[google-translator]

Student Scholarships Distributed by Karuneegar Youth

ఈరోజు తిరుపతి లోని కరుణీగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించటం జరిగింది. ఈ సంవత్సరం పదిమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున అందించామని, ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కనీసం ఇరవై మందికి తగ్గకుండా కరణం కుల యువతకు ఆర్ధిక సహాయాన్ని అందచేస్తామని శ్రీ ముని శ్రీధర్ పిళ్ళై గారు తెలియచేసారు.

తమయొక్క కర్తవ్య దీక్షకు శ్రీ సంతపేట జనార్దనన్ మరియు శాంతమ్మ గార్లు ఆర్ధిక సహాయంతోపాటుగా ఎంతో ప్రొత్సాహాన్నీ అందిస్తున్నారని ఈ సందర్భంగా ముని శ్రీధర్ తెలియచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ శ్రీ నరసింహ యాదవ్, O.C సంఘర్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోల్తి ప్రతాప్ రావు, తుమ్మల గుణ శేఖర్, కరుణీగర్ యూత్ నాయకులు ప్రదీప్ కుమార్, శ్రీనివాసులు, చిదంబరం, చరణ్, పళని శేఖర్, సురేష్, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

.

.

.

%d bloggers like this: