[google-translator]

Today’s Devotional E-Paper – 03-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

03/11/2018 , శనివారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.12AM

సూర్యాస్తమయం : 5.42PM

తిథి : ఏకాదశి 2.47AM

నక్షత్రం : పుబ్బ 11.11PM

యోగం : బ్రహ్మం 7.24AM

కరణం
: ఐన్ద్రం 4.31AM
బవ 3.51PM
బాల 2.47AM

అమృతఘడియలు :5.10PM-6.40PM

వర్జ్యం : 8.08AM-9.39AM

రాహుకాలం :
09.00 AM to 10.30 AM

యమగండం :
01.30 PM to 03.00 PM

దుర్ముహూర్తం
6.12AM-7.44AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

03/11/2018 , Saturday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.12AM

SunSet :

5.42PM

Tithi :

Ekadasi 2.47AM

Nakshatram :

Pubba 11.11PM

Yogam :

Brahmam 7.24AM

Karanam :

Aindram 4.31AM
Bava 3.51PM
Bala 2.47AM

AmruthaGadiyalu :

5.10PM-6.40PM

Varjyam :

8.08AM-9.39AM

Rahukalam :9.00 AM to 10.30 AM

Yamagandam : 1.30 PM to 03.00 PM

6.00AM

Durmuhurtham 6.12AM-7.44AM

* Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 02-11-2018: 56,894.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 03-11-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 01.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 04 HOURS. 
TONSURES: 23,262, 
PARAKAMANI: RS.2.37 CRORES. 
Dept of PRO TTD

 

 

 

 

 

03/11/2018 , Saturday

 

 

02:30-03:00 hrs
Suprabhatam

 

 

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 

 

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

 

 

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

 

 

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

 

 

07:30 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

 

20:00 – 00:30 hrs
Sarvadarshanam

 

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

 

00:45 hrs
Ekanta Seva

 

శ్రీనివాసమంగాపురంలోని 
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాభివృద్ధికి కృషి : టిటిడి ఈవో 
విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం గల శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతోందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఈ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారత పురావస్తు శాఖవారి అనుమతి వచ్చాక ఆలయంలో నూతనంగా పోటు, ఉగ్రాణం, వాహన మండపం, యాగశాల, కల్యాణమండపం విస్తరణ, డార్మెటరీ హాలు, నూతన కార్యాలయ భవనం తదితర అభివృద్ధి పనులను రూ.5 కోట్లతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, తిరుమలకు వెళ్లలేని భక్తుల కోసం శ్రీవారు ఇక్కడ అర్చావతారమూర్తిగా దర్శనమిస్తున్నారు. తిరుపతి నుండి దాదాపు 12 కి.మీ దూరంలో గల ఈ ఆలయానికి ఆర్‌టిసి బస్సు సౌకర్యం ఉంది. యువతీ, యువకులు ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని కంకణం ధరిస్తే దోషాలు తొలగి వివాహ శుభఘడియలు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని రోజుకు దాదాపు 3 వేల మంది, శనివారం 8 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నెలకు సుమారు రూ.30 లక్షల హుండీ ఆదాయం లభిస్తోంది. ఆర్జిత సేవల నిర్వహణ ద్వారా నెలకు సుమారు రూ.20 లక్షలు లభిస్తోంది. రూ.3.90 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, రూ.47 లక్షలతో ఆలయ పుష్కరిణి విస్తరణ తదితర అన్ని అభివృద్ధి పనులను రూ.7 కోట్లతో పూర్తి చేశారు.  ప్రతి ఏడాదీ రూ.88 లక్షల వ్యయంతో ఆలయంలో చలువపందిళ్లు, తాత్కాలిక షెడ్లు, పర్వదినాల సమయంలో క్యూలైన్ల ఏర్పాటు తదితర పనులు చేపడుతున్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టిటిడి భక్తుల నుండి సలహాలు, సూచనలు కోరుతోంది.

SRINIVASA MANGAPURAM TEMPLE EMERGING AS MOST SOUGHT AFTER LORD AFTER TIRUMALA

 

Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram, about 15km, from Tirupati, is emerging fast as most sought after deity after Tirumala.

 

The daily footfall to this temple is 3000 while Saturdays the number is aggregated at 5000. While the hundi collections is standing at Rs.30 lakhs per month taking the annual revenue figures to 3.5cores in this temple which is under the control of Archaeological Survey of India(ASI).

 

Already Rs.7cr has been spent towards the expansion of pushkarini, protective wall and other development works by TTD. Permission is now awaited from ASI to construct Potu, Ugranam, Vahana Mandapam, Yagashala, Dormitory Hall, Office Building etc. at Rs.5crores.

 

The important significance of this temple is that the unmarried who perform Kalyanotsavam in this temple will soon be blessed in marital bond with the benign blessings of Sri Kalyana Venkateswara Swamy.

 Dept. of PRO- TTD.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 
ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో నవంబరు 7వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఇ.సి.శ్రీధర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
నవంబర్‌ 7న దీపావళి ఆస్థానం, సహస్ర కలశాభిషేకం
శ్రీకోదండరామాలయంలో నవంబర్‌ 7వ తేదీ అమావాస్య, దీపావళి సందర్భంగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు. అమావాస్య సందర్భంగా ఉదయం 6.00 నుండి 9.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా జరగనుంది.  రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
దీపావళి సందర్భంగా నవంబర్‌ 7వ తేదీ రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది. 

 

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన శ్రీ పి. మురళీకృష్ణ ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజమండపం వద్ద టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజుకు అందజేశారు. 

Rs.10 LAKHS DONATED TO SVAT

 A Bengaluru based philanthropist Sri Murali Krishna has donated Rs.10 lakhs to Sri Venkateswara Anna Prasadam Trust.

 

He handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju on Friday in the Srivari temple.

 Dept. of PRO- TTD.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించనున్నారు. 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన నవంబరు 3వ తేదీ శనివారం ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు నవంబరు 4వ తేదీన ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు నవంబరు 5వ తేదీ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. 
గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.
ఈ సందర్భంగా ప్రతిరోజూ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీధనంజయులు, ఏఈవో శ్రీలక్ష్మయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

 Dept. of PRO- TTD. 

TELECAST VISHNU SAHASRA NAMAM IN SVBC IN EVENINGS ALSO

While appreciating the devotional programmes that are being relayed by Sri Venkateswara Bhakti Channel of TTD, a pilgrim sought TTD EO Sri Anil Kumar Singhal to telecast Vishnu Shasra Namam during evening times also.

 

The monthly Dial your EO programme took place at Annamaiah Bhavan in Tirumala on Friday where in as many as 25 pilgrim callers had given some suggestions and brought some issues to the notice of TTD EO. Reacting to the suggestion of pilgrim caller Sri Ramaiah from Bengaluru, the EO said, it is a pleasure to see that the SVBC programmes are reaching global pilgrims. At present we are relaying Vishnu Sahasra Namam in the morning slot onlywe have to give priority to other religious programmes, he added.

 

Sri Ramachandra Reddy from Kadapa, Sri Ramu from Eluru, have sought EO to ensure Seva tickets in online to which EO replied, for more transparency we have now introduced only one registration on one mail ID and one mobile number from this month onwards. We will examine this for a few months and based on the feedback we will make further pilgrim friendly amendments, he said.

 

A pilgrim caller Sri Srinivas from Greenfield said, whether it is possible to book for 100 members in online for the month of March 2019. Answering the caller, EO said, on December 2 the Rs.300 tickets quota will be released online and they can comfortably book for all.

 

Responding to a caller Sri Rama Sharma from Bengaluru, the EO said, it is not feasible for TTD to arrange a shopping mall to sell the photos of deities and other spiritual objects. He also the rates on the objects that are being sold by the shopping malls in Tirumala could not be fixed by TTD.

 

 

Another caller Sri Mohan Raju from Piler suggested EO to arrange escalator inside Garbhalaya to avoid jostling and enhance lighting as the presiding deity is not visible to many in Maha Laghu darshanam to which EO replied it is not possible in religious angle as per the tenets of Agama shastras.

 

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CE Sri Chandrasekhar Reddy, CVSO (FAC) Sri Sivakumar Reddy and other senior officers were also present.

 

 Dept. of PRO- TTD.

V-DAY ARRANGEMENTS COMMENCE BY NOVEMBER 25-TTD EO

The arrangements for the big religious event, Vaikunta Ekadasi and Dwadasi scheduled on Decemebr 18 and 19 will commence from Novemeber 25 onwards, said TTD EO Sri Anil Kumar Singhal.

 

After Dial you EO programme, addressing media persons at Annamaiah Bhavan in Tirumala, the EO said, this year micro level planning has been made for Vaikuntha Ekadasi and the temporary sheds will be laid in four mada streets to manage the pilgrims in an orderly manner with defined entry and exit gates. The engineering works will commence from 25th of this month and JEO Tirumala Sri KS Sreenivasa Raju will be continuously monitoring the arrangements, he added.

 

He said, the special darshan for 4000 numbers of aged and physically challenged persons will be allotted on November 20 and 27 while parents with infants below the age of 5years on November 21 and 28 since the season is a slag period.

 

The EO said, Karthika Pournami Managudi will be observed across the twin Telugu states from November 20 to 23. While the annual Karthika Brahmotsavams in Sri Padmavathi Ammavari temple will be observed from December 4 to 12. The arrangements for both the events are taking place under the supervision of Tirupati JEO Sri P Bhaskar, he added.

 

He said, to increase the visit of pilgrims to sub temple, the overall development of each temple has been handed over to one senior officer. Now, in Sri Govinda Raja Swamy temple in Tirupati, we did inspection recently to sort out the long pending parking problem. Similarly, Rs.5crores worth developmental works will be taken up in Srinivasa Mangapuram temple and we are awaiting permission from Arcahelogical department, he maintained.

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు :  శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసిన టిటిడి అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, హర్యానా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసి లక్షలాది మంది భక్తులను ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు :  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో డిసెంబరు 4 నుండి 12వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో డిసెంబరు 4న ధ్వజారోహణం, డిసెంబరు 8న గజవాహనం, డిసెంబరు 9న గరుడవాహనం, డిసెంబరు 11న రథోత్సవం, డిసెంబరు 12న పంచమీతీర్థం జరుగనున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాం.
–  బ్రహ్మోత్సవాల వాహనసేవలతోపాటు, తిరుచానూరులోని ఆస్థానమండపం, మహతి ఆడిటోరియం, శిల్పారామంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం.
పోస్టల్‌ ద్వారా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ”ఆశీర్వచనం”  : తిరుమల శ్రీవారి ఆలయానికి తపాలా శాఖ ద్వారా విరాళాలు అందిస్తున్న దాతలకు అమలుచేస్తున్న ఆశీర్వచనం పథకాన్ని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూడా వర్తింపచేశాం.
– ఈ ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తపాలాశాఖ ద్వారా రూ.500/- పైబడి హుండీ కానుకలు పంపే దాతలకు రశీదుతో పాటు శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి చిత్రపటం, అక్షింతలు, అమ్మవారి కుంకుమను తపాలా శాఖ ద్వారా భక్తులకు అందిస్తున్నాం.
– అక్టోబరు 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అక్టోబరు 31వ తేదీ వరకు 250 మందికిపైగా అమ్మవారి ఆశీర్వచనాన్ని అందించాం.
ప్రత్యేక దర్శనాలు :  వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు నెలలో 2 రోజుల పాటు  కల్పించే ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని తిరిగి అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా  నవంబరు 20, 27వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, నవంబరు 21, 28వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు దర్శనం కల్పిస్తాం.
– ఈ అవకాశాన్ని వృద్ధులు, దివ్యాంగులు, 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : డిసెంబర్‌ 18న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడతాం. పటిష్టంగా క్యూలైన్లు, ఆలయ మాడ వీధుల్లో, ఆళ్వార్‌ ట్యాంక్‌ వద్ద, నారాయణగిరి ఉద్యానవనాలలో షెడ్లు ఏర్పాటుచేస్తాం.
నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు మనగుడి : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబరు 20 నుండి 23వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇందులో భాగంగా నవంబరు 20న మంగళ కైశిక ద్వాదశి, 21న ఆలయ శోభ, 22, 23వ తేదీల్లో ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం.
టిటిడి స్థానికాలయాల అభివృద్ధి : తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని స్థానికాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా టిటిడి సీనియర్‌ అధికారులకు ఆయా ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాం.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యముంది.
– ఈ ఆలయాన్ని రోజుకు దాదాపు 3 వేల మంది, శనివారం 8 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.
– తిరుపతి నుండి దాదాపు 12 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.
– తిరుపతి నుండి ఆర్‌టిసి బస్సు సౌకర్యం ఉంది.
– నెలకు సుమారు రూ.30 లక్షల హుండీ ఆదాయం లభిస్తోంది.
అభివృద్ధి పనులు  :  రూ.3.90 కోట్లతో ఆలయం చుట్టూ ప్రహరీ, రూ.47 లక్షలతో ఆలయ పుష్కరిణి విస్తరణ తదితర అన్ని అభివృద్ధి పనులను రూ.7 కోట్లతో చేపట్టాం.
– ప్రతి ఏడాదీ ఆలయంలో చలువపందిళ్లు, తాత్కాలిక షెడ్లు, పర్వదినాల సమయంలో క్యూలైన్ల ఏర్పాటు తదితర పనులకు రూ.88 లక్షలు ఖర్చు చేస్తున్నాం.
– భారత పురావస్తు శాఖ వారి అనుమతి వచ్చాక ఆలయంలో నూతనంగా పోటు, ఉగ్రాణం, వాహన మండపం, యాగశాల, కల్యాణమండపం విస్తరణ, డార్మెటరీ హాలు, నూతన కార్యాలయ భవనం తదితర అభివృద్ధి పనులను రూ.5 కోట్లతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భక్తుల నుండి సలహాలు, సూచనలు కోరుతున్నాం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు  :  తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద దక్షిణ మాడ వీధిలోని ఖాళీ స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాం.
దర్శనం : 
–  గతేడాది అక్టోబరులో 23.77 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది అక్టోబరులో 24 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 
హుండీ ఆదాయం : 
–  శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది అక్టోబరులో రూ.82.04 కోట్లు కాగా, ఈ ఏడాది అక్టోబరులో రూ.85.16 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం : 
–  గతేడాది అక్టోబరులో 55.19 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది అక్టోబరులో 57.51 లక్షల మంది భక్తులకు అందజేయడం జరిగింది. 
లడ్డూ లు : 
–  గతేడాది అక్టోబరులో 93.54 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది అక్టోబరులో 1.05 కోట్లు లడ్డూలను అందించాం.
తలనీలాలు : 
–  గతేడాది అక్టోబరులో 11.09 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది అక్టోబరులో 9.97 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
 Dept. of PRO- TTD.
మరింత పారదర్శకంగా ఆర్జిత సేవల బుకింగ్‌ విధానం : 
‘డయల్‌ యువర్‌ ఈవో’లో  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌
శ్రీవారి ఆర్జిత సేవల బుకింగ్‌ విధానాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఒక ఫోన్‌ నంబర్‌ లేదా ఒక ఈ-మెయిల్‌ ఐడితో ఒకరే నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు. 
 ఈ సందర్భంగా 2019, ఫిబ్రవరి నెల కోటాలో మొత్తం 67,146 టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,796 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,096, తోమాల 110, అర్చన 110, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 57,350 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4,050, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,425, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకారసేవ 16,200 టికెట్లు ఉన్నాయని వివరించారు.
1. రాము – ఏలూరు, రామచంద్రారెడ్డి – కడప
ప్రశ్న:   ఆన్‌లైన్‌ డిప్‌లో ప్రయత్నిస్తుంటే సేవా టికెట్లు లభించడంలేదు? 
ఈవో : నెలకు దాదాపు లక్ష మంది భక్తులు ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. సేవా టికెట్లు పరిమితంగా ఉండటంతో అందరికి లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రయత్నిస్తూ ఉండాలి. తిరుమలలోను ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా ఆర్జిత సేవలను కేటాయిస్తున్నాం. 
2. లలిత – తమిళనాడు.
ప్రశ్న: సర్వదర్శనంలో వృద్ధులు ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది ? 
ఈవో : వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్‌ ద్వారా సులువుగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.
3. కరుణాకర్‌ రెడ్డి  – కర్నూలు.
ప్రశ్న: నడకమార్గంలో మొదటి గోపురం సమీపాన తలఏరు గుండు వద్ద గ్రిల్స్‌ తొలగించండి? 
ఈవో : ఆ ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. 
4. శ్రీనివాస్‌  – విజయవాడ.
ప్రశ్న: వైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు ? 
ఈవో : భక్తులకు ముందుగా తెలియజేసి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. 
5. నాగరాజు  – శంకర్‌పల్లి, సంగారెడ్డి, శివసాయి – నెల్లూరు, శంకర్‌ – మిర్యాలగూడ
ప్రశ్న: కల్యాణోత్సనానికి దంపతులతో పాటు పిల్లలను, తల్లిదండ్రులను తీసుకురావచ్చా ? 
ఈవో : ఎక్కువ మంది భక్తుల సౌకర్యార్థం ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. కల్యాణోత్సవంలో సామూహికంగానే సంకల్పం చెప్పించేందుకు వీలుంది. 
6. రామోహ్మన్‌ శర్మ  – బెంగుళూరు.
ప్రశ్న: పౌర్ణమి గరుడసేవ రోజున మాడ వీధిలో నిలబడివుండగా సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు ?
ఈవో : సెక్యూరిటి సిబ్బందికి తగిన సూచనలు ఇస్తాం. భక్తులు గ్యాలరీల నుండి సౌకర్యవంతంగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. 
7. శివరామ్‌  – హైదరాబాద్‌.
ప్రశ్న: వృద్ధుల కోసం శ్రీవారి ఆలయం నుండి బస చేసిన గదుల వరకు బ్యాటరీ కార్లు పెట్టండి? 
ఈవో : రాంబగీచా వద్ద బ్యాటరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. 
8. సూర్యనారాయణ  – శ్రీకాకుళం.
ప్రశ్న: నూతన సంవత్సరానికి ఆన్‌లైన్‌లో దర్శనం, గదుల బుకింగ్‌ సౌకర్యం ఉందా ? 
ఈవో : పర్వదినాల సమయంలో పరిమితంగా ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు, గదులు అందుబాటులో  ఉంచుతాం.  
9. అనంతరామ్‌   – బెంగుళూరు, రామచంద్రప్ప – బెంగళూరు, మోహన్‌రాజ్‌  –  పీలేరు. 
ప్రశ్న: క్యూలైన్లలో భక్తుల తోపులాటను అరికట్టండి? స్వామివారు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయండి?. 
ఈవో : విజిలెన్స్‌ సిబ్బంది సాయంతో భక్తుల తోపులాటను తగ్గిస్తున్నాం. భక్తులు ఎవరికివారు సంయమనం పాటిస్తే ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆగమాల ప్రకారం లైటింగ్‌ పెంచడం సాధ్యం కాదు. నాద నీరాజనం వేదికపై జానపద సంగీతం ప్రదర్శనలు ఏర్పాటు చేసే విషయంపై చర్చిస్తాం.  
10. సుబ్రమణ్యం   – చెన్నై, రామయ్య   –  నెల్లూరు. 
ప్రశ్న: ఎస్వీబీసీలో షష్టిపూర్తి కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేయండి, విష్ణుసహస్రనామాన్ని సాయంత్రం కూడా ప్రసారం చేయండి?
ఈవో : ఎస్వీబీసీ బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. ధర్మోరక్షతి రక్షిత: స్టిక్కర్లను తిరిగి ముద్రిస్తాం. 
11. కిరణ్‌  -నెల్లూరు 
ప్రశ్న: లక్కీడిప్‌లో ఆర్జితసేవా టికెట్ల నమోదుకు ఫొటో తప్పనిసరి చేయండి? 
ఈవో : ఎక్కువ మంది భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాం. 
12. అయ్యన్న   – రాజమండ్రి
ప్రశ్న: ఈ-దర్శన్‌ కౌంటర్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేయడం లేదు? 
ఈవో : ఈ-దర్శన్‌ కౌంటర్లలో ఆర్జిత సేవా టికెట్లకు ఎలాంటి ప్రత్యేక కోటా లేదు. ఇంటర్నెట్‌ వసతి  ఉంటే ఎక్కడైనా వీటిని బుక్‌ చేసుకోవచ్చు. 
13. కామేశ్వర్‌ రావు   – హైదరాబాద్‌
ప్రశ్న: చక్రస్నానం సమయంలో అర్చకులు సుదర్శన చక్రం కంటే ముందుగానే మునుగుతున్నారు. కల్యాణం టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి గదులు ఇవ్వండి, లడ్డూలు ట్రేలు శుభ్రం చేసే చోట వ్యర్థాలను తొలగించండి? 
ఈవో : వైదిక కార్యక్రమాలు అర్చకుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వారికి ఈ విషయాన్ని తెలియజేస్తాం. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఇవ్వడం సాధ్యం కాదు. వ్యర్థాలను తొలగిస్తాం. 
14. రమేష్‌  – హైదరాబాద్‌, సంజయ్‌ – హైదరాబాద్‌
ప్రశ్న: సిఫారసు లేఖలు తీసుకువస్తున్న భక్తులతో జెఈవో కార్యాలయం సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు? 
ఈవో : గదుల కోసం సిఫారసు లేఖలు తీసుకువచ్చే భక్తులు నిర్దేశించిన కౌంటర్లలో సమర్పించాలి. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో సిఫారసు లేఖలు స్వీకరించడం సాధ్యం కాదు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించకుండా తగిన సూచనలు ఇస్తాం.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, శ్వేత సంచాలకులు శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ ఎం.మనోహర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

OM NAMO VENKATESHAYA 

 

——