Today’s Devotional E-Paper -16-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

16/02/2019 , శనివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.40AM

సూర్యాస్తమయం :6.14PM

తిథి :ఏకాదశి 6.56AM
ద్వాదశి4.55AM

నక్షత్రం :ఆర్ద్ర 3.44PM

యోగం :ప్రీతి 9.15PM

కరణం :భద్ర6.56AM
బవ5.55PM
బాల 4.55AM

అమృతఘడియలు :7.42AM

వర్జ్యం :3.04AM-4.34 AM

దుర్ముహూర్తం
6.40AM-8.13AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

16/02/2019 , Saturday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Magha Masam

Paksham :

Sukla

SunRise :

6.40AM

SunSet :

6.14PM

Tithi :

Ekadasi 6.56AM
Dwadasi 4.55AM

Nakshatram :

Aardhra 3.44PM

Yogam :

Preethi 9.15PM
Karanam :

Bhadra 6.56AM
Bava 5.55PM
Bala 4.55AM

AmruthaGadiyalu :

7.42AM

Varjyam :

3.04AM-4.34 AM

Durmuhurtham 6.40AM-8.13AM

 

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA    
TOTAL PILGRIMS HAD DARSHAN ON 15.02.2019: 65,987.
. V.Q.C SITUATION AT 05:00 AM ON 16.02.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 06,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 12 HOURS. 
TONSURES – 22,000.
 PARAKAMANI – RS. 2.59 CRORES.
Dept of PRO TTD

 

 
 
 
16/02/2019 , Saturday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

 

 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను హించారు.
స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.  అదేవిధంగా శనివారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. .
  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

DONATION RECEIVED TO SV ANNAPRASADAM

A NRI devotee Smt Inaganti Manimala had donated Rs.10,00,116 to SV Anna prasadam Trust of TTD.

 

Hailing from New York of USA the donor handed over the DD for the same on Thursday to Tirupati JEO Sri B Lakshmikantham in his office in TTD Administrative building.

 

Dept of PRO TTDPrint all
In new window

ఫిబ్రవరి 25 నుండి మార్చి 6వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
25-02-2019(సోమవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం)        హంస వాహనం
26-02-2019(మంగళవారం) సూర్యప్రభ వాహనం        చంద్రప్రభ వాహనం
27-02-2019(బుధవారం) భూత వాహనం              సింహ వాహనం 28-02-2019(గురువారం) మకర వాహనం          శేష వాహనం
01-03-2019(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
02-03-2019(శనివారం) వ్యాఘ్ర వాహనం          గజ వాహనం
03-03-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం    అశ్వవాహనం
04-03-2019(సోమవారం) రథోత్సవం(భోగితేరు)             నందివాహనం
05-03-2019(మంగళవారం) పురుషామృగవాహనం       కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం  
06-03-2019(బుధవారం) శ్రీనటరాజస్వామివారి  రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం.          ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
ఫిబ్రవరి 23న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా శనివారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
Dept of PRO TTD
ఫిబ్రవరి 20న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 20వ తేదీ కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.00 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 10.00 గంటలకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు అక్కడి నుండి బయల్దేరి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——