[google-translator]

WOW,One More Excellent Position came to Our Dr. Sipai Sir

ఆంద్ర ప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర పాలక సంచాలకులుగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి Dr సిపాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం నాడు అమరావతి లోని సంస్థ ప్రధాన కార్యాలయములో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేసారు. ఈ పదవి ప్రమాణ స్వీకారోత్సవం లో రాష్ట్ర వైద్య శాఖ మాత్యులు Dr కామినేని శ్రీనివాసు గారు Dr సిపాయి సుబ్రహ్మణ్యం గారితో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు.

ఈ సందర్భముగా Dr సిపాయి సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ ఈ సంస్థ సంవత్సరానికి ౩౦౦ కోట్లు విలువైన ఔషదాలు రాష్ట్ర వ్యాప్తంగా వున్నా అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో, బోధనా వైద్య శాలలు, జిల్లా వైద్య శాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని వైద్యశాలల భావన నిర్మాణము వైద్య పరికరాల సేకరణ మరియు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ శాఖా పరిధిలో వున్నా ఆయుర్వేద, హొమియో, యునాని వైద్య కల శాలలు, బోధనా వైద్య శాలలు, మరియు ఇతర వైద్య శాలల భవనాల నిర్మాణాలు పరికరాల సేకరణ మరియు సరఫరాలు చేపడుతుందన్నారు. ఔషదాలు పరికరాలు సరఫరా సేకరణ విధానాలలో సాములా మార్పులు చేపట్టి నాణ్యమైన ఔషదాలు పరికరాలు, సేవలు తగిన సమయములో అందించేటట్లు పలు చర్యలు రాబోయే కొద్దీ నెలల్లో చేపట్టనున్నట్లు Dr సిపాయి సుబ్రమణ్యం గారు వెల్లడించారు. అలాగే అవసరమయితే తమిళునాడు లాంటి ఇతర రాష్ట్రాలలో పాటిస్తున్న ప్రమాణాలను అంతకంటే మెరుగు పరుస్తూ నూతన విధానాల రూపకల్పన చేసేందుకు పలు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇంతటి బృహత్ బాధ్యత కల్పించి నటువంటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి కృతజ్ఞలు తెలియచేసారు. అలాగే మానవ వనరుల అభివృద్ధిలో ప్రముఖ పాత్రా వహించి వైద్య ఆరోగ్య శాఖకు నిధులు పెంచడమే కాకుండా వాటి సద్వినియోగం కోసం ప్రతిష్ట చర్యలు తీసుకోవాలిసిందిగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు తగిన మార్గదర్శనం చేసినట్లు Dr సిపాయి సుబ్రమణ్యం గారు వెల్లడించారు.
ఈ కార్యక్రమములో సంస్థ నూతన అధ్యక్షులు లక్ష్మి పతి, సభ్యులు నారాయణరావు, ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గోపినాథ్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు Dr రాజారావు, చీఫ్ ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

%d bloggers like this: