[google-translator]

Today’s Devotional E-Paper – 04-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

04/11/2018 ,ఆదివారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.12AM

సూర్యాస్తమయం : 5.42PM

తిథి ద్వాదశి 12.52AM

నక్షత్రం  ఉత్తర 9.56PM

యోగం వైదృతి 1.48AM

కరణం కౌలవ 1.50PM
           తైతుల 12.52AM

అమృతఘడియలు : 3.06PM-4.37PM

వర్జ్యం 7.31AM
         5.59AM

దుర్ముహూర్తం
4.10PM-4.56PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

04/11/2018 , Sunday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.12AM

SunSet :

5.42PM

Tithi :

Dwadasi 12.52AM

Nakshatram :

Uttara 9.56PM

Yogam :

Vaidruthi 1.48AM

Karanam :

Koulava 1.50PM
Taitula 12.52AM

AmruthaGadiyalu :

3.06PM-4.37PM

Varjyam :

7.31AM
5.59AM

Durmuhurtham 4.10PM-4.56PM

 

 

 

04/11/2018 , Sunday

 

 

02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs

Thomala Seva (Ekantam)

 

 

04:00 – 04:15 hrs

Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

 

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

 

 

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 

 

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

 

07:30 – 19:00 hrs
Sarvadarshanam

 

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

 

00:45 hrs
Ekanta Seva

 

FEBRUARY QUOTA OF Rs.300 TICKETS TO BE RELEASED ON NOV 6

The online quota of Rs.300 tickets for the month of February will be released on November 6 by TTD.

 

The pilgrims can book these tickets in e-Darshan counters, Post Offices and in on-line also.

 Dept. of PRO- TTD.

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.  
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. 
ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. తిరుమంజనంలో స్వామి అమ్మవార్లకు తులసి, వృచ్చి, ప్రత్యేక రోజాలు, వివిధ సాంప్రదాయ పుష్ప మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. 
 కాగా, సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.  
గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీధనంజయులు, ఏఈవో శ్రీలక్ష్మయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

PAVITROTSAVAMS OFF TO A RELIGIOUS START IN SKVST

The annual Pavitrotsavams off to a colourful start in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Saturday.

 

The celestial bath, snapana tirumanjanam fete took place in the temple between 10am and 11.30am in Yagashala. 

 

Later in the evening, the Pavitra garlands (Specially made thread garlands) were brought to Yagashala and Pavitra Pratistha performed between 7pm and 8.30pm.

 

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Ramanaiah, Temple Inspector Sri Anil Kumar and others took part in this fete.

తిరుమలలో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధానికి వ్యాపారులు సహకరించాలి : 
టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
తిరుపతి తరహాలో తిరుమలలోనూ ప్లాస్టిక్‌ కవర్ల నిషేధానికి వ్యాపారులు సహకరించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కోరారు. తిరుపతిలోని రవాణా విభాగంలో శనివారం జరిగిన ఆయుధపూజ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జెఈవో సమాధానమిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తే ఇతర ప్రాంతాలవారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. తిరుమలలో లడ్డూ కవర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయన్నారు. ప్రత్యామ్నాయం దొరికే వరకు లడ్డూ కవర్లను కొనసాగిస్తామని, ఆ తరువాత మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆలయం లోపల ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించడం లేదన్నారు. తిరుమల వ్యాపారులు ఈ నెల 10వ తేదీ వరకు సమయం కోరారని, ఆ తరువాత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించరాదని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ విషయంలో సహకరించాలని కోరారు.

MANAGUDI FETE FROM NOV 20 TO 23-TIRUPATI JEO

The religious event Karthika Pournami Managudi will be observed in twin Telugu states from November 20 to 23 in a big way, said Tirupati JEO Sri P Bhaskar.

 

The preparation of Akshata (holy rice) for the mega religious event commenced on Saturday in SVETA building in Tirupati. Speaking on this occasion, the JEO said, Managudi is a programme aimed at bringing back the past glory to the neglected ancient temples and also to bring awareness among the youth about the importance of the temples, puja vidhi and other dharmic activities”, he said. 

 

Elaborating further, he said, this mass religious event was introduced in TTD about six years ago in 2012 along with AP Endowments department. This fete is observed twice in a year during Sravana Pournami and Karthika Pournami across AP and Telengana. This year this fete will be observed in the auspicious month of Karthika from November 20 to 23. On the first day, Mangala Kaisika Dwadasi will be observed in five selected centres in each district of two Telugu states. Mala Dasari community is the one who took the divine task of propagating the importance of temples and worship in rural areas since ages through devotional sankeertans”, he added. 

 

The JEO said, on November 21, Aalaya Sobha will be observed where in the selected temples in each district will be cleansed involving local devotees and Karthika Deepotsavam and Managudi will be observed on November 22 and 23 respectively, he maintained.

 

Earlier JEO Released wall poster for Managudi programme. Meanwhile Srivari Seva volunteers, Hindu Dharma Prachara Parishad staffs prepared the holy akshatas. HDPP Chief Sri Ramana Prasad and others were also present.

 Dept. of PRO- TTD.
టిటిడి రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
తిరుపతిలోని టిటిడి రవాణా విభాగంలో శనివారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ టిటిడిలోని అత్యంత ప్రతిభావంతమైన విభాగాల్లో రవాణా ఒకటన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిత్యం వందలాది వాహనాలను నడుపుతున్న ఈ విభాగానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. జిఎం, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు ఇతర సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ దసరా, దీపావళి పర్వదినాల మధ్యలో టిటిడిలో ముఖ్యమైన రవాణా విభాగంలో ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆయా విభాగాలు భక్తులకు మెరుగైన సేవలు అందించడం వెనక రవాణా విభాగం పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా రవాణా విభాగం అధికారులకు, సిబ్బందికి  శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకుముందు రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో జెఈవోలు శ్రీవారి విగ్రహానికి, సంచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వివిధ టిటిడి వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు.
కాగా, 1948వ సంవత్సరంలో రెండు వాహనాలతో టిటిడి రవాణా విభాగం ప్రారంభమైంది. అంచెలంచలుగా ఎదిగి 1975లో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసికి టిటిడి బస్సులను అప్పగించారు. ప్రస్తుతం దాదాపు 300 వాహనాలు గల ఈ శాఖ ఇటు తిరుమల, అటు తిరుపతిలో శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు విశేషసేవలు అందిస్తూ స్వామివారి భక్తి వైభవవ్యాప్తికి కృషి చేస్తోంది. తిరుమలలో 12 ధర్మరథాలు రోజుకు 300 ట్రిప్పలతో దాదాపు 60 వేల మంది భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేస్తున్నాయి. తిరుపతిలోనడక దారి భక్తులకు 3 ధర్మరథాలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం వరకు విశేష సేవలందిస్తున్నాయి. 12 అంబులెన్స్‌లు, రెండు ఘాట్‌ రోడ్లలో ఆటోక్లినిక్‌ వాహనాలు, క్రేన్‌లు తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నాయి. తిరుమలలో బ్యాటరీ కార్లు వృద్ధులకు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి న్యాయాధికారి శ్రీ రమణనాయుడు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, రవాణా విభాగం ఏఈవో శ్రీ కృష్ణమూర్తిరెడ్డి, ఏఎమ్‌ఎఫ్‌ శ్రీమతి లక్ష్మీప్రసూన, డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు శ్రీరమేష్‌, శ్రీ మోహన్‌, డ్రైవర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

AYUDHA PUJA OBSERVED IN TIRUPATI TRANSPORT

Ayudha Puja was obseved in the TTD Transport wing in Tirupati on Saturday.

 

Tirumala JEO Sri K S Sreenivasa Raju and Tirupati JEO Sri P Bhaskar who took part in the puja, have said, the incident free travel in ghat roads speaks volumes about the capacity and calibre of the work force of TTD Transport wing. “Almost every day there will be some sort of minor accidents taking place in ghat roads by private vehicles but so far not a single incident has been reported with TTD vehicles. This clearly proves the ability and responsible attitude of TTD drivers. I compliment General Manager, TTD Transport Wing, Sri Sesha Reddy and his team for this achievement”, they added.

 Dept. of PRO- TTD.

