Today’s Devotional E-Paper -24-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

24/02/2019 , ఆదివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :బహుళ

సూర్యోదయం :

6.37AM

సూర్యాస్తమయం :

6.17PM
తిథి
:

పంచమి
12.05PM
నక్షత్రం
:

స్వాతి
3.44AM
యోగం
:

వృద్ధి
7.20PM
కరణం
:

తైతుల
12.03PM
గరజి
11.29PM
అమృతఘడియలు
:

7.08PM-8.42PM
వర్జ్యం
:

9.45AM-11.19AM
దుర్ముహూర్తం
4.44PM-5.30PM

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

24/02/2019 , Sunday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Bahula
SunRise :

6.37AM
SunSet :

6.17PM
Tithi :

Panchami 12.05PM
Nakshatram :

Swathi 3.44AM
Yogam :

Vruddhi 7.20PM
Karanam :

Taitula 12.03PM
Garaji 11.29PM
AmruthaGadiyalu :

7.08PM-8.42PM
Varjyam :

9.45AM-11.19AM
Durmuhurtham 4.44PM-5.30PM

 
 
24/02/2019 , Sunday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శ‌నివారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరిగింది.
అంకురార్పణం సందర్భంగా శ‌నివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
          ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూపరింటెండెంట్‌  శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 24న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.00 నుండి 9.18 గంటల మధ్య మీన‌ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
24-02-2019(ఆదివారం)   ధ్వజారోహణం( మీన‌ లగ్నం) పెద్దశేష వాహనం
25-02-2019(సోమవారం)  చిన్నశేష వాహనం హంస వాహనం
26-02-2019(మంగళవారం)          సింహ వాహనం       ముత్యపుపందిరి వాహనం
27-02-2019(బుధవారం)     కల్పవృక్ష వాహనం         సర్వభూపాల వాహనం
28-02-2019(గురువారం)    పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)  గరుడ వాహనం
01-03-2019(శుక్రవారం)    హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం
02-03-2019(శనివారం)    సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-03-2019(ఆది వారం)  రథోత్సవం అశ్వవాహనం
04-03-2019(సోమవారం)  చక్రస్నానం         ధ్వజావరోహణం 
తిరుమలలో ఫిబ్రవరి 24న అనంతాళ్వారు 965వ అవతారోత్సవం
శ్రీ వైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 965వ అవతారోత్సవం ఫివ్రబరి 24న ఆయన వంశీకులు తిరుమలలోని పురుశైవారి తోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 
సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా ఆయన వంశీకులు తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా పరిగణించడం ఆనవాయితీ. ఆనాడు దేశ వ్యాప్తంగా స్థిరపడివున్న అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచానాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 500 వందలకు పైగా అనంతాళ్వారు వంశీయులు ఈ అవతారోత్సవంలో పాల్గొంటారు.
చారిత్రక నేపథ్యంలో శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపుగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీరామానుజాచార్యులతో కూడి అవిర్భవించినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కూడి స్వామివారి ఆలయం చెంత ఒక పూతోటను నిర్మిస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యాన వన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్త స్రావణం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపార భక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రుడైనాడు.
నేటికి శ్రీవారి ఆలయంలో స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్య గాథను స్పురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తున్నది. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొననున్నారు.
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుంజనం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 6 వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీరాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
——————————————–
ఫిబ్రవరి 24న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం ఫిబ్రవరి 24న ఆదివారం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీవినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.
ఏర్పాట్లు పూర్తి :
బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
ఫిబ్రవరి 25న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 25వ తేదీ సోమ‌వారం ఉదయం 7.19 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి. 
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ             ఉదయం                                              సాయంత్రం
25-02-2019 (సోమవారం)  ధ్వజారోహణం(కుంభలగ్నం)        హంస వాహనం
26-02-2019(మంగళవారం)  సూర్యప్రభ వాహనం        చంద్రప్రభ వాహనం
27-02-2019(బుధవారం)         భూత వాహనం           సింహ వాహనం
28-02-2019(గురువారం)       మకర వాహనం          శేష వాహనం
01-03-2019(శుక్రవారం)           తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
02-03-2019(శనివారం)        వ్యాఘ్ర వాహనం          గజ వాహనం
03-03-2019(ఆదివారం)        కల్పవృక్ష వాహనం    అశ్వవాహనం
04-03-2019(సోమవారం)      రథోత్సవం(భోగితేరు)             నందివాహనం
05-03-2019(మంగళవారం)    పురుషామృగవాహనం       కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం  
06-03-2019(బుధవారం)     శ్రీనటరాజస్వామివారి  రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం.             ధ్వజావరోహణం.

 

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——