[google-translator]

Hats off to Accord School Students

అకార్డ్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్నిశనివారంనాడు వైభవంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా వచ్చిన 47,000 /- రూపాయలను ఈరోజు అనగా 06 -09 -2017 న అకార్డ్ స్కూల్ విద్యార్థులు, మానవతా దృక్పథముతో తస్లీమా సుల్తానా ఆధ్వర్యములో నడుపబడుతున్న అభయక్షేత్రానికి వెళ్లి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ చంద్రశేఖర రెడ్డి గారు విద్యార్థుల పరోపకారగుణాన్ని మెచ్చుకొంటూ అభినందించారు.

ఈవిధమైన సామాజిక కార్యక్రమాలలో విద్యార్థులను మమేకం చేయటం నిజంగా హర్షించదగిన విషయం. చిన్నతనం నుంచే ఇలాంటి సామాజిక స్పృహ అలవడితే మన భారత దేశ భావి పౌరులు తప్పనిసరిగా దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇలాంటి కార్యక్రమాలలో తమ విద్యార్థులను మమేకం చేస్తున్న మన టెంపుల్ టౌన్  తిరుపతిలోని చిగురువాడకు చెందిన అకార్డ్ స్కూల్ యాజమాన్యాన్ని మా లైవ్ తిరుపతి.కామ్ మనస్ఫూర్తిగా అభినందిస్తోంది.

పద్మావతి దేవిరెడ్డి,
చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్,
లైవ్ తిరుపతి.కామ్

 

.

%d bloggers like this: