Today’s Devotional E-Paper -26-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

26/02/2019 , మంగళవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :బహుళ
సూర్యోదయం :

6.35AM
సూర్యాస్తమయం :

6.17PM
తిథి
:

సప్తమి
10.17AM
నక్షత్రం
:

Anuradha 3.38AM
యోగం
:

వ్యాఘా
3.40PM
కరణం
:

బవ
10.17AM
బాల
10.10PM
అమృతఘడియలు
:

5.12PM-6.48PM
వర్జ్యం
:

7.34AM-9.10AM
దుర్ముహూర్తం
8.55AM-9.42AM
11.12PM-12.01AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

26/02/2019 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Bahula
SunRise :

6.35AM
SunSet :

6.17PM
Tithi :

Sapthami 10.17AM
Nakshatram :

Anuradha 3.38AM
Yogam :

Vyagha 3.40PM
Karanam :

Bava 10.17AM
Bala 10.10PM
AmruthaGadiyalu :

5.12PM-6.48PM
Varjyam :

7.34AM-9.10AM
Durmuhurtham 8.55AM-9.42AM
11.12PM-12.01AM

 
 
26/02/2019 , Tuesday
06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell
07:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి, 2019 ఫిబ్ర‌వ‌రి 25: టిటిడికి అనుబంధంగా ఉన్న‌ త‌రిగొండలోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రాత్రి జ‌రిగిన హంస వాహ‌న‌సేవ‌లో జెఈవో అవిష్క‌రించారు.

బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 13 నుంచి 21వ తేదీవ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో మార్చి 13న ధ్వ‌జారోహ‌ణం, మార్చి 18న క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌, మార్చి 19న‌ ర‌థోత్స‌వం, మార్చి 20న పార్వేట ఉత్స‌వం, మార్చి 21న చ‌క్ర‌స్నానం, మార్చి 22న పుష్ప‌యాగం జ‌ర‌గ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Dept of PRO TTD

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

రెండో రోజు రాత్రి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీరూపంతో భక్తులను అనుగ్రహంచారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడిస్తాడు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మలమనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు సెలవిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

 

HAMSA VAHANA SYMBOLISES PARAMAHAMSA SWAUPA

 

On the second day evening, the processional deity of Sri Kalyana Venkateswara Swamy took celestial ride on the Hamsa Vahanam as Goddess of Wisdom, Saraswathi Devi.

Hamsa, the divine swan has the unique quality of distinguishing water from milk which is the Pamahamsa Tatva as per Hindu Mythology. By taking celestial ride on this vehicle, Lord preaches that He is Paramahamsa and He weeds out bad from good in the society.

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Superintendent Chengalrayulu and others were also present.

 

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా సోమ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో ఎస్‌.వి.సంగీత కళాశాల ఆధ్వ‌ర్యంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివ‌ర్శిటి ఆధ్వర్యంలో ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్‌ ధార్మికోప‌న్యాసం చేశారు. ఇందులో ఆళ్వార్లు వారి జీవిత విశేషాలు, వారు స్వామివారిని ఏవిధంగా సేవించి త‌రించారో వివ‌రించారు.

సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు కుప్పంకు చెందిన జి.ఎల్‌.జ్ఞానాంబ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు
. సాయంత్రం 6.00 నుండి 7.00 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో తిరుప‌తికి చెందిన కె.విశాల‌క్ష్మి అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆలపించారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన ఆర్‌.ఎస్‌.ఎస్‌.శైలేశ్వ‌రి బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు భ‌క్తి సంగీతం వినిపిచారు.

అదేవిధంగా తిరుపతిలోని రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాదుకు చెందిన ప్రియ‌మోహ‌న్ బృందం నామ‌సంకీర్త‌న కార్య‌క్ర‌మం నిర్వహించారు.

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——