[google-translator]

Today’s Devotional E-Paper -04-12-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

04/12/2018 , మంగళవారం

 

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం
మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ
సూర్యోదయం :6.25AM
సూర్యాస్తమయం :5.41PM
తిథి :ద్వాదశి12.56PM
నక్షత్రం:స్వాతి 4.00AM
యోగం :శోభనం 1.26PM
కరణం :తైతుల12.56PM
       గరజి12.33AM

 

 

అమృతఘడియలు :7.18PM-8.52PM

 

వర్జ్యం :9.48AM-11.23AM
రాహుకాలం :03.00 PM to 04.30 PM

 

యమగండం : 09.00 AM to 10.30 AM

 

 

దుర్ముహూర్తం
8.40AM-9.25AM
10.47PM-11.38PM

 

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

04/12/2018 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Karthikam

Paksham :

Bahula

SunRise :

6.25AM

SunSet :

5.41PM

Tithi :

Dwadasi 12.56PM

Nakshatram :

Swathi 4.00AM

Yogam :

Shobhanam 1.26PM

Karanam :

Taitula 12.56PM
Garaji 12.33AM

AmruthaGadiyalu :

7.18PM-8.52PM

Rahukalam :03.00 PM to 04.30 PM

Yamagandam : 09.00 AM to 10.30 AM

Varjyam :

9.48AM-11.23AM

Durmuhurtham 8.40AM-9.25AM
10.47PM-11.38PM

 

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
 TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 03.12.2018 :: 75,626.
 VQC SITUATION AT 5.00 AM ON 04.12.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 10,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : UP TO 08 HOURS.
TONSURES – 26,810.
 PARAKAMANI – 3.58. CRORES. 

  Dept. of PRO- TTD.
 

 

04/12/2018 , Tuesday

06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell

07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

డిసెంబ‌రు 11న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల 
భక్తుల సౌకర్యార్థం 2019 మార్చి నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబ‌రు 11న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
TTD TO RELEASE MARCH QUOTA 
 
The Rs.300 special entry darshan quota for the month of March 2019 will be released by TTD on December 11.
 
The pilgrims can book these tickets through online, e-Darshan counters and in post offices.
  Dept. of PRO- TTD.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయనిర్మాణ వైశిష్ట్యం
తిరుచాన అనగా శ్రీకాంత. సిరులతల్లి అయిన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై వున్న ఊరే తిరుచాన ఊరు. ఇదే తిరుచానూరుగా మారింది. తిరుమల క్షేత్రం ఎప్పటినుండి ఉన్నదో తిరుచానూరు కూడా అంతే ప్రాచీన క్షేత్రమేకాక అంతటి మహిమగలదిగా విరాజిల్లుతోంది. అందువల్లనే తిరుమల యాత్రికులు, భక్తులు ముందుగా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించిన తర్వాత, తిరుమల కొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం శ్రేయోదాయకమని విశ్వాసం. అంతేకాక స్వర్ణముఖీనదీ తీరంలోని శుకమహర్షి ఆశ్రమ ప్రాంతం, ఆ పక్కనే పరాశరమహర్షి ఆశ్రమం, ఇంకోవైపు యోగులకొండ, మరోవైపు ఏడుకొండలు, అన్నింటి మధ్యలో నెలకొన్నది అలమేలుమంగపట్నం.
ఆలయ ప్రాంగణం
ఏడు బంగారు కలశాలతో గంభీరంగా తూర్పుముఖంగా కనపడే ఎత్తయిన రాజగోపుర ద్వారానికి లోపల ప్రాంగణంలో ఎదురుగా ఉన్న ఆలయం శ్రీకృష్ణస్వామి ఆలయం. ఈ ఆలయానికి దక్షిణంవైపు శ్రీసుందరరాజస్వామి ఆలయం, ఉత్తరం వైపున శ్రీ పద్మావతి ఆలయం కొలువై ఉన్నాయి. 
ఆశీర్వాదమండపం
ధ్వజస్తంభమండపానికి తూర్పున సుమారు 4 అడుగుల ఎత్తయిన రాతి అధిష్టానంపై నిర్మింపబడిన 16 రాతిస్తంభాల మండపమే ఊంజల్‌ మండపం. చాలా సంవత్సరాల క్రితం ఈ మండపం మధ్యలో వున్న వేదికలో అలమేలుమంగమ్మకు డోలోత్సవం జరిగేది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కొలువు మేళాలు (భజంత్రీ) వాయింపబడుతున్నాయి. ఇంకా, ప్రముఖులు అమ్మవారి దర్శనానంతరం ఈ మండపంలో కూర్చుని తీర్థప్రసాదాలను ఆశీర్వాదాన్ని స్వీకరిస్తుంటారు. 
ధ్వజస్తంభ మండపం
ఒక వరుసకు ఆరుస్తంభాలవంతున ఆరు వరుసలతో మొత్తం 36 రాతిస్తంభాల ఎతైన మండపం మధ్యలో బంగారుబలిపీఠం, దానికి పశ్చిమవైపు వున్న బంగారు ధ్వజస్తంభం ఉండడంచేత ఈ మండపం ధ్వజస్తంభమండపంగా పిలువబడుతోంది.
అమ్మవారికి నివేదనలు జరిగిన మూడుపూటల చివర్లో ఆలయాన్ని అంటి పెట్టుకొన్న భూతగణాలకు శుద్ధాన్నం బలిగా ఈ పీఠంపైన సమర్పింపబడుతుంది. కనుక ఇది బలిపీఠం. దీనికి ఆనుకొని ఎత్తయిన బంగారు ధ్వజస్తంభం ఉంది. అమ్మవారికి ఎదురుగా ఈ స్తంభంలో కింది భాగంలో పశ్చిమాభిముఖంగా గజవాహనం, ఉత్తర దక్షిణవైపున శంఖుచక్రాలు, తూర్పుముఖంగా శ్రీపద్మావతి అమ్మవారి ప్రతిమ ఇలా నలువైపులా ఈ ధ్వజస్తంభంపై ప్రతిష్టింపబడినాయి. ప్రతి సంవత్సరంలో కార్తీకమాసంలో జరిగే బ్రహ్మోత్సవ ప్రారంభంలో ఈ బంగారు ధ్వజస్తంభంపైన గజపతాకం ఎగుర వేయబడుతుంది. బ్రహ్మోత్సవానంతరం చివర్లో, ఈ ధ్వజం అవరోహణ జరుపబడుతుంది.
కల్యాణోత్సవ మండపం
అమ్మవారి ధ్వజస్తంభమండపానికి దక్షిణంగా, శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయానికి ముందు భాగంలో వున్న కల్యాణ మండపంలో శ్రీ పద్మావతీ శ్రీనివాసులకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం జరుగుతుంది. 
ముఖమండపం
శ్రీ పద్మావతి అమ్మవారి ప్రధాన ఆలయానికి ముందు భాగంలో చుట్టూ ఇనుప కటాంజనంతో నాలుగు స్తంభాల మధ్యలో ఎత్తయిన రాతి వేదికతో విరాజిల్లుతున్న మండపమే ముఖమండపం. శ్రీపద్మావతి అమ్మవారికి ఈ మండపంలో ఆస్థానాలు, కొలువులు జరుగుతుంటాయి. 
అర్థమండపం
ముఖమండపం దాటి లోనికి వెళితే అక్కడ అర్థమండపం ఉన్నది. ఇది గర్భాలయానికి ప్రదక్షిణామండపం. ఈ అర్థమండపంలో గర్భాలయానికి ముందు భాగంలో దక్షిణవారకు ఉత్తరాభిముఖంగా ఉన్న రాతి అరలో సుదర్శన భగవానుని, విష్వక్సేనులవారి పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు విష్వక్సేనులవారు, గరుత్మంతులవారి శిలా విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. అలాగే ఉత్తరం వైపు దక్షిణాభిముఖంగా ఉన్న రాతి అరలో శ్రీభగవద్రామానుజులవారి శిలామూర్తితో పాటు, పంచలోహమూర్తి విగ్రహం కూడ ప్రతిష్టింపబడివున్నాయి. 
అంతరాళం
అర్థమండపం దాటి లోనికి వెళితే వుండే మండపమే అంతరాళం. ఈ అంతరాళంలో ప్రవేశించే ద్వారాన్ని ఇరువైపులా ఉండే అమ్మవారి సేవికలు వనమాలిని, బలాకిని కాపలా కాస్తుంటారు. ఈ అంతరాళంలో శ్రీపద్మావతి అమ్మవారి పంచలోహ ఉత్సవమూర్తితో పాటు శ్రీపద్మావతి శ్రీనివాసుల భోగమూర్తుల విగ్రహాలు కూడా చోటుచేసుకున్నాయి. 
గర్భాలయం
అంతరాళం దాటిన తర్వాత గర్భాలయం మధ్యలో పద్మపీఠంపై కూర్చున్న భంగిమలో శ్రీపద్మావతి అమ్మవారి శిలామూర్తి ప్రతిష్టింపబడింది. చతుర్భుజి అయిన అమ్మవారికి పై రెండు చేతుల్లో పద్మాలు వున్నాయి. క్రింది కుడి, ఎడమ చేతులు పరుసగా అభయ వరదముద్రలు కలిగి దర్శనమిస్తున్నది. అలిమేలుమంగ అని పిలువబడుతున్న పద్మావతి అమ్మవారి మూలమూర్తికి ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన అనే కుంకుమార్చన, నివేదన నిర్వహిస్తారు. అలాగే ప్రతి సోమవారం అష్టదళ పాదపద్మారాధన, ప్రతి గురువారం తిరుపావడసేవ, ప్రతి శుక్రవారం అభిషేకం, ప్రతి శనివారం పుష్పాంజలి సేవలను అమ్మవారి మూలమూర్తికి నిర్వహిస్తారు. 
శాంతినిలయ విమానం
శ్రీపద్మావతి అమ్మవారి గర్భాలయంపైన శాంతినిలయ విమానం అనే పేరుతో బంగారు కవచంతో ఏక కలశ గోపురం నిర్మింపబడింది. ఈ శాంతి నిలయం మీద విమాన పద్మావతి తిరుమల కొండ వైపు చూస్తున్నట్లుగా దర్శనమిస్తూ శ్రీనివాసుని స్మరింపజేస్తుంది. శాంతినిలయ విమానం మీద వాయువ్యమూలలో విలసిల్లే విమానలక్ష్మిగా కూడా దర్శనమిస్తున్నది.
  Dept. of PRO- TTD.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.
హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన  మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలవబడుతున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. 
 
