[google-translator]

Today’s Devotional E-Paper – 06-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

06/10/2018 , శనివారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.06AM

సూర్యాస్తమయం : 5.57PM

తిథి : ద్వాదశి 2.59PM

నక్షత్రం మాఘ 4.35PM

యోగం :శుభం 12.18AM

కరణం
:

తైతుల
2.59PM
గరజి
1.53PM

అమృతఘడియలు 2.20PM-3.50PM

రాహుకాలం : 09.00AM – 10 .30AM

వర్జ్యం
6.52AM
12.05AM-1.36AM

దుర్ముహూర్తం
5.58AM-7.35AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

06/10/2018 , Saturday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Bhaadrapadam

Paksham :

Bahula

SunRise :

6.06AM

SunSet :

5.57PM

Tithi :

Dwadasi 2.59PM

Nakshatram :

Magha 4.35PM

Yogam :

Subham 12.18AM

Karanam :

Taitula 2.59PM
Garaji 1.53PM

AmruthaGadiyalu :

2.20PM-3.50PM

Rahukaalam : 9.00AM – 10 .30AM

Varjyam :

6.52AM
12.05AM-1.36AM

Durmuhurtham 5.58AM-7.35AM

 
 Darshan Details of Lord. BALAJI 

OM NAMO VENKATESAYA 

 

TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 05.10.2018 :: 80,340.

 

VQC SITUATION AT 5.00 AM ON 06.10.2018:

 

NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 27,

 

APPROXIMATE TIME FOR SARVA DARSHAN : 14 HOURS.

 

TONSURES – 29,775.

 

PARAKAMANI – 3.37. CRORES.  

 

 

 

06/10/2018 , Saturday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

 

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

07:30 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

—-

 _

 

TTD CANCELS DARSHAN TO LOCALS ON OCT 9

TTD Cancels Darshan to local on Tuesday, October 9 following Srivari Navarathri Brahmotsavams.

No Tokens will be issued on Sunday, October 7. The locals are requested to make note of this and cooperate with TTD

అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని  మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్‌ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం దర్శన టోకెన్లు ఇవ్వబడవు.

 

ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. దర్శనం రద్దు విషయాన్ని స్థానిక భక్తులు గమనించి టిటిడికి సహకరించగలరు.

 

Dept. of PRO- TTD.

పోస్టల్‌ శాఖ ద్వారా విదేశాల్లోని భక్తులకు కూడా టిటిడి డైరీలు, క్యాలెండర్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

 

టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే విదేశాల్లోని భక్తులకు పోస్టల్‌ శాఖ ద్వారా అందించే ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వారి మాటల్లోనే…

 

భక్తులకు అందుబాటులో 2019 టిటిడి డైరీలు, క్యాలెండర్లు :

– 2019వ సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు, చిన్న డైరీలు, పెద్ద డైరీలు, శ్రీవారి పెద్ద క్యాలెండరు, శ్రీ పద్మావతి మరియు శ్రీవారి క్యాలెండరు, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ భక్తులకు అందుబాటులో ఉంచాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 50 వేల కాపీలను భక్తులకు అందుబాటులో ఉంచాం. 12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీని భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులకు పోస్టల్‌ ద్వారా ఇంటికి చేరవేస్తారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి :

– అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి నవరాత్రి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాం.

– తమిళులకు పవిత్రమైన పెరటాశినెల, దసరా సెలవులు, శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఈ నెల 20, 21వ తేదీల వరకు రానున్న శని, ఆదివారాలలో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు రద్దు చేయడమైనది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పరిమిత సంఖ్యలో జారీచేస్తున్నాం.

ఆకట్టుకునేలా కళాబృందాలు :

– శ్రీవారి వాహనసేవలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, హర్యానా, ఛత్తీస్‌గడ్‌, కర్ణాటక, కేరళకు చెందిన కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

– ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల జానపద నృత్యాలు, పంతి డ్యాన్స్‌, ఒగ్గు డోలు, డప్పులు, పంచవాయిద్యాలు తదితర సాంప్రదాయ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ఆన్‌లైన్‌లో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లు :

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవ టికెట్లను భక్తుల సౌకర్యార్థం అక్టోబరు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో ఉంచడమైనది.

– ఇందులో భాగంగా 50 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో, 50 శాతం టికెట్లు కరెంట్‌ బుకింగ్‌లో పొందవచ్చు.

– ఆన్‌లైన్‌లో 90 రోజుల ముందు నుండి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. అదే విధంగా, 48 గంటల ముందు వరకు కూడా ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం.

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రోజువారి జరిగే ఆర్జిత సేవలు.

సేవ ఆన్‌లైన్‌ బుకింగ్‌ కరంట్‌ బుకింగ్‌ మొత్తం

1. సుప్రభాతం 50 50 100

2. కల్యాణోత్సవం 50 50 100

3. అష్టదళపాదపద్మారాధన

(సోమవారం) 35 40 75

4. అష్టోత్తర శతకళశాభిషేకం

(బుధవారం) 15 15 30

5. తిరుప్పావడసేవ(గురువారం) 50 50 100

6. అభిషేకం(శుక్రవారం) 30 30 60

7. వస్త్రాలంకరణసేవ(శుక్రవారం) 5 2 7

8. లక్ష్మీపూజ(శుక్రవారం) 75 75 150

9. పుష్పాంజలిసేవ(శనివారం) 35 15 50

– టిటిడి అనుబంధ ఆలయాలైన అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5న పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 7వ తేదీ వరకు జరగనున్నాయి.

అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఇటీవల పవిత్రోత్సవాలు నిర్వహించాం.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం :

– అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయాన్ని ఒక రోజుకు దాదాపు 3 వేల మంది, శనివారం 10 వేల నుండి 15 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.

– ఈ ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో రూ.4.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఆలయంలో పోటు, యాగశాల, కార్యాలయ గది, ప్రసాద వితరణశాల, అఖండం, ఆలయం చుట్టూ కాలువలు, మాడ వీధుల్లో సిసి రోడ్ల విస్తరణ, టిటిడి కల్యాణమండపం, పూడి రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ వద్ద ఆర్చి నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

దర్శనం :

– గతేడాది సెప్టెంబరులో 21.35 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది సెప్టెంబరులో 23.39 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

హుండీ ఆదాయం :

– శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది సెప్టెంబరులో రూ.76.28 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో రూ.87.84 కోట్లు వచ్చింది.

అన్నప్రసాదం :

– గతేడాది సెప్టెంబరులో 51.77 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది సెప్టెంబరులో 63.49 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది.

లడ్డూ లు :

– గతేడాది సెప్టెంబరులో 79.24 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది సెప్టెంబరులో 97.87 లక్షల లడ్డూలను అందించాం.

తలనీలాలు :

– గతేడాది సెప్టెంబరులో 9.45 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది సెప్టెంబరులో 9.82 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.

 

TTD TO MARKET 2019 DIARIES AND CALENDARS OVERSEAS THROUGH POSTAL DEPARTMENT-EO

 

Moving a step ahead, TTD will now deliver it’s 2019 Diaries and Calendars booked in online to overseas through postal department, said, TTD EO Sri Anil Kumar Singhal.

 

After Dial your EO program, talking to media persons at Annamaiah Bhavan in Tirumala on Friday he said, last year we commenced online sales of our diaries and calendars which received huge reception from public. We delivered them through postal department within the country. Now we are set for overseas delivery also, he added.

 

Later he said, some changes will be brought in online sale of arjitha seva tickets. “Keeping in view the misuse of these seva tickets by some miscreants we want to bring some amendments which will come in to force by next month. From unlimited registrations from a single mobile number and e-mail ID we now want to restrict it to only two registrations. Some pilgrims suggested to re-introduce photo upload also to avoid manipulation, which will be looked into”, he maintained.

 

The EO also said, online quota of booking of arjitha seva tickets is also introduced in Padmavathi temple at Tiruchanoor and the devotees can now register three months prior till two days before based on the availability of arjitha seva tickets in online.

 

He said that, towards the development of local temples under the umbrella of TTD, one senior officer has

been allotted to each sub temple. This adoption will help in the better development. We have now sanctioned Rs.4.70cr towards the development of Appalayagunta temple”, he mentioned.

