భ‌క్తి సంగీత కార్యక్రమాలు జరిగాయి,
 
 Dept. of PRO- TTD.
సింహ వాహనంపై సిరులతల్లి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి అమ్మవారు సింహ వాహనంపై భక్తులను కటాక్షింరుచారు. 
రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
 

PADMAVATI RIDES ON SIMHA VAHANAM

 Goddess Padmavati was taken on a celestial ride on Simha vahanam in the Mada streets of Tiruchanoor as part of the annual Kartika Brahmosavams and blessed Her devotees.

 

The Lion is  a symbol of  braveness, strength and a favorite transport of the Goddess effectively enabling her noble task of punishing the evil and protecting the good in society. 

 

Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani, AEO Sri Subramanyam and others were present.

Dept. of PRO- TTD.

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా శ్రీ కాలభైరవస్వామివారి హోమం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు శ్రీచండికేశ్వరస్వామివారి కలశస్థాపన, హోమం, విశేష దీపారాధన నిర్వహించారు.
డిసెంబరు 7వ తేదీ శుక్ర‌వారం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 Dept. of PRO- TTD.
డిసెంబర్ 7న డయల్ యువర్ ఈవో రద్దు
 తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జ‌రుగుతున్న కారణంగా డిసెంబర్ 7న డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
          కాగా 2019 మార్చి నెలకు సంబంధించిన మొత్తం  70,512 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు టిటిడి ఆన్ లైన్‌లో  విడుదల చేయనుంది. కాగా  ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 11,537 సేవా టికెట్లు, ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 58,975 సేవాటికెట్లు ఉన్నాయి.  భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది.
డిసెంబరు 8న శ్రీవారి లక్మీకాసుల హారం ఊరేగింపు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు శ‌నివారం జరుగనుంది. 
శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన ఈ హారంతో అధికారులు ఉదయం 9.00 గంటలకు తిరుమలలో బయల్దేరతారు. తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చిన అనంతరం అక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు. సాయంత్రం జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహన సేవ రోజు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
 Dept. of PRO- TTD.

శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఆధ్యాత్మిక వైభ‌వ ఉద్యాన‌వ‌నం ప‌నుల‌కు గౌ.. ముఖ్య‌మంత్రి శంకుస్థాప‌న‌

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిని సుంద‌ర‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో భాగంగా అవిలాల చెరువులో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర ఆధ్యాత్మిక వైభ‌వ ఉద్యాన‌వ‌నం(స్పిరిచువ‌ల్ థీమ్ పార్క్‌) ప‌నుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ… శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు గురువారం సాయంత్రం శంకుస్థాప‌న చేశారు. 
        
           ఈ మొత్తం ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ.181.13 కోట్లు కాగా మొద‌టి ద‌శ‌లో రూ.80.14 కోట్ల‌తో ప‌నులు చేప‌డ‌తారు. ఇందులో ఇంట‌ర్న‌ల్ ఫెన్సింగ్ వెలుప‌ల 3 కి.మీ పొడ‌వునా ప్ర‌హ‌రీ నిర్మిస్తారు. హైవే నుండి రోడ్డు, టికెట్ కౌంట‌ర్లు, 496 ద్విచ‌క్రవాహ‌నాలు, 390 కార్లు, 64 బ‌స్సులు నిలిపి ఉంచేందుకు వీలుగా పార్కింగ్ ప్ర‌దేశం, స‌ర్వీస్ రోడ్‌, సైకిల్ ట్రాక్‌, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. 
     ఇంట‌ర్న‌ల్ ఫెన్సింగ్ లోప‌ల ప‌చ్చికబ‌య‌ళ్లు, శేషాచ‌ల అడ‌వుల్లో జీవ‌వైవిద్యాన్ని ప్ర‌తిబింబించేలా ఏర్పాట్లు, జ‌లాశ‌యాలు ఉంటాయి. రాశి వ‌నం, న‌క్ష‌త్ర వ‌నం, వ‌న‌గ్ర‌హ వ‌నం, హీలింగ్ గార్డెన్‌, థీమ్ గార్డెన్‌, అట‌వీ పుష్పాల వ‌నం, వివిధ ర‌కాల పుష్ప‌వ‌నాలు, సీతాకోక‌చిలుక‌ల వ‌నం, పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక ఉద్యాన‌వ‌నం, గ‌రుడ వ‌నం ఏర్పాటు చేస్తారు.
      సంద‌ర్శ‌కుల కోసం తాగునీరు, మ‌రుగుదొడ్లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేస్తారు.
 
అంతకుముందు ముఖ్యమంత్రి గారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. 
        
        శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్.అమర్నాథరెడ్డి, శ్రీ కె.అచ్చన్నాయుడు , ఎంపి డా.ఎన్ .శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీమతి.సుగుణమ్మ,  టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌,  తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రద్యుమ్నా ,  సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ ఈ 1 శ్రీ ఎం.రమేష్ రెడ్డి ,డిఎఫ్ వో శ్రీ ఫణికుమార్ నాయుడు , ఈఈ శ్రీ నాగేశ్వరరావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

CM LAYS FOUNDATION STONE TO RELIGIOUS THEME PARK AT AVILALA TANK

 With the objective to transform pilgrim city of Tirupati into a spiritual hub of India, the honourable Chief Minister of AP, Sri Nara Chandababu Naidu laid foundation for Sri Venkateswara Spiritual theme park  at the sprawaling  Avilala grounds on Thursday evening.

 

At an Estimated cost of Rs. 181.13crores, TTD plans to spend Rs. Rs.80.14 crores in the first phase which includes, internal fencing and compound wall of 3.5 kms, ticket counters and parking for 496 two wheelers, 390 cars and 64 buses besides cycle tracks and walkers path etc. 

 

Besides, the land scape of grass moulds, reserviors, reflecting the bio-diversity of Seshachala Ranges. The Astro gardens are going to be another attraction. With Parrots park , children’s park and a unique Garuda vanam coming up to add more beauty to the theme park. 

Food courts, toilets, drinking water and rest rooms for visitors were also on the anvil. The goal is to transform the Avilala grounds into a devotional destination for all pilgrims who are visiting Tirupati.

Among others who took part in this fete includes, State minister Sri N Amarnath Reddy, TTD Chairman Sri P Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri K S Sriniasa Raju ,Tirupati JEO Sri Pola Bhaskar, Chief Engineer Sri Chandraselhar Reddy, SE-1 Sri Ramesh Reddy, DFO Sri Phani kumar Naidu, EE Sri Nageswar Rao and others 

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

 

——