[google-translator]

Today’s Devotional E-Paper -06-12-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

06/12/2018 ,గురువారం

 

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ

 
సూర్యోదయం :6.26AM

 
సూర్యాస్తమయం :5.41PM

 
తిథి :చతుర్దశి 11.55AM

 
నక్షత్రం :అనురాధ 4.51AM

 
యోగం :సుకర్మ 10.36PM

 
కరణం:శకుని11-55AM
చతు 12.02PM

 
అమృతఘడియలు :6.09PM-7.48PM

 
రాహుకాలం :01.30 PM to 03.00 PM

 
యమగండం :06.00 AM to 07.30 AM

 
వర్జ్యం :8.17AM-9.56AM

 
దుర్ముహూర్తం
10.11AM-10.56AM
2.41PM-3.26PM

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

06/12/2018 , Thursday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise :

6.26AM

SunSet :

5.41PM

Tithi :

Chaturdasi 11.55AM

Nakshatram :

Anuradha 4.51AM

Yogam :

Sukarma 10.36PM

Karanam :

Sakuni 11-55AM
Chatu 12.02PM

AmruthaGadiyalu :

6.09PM-7.48PM

Rahukalam :01.30 PM to 03.00 PM

Yamagandam :06.00 AM to 07.30 AM

Varjyam :

8.17AM-9.56AM

Durmuhurtham 10.11AM-10.56AM
2.41PM-3.26PM

 

 

06/12/2018 , Thursday

06:00 – 08:00 hrs
Tiruppavada

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell

08:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell

21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

పెద్దశేష వాహనంపై మువ్వ‌గోపాలుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి
వాహ‌న‌సేవ‌లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇఎస్ఎల్‌.న‌ర‌సింహ‌న్‌
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధ‌వారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై మువ్వ‌గోపాలుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.  అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇఎస్ఎల్‌.న‌ర‌సింహ‌న్ దంప‌తులు వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. అనంత‌రం అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.
        ఈ సంద‌ర్భంగా గౌ.. గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద‌శేష వాహనంతోపాటు ఆల‌యంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. 
శ్రీపద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.
ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ పెద్దశేష వాహనంపై అమ్మవారిని దర్శిస్తే సమస్త దోషాలు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా అమ్మవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. డిసెంబ‌రు 8న గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 12న పంచ‌మీతీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉన్నందున విస్తృతంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యంగార్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్‌పి శ్రీ అన్బురాజ‌న్‌, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

DEVOTEES HAD DARSHAN OF “GODDESS OF WISDOM” ON HAMSA VAHANAM

The devotees were elated by the glimpse of Goddess Padmavathi Devi who graced them as “Saraswathi Devi”-the Goddess of Wisdom on Hamsa Vahanam on second day evening as a part of Navahnika Karthika Brahmotsavams on Wednesday.
Saraswati is a Sanskrit fusion word which is a fusion of sāra which means “essence”, and sva  which means “one self”, meaning “essence of one self”. Hence Goddess Saraswati is being revered as the “one who leads to essence of self-knowledge”. 
TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jatti, ACVSO Sri Sivakumar Reddy,Dy.EO Smt Jhansi Rani and others were present.

 Dept. of PRO- TTD.

 
పెద్దశేష వాహనసేవ‌లో ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ ఆవిష్క‌ర‌ణ‌
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధ‌వారం ఉదయం పెద్దశేషవాహనంపై మువ్వ‌గోపాలుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ఆధ్వ‌ర్యంలో ముద్రించిన ఆళ్వారుల సంగ్ర‌హ చ‌రిత్ర‌, ఏకాద‌శీవ్ర‌త మ‌హిమ పుస్త‌కాల‌ను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం రచ‌యిత‌ల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. తాళ్లూరు ఆంజ‌నేయులు, ఉప‌సంపాద‌కుడు డా.. నొస్సం న‌ర‌సింహాచార్య పాల్గొన్నారు.
        ఆళ్వారుల సంగ్ర‌హ చ‌రిత్ర పుస్త‌కాన్ని శ్రీ వైద్యం వేంక‌టేశ్వ‌రాచార్యులు ర‌చించారు. క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని త‌మ పాశురాల‌తో, ద్ర‌విడ ప్ర‌బంధాల‌తో స్తుతించి త‌రించిన వైష్ణ‌వ భ‌క్తాగ్రేస‌రులు ఆళ్వారులు. వీరికి శ్రీ‌వైష్ణ‌వ సంప్ర‌దాయంలో ఒక విశిష్ట స్థానం ఉంది. వీరు 12 మంది. వీరు వివిధ కులాల్లో, వేరువేరు కాలాల్లో పుట్టినా భ‌గ‌వ‌త్ ప్రావీణ్యం అంద‌రికీ స‌మాన‌మే. ఇంత‌టి మ‌హ‌నీయుల, పుణ్య‌చ‌రితుల జీవిత విశేషాలు ముందుత‌రాల వారికి తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో టిటిడి ఈ గ్రంథాన్ని ముద్రించింది.
        ఏకాద‌శీవ్ర‌త‌మ‌హిమ పుస్త‌కాన్ని శ్రీ‌మ‌తి భ‌క్తికాదేవిదాసి ర‌చించారు. స్వామి పుష్క‌రిణీ స్నానం, స‌ద్గురువు పాద‌సేవ‌, ఏకాద‌శీ వ్ర‌తం ఈ మూడు అత్యంత క‌ష్ట‌సాధ్యాల‌ని బ్ర‌హ్మాండాది పురాణాలు చెబుతున్నాయి. హైంద‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం ఏకాద‌శినాడు అనారోగ్య‌పీడితులు, బాలింత‌లు, శిశువులు త‌ప్ప మిగిలిన వారంద‌రూ ఉప‌వాసం చేసి మ‌రుస‌టిరోజు శ్రీ‌హ‌రిని పూజించి తీర్థ‌ప్ర‌సాదాలు స్వీక‌రించాల‌ని మ‌న ధ‌ర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం అంబ‌రీషుడు త‌దిత‌ర పురాణ పురుషులు ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించి వైకుంఠాన్ని చేరుకున్నారు. సంవ‌త్స‌రంలో 26 ఏకాద‌శులు ఉన్నాయ‌ని ఆయా ఏకాద‌శుల మ‌హాత్యాల‌ను ప‌ద్మ‌పురాణం చ‌క్క‌గా వివ‌రించింది. ప‌ద్మ‌పురాణంలోని 26 ఏకాద‌శుల మ‌హ‌త్యాల‌ను వివ‌రిస్తూ శ్రీ‌మ‌తి భ‌క్తికాదేవిదాసి రాసిన గ్రంథ‌మే ఇది. భ‌క్తులంద‌రూ ఏకాద‌శి వ్ర‌తాన్ని ఆచ‌రించి భ‌గ‌వంతుని కృప‌కు పాత్రులు కావాల‌నే సంక‌ల్పంతో టిటిడి ఈ గ్రంథాన్ని ప్ర‌చురించింది.
 Dept. of PRO- TTD.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో  ఆకట్టుకునేలా కళాబృందాలు 
          శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో  భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలు ప్రదర్శనలు చేస్తున్నాయి. భక్తులకు భక్తిభావాన్ని మరింత పెంచేలా తిరుచానూరు, తిరుపతిలలోని వివిధ వేదికలపై ఆద్యాత్మిక, భక్తి, సంగీతం, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. తిరుచానూరులోని ఆస్థానమండపం, తిరుపతిలో మహతి, రామచంద్రపుష్కరిణి, అన్నమాచార్య కళామందిరం, శిల్పారామం వేదికలపై భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 
         బ్రహ్మోత్సవాలలో భాగంగా వాహనసేవ ముందు   హైదరాబాద్ కు చెందిన మంజీర అకాడమీ ఆఫ్ కూచీపూడి డ్యాన్స్ ట్రూప్లో 26 కళాకారులు కూచిపూడి ప్రదర్శన చేశారు. ఈ ట్రూప్ కు శ్రీమతి జె. రేణుక ప్రభాకర్ నేతృత్వం వహించారు. అలాగే కరీంనగర్ కు చెందిన పోలంపల్లి శ్రీ మల్లికార్జున కళా సంఘం ఆధ్వర్యంలో 19 కళాకారులు లయబద్ధంగా డ్రమ్ములు వాయిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఈ ట్రూప్ కు శ్రీ వై. సురేష్ నేతృత్వం వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శ్రీమతి తెలగంశెట్టి అనురాధ నేతృత్వంలో శ్రీ బాలగణపతి కోలాట సంఘం నేతృత్వంలో 28 మంది కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాధారణలో భక్తులను ఆకర్షించారు.  చెన్నైకు చెందిన శివ నాట్యాలయ డ్యాన్స్ స్కూల్ నుంచి నాట్యకళాకారులకు శ్రీమతి ఎల్.ఎన్.శైలజ వెంకటేషన్ నేతృత్వం వహించారు. 25 మంది నాట్యకళాకారులు భరతనాట్యం ప్రదర్శించారు.
           తిరుచానూరులోని ఎన్ఆర్ఐ స్కూలు విద్యార్థులు కోలాటం, వివిధ దేవతామూర్తుల వేశాల ప్రదర్శనలు చేశారు. తిరుపతికి చెందిన ఉమామహేశ్వరి భజన మండలికి చెందిన 15 మంది కళాకారులు కోలాటం ప్రదర్శన చేశారు. 
       తిరుచానూరులోని నవజీవన బ్లడ్ రిలీప్ సెంటర్ నుండి వచ్చిన 30 మంది అంధ విద్యార్థిని విద్యార్థులు భజనలు చేశారు. అదేవిధంగా ఇదే సంస్థ నుండి 15 మంది అనాధ బాలికలు కోలాటం ప్రదర్శించారు. గాజులమండ్యంకు చెందిన శ్రీనివాస కోలాట భజన మండలి మహిళలు కోలాట ప్రదర్శన, చంద్రగిరికి చెందిన శ్రీనివాస చక్కభజన సంఘం నుండి 15 మంది కళాకారులు చక్కభజన చేశారు. 
 శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో  చెక్క భజన, కోలాటం, అడుగుల భజన, పిల్లనగ్రోవి, గరగాట భజన,  భజనల బృందాలు ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వివిధ దేవతామూర్తుల ప్రదర్శనలు, వెంకన్న గొడుగు భక్తులను అలరింపజేస్తున్నాయి. 

Dept. of PRO- TTD.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం అలమేలుమంగ ఆలయ అభివృద్ధిలో మహంతులు
తిరుచానూరులోని శ్రీపద్మావతిదేవి అమ్మవారి ఆలయ అభివృద్ధికిి మహంతులు ఎనలేని కృషి, సేవలు అందించారు. క్రీ.శ.1843నుండి క్రీ.శ. 1933వరకు తిరుమల తిరుపతి దేవాలయాల పరిపాలనాదక్షులుగ, విచారణకర్తలుగా ఉన్నారు. ఆరుతరాల మహంతులసేవల గురించి శాసనాలున్నాయి. వీరు శ్రీపద్మావతి అమ్మకు పూజలు, వైభవోపేతమైన సేవలు అందజేశారు. 
ప్రథమ  విచారణకర్తగా ఆంగ్లేయుల కాలం నుండి క్రీ.శ. 1843వ సం||లో ఆలయ పరిపాలనను తీసుకొన్న సేవాదాసు తిరుచానూరులోని అమ్మవారి ఆలయంలో ముఖమండపాన్ని నిర్మించారు. అటు తర్వాత మహంతు ధర్మదాస్‌ విచారణకర్తగ, తిరుమల తిరుపతిలోని దేవస్థానం ఆలయాలకు  సేవలందిస్తూ, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి గుడిపై ఎక్కువ శ్రద్ధను చూపెట్టారు.
మహంతులు అమ్మవారికి బంగారు హస్తకవచాలు, చేతికి బంగారు పద్మాలు, వెండి కవచాలను చేయించారు. వజ్రవైడూర్యాలు పొదిగిన బంగారు కిరీటాన్ని చేయించి, ఆ కిరీటంచుట్టూ చిన్న చిన్న బంగారు గంటలు పొదిగించాడు. అమ్మవారికి బంగారు హస్తకవచాలు, చేతికి బంగారుపద్మాలు చేయించాడు.
 చతురస్రాకారంలో అమ్మవారిగుడిని, కృష్ణస్వామిగుడిని చేరుస్తూ పెద్దప్రాకారాన్ని నిర్మించారు. కృష్ణస్వామిగుడికి ఎదురుగా మహాద్వారగోపురాన్ని నిర్మించాడు. ఈ గోపురాన్ని మహంతులు కట్టారనే నిదర్శనానికి ఆ గోపురపు గోడపై హాథీరాంజీ మరియు శ్రీవేంకటేశ్వరస్వామి ”దాయాలాట” శిల్ప ప్రదర్శనే తార్కాణం. అమ్మవారి గుడికి ముఖమంటపాన్ని, ఒక విస్తీర్ణమైన మంటపాన్ని కట్టించారు  . అలాగే చుట్టూ రాళ్ళతో రమణీయంగ, చూడముచ్చటగ జలక్రీడా సరోవరాన్ని కట్టించారు  . ఈ జలక్రీడ సరోవరంలో అమ్మవారికి తిరు మంజనం చేయించేవారు. 
  మహంతు ప్రయాగదాస్‌జీ తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి దేవాలయంలోని 1)శ్రీసుందరరాజస్వామికి, శ్రీదేవి, భూదేవేరులకు, 2)రుక్మిణీ సత్యభామాసమేత శ్రీకృష్ణస్వామికి, 3)శ్రీపద్మావతి అమ్మవారికి- ఉత్సవర్లకు నిలిచిపోయిన తెప్పోత్సవాన్ని పునరుద్ధరించాడు. ఇలా తిరుచానూరులోని దేవాలయాలకు మహంతులు అనేకానేక ఉత్సవాలను, సేవలను జరిపించటమేగాక దేవాలయాభివృద్ధికి ఎంతగానో పాటుబడ్డారు.
శ్రీ పద్మావతి అమ్మవారికి వైభవంగా స్నపనతిరుమంజనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన బుధ‌వారం అమ్మవారికి నిర్వహించిన‌ స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా బుధ‌వారం మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.
టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మ‌ణికంఠ భ‌ట్టార్  మ‌రియు ప్ర‌ధాన కంకణభట్టర్‌ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో కురువేరు(వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, వివిధ రకాల ఎండు ఫలాలు, మూడు రంగుల రోజా పూలు, లిల్లీపూల మాలలు అమ్మవారికి అలంకరించారు. 
ఆకట్టుకున్న ఫల,పుష్ప మండపం :
స్నపనతిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపంలో   వివిధ ర‌కాల సాంప్ర‌దాయ పుష్పాలు, క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌, తదితర అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, మొక్కజొన్నల‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ మండపాన్ని 20 మంది టిటిడి గార్డెన్‌ సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించి నిర్మించారు. బ్రహ్మోత్సవాలలో 3 రోజుల కోసారి వివిధ ర‌కాల‌పుష్పాలను మార్చి అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. 
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ :
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరనరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపంలలో టిటిడి గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దాదాపు 50 మంది సిబ్బంది  3 రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు. ఇందుకుగాను 5 టన్నుల వివిధరకాల సుగంధ, ఉత్తమజాతి పుష్పాలు ఉపయోగించారు. 
        ఈ సంద‌ర్భంగా టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ అర్చ‌కం మ‌ణికంఠ భ‌ట్టార్ మాట్లాడుతూ న‌వ‌క‌ళ‌శ స్న‌ప‌నంలో భాగంగా ప్ర‌తి రోజు అమ్మ‌వారికి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ధ్వ‌జారోహ‌ణం నుండి పుష్ప‌యాగం వ‌ర‌కు అమ్మ‌వారికి తిరుమంజ‌నం నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇందులో భాగంగా ఉత్త‌మ‌మైన ద్ర‌వ్యాలు, ఉప‌క‌ర‌ణాలతో స్న‌ప‌నం చేస్తామ‌న్నారు. 
      ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు. 
శ్రీ పద్మావతి అమ్మవారికి సాంస్కృతిక శోభ
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో బుధ‌వారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. 
ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు గుంటూరుకు చెందిన శ్రీ వి.ఎన్‌.దీక్షితులుమాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని, సృష్టికి కార‌ణ‌మూన స్త్రీ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు.   
       అనంత‌రం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఎమ్‌.ఎ.సుష్మ బృందం వారిచే  భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. 
అనంతరం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు  శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి కుమార్తె కుమారి పి.వి.అర్చిత బృందంలోని  దాదాపు 22 మందికి పైగా న‌ర్త‌కీమ‌ణుల‌చే అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌కు చేసిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న భ‌క్తులను విశేషంగా ఆక‌ట్టుకుంది.  కాగా సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, ఊంజల్‌ సేవలో సంకీర్తన‌ల‌ను హైద‌రాబాదుకు చెందిన ఎన్‌.పి.శ్రీ‌దేవి బృందం గానం చేశారు. 
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు చెన్నైకిి చెందిన శ్రీ ఎస్‌.వాసురావు బృందంచే భ‌క్తిసంగీతం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఎ.న‌ర‌సింహ‌న్ బృందం భక్తి సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద తిరుప‌తికి చెందిన శ్రీ పి.ఆర్‌. భానుకుమార్ బృందంచే జాన‌ప‌ద భ‌క్తి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన జి.ఎన్‌.రెడ్డి అభిన‌య ఆర్ట్స్‌చే నృత్య కార్యక్రమాలు జరిగాయి.
 Dept. of PRO- TTD.

