[google-translator]

Live Tirupati Shivaji’s Special Article

*లైవ్ తిరుపతి శివాజీస్ స్పెషల్ ఆర్టికల్*

 

ఈమధ్య ఎంతోమంది చిన్న చిన్న పేపర్ వాళ్ళు, అలాగే ఊరుపేరులేని, చిన్న చిన్నటి.వి ఛానళ్ల వాళ్ళు తిరుపతి నియోజకవర్గం గురించి రకరకాల సొంత కథనాలు వండి వారుస్తున్నారు. ఆ వంటకాలు సరిగ్గా చేస్తే …. అసలు ఈ పోస్ట్ వచ్చేదే కాదు. అసలుదినుసులు మరచి అక్కరకు రాని మసాలాలు వేస్తూ ఉండటటమే ఈ పోస్ట్ కి నాంది.

 

దివంగత నేత, ప్రియతమ నాయకుడు స్వర్గీయ. మన్నూరు వెంకటరమణ గారి మరణం తర్వాత అనుకోని పరిస్థితుల్లో, మరియు తిరుపతి ప్రజలకు ఆయన చేసిన వాగ్దానాలను తప్పనిసరిగా నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో ఆయన సతీమణి ఐన శ్రీమతి. మన్నూరు సుగుణమ్మ గారు మన తిరుపతి MLA గా అడుగిడితే… ప్రజానీకం సైతం మనస్ఫూర్తిగా స్వాగతించి అద్భుతమైన మెజారిటీతో గెలిపించి తమ అక్కున చేర్చుకోవటం జరిగింది.

ఆమె ఒక గృహిణి. ఏం చేయగలదు.? ఇప్పటి వరకూ బయటికే రాని ఆమె నియోజకవర్గమంతా ఎలా తిరుగగలదు..? అనే రకరకాల విమర్శలకు చెక్ పెడుతూ.. ఈరోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి మానస పుత్రికలైన గ్రామ దర్శిని,దళిత తేజం,నగర దర్శిని మొదలైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ,స్థానిక టి.డి.పి శ్రేణులను కలుపుకొనిపోతూ, అను నిత్యం ప్రజలలో మమేకమౌతూ సాగుతున్న సుగుణమ్మ గారి ఫ్యామిలీ పై ఈ మధ్య కొంతమంది స్వార్థపరులు తమ స్వప్రయోజనాలకోసం బురదజల్లడం ప్రారంభించారు.

 

వారు ఎవరైతేనేమి..? వారు లేవనెత్తుతున్న అంశాలకు నా ప్రశ్నలు మరియు సమాధానాలివే..?

*ప్రశ్న- 1?*

  1. సుగుణమ్మ గారికి వ్యతిరేకంగా తుడా ఛైర్మన్ శ్రీ నరసింహ యాదవ్ గారు పని చేస్తున్నారని.

 *నా సమాధానం:* మీకు శ్రీ నరసింహ యాదవ్ గారు అలా చేస్తున్నారని ఎందుకనిపించింది…?

ఏమైనా ఫోన్ సంభాషణలు లేదా ఈ – మెయిల్, వాట్స్ అప్ మెసేజెస్ లాంటి ప్రూఫ్ లు మీదగ్గర ఉన్నాయా…?

మరెందుకు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపాలనుకుంటున్నారు…? ఏ ఫంక్షన్ అయినా మీటింగ్ అయినా,ఓపెనింగ్ అయినా, జన్మ లేదా మరణ కార్యక్రమాలలోనైనా, వాళ్లిద్దరూ కలిసి పని చేస్తుంటే మీకెందుకీ కుట్ర రాజకీయాలు..? ఎవరు మిమ్మల్ని ఇలా వ్రాయమని ప్రోత్సహించేది..?

*ప్రశ్న- 2?*

  1. సుగుణమ్మ గారి అల్లుడు బి.ఎల్. సంజయ్ గారి పెత్తనం వల్ల ఆమెకు చేటని వ్రాసారు.

 *నా సమాధానం:*

 సంజయ్ అనే వ్యక్తి ఏనాడైనా ప్రభుత్వ కార్యక్రమాలలో MLA ని పక్కనపెట్టి, తానే స్వయంగా పాల్గొని ఫొటోలకి పోజులిచ్చాడా….?

ఏ ప్రైవేట్ కార్యక్రమంలోనైనా తానే MLA గా వ్యవహరించాడా….?

  1. ఎప్పుడైనా ఎవరినైనా స్థలాల కోసం లేదా ఇతర జిల్లాలలో జరుగుతున్న తరహాలో ఇసుక మాఫియా

 తదితర విషయాలలో తలదూర్చాడా..?

(నోట్: అలా చేసివుంటే ఈ పాటికి చట్టం తన పని తాను చేసుకు పోయేది. అవునా.. కాదా..?)

  1. ఇళ్ల స్థలాల విషయంలో గానీ,పింక్షన్ల విషయంలో గానీ ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్లు దాఖలాలున్నాయా…?

మీరే ఆలోచించండి. ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.

ఎవరో చెప్పారని, గాలి మాటలను నమ్మి ఒక దివంగత నేత కుటుంబం పై బురదజల్లటం ఎంత వరకు న్యాయమని, సమంజసమని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.

నిరంతరం ప్రజల బాగు కోసం పాటుబడుతూ…నిత్యం ప్రజలతో మమేకమై ఉండే ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కుని కోల్పోయినందుకు సానుభూతి తెలపాల్సింది పోయి, బురదజల్లటం ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరముందని, అలాగే ప్రతి ఒక్కరికీ ఆప్తుడు మరియు అన్నా… అని పిలిస్తే పలికే నరసింహన్న మీద అనవసరంగా అభాండాలు వేయటం నిజంగా బాధాకరమని భావిస్తూ, దయచేసి ఇలాంటి పుకార్లతో మన “స్మార్ట్ తిరుపతి టి.డి.పి” కుటుంబంలో చిచ్చు పెట్టవద్దని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

నోట్: ఇది ఒక ఫ్యామిలీకి మరియు ఒక మంచి వ్యక్తికి మధ్య చిచ్చు పెట్టటం చూడలేక నా మనస్ఫూర్తిగా అనిపించిన నా స్వంత అభిప్రాయం.

 

*శివాజి,CEO,లైవ్ తిరుపతి*

ఫోన్: +91 97040 12327

www.livetirupati.com

e-mail: livetirupati.com@gmail.com