Today’s Devotional E-Paper -09-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

09/02/2019 , శనివారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.43AM

సూర్యాస్తమయం :6.13PM

తిథిచవితి9.13AM

నక్షత్రం:ఉత్తరాభాద్ర 2.41PM

యోగం:సిద్ధం 9.51AM

కరణం: భద్ర9.13AM

        బవ9.48PM

అమృతఘడియలు :9.29AM-11.13AM

వర్జ్యం:3.27AM-5.10AM
        6.43AM-8.15AM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

09/02/2019 , Saturday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.43AM
SunSet :

6.13PM
Tithi :

Chavithi 9.13AM
Nakshatram :

Uttarabhadra 2.41PM
Yogam :

Siddham 9.51AM
Karanam :

Bhadra 9.13AM
Bava 9.48PM
AmruthaGadiyalu :

9.29AM-11.13AM
Varjyam :

3.27AM-5.10AM
6.43AM-8.15AM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 08.02.2019 :: 68,311.
VQC SITUATION AT 5.00 AM ON 09.02.2019
NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 02,
APPROXIMATE TIME FOR SARVA DARSHAN – UP TO 06 HOURS ,
PARAKAMANI – 3.19. CRORES.
TONSURE – 13,537. 
 
 
 

09/02/2019 , Saturday
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

ఎస్వీ సంగీత కళాశాలలో ముగిసిన సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో మూడు రోజులపాటు జరిగిన సంగీత త్రిమూర్తులు శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీత్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.

 

ముందుగా ప్రవీణ, విశారద విద్యార్థులతో పాటు శ్రీ కె.రవిప్రభ, శ్రీ కె.ఈశ్వరయ్య బృందం నాదస్వర వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సంగీత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, స్థానిక కళాకారులు పలు కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

 

సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీ ఎం.సురేంద్ర, శ్రీ జి.చెన్నయ్య వయొలిన్‌, శ్రీ వి.సురేష్‌బాబు గాత్రం, శ్రీ కెవి.చల్లా ప్రభవతి వయొలిన్‌, శ్రీమతి కె.వందన గాత్రం, శ్రీ ఎం.అనంతకృష్ణ వేణువు వాద్యప్రదర్శనలు ఇచ్చారు.

 

మూడు రోజుల పాటు జరిగిన ఆరాధనోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుండి రాత్రి 8.45 గంటల వరకు సంగీత కళాశాల, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, స్థానిక కళాకారులు సంగీత త్రిమూర్తుల అపురూపకృతులు, కీర్తనలను రోజుకు 100 చొప్పున ఆలపించారు.

 

ఈ కార్యక్రమంలో ఎస్వీ నాదస్వర పాఠశాల హెడ్‌మాస్టర్‌ శ్రీ సత్యనారాయణ, అధ్యాపకులు శ్రీ సుధాకర్‌ తదితర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.

 

Dept of PRO TTD

ఫిబ్ర‌వ‌రి 19న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల పుణ్యక్షేత్రంలో ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. కుంభ మాసం, ముఖా నక్షత్రంలో పౌర్ణ‌మినాడు ఈ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన భ‌క్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. తిరుమల శేషాచలగిరుల్లో ముక్కోటి తీర్థాలున్నాయని ప్రసిద్ధి. తీర్థాలను ధర్మరతిప్రదాలు, జ్ఞానప్రదాలు, భక్తివైరాగ్యప్రదాలు, ముక్తిప్రదాలు అని నాలుగు రకాలుగా విభజించారు.

ఇందులో ధర్మరతిప్రదాలు 1008 ఉన్నాయి. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే ధర్మాసక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. జ్ఞానప్రద తీర్థాలు 108 ఉన్నాయి. వీటిలో స్నానమాచరిస్తే జ్ఞానం లభిస్తుందని విశ్వాసం. భక్తివైరాగ్య ప్రదాలు 68 ఉన్నాయి. వీటిలో స్నానం చేయడం వల్ల సంసార దుఃఖాలు తొలగిపోయి భక్తితత్వం వైపు మనసు మళ్లుతుందని నమ్మకం. ముక్తిప్రదమైన తీర్థాలు 26 ఉన్నాయి. వేంకటాచల మహత్యంలో పేర్కొన్న విధంగా ముక్తిప్రదమైన తీర్థాల్లో కుమారధార తీర్థం మొదటిస్థానంలో ఉంది. యుగయుగాలుగా ఈ తీర్థం భక్తులకు ముక్తిని ప్రసాదిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. పద్మ, వరాహ, వామన, మార్కండేయ పురాణాల్లో ఈ తీర్థ ప్రాశస్త్యం ఉంది.

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

ఫిబ్ర‌వ‌రి 19న పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన మంగ‌ళ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

 

KUMARADHARA MUKKOTI AND POURNAMI GARUDA SEVA IN TIRUMALA ON FEBRUARY 19

 

The annual Kumaradhara Mukkoti will take place in Tirumala on February 19.

This torrent festival usually falls on the auspicious day of Magha Pournami.

The monthly Pournami Garuda Seva will also be observed by TTD on the same day evening between 7pm and 9pm.

ఫిబ్రవరి 13వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవరి 13న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 14న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 15న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 16న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 17, 18, 19వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——