[google-translator]

Today’s Devotional E-Paper – 02-10-2018

పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

02/10/2018, మంగళవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.06AM

సూర్యాస్తమయం : 6.00PM

తిథి : అష్టమి 12.16AM

నక్షత్రం : ఆర్ద్ర 11.02PM

యోగం
: వారి 3.31PM

కరణం
: బాల 1.32PM
కౌలవ12.26AM

అమృతఘడియలు :1.37PM-3.08PM

వర్జ్యం : 8.21AM-9.52AM

దుర్ముహూర్తం:
8.29AM-9.16AM
10.50PM-11.39PM

PANCHANGAM

Today’s Good & Bad Timings

02/10/2018, Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Bhaadrapadam

Paksham :

Bahula

SunRise :

6.06AM

SunSet :

6.00PM

Tithi :

Ashtami 12.16AM

Nakshatram :

Aardhra 11.02PM

Yogam :

Vari 3.31PM

Karanam :

Bala 1.32PM
Koulava 12.26AM

AmruthaGadiyalu :

1.37PM-3.08PM

Varjyam :

8.21AM-9.52AM

Durmuhurtham 8.29AM-9.16AM
10.50PM-11.39PM

*Darshan Details of Lord Balaji*

OM NAMO VENKATESAYA

TOTAL PILGRIMS HAD DARSHAN ON 01-10-2018: 83,542. 

V.Q.C SITUATION AT 05:00 AM ON 02-10-2018

 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: OUT SIDE LINE: ALWAR TANK 4TH POINT,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UPTO 20 HOURS. 
TONSURES: 36,024, 
PARAKAMANI: RS.2.88 CRORES. 
Dept. of PRO – TTD 

 

02/10/2018 , Tuesday
06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell
07:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

—-

MORE BEAUTIFICATION ALONG SIDES FOOTPATH ROUTES-TTD EO

 

To give a better aesthetic feel to the multitude of visiting pilgrims, more greenery need to be grown on either sides along Srivari Mettu and Alipiri footpath routes, said, TTD EO Sri Anil Kumar Singhal.

During the senior officers review meeting held at the conference hall in TTD administrative building in Tirupati on Monday, the EO direct the DFO Sri Phani Kumar Naidu to go for more beautification in footpath routes.

 

Later he directed the Chief Engineer Sri Chandrasekhar Reddy to complete the electrical works including lighting, erection of heaters, laying of cots and beds in New Seva Sadan buildings etc.on a faster pace.

He also instructed him to complete the works in SV temple at Kanyakumari before this year end.

 

He later instructed IT wing of TTD and TCS to present a power point presentation of all the IT applications introduced in TTD for the benefit of pilgrims.

 

DLO Sri Venkataramana Naidu, CVSO Incharge Sri Siva Kumar Reddy, FACAO Sri Balaji and other senior officers were also present.

కాలినడక మార్గాలలో మరింత పచ్చదనం పెంచేలా చర్యలు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

 

 

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు కాలినడక మార్గాలతోపాటు, రింగ్‌ రోడ్‌ తదితర ప్రాంతాలలో మరిన్ని మొక్కలు పెంచాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను మెరుగైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. తిరుమలలో యాత్రికులకు అశ్విని ఆసుపత్రి, ఇతర ఆసుపత్రులలో మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న సేవా సదన్‌ నూతన భవనంలో వేడి నీటి సౌకర్యం, లైటింగ్‌, ఫ్యాన్లు, వసతి తదితర సదుపాయాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. మొకాలిమిట్ట నుండి జిఎన్‌సి టోల్‌ గేట్‌ వరకు రోడ్ల విస్తరణ పనులపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. తిరుమలలోని కాటేజీల వద్ద అన్నప్రసాద వ్యర్థాలను వేయకుండా నివారించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలు ఉండటం వల్ల వన్యప్రాణులు, మృగాలు కాటేజీల వద్దకు వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు.

కన్యాకుమారి ఆలయ పనులను డిసెంబర్‌ లోపు పూర్తి చేయాలని సిఇ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. తిరుచానూరు తోళప్ప గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న వసతి గదులను యాత్రికులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భక్తుల సౌకర్యార్థం టిటిడి అమలుచేస్తున్న ఐటీ సేవలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో తయారు చేయాలన్నారు.

 

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.                                                                                 

Dept. of PRO- TTD.

TTD SETS NEW RECORD IN LADDU DISTRIBUTION

A new record has been created by TTD in the sale and distribution of laddus, thanks to the pilgrim crowd which thronged the hill town in the auspicious Prestasi month.

 

In the laddu sales and distribution which took place from 3am of September 30 till 3am of October 1, a total of 5,13,566 laddus were recorded.

 

The previous highest figures includes 4,64,152 on October 10 in 2016, followed by 4, 32,745 on May 28 this year. The next highest figures includes 4,14,987 on May 19 in 2018 and 4,11,943 on June 11 in 2017.

 

రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూప్రసాదం విక్రయం

తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని టిటిడి రికార్డు స్థాయిలో తయారుచేసి భక్తులకు విక్రయించింది. తమిళులకు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసంలో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసి అందుబాటులో ఉంచుతోంది.

 

ఈ క్రమంలో సెప్టెంబరు 30వ తేదీ ఆదివారం టిటిడి చరిత్రలో మొదటిసారి 5,13,566 లడ్డూలను తయారుచేసి భక్తులకు విక్రయించడం జరిగింది. గతంలో 2016 అక్టోబరు 10న 4,64,152 లడ్డూలు, 2017 మే 28న 4,32,745 లడ్డూలు, 2018 మే 19న 4,14,987 లడ్డూలు, 2017 జూన్‌ 11న 4,11,943 లడ్డూలను టిటిడి విక్రయించింది.

 

పోటు విభాగం అధికారులు, సిబ్బంది, పోటు కార్మికులు సమష్టిగా కృషి చేసి భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను తయారుచేస్తున్నారు. తయారుచేసిన లడ్డూలను 64 కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.

Dept. of PRO- TTD.

అక్టోబరు 2న టిటిడి పరిపాలనా భవనంలో గాంధీ జయంతి వేడుకలు

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు అక్టోబరు 2వ తేదీ మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా జరుగనున్నాయి.

 

టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటలకు జయంతి వేడుకలు ప్రారంభమవుతాయి. టిటిడి అధికార ప్రముఖులు పాల్గొంటారు.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——