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి అష్టోత్తరం, లక్ష్మి సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబమ్రణ్యం,  అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా అంకురార్పణ : 
కాగా, సాయంత్రం 6.00 నుంచి 8.30 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా  జరిగింది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. 
డిసెంబరు 4న ధ్వజారోహణం : 
ఆలయంలో మంగళవారం ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, ఉదయం 8.30 నుండి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8.00 నుంచి 11.00 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

LAKSHA KUMKUMARCHANA OBSERVED

As a part of the Annual Brahmotsavams at Sri Padmavati Ammavari Temple in Tiruchanoor, Laksha Kukumarchana was performed in a grand manner on Monday.   

 

Kumkuma or the vermilion has a most significant place in Hindu religion and Kumkuma implies Stree Shakti as it symbolically represented as the combination of Lakshmi, Saraswati and Parvathi.

 

Conduction of Laksha Kukumarchans as a prelude to Brahmotsavam is an age old practice at the Sri Padmavati Ammavari temple. 

 

Archakas performed the prestigious and sacred ritual at Sri Krishna Mukha mandapam inside the temple between 8am and 12 noon and hundreds of women devotees took part in the fete. 

 

They recited Lakshmi Astottaram, Lakshmi Sahasranamam on this celestial occasion.

 

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, other archakas, officials and devotees participated in the event.

  Dept. of PRO- TTD.

GRAND ANKURARPANAM

 Ankurarpanam was performed in the evening between 6pm to 8pm for the Brahmotsavams.

 

Archakas conducted Punyahavachana, Chakra bandhanam and Senadhipati procession in the four mada streets of the Temple following the ritual.

 

TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam and others took part.

DHWAJAROHANAM ON DECEMBER 4

 

The annual brahmotsavams in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor will flag off with Dhwajarohanam on Tuesday.

 

Dwajasthambham thirumanjanam for the Brahmotsavam will be performed between 7.00 AM and 8 .00 AM while Dwajarohanam will commence  at 8.30 in the Vrischika lagnam heralding the commencement of the Navahnika Karthika Brahmotsvams.Goddess will give darshan to devotees on the  Chinna Sesha vahanam in the night on Tuesday between 8.00PM and 11.00 PM in the mada streets surrounding the temple.

డిసెంబరు 4న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక వనభోజనాలకు ఏర్పాట్లు పూర్తి 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కార్తీకవనభోజనాలకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అవసరమైన చల్లువ పందిళ్లు, విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేసింది. అదేవిధంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  
ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా ఆలయం నుండి శ్రీవారి మెట్టు మార్గంలోని పార్యేట మండసానికి చేరుకుంటారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు పార్వేట మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఆనంతరం ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  
అనంతరం టిటిడి ఏర్పాటు చేసిన వనభోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డిస్తారు.  
అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పార్వేట మండపం నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు.    

SRINIVASA MANGAPURAM GEARS UP FOR  KARTHIKA VANABHOJANAM

 

TTD has made all arrangemets to conduct the holy event of Karthika Vana Bhojanam at Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on December  4

 

The Paruveta Mandalam is decked up with Shamianas, electrical and floral decorations  besides queue lines etc for benefit of the devotees

 

Special devotional and bhakti programs are also scheduled for the occasion.

 

As part of the event,  the procession of Lord with His consorts Sridevi and Bhudevi will commence from temple at  8.00 AM and reach  the Paruveta mandapam near Srivari mettu  by  9.30  AM where Tirumanjanam will be performed for the utsava idols.

