[google-translator]

Wow… A.P State Employees also Mingled with O.C Sangharshana Samithi….!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని ఓ.సి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరియు వారిపై జరుగుతున్న దాడుల పరంగా ప్రభుత్వంపై పోరుబాట తప్పదని ఆంధ్రప్రదేశ్ ఓ.సి సంఘర్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా|| పోల్తి ప్రతాప్ రావు అన్నారు. ఇందుకు ఓ.సి. ఉద్యోగులందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

నిన్న, అనగా 30-07-2017 ఆదివారం అనంతపురంలో ఆంధ్ర ప్రదేశ్ ఓ.సి సంఘర్షణ సమితి రాష్ట్ర కమిటీ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఓ.సి సంఘర్షణ సమితి  తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు సింగం సదాశివ రెడ్డి,   గౌ|| అధ్యక్షులు కంచెర్ల శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోల్తి ప్రతాప్ రావు మరియు పాల్గొన్నారు .

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ. పోల్తి ప్రతాప్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓ.సి ఉద్యోగుల సమస్యలపై పోరాటానికి సిద్ధమంటూ నాయకులందరూ సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఓ.సి. ఉద్యోగుల రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షులుగా ముడియం రమణ (అనంతపురం),
ప్రధాన కార్యదర్శిగా టి.యం. బుచ్చిబాబు ( విజయవాడ),
ఉపాధ్యక్షులుగా వై. అభినందన రెడ్డి (అనంతపురం),
ఉపాధ్యక్షులుగా సీతామహాలక్ష్మి(విశాఖపట్నం)
ఉపాధ్యక్షులుగా గోనుగుంట్ల వెంకట నాయుడు (అనంతపురం) లను ఎన్నుకున్నారు.

 

కార్యదర్శులుగా చిత్తూరుకు చెందిన కె. నాగేశ్వరయ్య, శ్రీకాకుళంకి చెందిన ఎన్. శంకర్ రెడ్డి, కర్నూల్ కు చెందిన కె. రాజశేఖర్ రెడ్డి లను, కోశాధికారిగా పి. సత్యనారాయణ ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఓ.సి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏ సమయంలోనైనా సరే సిద్ధమంటూ పోల్తి ప్రతాప్ రావు సందేశమివ్వడం జరిగింది.

Note: ఇప్పటివరకూ మన ఆంధ్ర ప్రదేశ్ లో ఓ.సి ప్రభుత్వ ఉద్యోగుల గురించి హృదయపూర్వకంగా పట్టించుకునే వారెవ్వరూలేరు. అందరూ తమ తమ మాటల గారడీలతో ఓ.సి లు, బి.సి లు, మరియు మిగిలిన వర్గాల ఓట్లతో గద్దెనెక్కేవారే.

గద్దెనెక్కాక అందరు రాజకీయ నాయకులూ కూడా, ఓ.సి లను తప్ప అందరినీ పట్టించుకుంటారు. మరి ఓ.సి లకి దిక్కెవ్వరు….? అనుకునే ఈ అత్యద్భుత, మహాద్భుత….. ఆంద్ర రాష్ట్రంలో కనీసం ఈ ఓ.సి సంఘర్షణ సమితి ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ద్వారానైనా ఓ.సి ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరిగితే సంతోషించే వారిలో మా లైవ్ తిరుపతి.కామ్ ఎప్పుడూ ముందుంటుంది.

ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఓ.సి. ఎంప్లాయిస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్.

పద్మావతి దేవిరెడ్డి,
ఛైర్మన్ & మ్యానేజింగ్ డైరెక్టర్,
లైవ్ తిరుపతి.కామ్

 

%d bloggers like this: