Today’s Devotional E-Paper -19-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

19/02/2019 ,మంగళవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.39AM

సూర్యాస్తమయం : 6.15PM

తిథి :పూర్ణిమ 10.03PM

నక్షత్రం :ఆశ్రేష 11.12AM

యోగం :శోభా12.11PM

కరణం
:విష్టి 11.15AM
బవ10.03PM

అమృతఘడియలు :9.42AM-11.12AM

వర్జ్యం :10.19PM-11-48PM

దుర్ముహూర్తం
8.57AM-9.44AM
11.12PM-12.02AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

19/02/2019 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.39AM
SunSet :

6.15PM
Tithi :

Poornima 10.03PM
Nakshatram :

Asresha 11.12AM
Yogam :

Shobha 12.11PM
Karanam :

Vishti 11.15AM
Bava 10.03PM
AmruthaGadiyalu :

9.42AM-11.12AM
Varjyam :

10.19PM-11-48PM
Durmuhurtham 8.57AM-9.44AM
11.12PM-12.02AM

* Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA  
TOTAL PILGRIMS HAD DARSHAN ON 18.02.19: 75,418. 
V.Q.C SITUATION AT 05:00 AM ON 19.02.2019 
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 12,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 15 HOURS.
 PARAKAMANI – RS. 2.63 CRORES.
Dept of PRO TTD
 
 
19/02/2019 , Tuesday
06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell
07:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva
 

 _ ఫిబ్ర‌వ‌రి 19 నుండి 25వ తేదీ వ‌ర‌కు అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఆముక్త‌మాల్య‌ద – ప్ర‌సంగ‌మాలిక‌

తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 19 నుండి 25వ తేదీ వ‌ర‌కు టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆముక్త‌మాల్య‌ద స‌ప్తాహ ప్ర‌సంగ‌మాలిక కార్య‌క్ర‌మాని నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ మంగ‌ళ‌వారం విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య ఆవిర్భావ‌ము, ఆముక్త‌మాల్య‌ద‌ కావ్య‌ర‌చ‌నా నేప‌థ్య‌ము, ఫిబ్ర‌వ‌రి 20న శ్రీ‌విల్లిపుత్తూరు వ‌ర్ణ‌న‌ల ద్వారా భార‌తీయ గ్రామీణ వైభ‌వ‌ము, విష్ణుచిత్తుని భ‌క్తి, మ‌త్స్య‌ధ్వ‌జ మ‌హారాజు వృత్తాంత‌మును తెలియ‌జేస్తారు. ఫిబ్ర‌వ‌రి 21, 22వ తేదీల‌లో మ‌త్స్య‌ధ్వ‌జ మ‌హారాజుకు విష్ణుచిత్తుని ప్ర‌భోధ‌ములు, ఫిబ్ర‌వ‌రి 23న యామునాచార్యుని వృత్తాంత‌ము, రాజ‌నీతి, శ్రీ‌రంగ‌యాత్రను వివ‌రిస్తారు. ఫిబ్ర‌వ‌రి 24న గోదాదేవి చ‌రిత్ర‌ము, దాస‌రి మంగ‌ళ‌కైశికీ రాగాలాప‌న‌, సోమ‌శ‌ర్మ వృత్తాంత‌ము, ఫిబ్ర‌వ‌రి 25న గోదా శ్రీ రంగ‌నాథుల క‌ళ్యాణ వైభ‌వ‌మును గూర్చి ప్ర‌భోధాత్మ‌క సందేశ‌ములు ఇవ్య‌నున్నారు.

AMUKTAMALYADA SAPTAHA PRASANGA MALIKA IN ANNAMACHARYA KALAMANDIRAM FROM FEB 19 TO 25

The literary programme of Amuktamalyada Saptaha Prasanga Malika will be observed from February 19 to 25 in Annamacharya Kalamandiram in Tirupati under the aegis of Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD.

The week long literary fete includes the interesting aspects like the origin of Vijayanagara Dynasty and of the famous work Amukta Malyada, the ardent Bhakti of Vishnuchitta, story of Matsyadhwaja Maharaja, about Yamunacharya, Rajaneethi, Sri Ranga Yatra, Goda Devi Charitra, Mangala Kaisiki Ragam, Story of Soma Sharma, Sri Goda Ranganatha Parinayam and many more.

 

 

ఫిబ్ర‌వ‌రి 19న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమలలో ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన మంగ‌ళ‌వారం శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. కుంభ మాసం, ముఖా నక్షత్రంలో పౌర్ణ‌మినాడు ఈ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన భ‌క్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు.

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

ఫిబ్ర‌వ‌రి 19న పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన మంగ‌ళ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

 

KUMARADHARA MUKKOTI AND POURNAMI GARUDA SEVA IN TIRUMALA ON FEBRUARY 19

The annual Kumaradhara Mukkoti will take place in Tirumala on February 19.

This torrent festival usually falls on the auspicious day of Magha Pournami.

The monthly Pournami Garuda Seva will also be observed by TTD on the same day evening between 7pm and 9pm.

HDPP COMMITTEE MEETING HELD

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న : టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ‌ల హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతిగృహంలో సోమ‌వారం హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మాట్లాడుతూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో గ‌ల అసెంబ్లీ భ‌వ‌నం గ్రంథాల‌యానికి ఆధ్యాత్మిక‌, నైతిక‌, ఇత‌ర ప్ర‌చుర‌ణ‌ల‌ను అందించ‌నున్న‌ట్టు తెలిపారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా హ‌రిక‌థ‌, సంగీత కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే క‌ళాకారుల‌కు పారితోషికం పెంచ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అదేవిధంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న వివిధ కార్య‌క్ర‌మాల‌ను ఛైర్మ‌న్ స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ డొక్కా జ‌గ‌న్నాథం, తిరుప‌తి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌భ్యులు శ్రీ ఆర్‌వి.వెంక‌ట‌నారాయ‌ణ సుబ్బ‌రామ శ‌ర్మ‌, శ్రీ ఆర్‌వి.ర‌విచంద్ర‌శ‌ర్మ‌, శ్రీ సిహెచ్‌.సీతారామాంజ‌నేయ‌ప్ర‌సాద్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి.విశ్వ‌నాథం, ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి డా.. ఆంజ‌నేయులు, సేల్స్ వింగ్ డెప్యూటీ ఈవో శ్రీ హేమచంద్రారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

The executive committee meeting of Hindu Dharma Prachara Parishad was held under the chairmanship of TTD board chief Sri P Sudhakar Yadav on Monday in SPRH in Tirupati.

Important decisions:

@ To provide TTD publications to the library located in State Assembly at Amaravathi

@ To prepare an action plan to train students belonging to high schools of different districts in the state in Annamacharya Sankeertans

@ To enhance remuneration to the artistes of Hari katha and sakeertans

TTD Board Member Sri Dokka Jagannadham, Tirupati JEO Sri Sri B Lakshmikantham, HDPP Secretary Dr Ramana Prasad, HDPP committee members Sri RV Venkatanarayana Subbarama Sharma, Sri RV Ravichandra Sarma, Sri Ch. Seetharamanajeya Prasad, Annamacharya Project Director Acharya B Viswanatham, Sales wing DyEO Sri Hemachandra Reddy and others were present.

 

 

తెప్ప‌పై శ్రీగోవిందరాజస్వామివారు అభ‌యం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమ‌వారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్ర‌హించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 

ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. 

తెప్పలను అధిరోహించిన  శ్రీ గోవిందరాజస్వామిస్వామివారు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా మంగళవారం శ్రీగోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అదికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

 

 

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——