Today’s Devotional E-Paper -20-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

20/02/2019 , బుధవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :బహుళ

సూర్యోదయం :6.38AM

సూర్యాస్తమయం :6.15PM

తిథి
:

బహుళపాడ్యమి7.41PM

నక్షత్రం :మాఘ9.27AM

యోగం :అతి8.58AM

సుకర్మ5.57AM

కరణం:బాల 8.52AM

కౌలవ 7.41PM

తైతుల 6.34AM

అమృతఘడియలు :7.13AM-8.42AM
1.53AM-3.23AM

వర్జ్యం :4.55PM-6.25PM

దుర్ముహూర్తం
12.03PM-12.50PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

20/02/2019 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Magha Masam

Paksham :

Bahula

SunRise :

6.38AM

SunSet :

6.15PM

Tithi :

Bahula Padyami 7.41PM

Nakshatram :

Magha 9.27AM

Yogam :

Athi 8.58AM
Sukarma 5.57AM

Karanam :

Bala 8.52AM
Koulava 7.41PM

Taitula 6.34AM

AmruthaGadiyalu :

7.13AM-8.42AM
1.53AM-3.23AM

Varjyam :

4.55PM-6.25PM

Durmuhurtham 12.03PM-12.50PM

* Darshan Details of Lord Balaji*
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 19.02.2019: 66,712.
V.Q.C SITUATION AT 05:00 AM ON 20.02.2019
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 11,
APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 10 HOURS.
TONSURES – 19,065.
PARAKAMANI – RS. 2.81 CRORES
Dept of PRO TTD
 
 
20/02/2019 , Wednesday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)
06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell
09:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

ఘనంగా ముగిసిన శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు 

 తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు మంగ‌ళ‌వారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు తెప్పలపై విహరించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు స్వామివారు మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమివ్వనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

GRAND CONCLUSION OF SRI GT FLOAT FESTIVAL

The five day annual flat festival (Teppotsavam) of Sri Govindaraja Temple concluded with grand performing of special pujas on Tuesday evening.

As part of festivities snapana Thirumanjanam was performed to the utsava deities in the morning and taken around the Pushkarani in the flat in the evening for seven rounds. Thereafter the deities of Sridevi, Bhudevi and Sri Govindaraja Swamy were taken in a procession on the Mada streets.

The artists of HDPP, and Annamacharya project presented bhajans and Bhakti sangeet programs on the occasion.

Spl. Grade DyEO Smt Varalakshmi, AEO Sri Udaya bhaskar Reddy, Temple Supdt Sri Srihari, temple inspector Sri Krishna murthy other officials participated.

 

_
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో మంగ‌ళ‌వారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీమలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా గరుడసేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల నాలుగుమాఢ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి.

శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరినీ క‌టాక్షించాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

POURNAMI GARUDA SEVA OBSERVED

The monthly Pournami Garuda Seva was observed by TTD in Tirumala on Tuesday evening.

The processional deity of Sri Malayappa Swamy varu took out a celestial ride Garuda Vahanam between 7pm and 9pm.

Devotees thronged four mada streets to have darshanam of Lord on Garuda Vahanam.

AP Minister Sri Adinarayana Reddy, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Board Members Sri Rudraju Padmaraju, GSS Sivaji, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh and others took part.

 

ఫిబ్రవరి 20న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 20వ తేదీ కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.00 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 10.00 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు అక్కడి నుండి బయల్దేరి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

 

GRAND PROCESSION OF SRI KRT ON FEB 20

As per temple traditions the utsava idols of Sri Kodandarama and his consort will be taken in a procession to Kupu Chandrapeta about eight kms away from Tirupati on February 20 morning.

 

The Snapana Tirumanjanam will be performed to the Idols as part of the annual Magha masa festivities and brought back to Sri KRT later in the evening.

 

The artists of HDPP, Dada Sahitya will participate in the processions and perform bhajans, kolatas etc.

 

 

Dept of PRO TTD

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– తిరుమలలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు తిరుపతిలోని కల్యాణిడ్యామ్‌ స్టేజ్‌-1(శ్రీనివాసమంగాపురం) నుండి స్టేజి-2(శ్రీవారి మెట్టు) వరకు అదనపు పైపులైన్‌ ఏర్పాటుకు రూ.8.50 కోట్లు మంజూరు. ఈ పంపింగ్‌ సామర్థ్యం పెంపు ద్వారా తిరుమలకు 14 ఎంఎల్‌డిల నీటిని సరఫరా చేసే అవకాశముంది.

– తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపాలు మరియు శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపాల ఆధునీకరణకు రూ.8.32 కోట్లతో టెండర్లు ఆమోదం.

– తిరుమలలోని శంఖుమిట్ట కాటేజీల ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేయడానికి 5.15 కోట్ల రూపాయలు మంజూరుకు ఆమోదం.

– తిరుమలలో సాధారణ పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ సంస్థకు ఒప్పంద కాలపరిమితిని మరో ఏడాది పొడిగింపునకు ఆమోదం.

– తిరుమలలోని శ్రీవారి పోటు ఉగ్రాణంలో పని చేస్తున్న కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాది పొడిగింపునకు ఆమోదం.

– తిరుమలలోని దక్షిణ ప్రాంత పరిధిలోని కాటేజీలు మరియు అశ్వని ఆసుపత్రిలో ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను నిర్వహించేందుకుగాను ఏ1 ఫెసిలిటీ మరియు ప్రాపర్టీ మేనేజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు 3 సంవత్సరాల కాలానికి కేటాయించేందుకు రూ.36.50కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని తూర్పు ప్రాంత పరిధిలోని కాటేజీలు(అష్టవినాయక, నందకం, పాంచజన్యం, కౌస్తుభం) విశ్రాంతి గృహాల్లో ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను 3 సం|| నిర్వహించేందుకుగాను కల్పతరు సంస్థకు కేటాయించేందుకు రూ.17.50 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అదనపు భోజనశాల మరియు వంటశాల నిర్మాణానికి రూ.4.95 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని పశ్చిమ ప్రాంత పరిధిలోని కాటేజీలు, విశ్రాంతి భవనాల్లో 3 సం|| ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను నిర్వహించేందుకు పద్మావతి సంస్థకు కేటాయించేందుకు రూ.28.50కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుపతిలోని శ్రీనివాసం వసతి సమూదాయాల పరిధిలోని ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సేవలను పద్మావతీ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ సంస్థకు 3 సం|| పాటు కేటాయించేందుకు రూ.17 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి గృహం తూర్పు వైపున వంటశాల బ్లాకు నిర్మాణానికి రూ.12.50 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని ఎఫ్‌ టైపు క్వార్టర్సులో గల 76 నివాసగృహాలను సూట్లుగా మార్చి భక్తులకు కేటాయించేందుకు రూ.3.65 కోట్ల రూపాయలు మంజూరు.

– తిరుమలలోని ‘బి’ టైపు క్వార్టర్స్‌ వద్ద అదనపు యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.47.44 కోట్ల రూపాయలు మంజూరు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీబోండా ఉమామహేశ్వరరావు, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీచల్లా రామచంద్రారెడ్డి, శ్రీడొక్కా జగన్నాథం, శ్రీపొట్లూరి రమేష్‌బాబు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు, శ్రీఎన్‌.శ్రీకృష్ణ, శ్రీఅశోక్‌రెడ్డి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

 

 

IMPORTANT RESOLUTIONA DURING TTD BOARD MEETING

The TTD Trust Board under the Chairmanship of Sri P Sudhakar Yadav has taken some important resolutions during the board meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

Later the chairman briefed the media on the important decisions.

@ To sanction Rs.36.50crores to A1 Facility and Property Managers Pvt.Ltd.for a period of 3 years towards FMS services in southern area and Aswini hospital in Tirumala.

@ To sanction Rs.17.50crores to Kalpataru for a period of 3 years towards FMS services in Eastern part of Tirumala cottages.

@ To sanction Rs.8.50crores to Padmavathi for a period of 3 years towards FMS services in the cottages located on Western side.

@ Sanction of tenders worth Rs.28.50qqcrores towards improvements of Sri Padmavathi and Sri Srinivasa Kalyana Mandapams.

@ Towards special development works in Sankumitta Cottage area Rs.5.15crores has been sanctioned.

@ An amount of Rs.12.50crores sanctioned towards the construction of kitchen block on the Eastern side of Panchajanyam Rest House.

@ Conversion of 76 houses in F type quarters as suites at Rs.3.65crores to accommodate potu workers.

@ Additional Pilgrims Amenities Complex near B type quarters at a cost of Rs.47.44crores.

@ Extension of sanitation services of Sulabh International to one more year.

@ To meet the water requirements of Tirumala, construction of additional pipe line from Kalyani Dam stage 1 near Srinivasa Mangapuram to stage 2 at Srivarimettu at a cost of Rs.8.50crores.

TTD EO Sri Anil Kumar Singhal, Sri Dokka Jagannadham, Sri Bonda Umamaheswara Rao, Sri GSS Sivaji, Sri BK Parthasaradhi, Sri Rayapati Sambasiva Rao, Sri Challa Ramachandra Reddy, Smt Sudha Narayanamurthy, Smt Sapna Munagantiwar, Sri RudraRaju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Ex Officio Member, Sri Manmohan Singh, Dr M Padma, IAS, Spl Invitee Sri N Sri Krishna, Sri K Raghavendra Rao, JEOs Sri KS Sreenivasa Raju, Sri, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.

 

రూ.3,116.25 కోట్లతో టిటిడి 2019-20 వార్షిక బడ్జెట్‌ ఆమోదం

 

టిటిడి 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూ.3,116.25 కోట్లతో ఆమోదించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు.

ఇందులో హుండీ ద్వారా రూ.1,231 కోట్లు, పెట్టుబడులపై వడ్డీ ద్వారా రూ.845.86 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.1,039.39 కోట్లుగా రాబడిని అంచనా వేశారు.

అదేవిధంగా, ఇందులో భక్తుల సౌకర్యాలు, దేవాలయాల నిర్మాణానికి రూ.100 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.210 కోట్లు, హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు రూ.179 కోట్లు, విద్యకు రూ.127.5 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు రూ.139 కోట్లు కేటాయించారు.

పూర్తి బడ్జెట్‌ వివరాలను ఇ-మెయిల్‌ చేయడమైనది.

 

TTD APPROVES 2019-20 BUDGET FOR Rs.3116.25Cr_

Tirumala Tirupati Devasthanams has approved annual budget for the financial year 2019-20 at Rs.3116.25crores.

The sources of funds includes hundi collections, interests on investments, darshanam receipts, sale of human hair, prasadams, accommodation and Kalyana Mandapam receipts, arjitha sevas.

While the utilization of funds included engineering works, propagation of Hindu sanatana dharma, FMS and Sanitation, Vigilance and Security, Hospitals and Education.

 

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——