[google-translator]

Dear C.M Sir… Pls. know the Value of MBBS Doctors – A.R. REDDY

రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై…. మంగళవారం ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలనీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ. ఎ.ఆర్.రెడ్డి హెచ్చరించారు.

గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే.

ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీ. ఎ.ఆర్.రెడ్డి గారు మాట్లాడుతూ…. ఈ రోజుల్లో MBBS సీట్ తెచ్చుకోవటమంటే ఒక కఠోర తపస్సు చేసినట్లనీ, చిన్నప్పటినుంచీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, వ్యయ ప్రయాసలకోర్చి పూర్తిచేసిన డాక్టర్ పట్టతో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లకు మన రాష్ట్రం లో విలువ లేకుండా పోతుందనీ, ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండా కేవలం ఆరునెలల శిక్షణతో రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలను MBBS డాక్టర్లతో సమానంగా పరిగణించాలని చూస్తున్న చంద్రబాబుకు అసలు MBBS కున్న విలువ తెలియదనీ, తెలిస్తే ఇలాంటి చవకబారు ప్రకటనలను చేయరని తెలిపారు.

పొరపాట్లు చేయటం మానవ సహజమని, కనీసం ఇప్పటికైనా మెడికల్ విద్యపై అవగాహన తెచ్చుకొని జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా…. మంగళవారం ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలనీ IMA తరఫున విజ్ఞప్తి చేశారు. లేదంటే ఎటువంటి ఉద్యమాలకైనా IMA సిద్ధమని హెచ్చరించారు.

IMA కోశాధికారి డా|| యుగంధర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు చాలా దారుణంగా ఉన్నాయనీ, అలాగే MBBS, M.D, FRCS తదితర కష్టసాధ్యమైన వైద్యవిద్యనభ్యసించిన గొప్ప డాక్టర్లను అవమాన పరిచే విధంగా ఉన్నాయని, ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకుంటే మంచిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో IMA నగర ఉపాధ్యక్షులు డా|| రవిరాజు, మరియు స్థానిక డాక్టర్లు పాల్గొన్నారు.

%d bloggers like this: