[google-translator]

Today’s Devotional E-Paper -04-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

04/01/2019 , శుక్రవారం

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

మాసం : మార్గశిరం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.42AM

సూర్యాస్తమయం: 5.55PM

తిథిచతుర్దశి4.46AM

నక్షత్రంజ్యేష్ఠ1.37PM

యోగంవృద్ధి2.42AM

కరణంభద్ర4.21PM
           శకుని4.46AM

అమృతఘడియలు :4.25AM-6.05AM

వర్జ్యం :10.07PM-11.50PM

దుర్ముహూర్తం
8.57AM-9.41AM
12.41PM-1.26PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

04/01/2019 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Margasiram

Paksham :

Bahula

SunRise :

6.42AM

SunSet :

5.55PM

Tithi :

Charturdasi 4.46AM

Nakshatram :

Jyeshta 1.37PM

Yogam :

Vruddhi 2.42AM

Karanam :

Bhadra 4.21PM
Sakuni 4.46AM

AmruthaGadiyalu :

4.25AM-6.05AM

Varjyam :

10.07PM-11.50PM

Durmuhurtham 8.57AM-9.41AM
12.41PM-1.26PM

 

*Darshan Details of Lord Balaji* 
Dept of PRO TTD

.

 

04/01/2019 , Friday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam

 

04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam

 

06:00 – 07:00 hrs
Samarpana

07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)

 

09:00 – 20:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.

 

20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

21:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవం జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా వెళతారు. అక్కడ వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

 

Dept of PRO TTD

 

 ANDAL NEERATOTSAVAM

The festival of Andal Sri Godai Neeratotsavam will be observed in Sri Govinda Raja Swamy temple from January 7 to 13 in Tirupati.

Everyday the goddess will be taken to Sri Ramachandra Pushkarini on a celestial procession during this period and abhishekam with lukewarm water is performed.

Later in the evening, Andal returns to Sri Govinda Raja Swamy temple.

During the holy month of Dhanurmasa, this fete is observed to mark the penance performed by Andal to appease Lord Sri Ranghanatha (Venkateswara).

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన ‘గో మహోత్సవం’

 

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం మూడో రోజైన కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

 

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం.

 

కనుమ పండుగ సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది. 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు. 8.00 గంటల నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన మరియు కోలాటాలు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో సంకీర్త‌న కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. ఉద‌యం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు. 11.45 గంటల నుండి 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

 

గో మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

GO MAHOTSAVAM IN SV DAIRY FARM ON JAN 16

The Go Mahotsavam will be observed in a grand manner in Sri Venkateswara Goshala in Tirupati on January 16 following Kanuma festival by TTD.

According to Hindu dharma, Gopuja has a significant place as it is considered to be embodiment of all deities of Hinduism.

The special festivities will commence by 6am on January 16 in Goshala followed by Gopuja in the Dariy farm premises.

Local devotees take part in huge numbers in this fete.

 

జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం సంక్రాంతి కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.

గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, స‌హ‌స్ర క‌ళాశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

 

GODA PARINAYAM AND PARUVETA UTSAVAM IN TIRUMALA ON JAN 16

The Paruveta Utsavam will be observed in Tirumala on the day of Kanuma on January 16.

Earlier in the morning following Goda Parinayam, a procession will be organised for floral garlands of Andal Sri Godai from Pedda Jiyar Mutt in four mada streets and later will be offered to the presiding deity of Lord Venkateswara in Tirumala temple.

Later in the afternoon, Paruveta Utsvam will be observed from 1pm onwards, wherein Sri Malayappa Swamy along with Sri Krishna Swamy reaches Paruveta Mandapam and Asthanam, mock hunt fete are performed.

TTD has cancelled all arjitha sevas following this fete on January 16 in Tirumala temple.

 

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ. 6.52 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ. 6.52 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 3500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 2,300 కిలోలు, కిలో రూ. 18,331/-గా ఉన్న బి క్యాట‌గిరి – 1700 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

రెండో రకం తలనీలాలో కిలో రూ.17,009/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 4,100 కిలోలను వేలానికి ఉంచగా 2700 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.459.29 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా బి క్యాట‌గిరి – 7,400 కిలోలు వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.17.06 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

మూడో రకం తలనీలాలో కిలో రూ.6,020/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 2,800 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.168.58 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,553/-గా ఉన్న బి క్యాట‌గిరి – 9,800 కిలోలు వేలానికి ఉంచగా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.4.55 ల‌క్ష‌ల‌ ఆదాయం సమకూరింది.

కిలో రూ.1,800/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 2,100 కిలోలను వేలానికి ఉంచ‌గా 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.1.80 ల‌క్ష‌ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.36/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 1,23,000 కిలోలను వేలానికి ఉంచ‌గా 1000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.0.36 ల‌క్ష‌ల ఆదాయం సమకూరింది.

Dept of PRO TTD

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

 

——