 

The EO said, at present, the average turnout of pilgrims at Kurukshetra temple is 750 per day and week ends around 1700. As Gita utsavams are famous here during December which lasts for over 11 days, we are anticipating nearly 2-3lakh pilgrims during that period, he added.

 

Tirumala JEO Sri KS Sreenivaas Raju, CE Sri Chandrasekhar Reddy, CVSO Incharge Sri Siva kumar Reddy were also present.

Dept. of PRO- TTD.

DIAL YOUR EO

Before receiving the calls from pilgrims as a part of Dial your EO program, TTD EO Sri Anil Kumar Singhal informed the pilgrims on the important activities, rituals lined up in the month of October and also a over view of festivals of previous month. Some excerpts:

Preparations for Srivari Navaratri Brahmotsavams

All out arrangements have been made for convenience and comfort of the devotees expected to participate in the Navaratri Brahmotsavams from October 10-18.

 

TTD has decided to reduce the number of tokens for Divya Darshan and Sarva Darshan and Rs.300 special darshan tickets on all Saturdays and Sundays till October 20-21, In view of heavy crowds of devotees during the holy month of Peratasi (scared for Tamil devotees), Dasara Festival and Srivari Navaratri Brahmotsavams etc.

 

With an objective to provide Srivari Darshan to more devotees during Brahmotsavams, TTD has cancelled all Arjita sevas, special darshans as well

 

Organized running of RTC buses on par with the surge of devotee crowds for Brahmotsavam.

 

Plying of two-wheelers on the Tirumala ghat roads has been banned on October 14th in view of Garuda Seva day.

 

Similarly special parking lots have been readied near Alipiri gateway in Tirupati and Srivari Mettu near Srinivasa Mangapuram and all devotees are requested to utilize them.

 

Nearly 3000 Srivari Sevakulu, 1000 Scouts and Guides besides the regular TTD vigilance and Police will provide services to devotees during the nine day long celestial event of Brahmotsavams.

 

Cultural troupes from AP, Telangana, Gujarat, Haryana, Chattisgarh, Karnataka, Kerala will put up devotional feats during Brahmotsavams

The events include folk dances like Voggu dolu, Dappulu, Pancha Vaidhyalu and other traditional arts.

 

New Shed for Aged and physically disabled on South Mada street.

 

Brand new and comfortable sheds have been put up on the South Mada Street for benefit of physically challenged persons and Aged persons with all basic amenities, drinking water, chairs and food etc.

 

Online facilitation of Arjita Seva tickets of Sri Padmavati Ammavari Temple.

 

From October 1, all the arjita Seva tickets of Sri Padmavati Ammavari Temple, Tiruchanoor were made available to devotees on line.

 

50 % of the seva tickets will be online and rest 50% will be made available in current booking

 

Devotees of Sri Padmavati Ammavaru can book their arjita Seva tickets either 90 days ahead or before 48 hours of the event.

ఆన్‌లైన్‌లో 68,575 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

 

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2019, జనవరి నెల కోటాలో మొత్తం 68,575 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 7,125 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 4,425, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 61,450 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,775, ఊంజల్‌సేవ 4,350, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,975, వసంతోత్సవం 15,950, సహస్రదీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయని వివరించారు.

 

 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.

 

1. అమూల్య – హైదరాబాద్‌.

ప్రశ్న: మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి వచ్చాను. సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి ?

ఈవో : ధన్యవాదాలు.

 

2. కృష్ణ – గుంటూరు, రమాదేవి – హైదరాబాద్‌.

ప్రశ్న: ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో 11 నెలలుగా ఆర్జితసేవల కోసం నమోదు చేసుకుంటున్నాను. మాలాంటి వారి కోసం కొన్ని టికెట్లు కేటాయించండి?

ఈవో : పరిశీలిస్తాం.

 

3. లక్ష్మీదేవి – బెంగళూరు, రాధాప్రసాద్‌ – కర్నూలు.

ప్రశ్న: వైకుంఠ ఏకాదశి నాటికి వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పించండి? మహాలఘు దర్శనం వల్ల వృద్ధులు స్వామివారిని సరిగా చూడలేకపోతున్నారు?

