[google-translator]

ALL PURANAS NUMBER, NAMES AND POEMS

లైవ్ తిరుపతి.కామ్
శివాజీస్ స్పెషల్ ఆర్టికల్

పురాణముల గురించిన అవగాహన

శ్రీ వేదవ్యాసుడు పురాణములను పదునెనిమిది గా వివరించి చెప్పెను. వీటికి సంభందించి ఒక శ్లోకమును వ్యాసమహర్షి ఈ విధంగా చెప్పెను.
అష్టాదశ (18) పురాణములు వాటిలోని శ్లోకముల సంఖ్య

బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.

పద్మ పురాణము – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.

విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.

శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.

లింగ పురాణము – నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నవి.

గరుడ పురాణం – విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 శ్లోకాలున్నాయి.

నారద పురాణము – నారద మహర్షి రచన. 24,000 శ్లోకములు కలది.

భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.

అగ్ని పురాణం – భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 శ్లోకములు కలది.

స్కంద పురాణం – కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 శ్లోకములు ఉన్నాయి.

భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం – శతానీకుడు సుమంతునకు బోధించినది.31,000 శ్లోకములు ఉన్నాయి.

బ్రహ్మవైవర్త పురాణం – వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,౦౦౦ శ్లోకములు కలది.

మార్కండేయ పురాణం – పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 32,000 శ్లోకములు ఉన్నవి.

వామన పురాణము – బ్రహ్మదేవుని రచన – 14,000 శ్లోకములు కలది.

వరాహ పురాణం – శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.

మత్స్య పురాణం – శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.

కూర్మ పురాణం – శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,౦౦౦ శ్లోకాలున్నాయి.

బ్రహ్మాండ పురాణం – బ్రహ్మదేవుని రచన- 12,200 శ్లోకములున్నది.
మహాపురాణాలు దైవము యొక్క మూడు రూపములు ప్రకారంగా వర్గీకరించ బడ్డాయి.
త్రిమూర్తి

వైష్ణవ పురాణాలు:విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము

బ్రహ్మ పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం

శైవ పురాణాలు:శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం

ఉప పురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. అవి:

నరసింహ
శివధర్మ
దౌర్వాస
నారదీయ పురాణము
కాపిల
మానవ
ఔసనశ
బ్రహ్మాండ
వారున
కౌశిక
లైంగ
సాంబ
సౌర
పారాశర
మారీచ
భార్గవ
స్కాంద
సనత్కుమార

శివాజి, లైవ్ తిరుపతి.కామ్