తిరుమలలో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధానికి వ్యాపారులు సహకరించాలి : 
టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
తిరుపతి తరహాలో తిరుమలలోనూ ప్లాస్టిక్‌ కవర్ల నిషేధానికి వ్యాపారులు సహకరించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కోరారు.
తిరుపతిలోని రవాణా విభాగంలో శనివారం జరిగిన ఆయుధపూజ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జెఈవో సమాధానమిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తే ఇతర ప్రాంతాలవారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. తిరుమలలో లడ్డూ కవర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయన్నారు.
ప్రత్యామ్నాయం దొరికే వరకు లడ్డూ కవర్లను కొనసాగిస్తామని, ఆ తరువాత మారుస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆలయం లోపల ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించడం లేదన్నారు. తిరుమల వ్యాపారులు ఈ నెల 10వ తేదీ వరకు సమయం కోరారని, ఆ తరువాత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించరాదని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ విషయంలో సహకరించాలని కోరారు.

PLASTIC BAN FOR HEALTHY LIVING-TIRUMALA JEO

To keep the environs healthy for future generations, TTD has decided to observe plastic ban after November 10, said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.

 

Speaking to media persons in Tirupati on Saturday at TTD Transport office, he said, over the request of shop owners this ban date has been extended from November 1. Once we get the approval from Executive officer Sri Anil Kumar Singhal we will implement in Tirumala.

 

In Tirupati, from October 2, they have been successfully and strictly implementing the plastic ban to

make Tirupati city healthy. Similar way, we want to implement the same in Tirumala. Because of its global reputation, if the ban is implemented in hill town, the message will have a wider reach and will have more impact on pilgrims. Once the ban is implemented in Tirumala, we will appeal to the pilgrims to follow the ban, he maintained.

Dept. of PRO- TTD.

నవంబరు 4న రవనప్పగారిపల్లెలో 
టిటిడి ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరము
భారత ప్రభుత్వం ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలోని టిటిడి ఎస్‌.వి. ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రి అధ్వర్యంలో నవంబరు 5వ తేదీ ”జాతీయ ఆయుర్వేద దినోత్సవం”ను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ధన్వతరి జయంతి రోజున జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపడం జరుగుతుంది.
ఈ సందర్భంగా నవంబరు 4వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా దామలచెరువు మండలం రవనప్పగారి పల్లెలోని వశిష్టాశ్రమము పాఠశాలలో టిటిడి ఎస్‌.వి. ఆయుర్వేద కళాశాల అధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరము నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు అన్ని రకాల వ్యాధులకు వైద్యపరిక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తారు. అనంతరం దైనందిన జీవనంలో ఆచరించవలసిన ఆరోగ్య సూత్రాలు, గృహవైద్యము, పరిసరాలలో లభించు ఆయుర్వేద మొక్కలు – వాటి ప్రాముఖ్యత, ఆహర నియమాలు వంటి వాటిపై ” ప్రజా ఆరోగ్య పరిరక్షణ” పేరిట అవగాహన సదస్సు నిర్వహిస్తారు. 
కాగా నవంబరు 5వ తేదీ సోమవారం ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలోని  ఎస్‌.వి. ఆయుర్వేద కళాశాలలోని ధన్వంతరి మంటపంలో అభిషేకం, పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

 Dept. of PRO- TTD.

BOARD MEMBER DONATES Rs.5LAKHS 

TTD Trust Board member Sri Meda Ramakrishna Reddy has donated Rs.5lakhs to SV Annaprasadam Trust of TTD on Saturday.

 

He has handed over the DD for the same to temple DyEO Sri Harindranath in Srivari temple at Tirumala.

 

DHANWANTARI JAYANTHI ON NOV 5

 

Following the call given by Ministry of AYUSH, Government of India, National Ayurveda Day and Dhanwantari Jayanthi will be observed by TTD Ayurvedic Hospital and College on November 5.

 

Free Ayurvedic medical and awareness camps will be conducted in rural areas to enlighten the rural masses on Ayurvedic medication by TTD on the eve of National Ayurveda Day on November 4 in Ramayyagari village in Damalacheruvu mandal in Chittoor district. The Vasisthashram is hosting the programme for the villagers.

 

Five types of specified areas of Ayurvedic medication will be conducted on free consultation which includes Panchakarma, Salyal (eye related), Balaroga(child diseases), Prasuti Streeroga (gynaeic), Kayachikitsa (of body). Apart from this awareness lectures on home medicines, Ayurvedic health principles, locally grown medicinal plants, diet are also will be given. 

 

On November 5, Dhanwantari Jayanthi-the Birth Anniversary of God of Ayurvedic Medicine will also be observed in SV Ayurvedic college in Tirupati.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——