[google-translator]

Today’s Devotional E-Paper -01-10-2018

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

01/10/2018, Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Bhaadrapadam

Paksham :

Bahula

SunRise :

6.06AM

SunSet :

6.01PM

Tithi :

Sapthami 2.38AM

Nakshatram :

Mrugasira 12.28AM

Yogam :

Vyathi 6.20PM

Karanam :

Vishti 3.34PM
Bava 2.38AM

AmruthaGadiyalu :

4.04PM-5.35PM

Varjyam :

6.54AM-8.26AM

Durmuhurtham 12.27PM-1.15PM
2.50PM-3.38PM

పంచాంగం

 

నేటి మంచి చెడు సమయాలు

01/10/2018, సోమవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.06AM

సూర్యాస్తమయం : 6.01PM

తిథి : సప్తమి 2.38AM

నక్షత్రం : మృగశిర 12.28AM

యోగం : వ్యతి 6.20PM

కరణం
: విష్టి 3.34PM
భవ 2.38AM

అమృతఘడియలు : 4.04PM-5.35PM

వర్జ్యం : 6.54AM-8.26AM

దుర్ముహూర్తం
 12.27PM-1.15PM
2.50PM-3.38PM

*Darshan Details of Lord Balaji* 

 

OM NAMO VENKATESAYA
TOTAL PILGRIMS HAD DARSHAN ON 30-09-2018: 1,05,018.
V.Q.C SITUATION AT 06:00 AM ON 01-10-2018 
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 13,
APPROXIMATE TIME FOR SARVADARSHAN: UPTO 07 HOURS.
TONSURES: 40,355,
PARAKAMANI: RS.3.22 CRORES.  
Dept. of PRO- TTD. 

01/10/2018 , Monday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)
05:30 – 06:30 hrs
Visesha Puja
07:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

—-

PAVITROTSAVAMS IN TARIGONDA TEMPLE 

 

The annual pavitrotsavams in Taroginda Sri Lakshmi Narasimha Swamy temple will be observed from October 9 to 11 located in Chittoor district.

 

The ankurarpanam for the festival will be observed on October 8. On first day Pavitra Pratishta, Second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be observed.

అక్టోబరు 9 నుండి 11వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

 

టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 9 నుండి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 8వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి.

 

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 9న పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రెండో రోజు అక్టోబరు 10న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబరు 11న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, స్నపనతిరుమంజనంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

 

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

 

Dept. of PRO- TTD.

NO COMPROMISE IN PILGRIM SERVICES_

Offering services to multitude of visiting pilgrims to the best possible extent is the top most priority of TTD and there is no compromise on it, said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.

 

Speaking to media at Tirumala on Sunday, the JEO said, with the advent of Prestasi month, Tirumala has been witnessing unprecedented pilgrim rush from the last few days including Tuesdays and Wednesdays. To man the pilgrim rush, we have even deployed 120 officers specially for saturdays and sundays for the next three weeks.

 

The Divya Darshanam and Sarva Darshan tokens were also cancelled on October 6,7, 13,14, 20 and 21. While the Rs.300 tickets are issued in less numbers in view of heavy rush. TTD is providing Annaprasadam, water, milk at regular intervals to the pilgrims waiting in queue lines and compartments.

సామాన్య భక్తుల సేవలో రాజీకి తావులేదు- తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే లక్షలాదిమంది సామాన్య భక్తజనులకు సేవలందించడంలో ఎటువంటి రాజీపడేదిలేదని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు.

 

తిరుమలలో ఆదివారం ఉదయం జెఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాద సౌకర్యాలను కల్పించడంలో రాజీకి తావులేకుండా సేవలందిస్తున్నామన్నారు. పెరటాశి నెల సందర్భంగా సాధారణ రోజులలో కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 మరియు 2లు నిండి, బయట దాదాపు 2 కిలోమీటర్లు వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నట్లు తెలిపారు.

 

అధిక రద్దీ కారణంగా అక్టోబరు 6, 7, 13, 14, 20, 21వ తేదీలలో వచ్చే శని, ఆదివారాలలో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశామని, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పరిమిత సంఖ్యలో కేటాయించామన్నారు. తద్వారా సామాన్య భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1 మరియు 2ల ద్వారా అధిక సంఖ్యలో సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా శని, ఆదివారాలలో వి.ఐ.పి.బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు.

 

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమలలో పెరటాశి నెల శని, ఆదివారాలలో క్యూలైన్ల నిర్వహణకు అదనంగా 120 మంది టిటిడి సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించినట్లు తెలియజేశారు. వీరు తమకు కేటాయించిన ప్రాంతంలోని క్యూలైన్లలోని భక్తులకు అవసమైన తాగునీరు, అన్నప్రసాదాలు, మెడికల్‌, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను పర్యవేక్షిరని వివరించారు.

 

అదేవిధంగా దసర సెలవులు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులకు టిటిడి అన్నప్రసాదం, విజిలెన్స్‌, ఆరోగ్య విభాగాలు విశేష సేవలందిస్తున్నాయన్నారు. కావున భక్తులు సంయమనంతో టిటిడికి సహకరించి స్వామివారిని దర్శించుకోవాలని జెఈవో కోరారు.

 

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——