 

This will be followed by Asthanam from 10.00 AM onwrds. The devotees will be served delicious and tasty food as a part of vana bhojanam after the cultural programs.

 

The utsava dieties will return to temple between 2.00pm and 4.00 PM in a grand procession.

 

Senior TTD officials and devotees will participate in large number in this sacred annual event.

 

  Dept. of PRO- TTD. 

కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయానికి పోటెత్తుతున్న భక్తులు
కార్తీక మాసంలో తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం శివ కేశవులకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కపిలేశ్వర స్వామివారిని ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో అర్చించినట్లయితే శివస్థానాన్ని పొందుతారని పురాణ ప్రశస్తి. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే కార్తీక మాసంలో పుణ్యస్నానం,  పుణ్యయోగుల దర్శనం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుంది. 
ఇలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం విశేష సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు  దీపారాధన చేసి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారిని దర్శించుకుంటున్నారు. 
ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశేషపూజ మరియు హోమ మహోత్సవాలు చేపట్టారు. నవంబరు 8వ తేదీన గణపతి హోమంతో ఈ హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, నవగ్రహ హోమం, శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం, శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం)నిర్వహించారు. 
ప్రస్తుతం డిసెంబరు 5వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం) జరుగుతోంది. ఇందులో పాల్గొన్న భక్తులకు విద్యాప్రాప్తి, వివాహం, ఉద్యోగం, సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు వెల్లడించారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం డిసెంబరు 6వ తేదీ శ్రీ కాలభైరవస్వామివారి హోమం, డిసెంబరు 7న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనున్నాయి. 

SEA OF HUMANITY AT SRI KT

Huge turn out of devotees is being witnessed to the TTD sub Temple of Sri Kapileswara Swamy in the auspicious month of Karthika.

 

Especially, the Mondays which are often considered to be unique for Lord Shiva, that too in the month of Karthika, are being flooded by devotees.

 

Apart from all these special features, the temple authorities have also been observing month long Karthika Masa Visesha Mahotsavams which commenced on November 8 and will conclude on December 5.

 
  Dept. of PRO- TTD.
సప్తగిరి మాసపత్రికను పాఠకులకు సకాలంలో అందించాలి :  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌
ధర్మప్రచారంలో భాగంగా ఆరు భాషల్లో ముద్రిస్తున్న సప్తగిరి మాసపత్రికకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని, పాఠకులకు సకాలంలో చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సప్తగిరి మాసపత్రికను మరింత మంది పాఠకులకు చేర్చాలని సూచించారు. చందాదారుల వివరాలను డిసెంబరు చివరినాటికి సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద పార్కింగ్‌, కల్యాణవేదిక, ఆలయ పరిసరాల్లో పచ్చదనం పెంపు ఇతర ఇంజినీరింగ్‌ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి యాత్రికుల వసతి సముదాయాన్ని రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 
శ్రీవారి ఆలయంలో ప్రసాదం స్వీకరించే ప్రాంతంలో భక్తుల కోసం షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందే భక్తుల సౌలభ్యం మేరకు ఎప్పటికప్పుడు కోర్‌ కమిటీ ప్రణాళికలు రూపొందించాలని ఈవో ఆదేశించారు. టిటిడి ఆస్తుల వివరాలను కంప్యూటరీకరించాలన్నారు. తిరుమలలో భక్తులకు ఉపయోగం కాని సూచికబోర్డులను తొలగించాలన్నారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో ఒక్కో ఫ్లోర్‌ను దశలవారీగా అభివృద్ధి చేయాలని సూచించారు. 2019 డైరీలు, క్యాలెండర్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కాలినడక భక్తుల సౌలభ్యం కోసం మోకాళ్లమిట్ట నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎఫ్‌ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
డిసెంబర్‌ 7న ముగియనున్న  టిటిడి విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాల పంపిణీ
తిరుమల శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ గడువు డిసెంబర్‌ 7వ తేదితో  ముగియనుందని టిటిడి ఒక ప్రకటనలో తెల్పింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఉద్యోగుల పాత క్యాంటీిన్‌లో పంపిణీ చేయనున్నారు. పింఛన్‌దార్లకు పెద్ద లడ్డూలు, వడలు అందజేస్తారు. 
డిసెంబర్‌ 7వ తేదితో పంపిణీ గడువు ముగియనుండడంతో విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.

Dept. of PRO- TTD.

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో  వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
టిటిడి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలలో భాగంగా డిసెంబరు 4వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహిస్తారు. 
అనంతరం ఉదయం 11.30 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.00 గంటలకు వీధిఉత్సవం జరగనుంది. రాత్రి 9.00 గంటలకు పూర్ణాహుతిలో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
  Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

 

——