Today’s Devotional E-Paper -22-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

22/02/2019 ,శుక్రవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :బహుళ

సూర్యోదయం :6.37AM

సూర్యాస్తమయం :6.16PM

తిథి:తదియ 3.24PM

నక్షత్రం :హస్త 5.15AM

యోగం :సూలం 12.12AM

కరణం
:భద్ర 3.24PM
బవ 2.29AM

అమృతఘడియలు :11.32PM-1.03AM

వర్జ్యం :2.25PM-3.56PM

దుర్ముహూర్తం
8.57AM-9.43AM
12.50PM-1.36PM

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

22/02/2019 , Friday 

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Bahula
SunRise :

6.37AM
SunSet :

6.16PM
Tithi :

Tadiya 3.24PM
Nakshatram :

Hastha 5.15AM
Yogam :

Soolam 12.12AM
Karanam :

Bhadra 3.24PM
Bava 2.29AM
AmruthaGadiyalu :

11.32PM-1.03AM
Varjyam :

2.25PM-3.56PM
Durmuhurtham 8.57AM-9.43AM
12.50PM-1.36PM

 

* Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
PARAKAMANI – RS. 2.54 CRORES.
     TOTAL PILGRIMS HAD DARSHAN ON 21.02.2019: 63,379.
V.Q.C SITUATION AT 05:00 AM ON 22.02.2019
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 14,
APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 08 HOURS.
 
Dept of PRO TTD
 
 
22/02/2019 , Friday
02:30-03:00 hrs
Suprabhatam
03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam
04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam
06:00 – 07:00 hrs
Samarpana
07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)
09:00 – 20:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.
20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
21:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

_ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం రద్దు చేశారు.

పరదాలు విరాళం :

తిరుపతికి చెందిన శ్రీ నరసింహులు నాలుగు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 23న అంకురార్పణ :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శ‌నివారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

నాటి సిద్ధకూటమే నేటి శ్రీనివాసమంగాపురం :

క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్యపరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.

అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులు శ్రీకళ్యాణవేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు. ప్రకృతివైపరీత్యాలకు యవనుల దండయాత్రలకులోనై, శిథిలమైన ఈ గుడిని గోపురాలను పునర్‌నిర్మించి శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటుచేసి ఉత్సవాలు ఊరేగింపులు చిన తిరుమలయ్య నిర్వహించినట్లు అప్పటి శాసనాలు చెబుతున్నాయి.

అర్చకులు శ్రీ సుందరరాజస్వామివారి నుంచి 1967వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకుంది. ఆలయాన్ని పునరుద్ధరించి దిట్టం ఏర్పరిచింది. 1981వ సంవత్సరం నుంచి స్వామివారి నిత్యకల్యాణం, సాక్షాత్కార వైభవోత్సవం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

KOIL ALWAR TIRUMANJANAM PERFORMED IN SKVST

Ahead of annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple, at Mangapuram from February 24 the holy ritual of Koil Alwar was performed on Thursday morning.

The ritual took place early morning after daily pujas where in the temple walls, ceiling, and puja material were cleaned with traditional herbs like Nama Kolu, Srichurnam, Kasturi Pasapuleti, karpuram crystals, sandal powder, kichili gadda and aromatic water. Darshan commenced only after 11.30am are and arjita sevas of kalyanotsavam and Tiruppavada Seva were cancelled.

DONATIONS

Devotee from Tirupati presented two ornaments to temple for use in Brahmotsavams. DyEO of temple Sri Dhananjayulu, AEO Sri Lakshmi, Supdt Sri Ramanaiah, temple inspector Sri Anil.

ANKURARPANAM ON FEB 23

The Ankurarpanam will be conducted at 6.00 am on February 23 and all arrangements are made for the Brahmotsavams fete.

LEGEND OF SKVST

Rock edicts of 1433 show that 24 Vedic pundits of Srinivasa Mangapuram (erstwhile Sidda Katte) were appointed to perform Veda parayanam at Srivari Temple by Devayaya-2 of Vijayanagar Empire and granted funds also.

The temple legends also says that descendants of Tallapaka Annamacharya (Chinna Tirumalaiah) had rejuvenated it and Achutarayalu ruler of Chandragiri had exempted Mangapuram village from taxes and donated it to Sri Kalyana Venkateswara Swamy Temple. China Tirumalaiah also launched festivities, dailies rituals and also repairs to temple Gopuram.

In 1967 the temple was taken over by TTD from Archaka Sri Sundararajaswami and Brahmotsavams and festivals conducted since 1981.

 

 టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ వేనాటి రామ‌చంద్రారెడ్డి ప్రమాణస్వీకారం

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ వేనాటి రామ‌చంద్రారెడ్డి గురువారం ఉద‌యం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ప్ర‌మాణం అనంత‌రం స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌రువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి సి.మల్లీశ్వరిదేవి, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

NEW BOARD MEMBER SWORN IN_

Sri Venati Ramachandra Reddy of Nellore, took oath as TTD Trust Board member in Tirumala on Thursday in Srivari temple.

After the oath taking, he had darshanam of Lord Venkateswara. Later the vedic pundits offered Vedasirvachanam at Ranganayakula Mandapam. He was presented with Theertha Prasadams by temple officials.

DyEO Temple Sri Harindranath, DyEO Board Cell Smt Malleswari, Peishkar Sri Ramesh Babu were also present.

 

 

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——