[google-translator]

Health News Special: Liver problems Awareness Article

కాలేయ సమస్యల అవగాహన:

 

ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అసహజ ఆహారపు అలవాట్లు, జీవన విధానం మరింతగా కాలేయ సమస్యలను జటిలం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆరోగ్య సమస్య గా మారిపోయింది. సరైన అవగాహన లేకపోవడం వలన వ్యాధి మరింత ముదిరి ప్రాణం మిదకు తెచ్చుకుంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి ? కాలేయ సమస్యలకు జీవితం బలి కావల్సిందేనా?

.

Image result for liver

జీవన క్రీయలో కాలేయం పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కడుపులో ముదురు ఎరుపు రంగులో ఉండి, మెత్తగా ఉండి, కడుపులో కుడి భాగాన ఉదార విధానం కింద ఉంటుంది. కాలేయానికి రెండూ లోబ్స్‌ ఉంటాయి. వీటిలో నాలుగేసి విభాగాలుంటాయి. వీటిని సెగ్మెంట్స్‌ అంటారు. కాలేయంలో ప్రతి సెగ్మెంట్‌కు రక్త ప్రసరణ చేసి, తిరిగి వెనక్కు తెచ్చే నాళాలుంటాయి. కాలేయాలు మూడవ వంతు ఆరోగ్యంగా ఉన్నా ఆది చేసే పనులన్ని చేయగలుగుతుంది. కాలేయం చేసే పనులు చాలా ఉన్నాయి. రక్తంలోని విష పదార్ధాలను తొలగిస్తుంది. జీర్ణమైన ఆహారంలోని పోషకాలను స్వీకరిస్తుంది.

కాలేయం సెక్యూరిటీ గార్డులాగా పని చేసి మనలను కాపాడుతుంది. కాలేయంలో 70 శాతం దెబ్బతిన్న మిగిలిన అన్ని పనులను నిర్వర్తించగలుగుతుంది. కాలేయ సమస్యలతో ముందుగా చెప్పుకోవలసింది హెపటైటిస్‌-బి,  హెపటైటిస్‌-సి, క్రానీక్‌ వైరల్‌ హెపటైటిస్‌, అల్కహాలిక్‌ హెపటైటిస్‌.

 

వైరల్హెపటైటిస్‌:

related content

వైరస్‌లు కాలేయంలో చేరి కాలేయాన్ని పాడు చేస్తాయి. దీని వలన కొన్ని కణాలు చనిపోవడం వలన హెపటైటిస్‌ వస్తుంది. ముందు సామాన్య లక్షణాలుగా కనబడి తరువాత క్రానిక్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికిసునాయసంగా వ్యాపిస్తుంది. ఒక్కొక్క రకం వైరస్‌ వలన వచ్చే హెపటైటిస్‌ ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తారు. ఈ వైరస్‌లను హెపటో ట్రోఫిక్‌ వైరస్‌ అంటారక్‌ వీటిలో హెపటైటిస్‌-ఎ,హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి,హెపటైటిస్‌-ఇ , మొదలైనవి దీర్ఘకాలికంగా మారి క్యాన్సర్‌, లివర్‌ సిర్రోసిస్‌, అసైటిస్‌ రావటానికి ప్రధాన కారణం అవుతాయి.

 

హెపటైటిస్సి:

Image result for hepatitis c

హెపటైటిస్‌ సి భారతదేశంలో దాదాపు 14 మిలియన్ల మందిని బాధిస్తున్నది. ప్రతి సంవత్సరం దాదాపు 35,000 వేల కేసులు ఉంటున్నాయి.ఈ వ్యాధి వలన 8000 వేల నుంచి 10,000 వేల మంది దాకా చనిపోతున్నారు. 85 శాతం కేసులో మొండిగా మారి ఇబ్బంది పడుతున్నారు. హెపటైటిస్‌ సి వలన కొంత కాలేయం పాడైపోవడం వలన ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్‌ సి ఇతరులకు సంక్రమింప చేయగలదు. కాలేయం పాడైపోతుంది.

 

ఆల్కహాలిక్హెపటైటిస్‌:

.

Image result for livers affected by alcohol

మద్యం అలవాటు ఉన్నవారికి ఇది కనబడుతుంది. అలవాటు వలన కాలేయం పాడైపోతుంది. అతిగా మద్యం సేవించడం వలన శరీరానికి పోషకాలు అందక పోవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం, రోగ నీరోదక శక్తి తగ్గిపోవడం, గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు, పాంక్రియాస్‌ దెబ్బతినడం వంటి లక్షణాలు కనబడుతుంటాయి.

 

ఫాటీ లివర్‌:

Image result for fatty liver

కాలేయంలోని కణాల స్థానంలో కొవ్వు పేరుకోవడాన్ని ఫాటీ లివర్‌ అంటారు. మద్యం తీసుకునే వారిలో ఇది ఎక్కువగా కనబడుతుంది. క్రమంగా కాలేయం ఉబుతుంది. కడుపులో నొప్పి, ముఖంపైన, బుగ్గలపైన మచ్చలు కనిపిస్తుంటాయి.

 

లక్షణాలు:

అమితమైన నీరసం, విపరీతమైన ఆలసట, జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, ఆకలి తగ్గడం, వికారం, కుడివైపున డొక్కలోనొప్పి, తరుచుగా విరేచనాలు, బరువు తగ్గడం, మూత్రం పసుపు పచ్చగా, కొన్నిసార్లు ఎరుపు రంగులో ఉంటుంది. కండరాల నోప్పులు, కీళ్ల నోప్పులు, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి.

.

Image result for liver precautions

 

జాగ్రత్తలు:

*మద్యం తాగడం మానివేయాలి.

*మానసిక ఒత్తిడిని తొలగించుకోవాలి.

*ఆల్కహాల్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

*కలుషిత నీరు, ఆహారాన్ని తీసుకోకూడదు.

*కొవ్వు పదార్థ్ధాలు తీసుకోవడం తగ్గించాలి.

*బాగా వుడికిన ఆహార పదార్ధాలనే తినాలి.

*పండ్ల పై చర్మము తీసి శుభ్రంగా తినాలి.

*భోజనానికి ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి.

*వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.

 

Dr. S. Sudhakar

SURGICAL GASTROENTEROLOGIST
& LAPAROSCOPIC SURGEON

సంకల్ప సూపర్ స్పెషలిటీ హాస్పిటల్” 

తుడా ఆఫీస్ రోడ్, తిరుపతి. Ph: 88866 96040, 77027 11176

.

Pls. Click any of the above Images….

to get Suggestions or Book an Appointment

 With Sr. Doctors & Specialists