[google-translator]

Really IMA – TIRUPATI Wing is Doing Excellently

INDIAN MEDICAL ASSOCIATION (IMA) తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే…… నిరంతర వైద్య విద్య లో భాగంగా ఈ నెల 20 -08 -2017 స్థానిక బ్లిస్ హోటల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం IMA కార్యదర్శి Dr .A .R. Reddy ఆధ్వర్యంలో జరిగింది. 150 మంది వరకు ఎం.బి.బి.ఎస్. మరియు స్థానిక నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ మాసం మార్గదర్శి లో భాగంగా డా|| డి.కృష్ణా రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. డా|| డి.కృష్ణా రెడ్డి గారు కడప లో చేస్త్తున్న పుస్తకాల వితరణ, బ్రౌన్ విగ్రహ ప్రతిష్ఠాపన, నవజీవం సంస్థకు ఆయన చేసే సేవలు మొదలైన వాటిని కొనియాడుతూ… అందరూ ఆయనని కొనియాడారు.

ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో భాగంగా…. డా|| శ్రీనివాసన్ పరమశివం IMA – తిరుపతి శాఖ చేస్తున్న గొప్ప పనులను మరియు వారి దాతృత్వాన్ని కొనియాడుతూ…. అడ్వాన్స్డ్ నెర్వ్ సర్జెరీ పిన్ హోల్ న్యూరో సర్జెరీ గురించి ప్రసంగించారు. డా|| యూసుఫ్ గారు చాలా గొప్పగా సి.టి సర్జెరీ గురించి అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు.

స్థానిక వైద్యులైన డా|| పార్థ సారథి మరియు డా|| రవి రాజు గార్లు పాల్గొని IMA కార్యదర్శి Dr .A .R. Reddy గారి ఆధ్వర్యంలో IMA – తిరుపతి శాఖ గొప్ప అభివృద్ధిని పొందుతోందని కొనియాడారు.

IMA కార్యదర్శి Dr .A .R. Reddy గారు మాట్లాడుతూ…. ఇదివరకు వారం రోజులపాటు ఇబ్బంది పడే రోగాలకు ఇప్పుడు ఒక రోజులో పరిష్కారం లభిస్తున్నదనీ…. ఒక రోజులో తగ్గే జ్వరాలు రూపాంతరం చెంది డెంగ్యూ తదితర వ్యాధుల రూపంలో ప్రజలని పట్టి పీడిస్తున్నాయనీ చెప్తూ…. “సీన్ రివర్స్” అయ్యినదని ఛలోక్తిగా వివరించారు.

 

%d bloggers like this: