Today’s Devotional E-Paper -18-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

18/02/2019 , సోమవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల
సూర్యోదయం :

6.39AM
సూర్యాస్తమయం:

6.15PM
తిథి
:

చతుర్దశి
12.27AM
నక్షత్రం
:

పుష్యమి
12.51PM
యోగం
:

సౌభాగ్యం
3.19PM
కరణం
:

గరజి
1.35PM
వాణి
12.27AM
అమృతఘడియలు
:

6.51AM-8.21AM
వర్జ్యం
:

12.46AM-2.16AM
దుర్ముహూర్తం
12.50PM-1.37PM
3.09PM-3.56PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

18/02/2019 , Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.39AM
SunSet :

6.15PM
Tithi :

Chaturdasi 12.27AM
Nakshatram :

Pushyami 12.51PM
Yogam :

Sowbhagyam 3.19PM
Karanam :

Garaji 1.35PM
Vani 12.27AM
AmruthaGadiyalu :

6.51AM-8.21AM
Varjyam :

12.46AM-2.16AM
Durmuhurtham 12.50PM-1.37PM
3.09PM-3.56PM

* Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA  
 
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON       17-02-2019: 83,349.
 
 
 V.Q.C SITUATION AT 05:00 AM ON 18-02-2019
 
 
 
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 15,
 
 
 APPROXIMATE TIME FOR SARVADARSHAN:UPTO 12 HOURS. 
 
 
TONSURES : 27,567. 
 
 
PARAKAMANI: 3.29 CRORES. 
Dept of PRO TTD
 
 

 

 
 
18/02/2019 , Monday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)
05:30 – 06:30 hrs
Visesha Puja
07:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva
 

విద్యుద్దీపకాంతుల్లో శ్రీగోవిందరాజస్వామివారి విహారం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. 

తెప్పలను అధిరోహించిన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా సోమ, మంగళవారాల్లో శ్రీగోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అదికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

ఫిబ్రవరి 18న మహతిలో టిటిడి ఉద్యోగుల క్రీడోత్సవాల ముగింపు సమావేశం

 టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం 6.00 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.

 

టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2019 ఫిబ్రవరి 2వ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి 17వ తేదీతో ముగియనున్న విషయం విధితమే. ఇందులో భాగంగా టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా క్రీడాపోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నారు. అనంతరం టిటిడి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.

 

 

ఫిబ్రవరి 21న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 17: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

 

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో తిరుప్పావడ సేవ రద్దు చేశారు.

 

బహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 

తేదీ ఉదయం సాయంత్రం

 

24-02-2019(ఆదివారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

 

25-02-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

 

26-02-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
27-02-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

 

28-02-2019(గురువారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

 

01-03-2019(శుక్రవారం) హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం

 

02-03-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

 

03-03-2019(ఆది వారం) రథోత్సవం అశ్వవాహనం

 

04-03-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

 

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

 

అవిలాల చెరువు పనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

 ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిని సుంద‌ర‌న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో భాగంగా అవిలాల చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఉదయం టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మొదటిదశలో రూ.80.14 కోట్ల‌తో జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అవిలాల చెరువు అభివృద్ది పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రాబాబు నాయుడు గత డిసెంబర్ 6వ తేదిన శంకుస్థాపన చేశారని, ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

 

ఇందులో శ్రీవేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం (స్పిరిచువ‌ల్ థీమ్ పార్క్‌), ఇంట‌ర్న‌ల్ ఫెన్సింగ్ లోప‌ల ప‌చ్చికబ‌య‌ళ్లు, శేషాచ‌ల అడ‌వుల్లో జీవ‌వైవిద్యాన్ని ప్ర‌తిబింబించేలా ఏర్పాట్లు, జ‌లాశ‌యాలు, రాశి వ‌నం, న‌క్ష‌త్ర వ‌నం, నవగ్ర‌హ వ‌నం, హీలింగ్ గార్డెన్‌, థీమ్ గార్డెన్‌, అట‌వీ పుష్పాల వ‌నం, వివిధ ర‌కాల పుష్ప‌వ‌నాలు, సీతాకోక‌చిలుక‌ల వ‌నం, పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక ఉద్యాన‌వ‌నం, గ‌రుడ వ‌నం తదితర పనులను చేపడుతున్నట్లు వివరించారు.

 

జెఈఓ వెంట టిటిడి ఎస్ఈ శ్రీ రమేష్ రెడ్డి, ఈఈ శ్రీ జయరాములు నాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

 

 

JEO INSPECTS AVILALA TANK WORKS_

 

Tirupati JEO Sri B Lakshmikantham on Sunday morning inspected the ongoing development works of Avilala Tank in Tirupati.

 

He instructed the concerned officials to speed up the works and develop the tank as the most beautiful place of attraction with walkpaths, greenery etc.

 

SE 1 Sri M Ramesh Reddy, EE Sri Nageswara Rao and others were also present.

 

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——