[google-translator]

Today’s Devotional E-Paper -05-12-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

05/12/2018 , బుధవారం

 

 

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

 

మాసం : కార్తీకం

 

 

పక్షం : బహుళ

 
సూర్యోదయం :6.26AM

 
సూర్యాస్తమయం :5.41PM

 
తిథి :త్రయోదశి12.11PM

 
నక్షత్రం :విశాఖ4.11AM

 
యోగం :అతి11.50PM

 
కరణం :ఫణి 12.11PM
భద్ర12.03

 

 

అమృతఘడియలు :7.19PM-8.55PM

 
రాహుకాలం:12.00 PM to 01.30 PM

 

 

యమగండం :07.30 AM to 09.00 AM

 
వర్జ్యం :9.39AM-11.15AM

 

 

దుర్ముహూర్తం
11.41AM-12.26PM

 

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

05/12/2018 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise :

6.26AM

SunSet :

5.41PM

Tithi :

Trayodasi 12.11PM

Nakshatram :

Visakha 4.11AM

Yogam :

Athi 11.50PM

Karanam :

Phani 12.11PM
Bhadra 12.03

AmruthaGadiyalu :

7.19PM-8.55PM

Rahukalam :12.00 PM to 01.30 PM

Yamagandam : 07.30 AM to 09.00 AM

Varjyam :

9.39AM-11.15AM

Durmuhurtham 11.41AM-12.26PM

 

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 04.12.2018 :: 68,999.
 VQC SITUATION AT 5.00 AM ON 05.12.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 09,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : up to 12 HOURS. 
TONSURES – 22,123. 
PARAKAMANI – 3.20. CRORES. 
Dept of PRO TTD

 

 

05/12/2018 , Wednesday

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

09:30 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

CHINMAYI TAKES RIDE ON CHINNA SESHA

In all Her divine resplendent, Sri Padmavathi Devi took celestial ride on five hooded serpent vahanam. 

 

In the serpentine kingdom, King Vasuki is considered as Chinna Sesha Vahanam while mighty serpent king Adi sesha as Pedda Sesha Vahanam.

 

The privilege of carrying the deity twice is given to serpent king only in the form of Chinna Sesha on first day and Pedda Sesha on second day morning.

 

Tirupati JEO Sri Pola Bhaskar, Addl CVSO Sri Sivakumar Reddy, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, temple staff and devotees took part.

  Dept. of PRO- TTD.

శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తిభావంతో సేవ‌లందించాలి : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్కర్‌
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్స‌వాల‌కు విచ్చేసే భక్తులకు శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తిభావంతో సేవ‌లందించాల‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో మంగ‌ళ‌వారం శ్రీవారి సేవకులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ‌కులు క్రమశిక్షణ, నిబద్దత, అంకితభావంతో సేవలందించాలన్నారు. సమూహాలుగా ఉన్న భక్తులకు మరింత ఓపికతో సేవలు చేయాలన్నారు. రద్దీ సమయంలో సేవకులు సంయమనం పాటించాలని సూచించారు. ముఖ్యంగా గజవాహనం, పంచమితీర్థం రోజుల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు మెరుగైన సేవలు అందించాలని కోరారు. 280 మంది మహిళలు, 60 మంది పురుషులు సేవకులుగా వచ్చినట్టు తెలిపారు.
టిటిడి స‌హాయ‌ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల నుంచి  శ్రీవారి సేవకులు విచ్చేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సేవకులు చేయాల్సిన, చేయకూడని అంశాలను తెలియజేశారు. ముందుగా శ్రీ‌వారి సేవ‌కులు సుమారు గంట పాటు భజనలు చేశారు. 
ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, డెప్యూటీ ఈవో (జ‌న‌ర‌ల్‌) శ్రీ‌మ‌తి గౌత‌మి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, శ్రీవారి సేవ తిరుప‌తి సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి పి.విజ‌య‌ల‌క్ష్మి, సిబ్బంది శ్రీ చౌడ నాయ‌క్‌ తదితరులు పాల్గొన్నారు.
  Dept. of PRO- TTD.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి హృదయేశ్వరియైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం ధ్వజారోహణంతో అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక‌ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు మ‌రియుప్రధాన కంకణభట్టార్‌  శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
గజపట ప్రతిష్ఠ : 
               ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన  కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.
సకలదేవతలకు ఆహ్వానం : 
            ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
రాగ, తాళ నివేదన : 
           రాగ స్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మ కోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువు కోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. అదేవిధంగా గాంధార రాగం, మురళీ రాగం, నాటభాగ రాగం, కల్యాణి రాగం – ఆదితాళం, భుజంగ రాగం – ధ్రువ తాళం, గరుడాఖ్యి రాగం, సావేరి రాగం – త్రిపుట తాళం, సుమంత రాగం – నాట తాళం, మధ్యమావతి రాగం – మధ్య తాళం, సౌరాష్ట్ర రాగం – రూపక తాళం, బేగడ రాగం – ఏక తాళం, రేగుప్త రాగం – శంబే తాళం, పంతువరాళి రాగం – మల్ల తాళం, సామంత రాగం, రామక్రియ రాగం – సింహళిక తాళం, కాంభోజి రాగం – సింహవిక్రమ తాళం, దేవగాంధార రాగం – శ్రీరంగ తాళం, కారీ రాగం – గజలీలా తాళం, వరాళి రాగం – చించత్పుర తాళం, అనంత తాళం, కౌషిక రాగం – ఘర్మ తాళం, ఘంటా రాగం – నృసింహ తాళం, భూపాల రాగం – సింహనాద తాళం ఆలపించారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.
            అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ వసతులు కల్పించినట్టు తెలిపారు. బ్ర‌హోత్స‌వాల‌లో వాహనసేవలతో పాటు భ‌క్త‌లకు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. వాహనసేవలలో భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
     ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివో శ్రీ అశోక్ కుమార్‌గౌడ్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

GRANDEUR MARKS DHWAJAROHANAM IN TIRUCHANOOR TEMPLE

The nine day Karthika Brahmotsavams of Sri Padmavati who resides in Tiruchanoor as Sarva Swatantra Veera Lakshmi off to a grand start with the Dwajarohanam on Tuesaday at 8.30am in the auspicious Vrischika Lagnam amidst chanting of Vedic mantras under the able supervision of TTD Pancha Rathra agama advisor and Kankana Bhattar Sri Srinivasacharyulu. 

 

GAJA PATAM INSTALLATION

 

After awakening the Goddess with Suprabatha seva the special rituals for the day started. The sacred flag bearing the image of Gaja- the divine elephant was unfurled in the Yagashala. Later, Gaja Dhyana sloka, Gaja Mangalastakam and Garuda Gadyam were recited as mentioned in the Kashyapasamhita. 

 

Purnahuti was performed as per Rakshabandhan, Chayadivasam, Chaya Snapanam, Netronmeelanam, Tatwanyasa Homam, Prana Pratista Homam and concluded with Purnahuti before the Gaja flag was brought to the mandapam.

 

Invite for all Gods

As part of ritual Viswaksena Aradhana, Punyahavachanams were performed. Nine Kalashas were filled with holy liquid to welcome Gods of all worlds who were grandly felicitated by chanting of four vedas. Raksha Bandhan was tied to Dwajastambha to ensure smooth conduct of the celestial event.

 

A unique Raga- tala- nivedana was performed to appease the deities with each raaga including Kalyani, Neelambari, Bhairavi, Mayamalavagowla, Kanada in different Talas.

 

Later the TTD Executive Officer Sri Anil Kumar Singhal said dwajarohanam was performed on the inaugural day of Brahmotsavam inviting all gods and goddessesto take part in this nine day mega festival of Universal Mother. 

 

He said all arrangements were made to facilitate the devotees with Drinking water, toilets, Anna Prasadam and parking facilities. Efforts were made to provide Mula murti darshan to devotees along with Vahana Sevas on the same day. He urged the devotees to participate in large numbers and beget the blessings of Goddess Padmavati.

 

Among other prominent officials, Tirupati JEO Sri Pola Bhaskar, CVSO Sri Gopinath Jetti, Additional CVSO Sri Sivakumar Reddy, VGO Sri Ashok Kumar Goud, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam other officials and devotees were also present.

   Dept. of PRO- TTD.
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ”సౌభాగ్యం”
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా మొద‌టిరోజైన మంగ‌ళ‌వారం సౌభాగ్యం కార్య‌క్ర‌మం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కలిసి పసుపు, కుంకుమ, గాజులు, కంక‌ణాల‌ను మహిళలకు పంపిణీ చేశారు.
తిరుచానూరులో ప్రకాశిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవి. స్వామివారు జగద్భర్త కాగా ఈమె లోకమాత. జగత్తు అంతా వారి కుటుంబమే. లోకంలో సిరిసంపదలు, విద్య, పదవి, జ్ఞానం చివరికి మోక్షం కూడా అమ్మవారి స్వరూపాలే అని శాస్త్రాలే వివరిస్తున్నాయి. జగదేకమాత శ్రీమహాలక్ష్మీ అవతారమైన పద్మావతీ అమ్మవారు అందరికన్నా పెద్ద ముత్తయిదువ. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు, కమ్మలను సుమంగళీద్రవ్యాలుగా పెద్దలు చెబుతారు. ఆధునిక స‌మాజంలో ప‌సుపు, కుంకుమ‌ల విలువ‌ను మ‌రిచిపోతున్న యువ‌తుల‌కు వాటి ప్రాధాన్యాన్ని తెలియ‌జేసేందుకు టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది.
        టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ 2012వ సంవ‌త్స‌రంలో సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. అప్ప‌టినుండి ప్ర‌తి ఏడాదీ అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తోంది. ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో 50 వేల మంది మ‌హిళ‌ల‌కు ప‌సుపు, కుంకుమ‌, కంక‌ణాలు, 4 గాజులు చొప్పున అందించ‌నున్నారు. 
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా.. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

EO COMMENCES SOUBHAGYAM IN TIRUCHANOOR

 

The distribution of the sacred materials including vermilion, turmeric, bangles along with Kankanams to women devotees commenced on a grand religious note in Tiruchanoor temple by TTD EO Sri Anil Kumar Singhal on Tuesday evening in Sri Padmavathi Ammavaru temple premises.

 

Soubhagyam is often described as the good fortune of married women and is observed seeking longevity of their husband’s life.

 

Started by TTD in 2012, Soubhagyam is observed under the aegis of Hindu Dharma Prachara Parishad wing during every annual brahmotsavams at Tiruchanoor.

 

Tirupati JEO Sri P Bhaskar, HDPP Secretary Sri Ramana Prasad, DyEOs Smt Goutami, Smt Jhansi Rani and other officials, huge number of women devotees were also present.

    Dept. of PRO- TTD.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కార్తీకవనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా ఆలయం నుండి శ్రీవారి మెట్టు మార్గంలోని పార్యేట మండసానికి చేరుకున్నారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు పార్వేట మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. ఆనంతరం ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన వనభోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డించారు. శ్రీవారి వనభోజనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 
అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పార్వేట మండపం నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు.   
  ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూప‌రింటెండెంట్  శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ ముని చెంగ‌ల్రాయులు, అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

KARTHIKA VANABHOJANAM OBSERVED

The holy event of Karthika Vana Bhojanam at Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram was observed with religious pomp and gaiety on Tuesday.

 

The Paruveta Mandalam was decked up with Shamianas, electrical and floral decorations besides queue lines for benefit of the devotees. Special devotional and bhakti programs also conducted during the occasion.

 

As part of the event, the procession of Lord with His consorts Sridevi and Bhudevi commenced from temple at 8.00 AM and reached the Paruveta mandapam near Srivari mettu  by  9.30  AM where Tirumanjanam was performed for the utsava idols and was followed by Asthanam from 10.00 AM onwrds. 

 

The devotees gathered in huge numbers and were served with delicious and tasty food as a part of vana bhojanam after the cultural programs.