ఈవో : వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక రోజుల్లో సామాన్య భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడం జరుగుతుంది. వృద్ధులకు, దివ్యాంగులకు రోజువారీ ప్రత్యేక దర్శనంతోపాటు నెలలో 2 సార్లు అదనంగా ఎక్కువ మందికి దర్శనం కల్పిస్తున్నాం.

వృద్ధులు, దివ్యాంగులకు చక్కటి సౌకర్యాలతో నూతన షెడ్‌ ఏర్పాటుచేశాం. ఇప్పటికే వృద్ధులకు, దివ్యాంగులతోపాటు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.

 

4. సునీల్‌కుమార్‌ – ప్రకాశం, రామనారాయణ – గుంటూరు.

ప్రశ్న: ఫొటో తప్పనిసరి చేస్తే ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో అవకతవకలను అరికట్టవచ్చు?

ఈవో : ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ విధానంలో సాంకేతికంగా ఎలాంటి లోపాలు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగా లేని గ్రామీణ ప్రాంతాల భక్తుల కోసం ఫోటోను తప్పనిసరి చేయడం లేదు. అదేవిధంగా, ఇంటర్నెట్‌ సెంటర్ల నిర్వాహకులు ఒకే ఫోన్‌ నంబరు నుండి ఎక్కువ మందికి టికెట్లు నమోదు చేస్తున్నారు. వచ్చే నెల నుండి ఒక ఫోన్‌ నంబరు నుండి ఇద్దరికి మాత్రమే నమోదు చేసుకునేలా మార్పులు తీసుకొస్తాం.

 

5. నరేష్‌ – పార్వతిపురం.

ప్రశ్న: పరకామణి సేవలో వ్యాపారులకు అవకాశం కల్పించండి ?

ఈవో : పరిశీలిస్తాం.

 

6. గోపాలకృష్ణ – నూజివీడు.

ప్రశ్న: ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్న ఆధ్యాత్మిక విశేషాల్లో షిరిడీసాయి ఆలయం గురించి సమాచారం ఇవ్వండి ?

ఈవో : షిరిడీసాయి ఆలయం గురించి వారి వెబ్‌సైట్‌లో చక్కటి వివరాలున్నాయి. ఎస్వీబీసీలో శ్రీవారి సేవలు, ఇతర ధర్మప్రచార కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం.

 

7. కిరణ్‌కుమార్‌ – మార్కాపురం.

ప్రశ్న: స్కానింగ్‌ పాయింట్‌ వద్ద భక్తులందరికీ తిరునామం పెట్టండి ?

ఈవో : ఇప్పటికే అన్ని క్యూలైన్ల ప్రవేశమార్గాల్లో తిరునామం పెడుతున్నాం. స్కానింగ్‌ పాయింట్‌ వద్ద కూడా తిరునామధారణ చేయిస్తాం.

 

8. శ్రీనివాసులు – అనంతపురం.

ప్రశ్న: సిసి కెమెరాలకు కూడా దొరక్కుండా టిటిడి సిబ్బంది, పోలీసులు క్యూలైన్లలోకి తమవారిని దర్శనానికి తీసుకెళుతున్నారు? ఆలయంలో అయ్యవార్లు డబ్బులిస్తే ప్రసాదాలిస్తున్నారు?

ఈవో : అధికారులతో తనిఖీలు నిర్వహించి ఇకపై అలా జరగకుండా చూస్తాం.

 

9. రామారావు – విశాఖ.

ప్రశ్న: సిఫార్సు లేఖలపై గదులిస్తారా?

ఈవో : ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై నిర్దేశించిన కోటా మేరకు గదులు కేటాయిస్తాం. ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజుల్లో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫారసు లేఖలు స్వీకరించబడవు. గదులు దొరక్కపోతే లాకర్ల ద్వారా వసతి పొందొచ్చు.

 

10. సత్యనారాయణ – హైదరాబాద్‌.

ప్రశ్న: లడ్డూప్రసాద సేవ వయోపరిమితిని 70 సంవత్సరాలకు పెంచండి?

ఈవో : పరిశీలిస్తాం.

 

11. ప్రసాద్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: శ్రీవారి ఆలయంలో పురుష సేవకులు మహిళలను, మహిళా సేవకులు పురుషులను లాగేస్తున్నారు? వృద్ధుల ప్రత్యేక దర్శనం వయోపరిమితిని 60 ఏళ్లకు తగ్గించండి?

ఈవో : భక్తులను లాగకూడదని శ్రీవారి సేవకులకు, సిబ్బందికి స్పష్టంగా ఆదేశాలిస్తాం. భక్తులు ఎవరికివారు ముందుకు కదిలితే ఇలాంటి సమస్య ఉండదు. నడవలేనివారు, దివ్యాంగుల కోసమే ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటుచేసి దర్శనం కల్పిస్తున్నాం.

12. రాజేంద్రవర్మ – తిరుచానూరు.

ప్రశ్న: రేణిగుంట- తిరుచానూరు రోడ్డులో డంపింగ్‌ యార్డుతో సమస్యగా ఉంది?

ఈవో : స్థానిక అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం.

 

13. రమేష్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: వేసవిలో వచ్చాను. జెఇవో కార్యాలయం వద్ద సిబ్బంది లోనికి అనుమతించలేదు?

ఈవో : వేసవిలో అధిక రద్దీ కారణంగా బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించలేదు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అక్కడి సిబ్బందికి తగిన సూచనలిస్తాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్వేత సంచాలకులు శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

INTRODUCE TIRUNAMAM AT VAIKUNTHAM SECURITY CHECK POINT

Tirunamadharana will be implemented to pilgrims coming for darshan of Lord Venkateswara with Srivari Sevakulu at the hi-fi security check point introduced in Vaikuntham I, said TTD EO Sri Anil Kumar Singhal.

While answering the calls of pilgrims from across the country, as a part of Dial your EO program on Friday, the EO responding to a caller Sri Kiran Kumar from Prakasam saying that his suggestion is well taken and TTD will implement the same from Saturday (October 6) onwards immediately as every pilgrim will be covered while undergoing frisking at this crucial point.

 

Another caller Sri Srinivasulu from Anantapur sought EO to streamline the darshan inside temple for the benefit of common pilgrims for which the EO said surprise inspections will be carried out inside the temple with senior officers to avoid misappropriation if any.

 

Smt Lakshmi Devi from Bengaluru sought EO to allot certain quota of tickets to aged people during Vaikunta Ekadasi to which EO answered that it is not possible as nearly 1.70lakh pilgrims throng Tirumala during that time and all the privilege darshans remain cancelled.

 

Another caller Sri Naresh from Parvathipuram of Vizianagaram sought EO to consider private business persons also in Parakamani Seva for which the EO said they will look into the possibilities. When Sri Satyanarayana from Hyderabad sought EO to relax age limit for Parakamani seva if the volunteers are healthy, EO said it is not possible to make selections based on health.volunteers rendering service inside sanctum not to drag pilgrims in a harsh manner while another caller Sri Ramesh from Hyderabad also complained of the rude behavior of security at JEO Camp office in Tirumala to which the EO said they will be instructed and trained again in soft skills.

 

Sri Rajendra, a caller from Tiruchanoor brought to the notice of EO about the dumping yard located between Renigunta and Tiruchanoor road which is proving to be hazardous on the health of pilgrims passing by the way. Reacting to the caller the EO said though the issue is not under the purview of TTD necessary action will be initiated to reduce the problem by negotiating with concerned authorities.

 

While callers Sri Ramanarayana and Sri Krishna from Guntur, Sri Sunil Kumar from Prakasam suggested EO on online dip system to which EO replied them that whichever are feasible will be considered

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

 

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమలసేవ, అర్చన, అభిషేకం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదమం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

 

సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. సాయంత్రం 6.45 నుండి రాత్రి 9.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీశ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

APPALAYAGUNTA PAVITROTSAVAMS OFF TO A GRAND START

The annual pavitrotsavams in Appalayagunta off to a ceremonial start with Pavitra Pratishta on a Friday.

 

After morning rituals, snapana tirumanjanam was performed to the processional deities of Sri Prasanna Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi on either sides.

 

Later the specially made Pavitra garland were brought to Yagashala and special pujas were performed.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——