[google-translator]

Heartful Thanks to A.P C.M & Govt. – Polthi Prathap Rao

గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  నిన్న అనగా 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే.

ఈ సందర్భంగా…. ఈరోజు అనగా 22 -08 -2017 న మంగళవారం తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ నందు పాల్గొన్న ఫెడరేషన్ ఆఫ్ ఎక్సపీరియెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ పోల్తి ప్రతాప్ రావు, రాష్ట్ర కార్యదర్శి రుద్రయ్య, కార్యవర్గ సభ్యులు జె.కె.రామ్ మరియు చిత్తూరు జిల్లా ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులందరూ ముక్తకంఠంతో….  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు ప్రభుత్వానికి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ కామినేని శ్రీనివాసులు గారికి అలాగే, ఇందుకు సహకరించిన యమ్ఎల్ సి శ్రీ టీడీ జనార్ధన గారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ పోల్తి ప్రతాప్ రావు మాట్లాడుతూ… కనీసం ఇప్పటికైనా గ్రామీణ వైద్యమిత్రులందరికీ మంచి రోజులు రాబోతున్నందుకు సంతోషంగా ఉందనీ… కొంత ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో కుటుంబాలకు చక్కని చిరుదివ్వెను చూపిస్తూ…. వారి బ్రతుకులకు బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు.

%d bloggers like this: