[google-translator]

Today’s Devotional E-Paper – 06-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

06/11/2018 , మంగళవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం :

6.13AM

సూర్యాస్తమయం :

5.41PM

తిథి
: చతుర్దశి 10.01PM

నక్షత్రం
: చిత్ర 8.22PM

యోగం : ప్రీతి 9.09PM

కరణం
: భద్ర 10.38AM
శకుని 10.01PM

అమృతఘడియలు : 2.07PM-3.41PM

వర్జ్యం : 6.19AM
1.55AM-3.30AM

దుర్ముహూర్తం
8.31AM-9.16AM
10.42PM-11.32PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

06/11/2018 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.13AM

SunSet :

5.41PM

Tithi :

Chaturdasi 10.01PM

Nakshatram :

Chitra 8.22PM

Yogam :

Preethi 9.09PM

Karanam :

Bhadra 10.38AM
Sakuni 10.01PM

AmruthaGadiyalu :

2.07PM-3.41PM

Varjyam :

6.19AM
1.55AM-3.30AM

Durmuhurtham 8.31AM-9.16AM
10.42PM-11.32PM

 

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 05-11-2018: 69,651.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 06-11-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 02.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
TONSURES: 23,357, 
PARAKAMANI: RS.3.65 CRORES. 
Dept of PRO TTD

 

 

 

 

06/11/2018 , Tuesday

06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell

07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

 

ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల‌లో ఘ‌నంగా శ్రీ‌ ధ‌న్వంత‌రి జ‌యంతి

ఆయుర్వేద వైద్యానికి దైవంగా భావిస్తున్న శ్రీ ధ‌న్వంత‌రిజ‌యంతి సంద‌ర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్స‌వాన్ని సోమ‌వారం తిరుప‌తిలోనిశ్రీ వేంక‌టేశ్వ‌ర ఆయుర్వేద క‌ళాశాల మ‌రియు ఆసుప‌త్రిలో ఘ‌నంగానిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌ళాశాల‌లోని శ్రీధ‌న్వంత‌రి విగ్ర‌హానికిఅభిషేకం చేసి ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడితిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ హైంద‌వ సంస్కృతిలోఆయుర్వేదానికి విశేష ప్రాముఖ్య‌త ఉంద‌ని, ఈ వైద్య విధానాన్ని విస్తృతంగాప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కోరారు. ఆయుర్వేదానికి ప్రాచుర్యంక‌ల్పించేందుకు ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి వైద్య శిబిరాలు నిర్వ‌హించాల‌నిసూచించారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్డా.. ఎ.శంక‌ర్‌బాబు ఇత‌ర అధ్యాప‌కులు, వైద్యులు,విద్యార్థులుపాల్గొన్నారు.కాగా, శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆయుర్వేద క‌ళాశాల మ‌రియుఆసుప‌త్రి ఆధ్వ‌ర్యంలో న‌వంబ‌రు 4వ తేదీ ఆదివారం నాడు దామ‌ల‌చెరువుమండ‌లం ర‌వ‌ణ‌ప్ప‌గారిప‌ల్లెలోని వ‌శిష్టాశ్ర‌మంలో ఆయుర్వేద వైద్య శిబిరంనిర్వ‌హించారు. సుమారు 500 మంది రోగుల‌ను ప‌రీక్షించి ఉచితంగా మందులుపంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించి ఆయుర్వేదమొక్క‌లు, వాటి ఉప‌యోగాలు, గృహవైద్యం, ఆహార నియ‌మాలు, జీవ‌న‌శైలి త‌దిత‌రఅంశాలపై క‌ళాశాల ప్రొఫెస‌ర్లు తెలియ‌జేశారు. ఈ వైద్య శిబిరంలోక‌ళాశాల‌లోని 45 మంది అధ్యాప‌కులు, బోధ‌నేత‌ర సిబ్బంది, పిజివిద్యార్థులు, ఆసుప‌త్రి సిబ్బంది పాల్గొన్నారు.

తిరుచానూరులో భక్తుల సౌకర్యాలకు పెద్దపీట : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌
డెప్యూటీ ఈవో కార్యాలయం, లగేజి కౌంటర్ల కోసం నూతన భవనం ప్రారంభం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని సోమవారం నాడు జెఈవో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ నూతన భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లగేజి, సెల్‌ఫోన్‌, పాదరక్షల డిపాజిట్‌ కౌంటర్లు, మొదటి అంతస్తులో డెప్యూటీ ఈవో కార్యాలయం, రెండో అంతస్తులో సమావేశ మందిరం ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ఆస్థానమండపం కింద గల అన్నప్రసాద వితరణశాలను భక్తులు వేచి ఉండేందుకు కంపార్ట్‌మెంట్‌గా వినియోగిస్తామన్నారు. జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న పద్మావతి నిలయం వసతి సముదాయాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఆలయం చుట్టూ పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు పలు పనులు చేపడుతున్నట్టు జెఈవో తెలిపారు. ఆస్థానమండపం ఎదురుగా దుకాణాల సముదాయాన్ని నిర్మించి పంచాయతీకి నామమాత్రపు లీజుకు అప్పగిస్తామన్నారు. తద్వారా ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుందని వివరించారు. ఘంటసాల విగ్రహం నుండి వాహనాలు ఆలయం వైపునకు రాకుండా పూడి రోడ్డుకు దారి మళ్లిస్తామన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా స్థానికులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాడ వీధులు విస్తరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-4 శ్రీ రాములు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీలక్ష్మి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, డిఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ చంద్రశేఖర్‌, ఎఈవో శ్రీసుబ్రమణ్యం, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 Dept. of PRO- TTD.

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన పవిత్రోత్సవాలు సోమ‌వారం పూర్ణాహుతితో ఘ‌నంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఆ త‌రువాత‌ శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుక‌గా స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. తిరుమంజనంలో స్వామి అమ్మవార్లను తులసి, వివిధ సాంప్రదాయ పుష్ప మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. 
కాగా, సాయంత్రం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్ర‌హించారు. ఆ త‌రువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ‌ప్రోక్ష‌ణ‌, ఆచార్య బ‌హుమానం స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీధనంజయులు, ఏఈవో శ్రీలక్ష్మయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

PAVITROTSAVAMS CONCLUDES

The annual three day Pavotrotsavams came to a ceremonial end on Monday with Pavitra Purnahuti in the famous shrine of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram.

 

Earlier during the day, after awakening the Lord with Suprabhatam, special vedic rituals were performed in Yagashala which was followed by Snapana Tirumanjanam. 

 

Later Pavitra Purnahuti was performed marking the conclusion of three day religious fete.

 

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Ramanaiah, Temple Inspector Sri Anil Kumar and others took part in this fete.

NEW BUILDING INAUGURATED IN SRI PAT

New office and luggage counter building has been inaugurated in Tiruchanoor by Tirupati JEO Sri P Bhaskar on Monday.

 

Speaking on this occasion, he said, following day by day increase in pilgrim crowd at Sri Padmavathi Ammavari temple, many development activities are in array in the temple and it’s surroundings.

 

Today we have opened this Rs.75 lakhs building, which has cell phone and luggage depositing counter for pilgrims in ground floor, office of Temple Deputy Executive Officer in the first floor and meeting hall in the second floor”, he said.

 

Later the JEO elaborated, the existing Annaprasadam hall will be converted as waiting compartments akin to Tirumala while the new Annaprasadam building will be opened in a few days. The new pilgrim amenities complex which is constructed adjacent to national highway road will also be opened soon”, he added.

 

టిటిడి ఛైర్మన్‌, ఈవో దీపావళి శుభాకాంక్షలు
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీవారి భక్తులకు, యాత్రికుల‌కు, టిటిడి ఉద్యోగుల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని సోమ‌వారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఛైర్మన్‌, ఈవో కోరారు. టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్ కూడా భ‌క్తుల‌కు, యాత్రికుల‌కు, ఉద్యోగుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

DEEPAVALI GREETINGS EXTENDED TO PILGRIMS

On the occasion of Deepavali, the festival of lights, TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal, JEOs Sri K S Sreenivasa Raju, Sri P Bhaskar extended greetings to multitude of pilgrims who throng Tirumala and Tirupati temples every day.

 

They wished all to lit their lives with happiness and prosperity with the benign blessings of Sri Venkateswara Swamy and Padmavathi Devi.

JEO REVIEWS ON LOCAL TEMPLES DEVELOPMENT

To make local temples of TTD located in and around Tirupati more attractive for pilgrims, Tirupati JEO Sri P Bhaskar reviewed on the progress of works in these temples.

 

The review meeting with Incharge senior officers of the respective temples took place at SPRH in Tirupati on Monday. The meeting lasted for over three hours.

 

The JEO instructed the concerned officers to enumerate the pending works and give weekly report on the progress of works. He directed the officers that this step was initiated under the instructions of TTD EO Sri Anil Kumar Singhal to create more facilities in local temples so that more number of pilgrims visit these ancient temples”, he added.

శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణాన్నినిర్దేశిత గ‌డువులోపు పూర్తి చేయాలి :
టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తితోపాటు విశాఖ‌ప‌ట్నం,హైద‌రాబాద్‌, క‌న్యాకుమారి ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణాన్నినిర్దేశించిన గ‌డువులోపు పూర్తి చేయాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోలభాస్క‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని శ్రీప‌ద్మావ‌తివిశ్రాంతి గృహంలో సోమ‌వారం సాయంత్రం జెఈవో టిటిడి ఆల‌యాల అభివృద్ధి,ఇంజినీరింగ్ ప‌నుల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.
             

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆల‌యాలు, వ‌స‌తి గ‌దులనిర్మాణాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఈవో శ్రీ అనిల్‌కుమార్
సింఘాల్ ఆదేశించార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప‌నుల పురోగ‌తిపైస‌మీక్షించామ‌న్నారు. టిటిడి స్థానికాల‌యాల‌ను అభివృద్ధి చేయాల‌నినిర్ణ‌యించామ‌ని, ఇందులో భాగంగా తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తిఅమ్మ‌వారి ఆల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్నవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌నుచేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌కు సంబంధించిఅడ్డంకుల‌ను అధిగ‌మించేందుకు ఆయా ఆలయాల డెప్యూటీ ఈవోలు, ఇంజినీరింగ్అధికారులు, ఎస్టేట్ అధికారితో చ‌ర్చించామ‌న్నారు. ఆయా విభాగాల అధికారులుస‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి పెండింగ్ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌నిఆదేశించారు.
             

ఈ స‌మావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీచంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీ‌ సుధాక‌ర‌రావు,శ్రీ రాములు, ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, డిఎఫ్‌వో శ్రీఫ‌ణికుమార్‌నాయుడు ఆయా ఆల‌యాల డెప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.

OM NAMO VENKATESHAYA 

 

——