[google-translator]

Tirupati MLA In Protocol Problem….?

*ప్రోటోకాల్ ప్రాబ్లమ్ లో తిరుపతి ఎం.ఎల్.ఎ*

*తిరుపతి లోని S.V. హై స్కూల్ ప్లే గ్రౌండ్ సాక్షిగా తిరుపతి ఏం.ఎల్.ఏ కి ఘోర అవమానం*
స్థానిక భారతీయ విద్యాభవన్ వారు ఏర్పాటు చేసిన “తిరుపతి బుక్ ఫెస్టివల్” లో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ. మండలి బుద్ధ ప్రసాద్ గారు పాల్గొంటున్నప్పటికీ…. తిరుపతి స్థానిక ఎం.ఎల్.ఏ శ్రీమతి. మన్నూరు సుగుణమ్మ గారికి కనీసం సమాచారం లేదని మా “లైవ్ తిరుపతి” దృష్టికి రావటం జరిగింది.

మన భారతీయ రాజ్యాంగం ప్రకారం ఒక నియోజక వర్గంలో డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి పాల్గొనే కార్యక్రమాలలో తప్పనిసరిగా స్థానిక ఎం.ఎల్.ఏ పాల్గొనాలనే నిబంధన ఉందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా స్థానిక ఎం.ఎల్.ఏ శ్రీమతి. మన్నూరు సుగుణమ్మ గారిని రాజ్యాంగబద్ధంగా తీవ్రంగా అవమానించడం జరిగింది.

*ఒక “బుక్ ఫెస్టివల్” వంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే కనీసం 3 నెలల నుంచి ప్రణాళిక ఉంటుంది., ఉండాలి. కానీ, తిరుపతి భారతీయ విద్యాభవన్ వారు ఒక్క సారి కూడా స్థానిక ఎం.ఎల్.ఏ తో చర్చించి నట్లు గానీ, మా దృష్టికి రాలేదు.*

ఒక నియోజక వర్గంలో ఇలా ఎవరుపడితే వాళ్ళు, ఎలా పడితే అలా ఇష్టానుసారంగా కార్యక్రమాలు జరుపుకోవటం అనేది సరైన సంస్కృతి కాదనేది మా లైవ్ తిరుపతి అభిప్రాయం. ఎందుకంటే, డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి పాల్గొనే కార్యక్రమంలో ఏమైనా అపశృతులు జరిగితే ఆ నియోజకవర్గంలో మొట్టమొదటి జవాబుదారీ రాజ్యాంగ బద్ధంగా స్థానిక ఎం.ఎల్.ఏనా కాదా ? అనేది మా లైవ్ తిరుపతి మరియు ఎడ్యు జాబ్స్ సూటి ప్రశ్న?

అసలే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వల్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న మన ఆంధ్ర ప్రజానీకం, అందునా యువత ఏమైనా ఆవేశకావేశకాలకు లోనై రక రకాల పద్ధతుల్లో దాడి చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి…? మన స్థానిక ఎం.ఎల్.ఏ కాదా…..?

మన తిరుపతి స్మార్ట్ తిరుపతిగా అభివృద్ధి చెందుతుంది అంటే… మనలో అందరి వ్యక్తుల యొక్క, మన రాజ్యాంగ బద్దమైన పాలకుల యొక్క, కృషి లేదా అనేది మాత్రమే…మా సూటి ప్రశ్న.?

ఈరోజు జరిగిన “తిరుపతి బుక్ ఫెస్టివల్” లో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ. మండలి బుద్ధ ప్రసాద్ గారు పాల్గొనక పోయివుంటే ఈ ప్రశ్నే ఉత్పన్నమయ్యేది కాదు.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పాల్గొంటున్న సభలో స్థానిక ఎం.ఎల్.ఏ, కి చోటు లేదంటే…. నిజంగా మన తిరుపతి వాసులకి, మనం ఓటు వేసి గెలిపించుకున్న మన ఎం.ఎల్.ఏ కి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాము.

ఇట్లు,
మీ ఆత్మీయ బంధువు,

*శివాజి,CEO,*
*లైవ్ తిరుపతి & ఎడ్యు జాబ్స్*
@
సోషల్ మీడియా విత్
9,00,000 ఫ్యాన్స్*

%d bloggers like this: