[google-translator]

Today’s Devotional E-Paper -02-12-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

02/12/2018 , ఆదివారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

 

మాసం : కార్తీకం

 

 

పక్షం : బహుళ

 

సూర్యోదయం : 6.24AM
సూర్యాస్తమయం : 5.40PM
తిథి :దశమి 3.42PM

 

 

నక్షత్రం : హస్త 4.59AM
యోగం:ప్రీతి 8.13AM
ఆయుష్మాన్5.42AM
కరణం :భద్ర 3.42PM
బవ 2.55PM

 

 

అమృతఘడియలు :11.13PM-12.45AM

 

 

రాహుకాలం :04.30 PM to 06.00 PM

 

 

యమగండం:12.00 PM to 01.30 PM
వర్జ్యం : 2.01PM-3.33PM
దుర్ముహూర్తం : 4.10PM-4.55PM

 

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

02/12/2018 , Sunday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Karthikam

Paksham :

Bahula

SunRise : 6.24AM

SunSet : 5.40PM

Tithi : Dasami 3.42PM

   

Nakshatram : Hastha 4.59AM

Yogam : Preethi 8.13AM
                Ayushman 5.42AM

Karanam :

    Bhadra 3.42PM
Bava 2.55PM

AmruthaGadiyalu : 11.13PM-12.45AM

Rahukalam :04.30 PM to 06.00 PM

Yamagandam :12.00 PM to 01.30 PM

Varjyam :

2.01PM-3.33PM

Durmuhurtham 4.10PM-4.55PM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 01.12.2018 :: 72,032.
 VQC SITUATION AT 5.00 AM ON 02.12.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 22,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : UP TO 12 HOURS.
 TONSURES – 31,635.
 PARAKAMANI – 1.97. CRORES.
  Dept. of PRO- TTD. 

 

 

 

02/12/2018 , Sunday

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)

06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura

07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.

07:30 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మూత్సవాలు డిసెంబరు 4 నుండి 12వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పాంచరాత్ర ఆగమ విశిష్టతను తెలుసుకుందాం.
 
సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించినది పాంచరాత్ర ఆగమం. భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే నిత్యము, నైమిత్తికము, కామ్యము అనే ఉత్సవాలను ఎలా నిర్వహించాలి, కంకణబట్టార్‌ ఎలాంటి అధ్యయనం చేయాలి, ఉత్సవాలు నిర్వహించే యజమానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను ఆగమాలు తెలియజేస్తున్నాయి. పాంచ అంటే ఐదు, రాత్ర అంటే రోజులు అని అర్థం. భగవంతుడు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విష్వక్సేనమూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే ఐదుగురికి ఉపదేశించినవి కావున దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. ఇది మనుషుల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
లోకంలో ప్రతిజీవి పునరావృత్తి రహిత శ్రీవైకుంఠానికి చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రం దోహదపడుతుంది. ఈ ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, ఆర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పాద్మ సంహిత, శ్రీ ప్రశ్న సంహిత మొదలైన శాస్త్రాల్లో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక, కామ్యోత్సవాలను జరుపుతున్నారు. బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు, సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలను నిత్యోత్సవాలుగా, సంక్రాంతి, గ్రహణం సందర్భంగా చేపట్టే క్రతువులను నైమిత్తిక ఉత్సవాలుగా, భక్తుల కోరిక మేరకు నిర్వహించే ఆర్జితసేవలను కామ్యోత్సవాలుగా పిలుస్తారు.
చతుష్టానార్చన విశేషం
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చతుష్టానార్చనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా చతుష్టానార్చన నిర్వహిస్తారు. శ్రీవైకుంఠం నుంచి పరవాసుదేవుడిని జలం, మహాలక్ష్మిని కుంభం, అగ్నిదేవుడిని హోమం, చక్రాబ్జమండలాన్ని అక్షింతలు, యాగబేరాన్ని బింబం ద్వారా ఆవాహన చేస్తారు. దీనివల్ల అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి చేకూరుతాయి.

PANCHARATHRA AGAMA VIDHI IN TIRUCHANOOR TEMPLE

SPECIAL STORY 2

The annual Brahmotsavam of Sri Padmavati Ammavaru Temple ,Tiruchanoor is perforated as per the traditions of the Pancha Rathra Agamas which has its own unique norms and practices as laid down in the Vaikhanasa sect of Sri Vaishnavism.

It is said that the Pancha Ratha Agamas are framed on the direct  dictation of the  presiding diety of Sri Padmavathi Devi of how to perform Archanas, daily rituals, special rituals, festivals etc. It also laid down norms to be followed by Kankana Bhattar who supervised all the rituals and also the duties and functions of  theYajamani ( temple chief).

 

MEANING OF PANCHARATHRA

Pancha meant five and Ratha means Nights. Each day is dedicated to a deity and during these nights the Serpent King Anantudu, Garukmantudu, Viswakshenamurti, Chaturmukha Brahma, and Parameswarudu are invoked. It is a divine science to ward off the ignorance of the human beings in service of  Lord . The Pancharatha Agamas also explained188 puja methods as engraved in the Sri Padma Samhita. It is the compendium of traditions and practices now followed in daily rituals at Sri Padmavati Ammavari Temple.

 

All the  Utsavavams, Brahmotsvams, Teppotsavams ,Vasantotsavams, Navaratri Utsavams,  Sundararaja swamivari Avatarotsavams, Nitya utsavavams and events held in connection with Sankranti festival and and Granahanas etc. observed and also all Arjita sevas etc. I’m the temple are performed as per the norms mentioned in the Pancha Ratha Agamas.

 

IMPORTANCE OF CHATUSTARCHANA

 

The Chatustarchana ritual has a great significance in the Sri Padmavati Ammavari Temple during annual Brahmotsavams. This event is performed every day at the Yagashala from    5-6 AM in the morning and  again 4- 5.30 Pm in the evening by the temple archakas. The objective of the ritual is to ward off the evil forces in the society and ensure the conduct of Navahnika Karthika Brahmotsavams in a smooth manner.

 

  Dept. of PRO- TTD.
టిటిడి ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై శనివారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం నాడు ముఖ్య మ్యూజియం అధికారి కల్నల్‌ చంద్రశేఖర్‌ మండతో వివరణాత్మకంగా చర్చించారు.
 
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నిర్మాణాత్మకంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం మ్యూజియం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను జెఈవోకు ముఖ్య మ్యూజియం అధికారి తెలియజేశారు
.
ఈ సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రా
మచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు,  సిఏవో శ్రీ శేషశైలేంద్ర, విఎస్‌వో శ్రీమతి సదాలక్ష్మి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి తదితరులు పాల్గొన్నారు.

DEVELOPMENTAL WORKS OF SV MUSEUM REVIEWED

The developmental works which are completed in SV Museum at Tirumala was reviewed in detail on Saturday.

 

Tirumala JEO Sri KS Sreenivasa Raju held a detail review meeting with Chief Museum Officer Col.Chandrasekhar Manda at Annamaiah Bhavan.

 

The JEO directed the officers who were present in the meeting to come out with a constructive micro level plan to develop SV Museum into a world class model.

 

The SV Museum chief briefed the JEO about the needed measures to be taken for the upliftment of the Museum. 

 

SE II Sri Ramachandra Reddy, CAO Sri Seshasailendra, SE Electrical Sri Venkateswarulu, VGO Smt Sada Lakshmi, PRO Dr T Ravi and others were also present.

—————————-
శ్రీవారిని దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామి
తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం ప్రధాన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌(ఆండవన్‌) స్వామి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
ముందుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారికి టిటిడి తిరుమల జెఈవో శ్రీకెఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు, పార్‌పత్తేదార్‌ శ్రీ రామచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

  Dept. of PRO- TTD.

CHIEF PONTIFF OF SRI RANGAM SRIMATH ANDAVAN ASHRAMAM OFFERED PRAYERS TO LORD VENKATESWARA

His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam  visited Sri Vari Temple, Tirumala on Saturday. On his arrival at infront of Sri Vari Temple TTD Joint Executive Officer Sri KS Sreenivasa Raju and Temple Priests welcomed him with Temple Honors and led him to Sanctum Santorium.

 

DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Parpatheyadar Sri Ramachandra, and others were present.

  Dept. of PRO- TTD.

HDPP VALEDICTORY FUNCTION
 

JEO Tirupati Sri P Bhaskar Addressing the Valedictory session of Training Program of  Dharmacharyas in SVETA on Saturday evening. HDPP Secretary Sri Ramana Prasad was also present. 

  Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

 

 

——