Today’s Devotional E-Paper -23-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

23/02/2019 , శనివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :బహుళ

సూర్యోదయం :6.37AM

సూర్యాస్తమయం :6.16PM

తిథి:చవితి1.33PM

నక్షత్రం:చిత్ర4.19AM

యోగం:గండం9.38PM

కరణం:బాల1.33PM
కౌలవా12.48AM

అమృతఘడియలు:10.09PM-11.42PM

వర్జ్యం :12.56PM-2.28PM

దుర్ముహూర్తం 6.37AM-8.10AM

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

23/02/2019 , Saturday
Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Bahula
SunRise :

6.37AM
SunSet :

6.16PM
Tithi :

Chavithi 1.33PM
Nakshatram :

Chitra 4.19AM
Yogam :

Gandam 9.38PM
Karanam :

Bala 1.33PM
Koulava 12.48AM
AmruthaGadiyalu :

10.09PM-11.42PM
Varjyam :

12.56PM-2.28PM
Durmuhurtham 6.37AM-8.10AM

 
 
23/02/2019 , Saturday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

నూతన శ్రీవారిసేవ భవన సముదాయాల పూజలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్‌
తిరుమలలో నూతన శ్రీవారిసేవ భవన సముదాయాల్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన  పూజా కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపుట్టా సుధాకర్‌ యాదవ్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ మొత్తం రూ.96 కోట్ల వ్యయంతో కల్యాణవేదిక వెనుక వైపు మహిళాసేవకుల కోసం సేవాసదనం-1, పురుష సేవకుల కోసం సేవాసదనం-2 భవనాలను ఆధునిక వసతులతో నిర్మించినట్టు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ భవనాలపట్ల శ్రీవారి సేవకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు సేవ చేసే అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది శ్రీవారి సేవకులు వచ్చే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక్కో భవనంలో 3 అంతస్తుల్లో 16 హాళ్లు ఉన్నాయని, దాదాపు 2 వేల మంది బస చేయవచ్చని వివరించారు. అదేవిధంగా, 224 స్నానపు గదులు, వేడినీటి సౌకర్యం, 278 మరుగుదొడ్లు, 700 మందికి భోజనశాల(బఫె సిస్టమ్‌), రిజిస్ట్రేషన్‌ హాలు, సత్సంగం హాలు, రిక్రియేషన్‌ హాలు, రెండు లిఫ్టులు, లాకర్లు, మంచాలు ఉన్నాయని తెలియజేశారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో 2000వ సంవత్సరంలో 195 మందితో శ్రీవారి సేవ అనే స్వచ్ఛంద సేవ ప్రారంభమైందని, ప్రస్తుతం ప్రతిరోజూ 1,500 మందికి తగ్గకుండా, పర్వదినాల్లో 3,000 నుండి 3,500 మంది వరకు శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని ఛైర్మన్‌ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇటీవల జరిగిన శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో శ్రీవారి సేవకులు విచ్చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు శ్రీవారి సేవకుల సేవలను అభినందించారన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి,  ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, డిఇ శ్రీమతి సరస్వతమ్మ, ఇఇలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమల్లికార్జునప్రసాద్‌, శ్రీ శ్రీహరి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, డెప్యూటీ ఇఇలు శ్రీ రాజశేఖర్‌, శ్రీ వెంకటరమణ, శ్రీమతి రమాదేవి, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ పి.గోపాలరావు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ ఎస్‌.ప్రసాద్‌ బాబు ప్రమాణస్వీకారం
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీ ఎస్‌.ప్రసాద్‌బాబు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ నూతన సభ్యుడితో ప్రమాణం చేయించారు.
శ్రీ ప్రసాద్‌బాబు స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సెల్‌ డెప్యూటీ ఈవో శ్రీమతి సి.మల్లీశ్వరిదేవి, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 23న  శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి  25 నుండి మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. 
ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 8.00 నుండి 11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
మార్చి 7న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను మార్చి 7వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.
ఇందులో మిక్సిడ్‌ బియ్యం 18,560 కేజిలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు. 
ఆసక్తి గలవారు మార్చి 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, తితిదే” పేరిట రూ.3,000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ గీగీగీ.శిరిజీతిళీబిజిబి.ళిజీవీ సంప్రదించగలరు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ఫిబ్రవరి 23న అంకురార్పణం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. 
ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7.00 నుండి 8.45 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.00 నుండి 9.18 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
భక్తులకు అన్నప్రసాదాలు :
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహనసేవల సమయంలో భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి రోజుకు 3 వేల చొప్పున లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.
ప్రదర్శనశాలలు సిద్ధం :
భక్తులు వీక్షించేందుకు వీలుగా పలు స్వామివారు ఊరేగే వాహనాలతో ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. అదేవిధంగా భక్తుల కొర‌కు టిటిడి పుస్తకవిక్రయశాల, మీడియా సెంటర్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరిసర గ్రామాల్లో ధర్మప్రచార రథం :
బ్రహ్మోత్సవాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు పరిసర గ్రామాల్లో ధర్మప్రచార రథం పర్యటిస్తోంది. ఇందులో కరపత్రాలను పంపిణీ చేసి భక్తులను ఆహ్వానిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రచార రథం బ్రహ్మోత్సవాలపై ప్రచారం చేస్తున్నారు.
ఆకట్టుకునేలా అలంకరణలు :
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 5 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.
నూతన శ్రీవారిసేవ భవన సముదాయాలను తనిఖీ చేసిన జెఇఓ
   తిరుమలలో నూతన శ్రీవారిసేవ భవన సముదాయాలను శుక్రవారం సాయంత్రం టిటిడి తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ఐఏఎస్ తనిఖీ చేశారు.
          ఈ సందర్భంగా జెఈఓ శ్రీవారిసేవకులతో మాట్లాడుతూ ఇక్కడ మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఆధునిక వసతులతో భవనాలు నిర్మించినట్టు తెలిపారు.  శ్రీవారి సేవకులు వీటిని సద్వినియోగం చేసుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని కోరారు. బయటివ్యక్తులు రాకుండా వికెట్ గేట్ ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బందిని నియమించాలని, ఇక్కడి కాలువను సుందరీకరించాలని ఇంజినీరింగ్, భద్రత అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ భవనాల్లో శ్రీవారిసేవకులకు కల్పించిన వసతులను తనిఖీ చేశారు. శ్రీ‌వారి సేవ‌కులు బ‌స చేసేందుకు ఏర్పాటుచేసిన మంచాలను, మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశీలించారు.
 జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి,  విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఇఇలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమల్లికార్జునప్రసాద్‌, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ పి.గోపాలరావు ఇతర సిబ్బంది ఉన్నారు.
శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఏఐసిసి అధ్య‌క్షుడు శ్రీ రాహుల్‌గాంధీ
   అఖిల‌భార‌త కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసిసి) అధ్య‌క్షుడు శ్రీ రాహుల్‌గాంధీ శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు.
            శ్రీ రాహుల్ గాంధీ త‌న బృందంతో క‌లిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ప్ర‌వేశించి సాధార‌ణ భ‌క్తుల త‌ర‌హాలో మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం చేసుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌క మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, ఐఏఎస్ శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని శ్రీ రాహుల్ గాంధీకి అందించారు. 
             ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ముఖ‌మంత్రి శ్రీ న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి, కేర‌ళ మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ ఉమెన్ చాంది, టిటిడి మాజీ ఛైర్మ‌న్లు శ్రీ టి.సుబ్బ‌రామిరెడ్డి, శ్రీ క‌నుమూరి బాపిరాజు, టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం నిర్మాణపనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
———————————————
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం నిర్మాణం పనులను శుక్రవారం ఉదయం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు. 
              ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన 25 ఎకరాలలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్నిరెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలియజేశారు. జనవరి 31వ తేదిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆలయ స్థలంలో  శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి ఆగ‌మోక్తంగా భూక‌ర్ష‌ణం, బీజావాప‌నం కార్య‌క్ర‌మాలు వైభవంగా జ‌రిగాయని తెలిపారు.  ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. మొదటి దశలో  అంతర ప్రాకారం, బాహ్య ప్రాకారం, మహారాజ గోపురం, కల్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం తదితర నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయ నిర్మాణ నమూనాను సందర్శించారు. 
            ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీ ఆర్.రాజేంద్రుడు,ఈఈ శ్రీ ఎస్. ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 
హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం పనుల పరిశీలన
హైదరాబాద్ లో ప్రారంభానికి ముస్తాభవుతున్న శ్రీవారి ఆలయాన్ని టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టిలతో కలసి  గురువారం  టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.  త్వరలో శ్రీవారి ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్ పనులను మార్చి మొదటివారం లోపు  వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణం అంతా అధికారులతో కలసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  
      ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీ అశోక్ కుమార్ గౌడ్, డిప్యూటీ ఈవో శ్రీ పి.విశ్వనాథ్, డిఎఫ్ వో శ్రీ ఫణికుమార్ నాయుడు, ఎస్ఈ – 3 శ్రీ రాములు, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——