    Dept. of PRO- TTD.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం సిరులతల్లి శ్రీ అలమేలుమంగ అవతరణ
సిరులతల్లి శ్రీ మహాలక్ష్మి తిరుచానూరులో శ్రీ అలమేలుమంగగా కార్తికమాసంలో శుక్ల పంచమీ శుక్రవారం, ఉత్తరాషాడా నక్షత్రం, విజయలగ్నంలో శ్రీనివాసుని ఎదుట పద్మసరోవరంలో సహస్రదాళాలు కలిగిన బంగారుపద్మంలో అవతరించింది. 
బంగారు పద్మంలో పద్మాసనియై పద్మహస్తగా పద్మమూలాలంకృత అయిన నిత్య యౌవన శోభితురాలైన శ్రీ మహాలక్ష్మి, పదహారేళ్ల నవయువతిగా అవతరించింది. బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్న ‘పద్మావతి’ని బ్రహ్మేంద్రాది దేవతలు, భృగునారద, తుంబురాది మహర్షులు, ముక్కోటి దేవతలు ఎన్నోవిధాలుగా కీర్తిస్తూ, స్తుతించారు. ఆనాటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారు వెలసిన తిరుచానూరు క్షేత్రంలో ”స్వతంత్ర వీరలక్ష్మీ”గా ప్రసిద్ధి పొందారు.
 శ్రీ వేంకటేశ్వరస్వామివారు సుదీర్ఘ కాలం తర్వాత తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీమహాలక్ష్మిని చూసి ఆనందపడుతూ తన మెడలోని కల్హారమాలను ఆమె కంఠంలో వేసి, ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అందరికి వరాలను ప్రసాదించే అలమేలుమంగ అదృశ్యమై శ్రీనివాసుని వక్ష:స్థలంలో ”వ్యూహలక్ష్మి”గా ఆవిర్భవించింది. శ్రీవారి వక్షస్థలంలో అమ్మవారు వేంచేసివున్నందువల్ల స్వామివారు ‘శ్రీనివాసుడు’గా ప్రసిద్ధి పొందాడు.
శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన కార్తీకశుక్ల పంచమినాటిని పురస్కరించుకుని ప్రతిఏటా కలియుగాంతం వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపబడతాయని శ్రీపద్మావతి సమేత శ్రీనివాసుడు వరమిచ్చారు. అందువల్లే ఆనాటినుండి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతునవో అలాగే అమ్మవారికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.   
ఈ దివ్య క్షేత్రంలో శ్రీనివాసుడు లేకుండానే మహారాజ్ఞి అయిన పద్మావతి అమ్మవారికి పాంచరాత్రాగమ పద్ధతిలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పాట్లు చేసినట్లు పురాణ ప్రాశస్త్యి. అంతేగాక పద్మాసరోవరంలో పద్మావతి అమ్మవారు అవతరించిన నాటికి అవబృథస్నానం (పచమితీర్థం)తో ముగియనున్నట్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. పంచమితీర్థం రోజున తిరుమల క్షేత్రం నుండి శ్రీవారి కంఠంలోని పూలమాల, పసుపుకుంకుమలు, ఆభరణాలు, చీరసారె, పిండివంటలు, తిరుచానూరులోని అలమేలుమంగమ్మకు కానుకగా సమర్పించడం ఆనవాయితీ. 
సాక్షత్తు శ్రీనివాసుడు ఏడుకొండలు దిగి వచ్చి తపస్సు చేసిన దివ్యస్థలమైన తిరుచానూరులో బ్రహ్మాది దేవతల కోరిక మేరకు శ్రీ పద్మావతి అమ్మవారు ఈ క్షేత్రంలో  ‘అర్చామూర్తి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని, అర్చిస్తారో వారికి పోగొట్టుకున్న సిరిసంపదలు, పదవులు తిరిగి పొందడమేగాక, ధర్మ అర్థ కామ మోక్షలు, పురుషార్థాలు సిద్ధిస్తాయని స్థల పురాణ ప్రాశస్త్యి. 
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనవివ్వనున్నారు. డిసెంబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు డిసెంబరు 8న గజవాహనం, డిసెంబరు 9న గరుడవాహనం, డిసెంబరు 11న రథోత్సవము, డిసెంబరు 12వ తేదీ పంచమితీర్థంతో ముగుస్తాయి.
    Dept. of PRO- TTD.
తిరుచానూరులో ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఈవో 
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. 
ఇందులో టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో అనంతాళ్వారు తోట‌లో ఆడుకుంటున్న స‌మ‌యాన ప‌ద్మావ‌త‌మ్మ‌ను బంధించిన అనంతాళ్వారు…, శ్రీ‌వారి ఆదేశం మేర‌కు ప‌ద్మావ‌త‌మ్మ‌ను పూల‌బుట్ట‌లో పెట్టి స్వామికి స‌మ‌ర్పించి త‌న భ‌క్తిని, సేవ‌ను నిరూపిస్తున్న అనంతాళ్వారు…, శ‌క‌టాసురుడు అనే రాక్ష‌సుడిని సంహ‌రిస్తున్న చిన్నికృష్ణుడు…, వ‌ర‌మిచ్చిన శివునిపై వ‌ర ప్ర‌యోగం చేస్తున్న భ‌స్మాసురుడిని నృత్యంతో అంతం చేస్తున్న మోహినీ అవ‌తారంలో ఉన్న శ్రీ‌మ‌హావిష్ణువు…, అష్ట‌ల‌క్ష్మీ వైభ‌వం…, శ్రీ‌రామ వ‌న‌వాస స‌మ‌యాన త‌న‌ను వివాహం చేసుకోవాల‌ని కోరిన శూర్ప‌న‌ఖ ముక్కు చెవులు కోస్తున్న ల‌క్ష్మ‌ణుడు…, శ్రీ‌రామ‌, ల‌వ‌కుశుల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాన్ని ఆపుతున్న సీత‌మ్మ త‌ల్లి…, శ్రీ‌దేవి, భూదేవి స‌మేతంగా స్వామి ఆర‌గించిన ల‌డ్డూను ముస‌లి అవ్వ రూపంలో అన్న‌మ‌య్య‌కు అందిస్తున్న ప‌ద్మావ‌త‌మ్మ‌…, శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌రుని సైక‌త శిల్పం… తదితర పౌరాణిక అంశాలు, కూర‌గాయ‌ల‌తో రూపొందించిన దేవ‌తామూర్తుల మండ‌పం, పుష్పాలతో వివిధ జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
       అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కళల ప్రదర్శనశాల ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, తిరుపతి విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, డెప్యూటీ ఈవో (జ‌న‌ర‌ల్‌) శ్రీ‌మ‌తి గౌత‌మి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. 
    Dept. of PRO- TTD.

EXHIBITION ALLURES PILGRIMS

 The floral expo set up by TTD is getting the accolades from pilgrims with its innovative mythological concepts.

 

TTD Executive officer Sri  Anil Kumar Singhal and Joint Executive Officer Tirupati Sri  Pola Bhaskar on Tuesday jointly inaugurated the bright and colourful exhibition of puranic episodes and display of Ayurveda products got up as part of Karthika Brahmotsavams in Tiruchanoor.

 

The flower display put up by the TTD garden department  involving Goddess Padmavati and Lord Venkateswara, Anantalwar tying Goddess to a tree, Uniting Goddess with Lord by carrying Her in a basket, Annamacharya eating the laddu prasadam tasted by Lord offered by Goddess in the guise of an old lady, Bhasmasuravadha, Surpanakha Garva bhangam, Asta lakshmi Avirbhavam etc.

 

The exhibits also showcased Ayurvedic products from SV Ayurveda Pharmacy, display of herbs, free Ayurveda medical camp, and sculptures by different departments.

 

CVSO Sri Gopinath Jetti, Additional CVSO Sri K Sivakumar Reddy, VGO,Tirupati Sri Ashok Kumar Goud, Temple DyEO Smt Jhansi Rani, Dy.EO general Smt Gautami Garden Deputy Director Sri Srinivasulu and others participated in the event.

  Dept. of PRO- TTD.
ఘ‌నంగా న‌ర‌సింహ జ‌యంతి
అలిపిరి న‌డ‌క‌మార్గంలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం న‌ర‌సింహ జ‌యంతి ఘ‌నంగా జ‌రిగింది. కార్తీక మాసం, స్వాతి న‌క్ష‌త్రం రోజున ప్ర‌తి ఏడాదీ ఇక్క‌డ న‌ర‌సింహ జ‌యంతిని నిర్వ‌హిస్తారు. 
          ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు మాట్లాడుతూ న‌ర‌సింహ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శ్రీ‌వారి ఆల‌య పోటు విభాగం ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డి ఆల‌యంలో స్న‌ప‌న‌తిరుమంజ‌నం వేడుక‌గా నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చంద‌నం త‌దిత‌ర సుగంధ‌ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశార‌ని చెప్పారు. ఈ పురాత‌న ఆల‌యానికి ఎంతో చారిత్ర‌క ప్రాశ‌స్త్యం ఉంద‌ని, న‌డ‌క‌దారిలో తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులంద‌రూ ఈ స్వామివారిని ద‌ర్శించుకుంటార‌ని వివ‌రించారు. న‌డ‌కదారి భ‌క్తుల‌కు ఎలాంటి భ‌యం లేకుండా ఇక్క‌డి స్వామివారు అనుగ్ర‌హిస్తున్నార‌ని తెలియ‌జేశారు.
         ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

NARASIMHA JAYANTHI OBSERVED IN TIRUMALA

 

 Following the advent of Swathi Nakshatra, Narasimha Jayanthi was observed in Sri Lakshmi Narasimha Swamy temple located in Alipiri footpath route on Tuesday.

 

Tirumala JEO Sri KS Sreenivasa Raju took part in special abhishekam performed to the presiding by Potu wing of Sri Tirumala temple.

 

Temple DyEO Sri Harindranath, Peishkar Sri Ramesh Babu and others were also present.

  Dept. of PRO- TTD.
వైకుంఠ ఏకాద‌శికి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు
డిసెంబ‌రు 18న వైకుంఠ ఏకాద‌శి, 19న ద్వాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గకుండా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆల‌య మాడ వీధులు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను మంగ‌ళ‌వారం టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టితో క‌లిసి జెఈవో త‌నిఖీ చేశారు.
        ఈ సంద‌ర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సూచ‌న‌ల మేర‌కు మాడ వీధుల్లో దాదాపు 40 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు వీలుగా చ‌లికి ఇబ్బందులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఇక్క‌డ తాగునీరు, అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తామ‌ని, మ‌రుగుదొడ్ల వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని తెలిపారు. భ‌క్తుల‌ను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 2, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌- 1లోకి అనుమ‌తిస్తామ‌ని, అవి నిండిన త‌రువాత వ‌రుస‌గా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, ఆళ్వార్‌ట్యాంక్ లైన్‌, మాడ వీధుల్లోని షెడ్లు, బాట‌గంగ‌మ్మ గుడి మీదుగా క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద భ‌క్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ఈ విధంగా మొత్తం 80 వేల మంది భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఏకాద‌శి, ద్వాద‌శి రెండు రోజుల్లో ఒక ల‌క్షా 70 వేల మంది భ‌క్తులు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఒక‌రోజు ముందుగా భ‌క్తులు రావ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, చ‌లికాలం కావ‌డం, వ‌ర్షం ప‌డే సూచ‌న‌లు ఉండ‌డంతో ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా భ‌క్తులు త‌మ తిరుమ‌ల యాత్ర ప్ర‌ణాళిక రూపొందించుకోవాల‌ని కోరారు. డిసెంబ‌రు 18న ఉద‌యం 5.30 గంట‌ల నుండి సామాన్య భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు.
జెఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ర్టిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆరోగ్య‌శాఖాధికారి డా.. శ‌ర్మిష్ట‌, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ త‌దిత‌రులు ఉన్నారు.

ARRANGEMENTS IN FULL SWING FOR VAIKUNTHA EKADASI-TIRUMALA JEO

 The arrangements for ensuing Vaikuntha Ekadasi are under way and priority is being given for the Darshanam for common devotees which will last for nearly 44 hours on December 18 and 19, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

 

The JEO along with CVSO Sri Gopinath Jetti and CE Sri Chandra Sekhar Reddy inspected the arrangements for over three hours on Tuesday. As a part of the inspection the officials visited and inspected the ongoing works inside the temple, in four mada streets, at Kalyana Vedika via Bata Gangamma temple, in Narayanagiri gardens.

 

Later speaking to media persons the JEO said

 

* Pilgrims are allowed to enter into the compartments of Vaikuntham 2 through MBC 26 gate from 10am onwards on December 17

 

* After the compartments of VQC 2 and then VQC 1 gets filled, the pilgrims will be allowed to enter into the sheds constructed in Narayanagiri Gardens 

 

* After filling of all compartments of Vaikuntham and sheds in Narayanagiri Gardens, the pilgrims will be allowed to enter in to the special sheds arranged in four mada streets galleries through N 1 gate and the arrangements were made to nearly forty thousand pilgrims here.

 

* Even these galleries also gets filled then the devotees were made to wait in Kalyana Vedika which has a holding capacity of 3000 pilgrims. 

 

* Beyond this pint, the pilgrims will be made to wait in the queue lines laid at New Seva Sadan building.

 

* Continuous announcements through Radio and Broadcasting will be given for the information of pilgrims about these entry points in different languages 

 

* Sarva Darshanam commences on December 18 by 5.30am and lasts up to midnight of December 19 with a break of less than an hour for Naivedyam.

 

* Arrangements of continuous supply of food and water with Srivari Seva volunteers has been planned at micro level

 

* Set to provide Vaikuntha Dwara darshanam to 1.70pilgrims during these two days

 

Later the JEO also inspected new Seva Sadan buildings which are set for opening.

 

SE 2 Sri Rmachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, ACVSO Sri Sivakumar Reddy, HO Dr Sermista, Annaprasadam SO Sri Venugopal, VGOs Smt Sada Lakshmi, Sri Manohar were also present.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వస్త్రబహుమానం స్వీకరణ
సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని డిసెంబరు 4 నుండి 12వ తేదీ వ‌ర‌కు భక్తుల నుంచి ప‌ట్టువస్త్రాల‌ను బహుమానంగా స్వీకరిస్తారు. భ‌క్తులు స‌మ‌ర్పించే ఈ వ‌స్త్రాల‌ను అమ్మవారి మూలమూర్తికి అలంకరిస్తారు.
ఇందుకోసం వాహన మండపం వద్ద ప్రత్యేకంగా కౌంటర్‌ ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు భ‌క్తుల నుండి వస్త్రాలను స్వీకరిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తికి అలంకరించేందుకు 9 ఇంచులు, ఆపైన గల జరీ బార్డర్‌ కలిగిన నాణ్యమైన పట్టుచీరలను మాత్రమే స్వీకరిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోర‌డ‌మైన‌ది.
Dept. of PRO- TTD.
శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ మంత్రి గౌ|| శ్రీ ఎన్‌.అమరనాథరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం గౌ|| మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండోసారి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల  కోసం టిటిడి అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. భ‌క్తుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ఇటీవ‌ల నూత‌న అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం నిర్మించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తిరుప‌తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల‌న్న‌ గౌ|| ముఖ్య‌మంత్రి ఆలోచ‌న మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
  Dept. of PRO- TTD.

AP GOVT OFFERS SILKS TO GODDESS PADMAVATHI

 

On behalf of State Government, as a part of the traditional practice of making offerings during annual Brahmotsavams the state industry minister Sri N Amarnath Reddy presented silk vastrams to Goddess Padmavati on Tuesday. 

 

The Tirupati JEO Sri P Bhaskar,  received the silks on behalf of the TTD and later presented prasadams to the dignitaries after darshanam of goddess.

  Dept. of PRO- TTD.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నతెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని మంగ‌ళ‌వారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌,  అర్చక బృందం కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు. 
ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో  ఉండాలని, అంద‌రికీ ఆరోగ్యం, సంప‌ద ప్ర‌సాదించాల‌ని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ శ్రీ పిఎస్‌.ప్ర‌ద్యుమ్న‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

HE GOVERNOR OF AP & TELANGANA OFFERED PRAYERS TO GODDESS PADMAVATHI

HE Governor of Andhra Pradesh and Telangana Sri ESL Narasimhanan accompanied by wife Smt. Vimala Narasimhanan had darshan of Goddess Padmavathi in Sri Padmavathi Ammavari Temple, Tiruchanur on Tuesday evening. On his arrival at temple TTD Joint Executive Officer Sri Pola Bhaskar and temple priests welcomed him with temple honors. After darshan of the Goddess TTD JEO presented Ammavari Prasadam.

 

Dist Collector Sri Prudhyama, DyEO Smt Jhansi Rani, Temple priets and others were present.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

 

——