ARCHITECTURAL MARVEL OF TIRUCHANOOR AMMAVARI TEMPLE

The famous shrine of Tiruchanoor, the abode of Sri Padmavathi Devi is also known for its architectural splendour.

 

TEMPLE COURTYARD

 

The massive courtyard of the temple is nestled between sub temple of Sri Krishna Swamy opposite to the majestic Rajagopuram with seven Kalashas and sub temple of Sri Sundararajaswami temple on South and Sri Padmavati temple, to the North

 

ASHIRWADA MANDAPAM

 

This is a 16-pillared mandapam on a 4 feet high platform. Now it is seat of bhajantri mela and also a platform for VIPs to get blessings and Prasada   from archakas.

 

DSWAJASTAMBHA MANDAPAM

 

It is a unique architectural marvel with 36 pillars in six rows with Bangaru balipeetham. After serving Nivedana three times to Goddess Padmavati, Shraddhannam is served to Bhutaganas on the balipeetham. 

 

The Gaja Vahanam is embossed on the bottom and Shanku chakras facing South and Goddess Padmavati facing North on Dwajastambha. 

 

The celestial Gaja flag on the temple mast flies on this pillar during the annual Brahmotsavams and is lowered after the event.

 

KALYANOTSAVA MANDAPAM

 

To the south of Dwajastambha mandapam and in front of Sri Sundararaja Swamy temple, Kalyanotsavam is performed for Goddess Padmavati and Lord Venkateswara.

 

MUKHA MANDAPAM

 

A four pillared mandapam on a high platform and covered by grill opposite to main temple is where Asthanam and other rituals are conducted.

 

ARCHANA MANDAAM

 

Adjacent to Mukha mandapam this Archana mandapam is located to south of sanctum to whose North face lies the Panchaloha idols of Sudarshana and Viswaksena. The granite idols of Garuda and Viswaksena are installed. There is also a granite and Panchaloha idol of Sri Ramanujacharya.

ANTHARALAM MANDAPAM

 

After Archana mandapam, the Antaralam mandapam which is guarded by Vanamalini and Balakini at the door like Jaya and Vijaya in Tirumala.

 

SANCTUM

 

The majestic and holy idol of Goddess Padmavati in a sitting pose is installed in the sanctum after the Antaralam. The four handed Goddess wielded lotus in upper hands, Shanku and Padma in lower hands. The main idol also popularly hailed as Alarmelu Manga is worshipped with suprabatham, Sahasranamarchana and Kukumarchana every morning. On Mondays, Asta dala Padava padmaradhana, Thiruppavadai Seva on Thursdays, Abhisekam on Fridays and Pushpanjali Seva on Saturdays are performed.

 

SHANTI NILAYAM

 

A seven Kalasha with gold cover rests on the Gopuram above the sanctum of Goddess Padmavati and is called Shanti Nilayam, facing the Tirumala hill shrine of Sri Venkateswara Swamy. It also accommodates a sparkling idol of Vimana Lakshmi as well akin to Ananda Nilaya Vimana Venkateswara Swamy in Tirumala temple.

 Dept. of PRO- TTD.

OOTY CHERRIES ENHANCE GLAMOUR OF GODDESS

Among the religious events in ongoing annual Navahnika Karthika Brahmotsavams in Tiruchanoor Snapana Tirumanjanam has a significant place.

 

According to Pancharathra Agama Advisor Sri Archakam Manikantha Bhattar, this ritual is also known as “Poustika Karma” or “Poustika Snaanam” which enhances the power Goddess and is observed for ten days upto Pushpa yagam starting from the day of Dhwajarohanam.

 

While Sri Gopi Swamy who pla nmn 1ys key role behind the colourful and interesting decorations to deities with varieties of fruits and flowers said for the first time Ooru Cherries are used for decorating Divine Mother. 

 

Snapanam was performed with milk, honey, curd, coconut water and turmeric. During every interval, the processional deity of Sri Padmavathi Devi is decked with each type of fruit or floral garland which included the one with Apricots, Black grapes, Small Amla, pink roses, red roses, Anjeer and Tulasi garlands

 

The Garden wing Deputy Director Sri Srinivasulu said, the mandapam where the celestial Snapanam takes place is decked with Sweet Corn and orchids. “The entire decoration is by the largesse of donors and every three days the theme will be changed with fresh decoration”, he added.

 

The devotees who took part in the fete on Wednesday were enthralled by the beauty and grace of Goddess during this “Shrama Pariharotsavam”.

DIAL YOUR EO CANCELLED 

The monthly Dial your EO programme which is slated on December 7 is cancelled this month following annual Karthika Brahmotsavams at Tiruchanoor.

 

On every first friday of a month, this program is being conducted by TTD at Amnamaiah Bhavan at Tirumala between 8.30am and 9.30am wherein the pilgrims across the globe call TTD EO Sri Anil Kumar Singhal and and express their complaints, suggestions and feedback if any by dialling 0877 2263261.

 

The pilgrims are requested to make note of this and cooperate with TTD.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

 

——