[google-translator]

Today’s Devotional E-Paper -06-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

06/01/2019 , ఆదివారం

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్యమాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం : 6.43AM

సూర్యాస్తమయం : 5.56PM

తిథి :శుద్ధపాడ్యమిపూర్తి

నక్షత్రం :పూర్వాషాఢ 5.08PM

యోగంవ్యాఘా2.34PM

కరణం:కింస్తు 6.53PM

అమృతఘడియలు :10.56AM-1.40PM

వర్జ్యం :1.54AM-3.39AM

దుర్ముహూర్తం
4.26PM-5.11PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

06/01/2019 , Sunday
Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Pushya Masam
Paksham :

Sukla
SunRise :

6.43AM
SunSet :

5.56PM
Tithi :

Suddha Padyami Poorthi
Nakshatram :

Poorvashada 5.08PM
Yogam :

Vyagha 2.34PM
Karanam :

Kimsthu 6.53PM
AmruthaGadiyalu :

10.56AM-1.40PM
Varjyam :

1.54AM-3.39AM
Durmuhurtham 4.26PM-5.11PM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 05.01.2019: 71,072.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 06.01.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 02,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
TONSURES – 18,292. 
PARAKAMANI – RS. 2.82 CRORES. 
Dept of PRO TTD

06/01/2019 , Sunday

02:30-03:00 hrs

Suprabhatam

 

03:30 – 04:00 hrs

Thomala Seva (Ekantam)

 

04:00 – 04:15 hrs

Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

04:00 – 04:30 hrs

First Archana, Sahasranama Archana (Ekantam)

 

06:30- 07:00 hrs

FirstBell, Bali and Sattumura

 

07:00 – 07:30 hrs

Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

07:30 – 19:00 hrs

Sarvadarshanam

 

12:00 – 17:00 hrs

Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs

Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs

Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

20:00 – 00:30 hrs

Sarvadarshanam

 

00:30 – 00:45 hrs

Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva


జనవరి 8న వృద్ధులు, దివ్యాంగులకు, 9న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

 

శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

 

ఇందులోభాగంగా జనవరి 8వ తేదీన వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

 

5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జనవరి 9వ తేదీన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

AGED AND PHC DARSHA9N ON JAN 8 AND 22

In the month of January the special privileged darshan for aged and physically challenged is on 8 and 22 while those of parents with children below 5years is on 9 and 23.

 

To provide hassle free darshanam to aged (above 65y), physically challenged and parents with children below 5years of age, TTD has been giving special privileged darshanam during lean period in a year since last August. Two days during off season month are earmarked for this category of darshanam.

 

On January 8 and 22, in all together 3 slots 4000 tokens will be issued to aged and PHC citizens without making them to wait for hours in queue lines.

 

Similarly on January 9 and 23, the parents with children below 5years of age will be allowed for darshanam between 9am and 1.30am on those days through Supatham entry. The devotees falling under this category are requested to make use of this facility.

 

Dept of PRO TTD

శ్రవణం సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి : టిటిడి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

శ్రీవేంకటేశ్వర వినికిడిలోప నిర్ధారణ మరియు శిక్షణ సంస్థ(శ్రవణం)లో జరుగుతున్న చక్కటిసేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కోరారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రవణం ప్రాజెక్టును శనివారం ఛైర్మన్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ వినికిడిలోపం ఉన్న పిల్లలకు తొలిదశలోనే శిక్షణ ఇస్తే వినికిడిలోపాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. 0 నుండి 3 ఏళ్లలోపు వయసు గల వినికిడిలోపం ఉన్న చిన్నారులను ఇక్కడ చేర్చుకుని 8 దశల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. పిల్లలకు వయసుకు తగ్గట్టు చదవడం, రాయడం, చిత్రలేఖనం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. శిక్షణ కాలం పూర్తయ్యే వరకు పిల్లలతోపాటు తల్లి లేదా సంరక్షురాలికి ఉచితంగా వసతి, భోజనం, వైద్యం కల్పిస్తామన్నారు. పిల్లలు చేరగానే 2 వినికిడి యంత్రాలను, శిక్షణ పూర్తయ్యాక 2 బిటి హియరింగ్‌ యంత్రాలను అందిస్తున్నారని చెప్పారు. డిసెంబరు 15, 2006న 15 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 152 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయులు, 28 మంది సిబ్బంది ఉన్నారని తెలియజేశారు.

అనంతరం, మరింత ఎక్కువ మంది పిల్లలకు వినికిడి జ్ఞానాన్ని ప్రసాదించేందుకు శ్రవణం ప్రాజెక్టు గురించి ఎస్వీబీసీలో ప్రత్యేక కథనాలు, స్క్రోలింగ్‌ ప్రసారం చేయాలని, కరపత్రాలు, గోడపత్రికలు, హోర్డింగుల ద్వారా ఎక్కువ మందికి తెలిసేలా ప్రచారం చేయాలని ఛైర్మన్‌ అధికారులను ఆదేశించారు. అంతకుముందు శిక్షణ పొందుతున్న చిన్నపిల్లలను తరగతులవారీగా పరిశీలించారు. వారి తల్లులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకటగిరికి చెందిన చిన్నారి తల్లి శ్రీమతి లక్ష్మీ మాట్లాడుతూ తాము పిల్లలకు జన్మనిస్తే, శ్రవణం ప్రాజెక్టు వినికిడి జ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ ఇచ్చిందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి కె.భారతి, ఎవిఎస్‌వో శ్రీ రాజేష్‌, శ్రవణం ప్రాజెక్టు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

SRAVANAM SERVICES SHOULD REACH MANY NEEDY-TTD CHAIRMAN

The Trust Board Chief of TTD Sri P Sudhakar Yadav while complimenting the services of Sravanam Project of TTD, strongly felt that it’s services should reach more needy.

On Saturday, the Chairman made a surprise visit to Sravanam Project in Tirupati and verdiend various activities. He also inspected the facilities that are being offeren to the hearing impaired children, their mothers and teaching faculty in the building.

Later speaking to media persons he said, this was one of the most worthy projects of TTD that was commenced on December 15 in 2006 to transform the hearing impaired children to lead a normal life in the society.

“All the teachers are doing impeccable services to train deaf children. “If the parents would ante to recognize the problem on day one soon after the birth of their child, Sravanam project offers best services. It is always easy to cute deafness among children below 5years”, he opinioned.

Deputy EO Smt Bharathi, AVSO Sri Rajesh and others were also present.

 

డిస్‌ప్లే బోర్డుల ద్వారా భక్తులకు సమాచారం తెలియజేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

 

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌, బస్టాండులో దిగగానే శ్రీవారి ఆలయం, స్థానికాలయాల సమాచారాన్ని డిస్‌ప్లే బోర్డుల ద్వారా తెలియజేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని ముఖ్య కూడళ్లలోనూ తిరుమల, తిరుపతిలోని ఆలయాల దర్శనవేళలు, ఆర్జితసేవలు, వసతి గదులు తదితర సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే క్యూకాంప్లెక్స్‌లోకి చేరుకునేలా తిరుమలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. తిరుమలలో రద్దీ రోజుల్లో భక్తులు లగేజి ఎక్కడ డిపాజిట్‌ చేయాలి, ఎక్కడ తిరిగి పొందాలి అనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. రథసప్తమినాటికి మాడ వీధుల్లో ఎస్వీబీసీ, రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, సిసిటివి వైర్లు బయటకు కనిపించకుండా భూగర్భ కేబుల్‌ వ్యవస్థను పూర్తి చేయాలన్నారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న శ్రీవారి కల్యాణోత్సవాల్లో భక్తులకు ఆయా భాషల సప్తగిరి మాసపత్రికను ఉచితంగా పంపిణీ చేయాలని ఈవో ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులకు మరింత వేగంగా సులభతరంగా పోస్టల్‌ శాఖ ద్వారా బట్వాడా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ముఖ్య నగరాల్లో ఉన్న టిటిడి సమాచార కేంద్రాల్లో డైరీలు, క్యాలెండర్లు నిల్వ ఉంచుకుని, అక్కడినుండే భక్తులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నాటి యువతకు మన పండుగలు, వాటి విశిష్టత, సంప్రదాయాల గురించి, ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలియజేసేలా ఎస్వీబీసీలో ఆకట్టుకునేలా ప్రత్యేక కథనాలు ప్రసారం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

DISPLAY TTD INFORMATION FOR THE EASE OF PILGRIMS-EO

 

Electronic LED boards need to be set up to display TTD information at different vital places in Tirumala and in Tirupati, for better knowledge of the visiting pilgrims, said TTD EO Sri Anil Kumar Singhal.

 

The senior officers review meeting took place at conference hall in TTD administrative building on Saturday. EO along with Tirupati JEO Sri P Bhaskar and CVSO Sri Gopinath Jetti reviewed on various activities.

The EO instructed the concerned to place LED boards at vital places and junctions in Tirumala and Tirupati. The boards should display the temple timings, about arjitha sevas, accommodation and other details pertaining to Tirumala as well about local temples. As soon as the pilgrim lands in Railway station or Bus station he should be able to know about his destined place of visit to avoid confusion”, EO added.

Later he said, the pilgrims who are coming with token based darshanams should be allowed to enter into the compartments only during their time slots. Vigorous publicity through announcements is required’, he said.

The EO instructed the engineering wing officials that cable wiring in mada streets of Tirumala to be completed before Radhasapthami. The wires and ducts are not be seen outside”, he directed.

Later he instructed the concerned to distribute Sapthagiri free of cost in the vernacular language of the area whenever Srinivasa Kalyanams are performed.

CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji and other officers were also present.

 

జనవరి 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర నాట్యకళా పరిషత్‌ 64వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు : హెచ్‌డిపిపి కార్యదర్శి డా|| రమణప్రసాద్‌

 

శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్‌ 64వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు జనవరి 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయని, ఇందుకోసం పౌరాణిక నాటకాల ఎంపిక పూర్తయిందని పరిషత్‌ ఉపాధ్యక్షుడు, టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌ వెల్లడించారు. తిరుపతిలోని పురంధరదాస కాంప్లెక్స్‌లో గల పరిషత్‌ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా|| రమణప్రసాద్‌ మాట్లాడుతూ జాతీయ నాటకోత్సవాల్లో 14 పౌరాణిక నాటకాలు, 5 పౌరాణిక నాటికలు, 12 సాంఘిక నాటకాలు, 33 ఏకపాత్రాభినయాలు, 17 లలిత సంగీతం కార్యక్రమాలను ఎంపిక చేశామన్నారు. మొత్తం 41 పౌరాణిక నాటకాలు, 11 పౌరాణిక నాటికలు, 44 సాంఘిక నాటకాలు, 93 ఏకపాత్రాభినయాలు, 59 లలిత సంగీతం దరఖాస్తులు అందినట్టు తెలిపారు.

నగదు బహుమతుల వివరాలు

పోటీల్లో పాల్గొన్న ప్రతి ప్రదర్శనకు పారితోషికం అందజేస్తారు. ఇందులో పౌరాణిక పద్య నాటకాలకు రూ.30 వేలు, పౌరాణిక పద్యనాటికలకు రూ.18 వేలు, పౌరాణిక పద్యనాటిక(పిల్లల విభాగం)లకు రూ.18 వేలు, సాంఘిక నాటికలకు రూ.15 వేలు, ఏకపాత్రాభినయాలకు రూ.2 వేలు, లలిత సంగీతం(స్థానికేతరులకు మాత్రమే) రూ.750/- పారితోషికం అందిస్తారు.

ప్రతి విభాగంలోనూ మొదటి మూడు ఉత్తమ ప్రదర్శనలకు గరుడ నగదు బహుమతులు అందిస్తారు. పౌరాణిక పద్య నాటకాల్లో ఉత్తమ ప్రదర్శనకు రూ.70 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.45 వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.30 వేలు, పౌరాణిక పద్య నాటికల్లో ఉత్తమ ప్రదర్శనకు రూ.25 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.12,500/-, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.9 వేలు, పౌరాణిక పద్య నాటికలు పిల్లల విభాగంలో ఉత్తమ ప్రదర్శనకు రూ.25 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.12,500/- వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.9 వేలు అందిస్తారు. అదేవిధంగా, సాంఘిక నాటికల్లో ఉత్తమ ప్రదర్శనకు రూ.22 వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.11 వేలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.8,500/-, ఏకపాత్రాభినయంలో ఉత్తమ ప్రదర్శనకు రూ.4,116/-, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.3,116/-, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.2116/-, లలితసంగీతంలో ఉత్తమ ప్రదర్శనకు రూ.3,116/-, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.2,116/-, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.1,116/- అందజేస్తారు. ఈ నగదు బహుమతులతోపాటు ప్రతి కేటగిరీలోనూ 12 వ్యక్తిగత గరుడ అవార్డులు ప్రదానం చేస్తారు.

ఈ సమావేశంలో నాట్య కళా పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎల్‌.జయప్రకాష్‌, కమిటీ సభ్యులు శ్రీ కొత్తపల్లి మునిరత్నం, శ్రీ బిపి.శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——