[google-translator]

Today’s Devotional E-Paper – 02-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

02/11/2018 , శుక్రవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.12AM

సూర్యాస్తమయం : 5.43PM

తిథి : నవమి 7.10AM

నక్షత్రం : దశమి 4.54AM

యోగం
:మాఘ 12.38PM

కరణం
:

శుక్లము
10.27AM
గరజి
7.10AM
వాణి
6.02PM
భద్ర
4.54AM

అమృతఘడియలు :10.23PM-11.53PM

వర్జ్యం : 1.27PM-2.56PM

దుర్ముహూర్తం
8.30AM-9.16AM
12.21PM-1.07PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

02/11/2018 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.12AM

SunSet :

5.43PM

Tithi :

Navami 7.10AM

Nakshatram :

Dasami 4.54AM

Yogam :

Magha 12.38PM

Karanam :

Suklam 10.27AM
Garaji 7.10AM
Vani 6.02PM
Bhadra 4.54AM

AmruthaGadiyalu :

10.23PM-11.53PM

Varjyam :

1.27PM-2.56PM

Durmuhurtham 8.30AM-9.16AM
12.21PM-1.07PM

 

 

 

02/11/2018 , Friday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam

 

 

04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam

 

06:00 – 07:00 hrs
Samarpana

 

07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)

 

09:00 – 20:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.

 

 

20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

21:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

 

00:45 hrs
Ekanta Seva

 

శ్రీవారి ఆలయంలో నవంబరు 7న దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 7వ తేదీ బుధవారం ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. 
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

DEEPAVALI ASTHANAM IN TIRUMALA ON NOV 7

 The religious temple court ceremony in connection with the festival of lights will be observed in Tirumala on November 7.

 

This fete takes place at Bangaru Vakili in Garudalwar Sannidhi between 7am and 9am.

 

The processional deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi along with Vishwaksena are seated opposite Garudalwar and Asthanam will be performed.

 

TTD has cancelled all arjitha sevas in connection with this fete.

 Dept. of PRO- TTD.
న‌వంబ‌రు 7న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 7వ తేదీ బుధ‌వారం దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. 
న‌వంబ‌రు 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 6వ‌ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
న‌వంబ‌రు 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం
 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఉప ఆలయమైన శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం న‌వంబ‌రు 2 నుంచి 11వ తేదీ వరకు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 11వ తేదీన శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.00 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ మనవాళ మహాముని వారికి సమర్పిస్తారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీ మనవాళ మహామునితో కలసి తిరుమాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. 
శ్రీ మనవాళ మహాముని 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తిచేసిన శ్రీవైష్ణవ ఆచార్యపురుషుడు.
 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——